మనం ఇంతే!
సంఘటన తరవాత ఆ వీధిని వెళ్ళడం మానేసాను, ఎందుకైనా మంచిదని.మరో వీధిన రాకపోకలు సాగిస్తున్నా! ఈ వీధి పరిస్థితి ఆ వీధికంటే అధ్వాన్నంగా ఉంది. ఇంటికో డస్టుబిన్ను, దానినిండా పారేసిన అన్నం, చూస్తే కడుపు తరుక్కుపోయింది,మళ్ళీ ఆవేశం వచ్చేసిందిగాని తమాయించుకున్నా! తలొంచుకుని వెళిపోడం అలవాటు చేసుకున్నా! సాధ్యం కావటం లేదు. ఈ డస్టుబిన్నులు ఎత్తుగా స్థంబాలకి కట్టేరు, విశేషం ఏమని అడిగా ఒకరిని. వారు చెప్పినది,ఈ డస్టుబిన్ను నిండితే, పందులని పెంచుకుంటున్నవారొచ్చి పట్టుకుపోతారనీ, డస్టుబిన్ను నిండా ఇలా ఇచ్చినదానికి డబ్బులు కూడా ఇస్తారని చెప్పేరు, నాకు ఒళ్ళు కంపరమే పుట్టింది. ఏం చేయగలను, అశక్తుడిని, తలొంచుకుని పోతున్నా! ఎవరికి ఉ.బో.స లు చేయకూడదని తీర్మానించుకున్నా.
చలితిరిగింది, ఉదయం నడక మంచిదికాదనిపించింది. సాయంత్రం ఏ సమయానికి వెళితే బాగుంటుందని బయలుదేరా నాలుగున్నరకి. ఇది చాలా హడావుడి సమయం. కేంపస్ లో కెజి నుంచి పిజి దాకా ఉంటారు విద్యార్థులు, నాలుక్కి చిన్న పిల్లలతో మొదలయ్యే పిల్లలు వెళ్ళడం పి.జివాళ్ళు చివరవెళ్ళడంతో హడావుడి ముగుస్తుంది. ఈ లోగా బస్సులరాకపోకలు, అబ్బో పెళ్ళివారిల్లే! ఈ మధ్యలో నడకకి వచ్చే స్త్రీలు, ముసలాళ్ళ రాకపోకలు.
ఇక గ్రవుండ్ కి వెళితే మూలనుంచి ఫుట్బాలే కాళ్ళలో , పడుతుందో, బేస్కెట్బాలే నెత్తిన పడుతుందో, క్రికెట్బాలే పక్కటెముకల్ని ముద్దు పెట్టుకుంటుందో,చెప్పలేం. :) ఇక ఏ కుర్రాడో, కుర్రదో పరిగేట్టుకొచ్చి గుద్దేస్తారో అని పీకుతూ ఉంటుంది. ఈ మధ్యలో ముసలాళ్ళు, ఆడాళ్ళు నడక, ఏం చెప్పను ఆనందం పొంగిపొర్లుతూ ఉంటుంది. పిల్లలికి ఆడుకునే సమయం కాదంటే ఎలా? వాళ్ళని అలా ఉత్సాహంగా చూడడం కూడా ఉత్సాహం తెచ్చుకున్నట్టే :) మరొకొంచం చలిపెరగనిద్దామని తీర్మానించుకుని ఉదయపు నడకే మళ్ళీ మొదలెట్టా.
అనుకోకుండా పాతవీధినే వచ్చేస్తున్నా. షరా మామూలే. ఆ పడచు గిన్నెతో అన్నం బయట పారబోసి వెళుతోంది, నన్ను చూసింది కాని తలొంచుకుని గబగబా లోపలికెళిపోయింది. నేనూ మరి మాటాడక తలొంచుకుని వచ్చేసాను.
రోజూ అన్నం ఇలా ఎందుకు పారేస్తున్నారు, ప్రశ్న దొలిచింది. ఒక అవ్వని అడిగా! నీకెందుకీ గోల ఈ వయసులో విదిలించింది. తెలుసుకుందామనీ, నసిగేసా! ఏమనుకుందోగాని, అన్నం పారెయ్యడం ఆడాళ్ళకి ఇష్టమా? కాని తప్పక పారేస్తున్నారు, ఎంత బాధపడుతూ పారేస్తారో చెప్పలేను. రోజూ రాత్రి అన్నం వండుతుంది, ఎదురు చూస్తుంది భర్తకోసం, ఆశ నిరాశే! తను తాళలేకపోతే తింటుంది, లేదంటే తనూ పస్తే ఉంటుంది. ఏ రాత్రికో తూలుకుంటూ ఇంటికొస్తాడా మనిషి. వచ్చినవాడు, మూడు నిమిషాలు పొల్లి పక్కకి తిరిగి పడుకుంటాడు. తిండి లేదు, ఇదేమని అడిగితే సమాధానంలేదు, లేదా చెయ్యి చేసుకుంటాడు. ఏం చెప్పమన్నావ్! గవళ్ళ గంగమ్మగారి హస్తోదక మహిమ, అని కొంగు దులుపుకుని లోపలికెళిపోయింది.
ఓహో, అదా అసలు కారణం? పాపం, ఆ అమ్మాయి బాధ ఆ అమ్మాయిది. చెప్పుకోలేదు. అయినా ఆ మిగిలిన అన్నాన్ని పారబొయ్యడం ఎందుకు? ఎవరయినా బిచ్చగాళ్ళకెచ్చెయచ్చుగా?
ReplyDeleteఅవునూ, మీరు వెళ్లడానికి మూడో దారి లేదా? అయినా త్యాగరాజు గారు “చక్కని రాజమార్గములుండగా ……”అన్నాడు కదా 🙂?
విన్నకోటవారు,
Deleteఆలోచించవలసినదే :)
ఆలోచించండి ఆలోచించండి - మెయిన్ రోడ్ (రాజమార్గం) కాక వేరే చిన్న వీధుల్లో నుండి దారున్నదా అని ఆలోచించండి.
Delete“చక్కని రాజమార్గములుండగా” అన్న త్యాగయ్య గారి మాట ఏదో సరదాకు అన్నాను గానీ ….. పెద్ద వయసులో మెయిన్ రోడ్ మీద నడవడం ఎంతమాత్రమూ క్షేమం కాదు. వాహనదారులు పట్టపగ్గాలు లేకుండా నడుపుతున్నారు కదా. చిన్న చిన్న వీధుల్లో కూడా ట్రాఫిక్ తక్కువేమీ ఉండడం లేదు కానీ ఎంతయినా మెయిన్ రోడ్ కన్నా కొంచెం నయం కదా (అని అనుకుంటున్నాను). ఇవన్నీ మీకు తెలియని అంశాలా?
అందువల్ల ఈసారికిలా పోనిద్దాం, ఏమంటారు? 🙏
విన్నకోటవారు,
Deleteరాజవీధి మీరు చెప్పినట్టే ఉంది, అదే భయంతో పక్కవీధులు పట్టింది :) వీటిలోనూ ట్రాఫిక్కు తక్కువ తినలేదుగాని, ఉదయమే గనక భయంలేదు, ఎవరూ లేవరుగనక.
ఏ వీధినైనా బాధలేదండి :) జనజీవన స్రవంతి కనపడుతూ ఉంటుంది, దానికి స్పందించడం, ఉబోసలు మానుకుంటే చాలు, కాని అదే జరగటం లేదు, వద్దనుకుంటూనే, చెప్పాల్నిపించింది, చెప్పేసా :) అనడం అలవాటైనట్టుంది.
అనడం అలవాటైంది
Deleteయథో కర్మః తథో ....
Anonymous6 November 2022 at 09:58,
Deleteనిజమేగా
తాతగారు, ఈ వయసులో మీకెందుకీ మానసిక ఒత్తిడి. హాయిగా మీ వ్యాహ్యాళిని ఆస్వాదించి ఆనందించండి 😀
ReplyDeleteAnonymous30 October 2022 at 20:30
Deleteబాలాదపి సుభాషితమ్. ఆచరించవలసినదే :)
పుట్టిన రోజు శుభాకాంక్షలు శర్మగారు.💐
ReplyDeleteబోనగిరిగారు,
Deleteధన్యవాద శతం.
దీర్ఘాయుష్మాన్భవ.
ఆరోగ్యమస్తు.
ఐశ్వర్యమస్తు.
అవును కదా శర్మ గారు. ఈ మధ్య మతిమరుపు ఎక్కువవుతోంది (నాకు సుమండీ) 😔.
ReplyDeleteబోనగిరి గారికి ధన్యవాదాలు.
మీకు జన్మదిన శుభాకాంక్షలు 💐.
విన్నకోటవారు,
Deleteధన్యవాదాలు.