Monday, 24 October 2022

తాటాకు టపాకాయలు

దీపావళి శుభకామనలు.
(సినీవాలి శుభకామనలు)
తాటాకు టపాకాయలు


తాటాకు టపాకాయలు దీపావళికి కాల్చడం ఆనవాయితీ. వీటి తయారు మాత్రం సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉంటుంది. మామూలు తాటాకులు పనికి రావు, చిట్టిమట్టల ఆకులు తెచ్చుకుని ఎండబెట్టి, ఆ పై మట్టలు నరికి, ఓపికగా కూచుని ఒక్కొక్క ఆకునూ వేరు చేసి, ఈనెలు తీసి, అకుల్ని లెక్కబెట్టి కట్టగట్టాలి. 

మాదగ్గరలో మందుగుండు తయారు చేసేవారున్నారు.వారు ఈ తాటాకులు కొనుక్కుపోతుంటారు.



 

ఆకును తయారుచేయడానికి ఓపిక శ్రద్ధ కావాలి.సంవత్సరం పొడుగునా చేయాలి, ఒక రోజులో అయేపని కాదు.



ఇంత కష్టపడ్డా మిగిలేది తక్కువ శ్రమ ఎక్కువ.


ఇక తాటాకు టపాకాయల్లో ఉపయోగించేది సూరేకారం, పటాసు , గంధకం,బొగ్గుపొడి, ఒక్క జొన్నగింజ.


ఒక తాటాకును ముక్కచేసి పైచెప్పినవాటిని అందులో వేసి ఒక వత్తిని మూలగా బయటికి పెట్టి ఆకును మడతపెట్టి, మిగిలిన ఆకును దానిపై ఒడుపుగా దానిపైచుట్టి బిగిస్తే టపాకాయ తయారు. బిగింపులో కూడా పేలుడు తేడా ఉంటుంది.  

Courtesy. What's app

ఢిల్లీ దీపావళి సంబరం 

14 comments:

  1. తాటాకు టపాకాయలు తయారవడానికి ఇంత కథుందా?

    చిన్నప్పుడు నా ఫేవరైట్ టపాకాయలు అవి. ఇప్పుడు కూడా జనాలు కాలుస్తున్నారా?

    మీకందరకు దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      అంతకథా ఉందండి. ఇప్పటికి మాపేదవాని దీపావళి తాటాకు టాకాయలతోనే సుమండీ!

      Delete
    2. మీరు మరీ బీదరుపులు అరుస్తారండీ 🙂🙂.

      Delete
    3. విన్నకోటవారు,
      పెద్ద ఎన్.టి.ఆర్ నా దగ్గరేముంది బూడిద అన్నారు, జనం నమ్మేరా? నిజం చెబితే నమ్మరు సార్!

      Delete
  2. Replies
    1. శ్యామలీయంవారు,
      పెళ్ళైన సంవత్సరం, స్వంతంగా కూరుకున్న చిచ్చుబుడ్లలాగా కొన్నచిచ్చుబుడ్డిని చేతిలో పట్టుకుకాల్చాను, అది కాస్తా అరచేతిమీద చీదేసి చెయ్యి కాలిపోయింది, ఆ తరవాత దీపావళి అంటే తెనాలి రామలింగడి పిల్లి కతయిపోయింది, నాకు :) మరి మందుగుండు దరికిపోలేదు, నేను నల్లమందు తాటాకు టపాకాయల కాలంలో నిలిచిపోయా! ఒకతను తాటాకులు తయారు చేస్తుంటే చూసాను అదీ కత!

      Delete
  3. Ee taataaku chappullaki evaru bedurutaarandi o Lakshmi bomb esukondi:)

    ReplyDelete
  4. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు ఎట్లావచ్చిందండీ ఈ సమెత?

    ReplyDelete
    Replies
    1. Anonymous27 October 2022 at 05:03
      ఇది జిలేబిని అడగవలసిన కొచ్చననుకుంటానండి. నాకూ తెలీదు, ప్రయత్నిస్తా! :)

      Delete
    2. మీరే జిలేబి మీరే శర్మగారని ఆ మధ్య ఈ‌ బ్లాగులో వ్రాసారండి ; మీకు మీరే సాటి

      Delete
    3. Anonymous27 October 2022 at 18:50
      జిలేబీ నేనూ ఒకటే అనుకునేవారు అనుకుంటారు, తెలిసినవారూ అలా అనుకుంటే ఎలా? అందరూ జిలేబీని మరచిపోయారు, నేను మరవలేదు, కారణం తెలిసినవారికి తెలుసు, తెలియనివారికి చెప్పినా తెలియదు :)

      ఇక రామాయణంలో వాల్మీకి ఇలా అంటారు.

      గగనం గగనా కారం
      సముద్రం సుముద్రో రివః
      రామ రావణ యోర్యుద్ధే
      రామ రావణ యోరివః
      ఆకాశం అకాశం లాగే ఉంటుంది! సముద్రం పోలిక సముద్రం లాగే ఉంటుంది. రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే!

      ఆకాశానికి, సముద్రానికి పోలిక చెప్పడానికి మరొకటి లేదు, అలాగే రామరావణ యుద్ధానికీ మరొకపోలిక లేదు.
      అలానే జిలేబీ కి నాకూ పోలిక లేదు, నేను నేనే

      Delete
    4. మీరు రామచంద్రులు జిలేబి రావణి :)

      Delete
    5. Anonymous28 October 2022 at 12:00
      తమచిత్తం మహభాగ్యం :)
      ============================
      నిన్నటి కామెంట్ లో శ్లోకం సరిచేశాను, కిందిది అసలుది

      గగనం గగనాకారం
      సాగరం సాగరోపమః
      రామ రావణ యోర్యుద్ధే
      రామ రావణ యోరివః

      పొరబాటుకు చింతిస్తున్నాను.

      Delete
  5. Anonymous26 October 2022 at 22:19
    /ఈ తాటాకు చప్పుళ్ళకి ఎవరు బెదురుతారండి ఓ లక్ష్మీ బాంబేసుకోండి :)/

    తర్జుమా చేసుకోడానికే కష్టపడ్డా సుమీ! లక్ష్మీ బాంబేల? డర్టీ బాంబే వేసుకోండి. :)

    ReplyDelete