Sunday, 23 October 2022

తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు

 

తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు


తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు,తల్లిపుట్టింటి గురించి మేనమామకి చెప్పినట్టు,తల్లిపుట్టిల్లు మేనమామకి ఎరుకే, ఇలా రకరకాలుగా చెబుతుంటారీ నానుడిని.ఏమిది?


మేనమామ అంటే తల్లి అన్న లేక తమ్ముడు. అనగా ఈ తల్లి ఆమె అన్న/తమ్ముడు ఒక ఇంట పుట్టినవారే! మేనమామకి ప్రత్యేకంగా తల్లిపుట్టిల్లు గురించి చెప్పడం హాస్యాస్పదం. ఇద్దరూ ఒక ఇంట పెరిగినవారే! ఆ తల్లి ఎలాపెరిగిందో ఆమె అలవాట్లేంటో, ఎంత వైభవంగా పెరిగిందో,ఆ ఇంటి ఆచార వ్యవాహారాలేంటో ప్రత్యేకంగా మేనమామకి చెప్పాలా?తెలియవూ!

6 comments:

  1. ఈ మధ్య సోషియల్ మీడియా లో ప్రతి ఒక్కరూ దేశం గురించి ఊదర గొట్టేస్తూన్నట్టు

    ReplyDelete
    Replies

    1. Anonymous23 October 2022 at 10:17,
      అదేకదా చేతనయింది.

      Delete
  2. తల్లి పుట్టిల్లు మేనమామకు ఎరుక

    ReplyDelete
  3. 👌 తెలుగు సామెతల్లో నాకు బాగా నచ్చే సామెత ఇది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఇన్నాళ్ళకి మీకు నచ్చిన నానుడి చెప్పగలిగానా? :)

      Delete
    2. 🙏
      సామెతలు జీవితానుభవాల నుంచి వచ్చినవి. కాబట్టి నాకు అన్ని సామెతలు నచ్చుతాయి. పై సామెత కాస్త ఎక్కువ నచ్చుతుంది అంతే 🙂.

      Delete