Friday, 5 March 2021

నిండా ములిగితే

 నిండా ములిగితే


నిండా ములిగినవానికి చలేంటి? అనిగాని నిండా ములిగితే చలేంటీ అనిగాని చెబుతుంటారీ నానుడిని. దీనికి రెండు అర్ధాలూ చెబుతారు. నీళ్ళలో శరీరం సగం ములిగితే చలనిపిస్తుంది, నిండా ములిగితే చలి ఉండదు అనేది ఒక అర్ధం. మరో మాట ఏదో విషయంలో పరిస్థితి పూర్తిగా విషమించి పోయినపుడూ, పూర్తిగా చెయిదాటిపోయినపుడూ, నష్టం తప్పదన్నపుడూ బయట పడి తెగించడమూ చెబుతారు. 


సగం ములిగితే చలేస్తుంది. ఎందుకు? శీతకాలమైనా వేసవి కాలమైనా శరీర ఉహ్ణోగ్రత స్థిరంగా ఉంటుంది 37 C, కాని బయటి ఉహ్ణోగ్రత శీతకాలంలో శరీర ఉహ్ణోగ్రత కంటే తక్కువగానూ వేసవిలో ఎక్కువగానూ ఉంటుంది. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అన్నది ఒక నానుడి. నీరు పల్లానికి ఎలా ప్రవహిస్తుందో అలాగే ఉష్ణం కూడా ఎక్కువనుంచి తక్కువ కి ప్రవహిస్తుంది. శీతకాలంలో శరీర ఉహ్ణోగ్రత కంటే బయట ఉహ్ణోగ్రత తక్కువ ఉన్నపుడు శరీరం వేడిని కోల్పోతూ ఉంటుంది, అందుకే చలేస్తుంది. అలాటి కాలంలో  నీటిలో దిగితే ఎలా ఉంటుంది?  శరీర ఉహ్ణోగ్రత ఎక్కువగానూ బయటి ఉహ్ణోగ్రత తక్కువగానూ ఉంటుంది, అలాటప్పుడు నీటిలో దిగితే నీటి పైపొరలలో ఉహ్ణోగ్రత క్కువగానూ  లోపలి పొరలలో ఎక్కువగానూ ఉంటుంది. అసలే శరీరం ఉహ్ణోగ్రత కోల్పోతున్నపుడు సగం శరీరం నీటిలోనూ సగం బయట ఉంటే చలి ఉంటుంది, కాని అదే పూర్తిగా శరీరం నీటిలో ములిగితే చలి ఉండదు.కారణం బయటి ఉష్ణోగ్రత కంటే లోపలి నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం.   

అదే నిండా ములిగినవాడికి చలేంటీ అన్నది.  

Matter will be in three states. Solid,liquid,vapor. Water will be at liquid state at normal temperatures, it becomes solid at the 0 C and  and vaporizes after 100 C. Special feature of water is that, it will become solid at 0 C but remains as liquid at -4 C. By becoming solid, water looses its latent heat. (Latent heat of fusion of water is 80 cal for gram) Please correct if I am wrong. 

 

మరోమాట కూడా నీరు  నున్నా ఉష్ణోగ్రతలో గడ్డకడుతుంది, కాని -4 C డిగ్రీల దగ్గర నీరుగానే ఉంటుంది. అందుకే మంచు పలకలకింద నీరుంటుంది అది -4 C ఉష్ణోగ్రతలో ఉంటుంది.


ఇక రెండవదాని గురించి ఏం చెప్పేది? కొల్లలు ఉదాహరణలు అందుకు చెప్పను :)   


17 comments:

  1. మీరు సామెతలని వివరించి చెప్పడం బావుంటుంది. ఓ సామెతలో ఇంత సైన్స్ దాగుంటుందని ఎంతమందికి తెలుసు :)

    ReplyDelete
    Replies
    1. చంద్రికగారు,
      మీ కాంప్లిమెంట్ కి
      ధన్యవాదాలు

      Delete
  2. అలానే ఇంచు మించు తెనుగు నానుడి కూడా ఉంది గదా శర్మాచార్య.. జేతుల్ కాలినంక ఆకుల్ బట్టనేల.. అదే హిందిలో ముహావర కూడా అబ్ పచ్తాయే తో క్యా హోత్ జబ్ చిడియ చుగ్ గయి ఖేత్..

    అట్లానే ఈ లేటెంట్ హీట్ చెద బావులలో మనకు ప్రస్ఫూటంగా తెలియ వస్తది ఆచార్య.. ఎండాకాలం లో చల్లగాను శీతాకాలం లో వేడిగాను అనిపిస్తూ ఉంటుంది. కుండ నీరు చల్లబడ్డం వెనక కథ కూడా దీని మూలమే..

    ReplyDelete
    Replies
    1. నిండామునిగేక చలీ
      నిండా ముంచేక చెలియ నిలువవు విబుధా !
      గుండెదిటువు చేసుకొనుటె 🙏 ,
      అండగ పరమాత్మగలడు అక్కున జేర్చున్ .

      Delete
    2. శ్రీధరా,
      మీ మొదటి పేరాలో చెప్పిన (తెలుగు) సామెత వేరు, పైన శర్మ గారు చెప్పిన సామెత వేరు.

      రెండో పేరాలో మీరు చెప్పిన “కుండ నీరు చల్లబడడం” అంటే అది evaporation.

      “చెద” బావి .... అంటే ఏమిటి, శ్రీధరా?


      Delete
    3. రాజావారు,
      ''నిండా ములిగాక చలీ, నిండా ముంచాక చెలీ నిలబడవు''. జీవిత సత్యం చెప్పారు సార్. వెయ్యండి రాజావారికి వీరతాళ్ళు, ఎక్కడ కందమ్మ,ఎక్కడా?

      Delete

    4. తలిచేరు :) అదే మహద్భాగ్యం :)
      థాంక్స్ అనేది ఎంత చిన్న మాట. ఇంతకన్నా ఏఁ చెప్పాలో తోచక భాష చిన్నబోయి ఉంది.


      జిలేబి

      Delete
    5. తలిచేరు మహద్భాగ్యము ,
      తలవక చస్తామ ? , నేడు తలిరులదినమం
      చలివేణులు ఘనవేణుల
      మెలిద్రిప్పుచు గొప్పవోవ , మేమేడ , హితా !

      Delete
    6. రాజారావాచార్య.. నూతికి నొరు పళ్ళు నిజం మీ మాట..
      సినిమా షికార్లు అనవసరపు ఖర్చుల చిట్టా పద్దులతో ధీధాం ధాంధీ ధా..

      నృసింహాచార్య.. ఇవాపోరేషన్ మూలానే చెద బావి గ్రీష్మాన చల్లగాను శీతలాన వేడిగాను అనిపిస్తాయి.. స్వెట్ గ్లాండ్స్ లేవు.. అదే స్వేద గ్రంధో శ్వేత గ్రంధమో (వైట్ పేఫర్) అందులోని సాల్ట్ ఇవాపోరేట్ ఔతునే మనకి చల్లదనం వస్తది.. కుండ బద్ధలయ్యేదా.. ఇహ చెదబావంటారా.. ఈనాటి బోరు ల మాదిరి కాకుండ పొలాలలో నిరుడు ఉండే ఓ రకమైన బావాచార్య.. ఊట బావిగాను ఘనకీర్తి.. చెద అంటే కోబ్బరి పీచో, నారలో మెలి పెట్టి తయారో చేసే కోర్స్ రోప్, పుల్లీ గుండా పుల్ చేసేవి.. ఈ పద్యం తెలిసే ఉంటుంది మికు "కరత్ కరత్ అభ్యాస్ కే జడమత్ హోత్ సుజన్ రసరి ఆవత్ జాత్ తే సిల పర్ పడత్ నిషాన్". బిజిలే అమ్మణ్ గారికి నమస్సుల్..!

      Delete
    7. బాబూ శ్రీధరా,
      దాన్ని “ చే ద” అంటారు. మీరు వ్రాసిన “చెద” అంటే termites, white ants.

      మీ వ్యాఖ్య చివర్లో మీ భాషలో ఏదో అన్నారు, అర్ఖం కాలేదు.

      Delete
    8. నా పేరు పక్కన క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయండి, వియనారాచార్య (విఠలాచార్య లా అనిపిస్తోటధనే కాబోలు నృసింహాచార్య అన్నాప్నేనూ.. వైట్ యాంఠ్/తర్మిత్ వేరు వేరు ఆచార్య.. ఐనను చే..ద కు చెద పట్టినను మట్టే కదా మహాశయ..

      ఆ చివరి లైన్ మా భాష కాదే..

      వావ్ అనగ బావి.. కంతుక్స్ త బావి కనుక చేద గుర్తుకచ్చినాద్.. {ఆ రామదాసు థమరి హన్మతి లేఖుంఢ రామ మందిరం ఖట్టేసినాడ్.. జహాఁపనా}
      అలా బావి కి ఉండే ఆ పుల్లె రాతితో కూడా ఉండేది.. అలా ఆ రాయి రూపు రేఖలనే ఆ చేద మార్చేయగలదని అదేదో దోహాలో (కతార్ క్యాపిటల్ కాదు సుమి..) ఉంటే ప్రసూతికరించాను..

      Delete


    9. మీ "ప్రసూతీ" కరిం, చెడం, బా వుంది :)

      Delete
    10. వాటిజ్ “ప్రసూతీకరించడం” ?? 🤔🤔

      Delete

    11. వినరా వారు

      ఇది కూడా తెలియదా :)


      Delete
    12. తచ్చు అప్పు పైటోగ్రకఫిల్ ఎర్రర్ వియన్నారాచార్య, బిజిలే అమ్మణ్.. అది ప్రస్తూతికరించటమని ఉండాలి..! అదేదో ఆబ్స్‌టెట్రిక్స్ అనుకునేరు.. మన్నించాలి

      Delete
  3. మట్టి ప్రమిద దెచ్చి మహదేవు నర్చించి
    ఆవు నెయ్యి వోసి అభవు నెదుట
    వత్తి వేసి శివుని వాకిట శివరాత్రి
    దీప మిడుడు , జన్మ తేజరిల్లు .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      మహదేవుడు మనలను రక్షించుగాక.
      ధన్యవాదాలు.

      Delete