Friday, 21 October 2022

తాతకి దగ్గులు నేర్పడం.

 తాతకి దగ్గులు నేర్పడం.

ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, పూర్తి జీవితం అనుభవించిన అనుభవజ్ఞునికి జీవితం గురించి చెప్పబోవడం అంటారు. 


ఇలా చెప్పబోయినవారు ఎవరూ? ఒక పిల్లకాకి, కళ్ళు పూర్తిగా తెరవని పసికూన, మనవడో/మనవరాలో, ఆ తాత కళ్ళెదుట పుట్టినవాళ్ళు, ఆ తాత చెయ్యిపట్టినడచినవాళ్ళు. ఇలా చెప్పబోయారంటే వారు జీవితంలో అప్పుడే అడుగుపెట్టినవారై ఉంటారు, అంటే వయసు పాతిక ముఫై మధ్య,అదే జీవితమనుకుని.  ఇక వీరి తండ్రి అంటే అరవై వయసు దగ్గరమాటే. మరితాతాంటే వీరితండ్రికదా! అంటే ఆయన వయసు ఎనభై ఆ పైమాటే కదా! 


ఇంతవయసు అనుభవమున్నవారికి జీవితంలో ఒడిదుడుకులగురించి చెప్పబోయినవారికి  మధ్య వయసుతేడా ఒక అర్ధశతాబ్ది, అనుభవంతేడా అంతే కదా!. మరీ తాత ఎనభై పైబడ్డ వయసులో ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎంత మందిని చూసి ఉంటాడు. ఎన్ని రకాల మనుషులని చూసి ఉంటాడు? 


ధూర్తులు,దుర్మార్గులు,వంచకులు, వదరుబోతులు, స్వప్రయోజనపరులు,నమ్మించి మోసంచేసినవారు, ఇలా చెప్పుకుపోతే ఇది అనంతంకదా!  జీవిత పరుగులో ఎన్నిసార్లు పడిపోయి లేచి మళ్ళీ పరుగందుకుని ఉంటాడు, ఎంత కష్టపడి వీళ్ళని పెంచి ఉంటాడు? నేడు కనుతెరచినవారింత అనుభవమున్నవారికి చెప్పబోవడమంటేనే తాతకి దగ్గులు నేర్పడం, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందనడం. దీనినే నక్కపుట్టి మూడు ఆదివారాలు కాలేదు ఇంతగాలివాన చూడలేదంది అన్నట్టు కదా!

12 comments:

  1. ఆంగ్లంలో కూడా Don’t teach your grandmother how to suck eggs అంటారు.

    మీటింగులో ఓ అంశం మీద కాస్త అధికంగా వివరణ ఇవ్వబోయిన ఓ సబ్-కలెక్టర్ కు పై సామెతే చెప్పి కోప్పడ్డాడట కలెక్టర్ గారు.
    అది వృధా ప్రయత్నం అవుతుంది సర్, ఎందుకంటే మా grandmother వెజిటేరియన్ అన్నాడట ఆ సబ్-కలెక్టర్ (ఇంకా యువకుడు కదా) 🙂.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      యువ రక్తం కదండీ, "పడుచు కాపరం చితుకులమంట" సామెతండి.

      Delete
    2. ఆఁ ఆఁ, ఆ చితుకుల మంటే ఆరకుండా రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది.

      Delete
    3. Experienced soul speaking :)

      Delete
    4. విన్నకోట నరసింహా రావు22 October 2022 at 13:32
      టపారాయక తప్పేలా లేదే! :)

      Delete
    5. తప్పక వ్రాయండి, శర్మ గారు, అంతకన్నానా👍.
      నేను చెప్పింది సార్వజనీనం కాబట్టి టపా వ్రాయడానికి తగినదే 🙂.

      Delete
  2. తాత అనగానే మీరన్నట్లు ఎనభైలకు దగ్గరలో ఉండవలసిన అవసరం లేదండీ. ముఖ్యంగా ఈరోజుల్లోని పిల్లలు మహాముదుర్లు - పదేళ్ళప్రాయంలోనే పెద్దలకే చెప్పవస్తూ ఉంటారు తరచుగా. అమ్మాయి పుట్టేనాటికి పాతికేళ్ళ వాడైన పెద్దాయన మనవడు పుట్టేనాటికి యాభైల్లో ఉండవచ్చును. ఆమనవడు నీకేమీ తెలియదు తాతయ్యా అని విసుక్కొనే నాటికి అరవైల్లో ఉండవచ్చును. అమ్మమ్మగారి పరిస్థితి కూడా అదే కాబట్టి ఆవిడ వయసును చూదాం - అది అరవైకన్నా తక్కువగానే ఉండవచ్చును. పూర్వకాలంలో ఐతే అమ్మమ్మ అయ్యేనాటికి వయస్సు నలభైల్లోనే ఉండేది కూడాను.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,
      నేనింకా పాతకాలంలో నే ఉండిపోయానంటారా? పదేళ్ళవాళ్ళే అలా మాటాడితే మనం పురోభివృద్ధి సాధించినట్టేనంటారా?

      Delete
  3. ఇది ఆ నాటి తాతలకు వర్తిస్తుందేమో గాని ఈ నాటి నో నాలెడ్జ్ తాతలకి వర్తిస్తుందా సందేహమే. అంతే కాక నేటి తరం పిల్లకాకులు గూగుల్ నాలెడ్జి తో తలపండిన మెచ్యూర్డ్ స్టఫ్

    ReplyDelete
    Replies
    1. Anonymous21 October 2022 at 15:13
      పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బని సామెతండి.

      Delete

  4. ఎనానిమస్‌గారన్నది కరెక్ట్. ఈ కాలంలో తాతలకి మనవలు దగ్గడం, తుమ్మడం, నడవడం, తినడం వగైరాలన్నీ ఈ కాలానికి తగినట్టు సరిగ్గా ఎలా చెయ్యాలా అన్నది నేర్పించగలరు. తాతల కాలపు దగ్గులు, తుమ్ములు ఈ కాలంలో అస్సలు పనిచెయ్యవు.

    ReplyDelete
    Replies
    1. కాంత్ జీ,
      కలికాలంలో ఇటువంటి తరం పుడుతుందని మార్కండేయుడు చెప్పినట్టుందండీ

      Delete