పిట్టనికొట్ట పొయిలోపెట్ట.
పిట్టనికొట్ట పొయిలోపెట్ట.
పూటబత్తెం పుల్లవెలుగు
రెక్కడితేగాని డొక్కాడదు.
అన్నీ ఒకలాటి నానుడులే ఐతే మొదటిది చాలా పురాతనమైనదనిపిస్తుంది. అన్నిటి అర్ధం ఒకటే ఏరోజు కూలితో ఆ రోజు గడపడమనీ, పని చేస్తేగాని పూటగడవదనీ, ఆహారం ఉండదనీ.
పొయ్యిలో పిల్లి లేవలేదు.
పొయ్యిలో పిల్లి లేవలేదంటే, వంట ప్రయత్నమే లేదని అర్ధం. ఎలా? వంట ఉదయమే చేసుకునేవారు, ఆ రోజుల్లో వేసిన పొయ్యిలమీద కట్టెలతో వంట చేసుకునేవారు. సాయంత్రానికి సూర్యాస్తమయం కాకుండానే భోజనాలు చేసేసేవారు, అందుకే " నోట్లో మెతుకు గూట్లో దీపం" అని నానుడి, అందుకు చాలా ముందుగానే వంటైపోయేది.అప్పటినుంచి మరలా ఉదయందాకా పొయ్యి ఖాళీ,ఈ పొయ్యి వెచ్చగా ఉంటుంది కనక పిల్లి పడుకుంటుంది, దానిని అక్కడ పడుకోనిచ్చేవారు, ఎందుకూ? పొయ్యి వంటింట ఉంటుంది, ఆహారపదార్ధాలు అక్కడే కొంతైనా ఉంటాయి, మరి అక్కడికి ఎలకలు చేరతాయి కదా! పిల్లి కాపలా అనమాట, దొరికితే ఎలకని భో0చేసి పడుకుంటుంది.పొద్దుటే వంట ప్రయత్నానికి ముందు పొయ్యిలో నిప్పు వేస్తారు గనక పిల్లి లేవక తప్పదు, అదనమాట,అంటే వంట ప్రయత్నమే లేదు, అంటే పొయ్యిలో పిల్లి లేవలేదు, లేపలేదని అర్ధం,పొయ్యిలో నిప్పే వేయలేదని చెప్పే ప్రయత్నం .
No comments:
Post a Comment