Thursday, 11 March 2021

నమః శంభవేచ

 

Courtesy:Whats app

హిమాచల ప్రదేశ్ లోని సోలాన్ లో ఉన్న జటోలి శివాలయం. 



నమః శంభవేచ మయోభవేచ 

నమః శంకరాయచ మయస్కరాయచ 

నమశ్శివాయచ శివతరాయచ. 



19 comments:



  1. మహాశివరాత్రి శుభాకాంక్షలు!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi,


      మహదేవుడు మనలను రక్షించుగాక.
      ధన్యవాదాలు.

      Delete
    2. బ్లాగుల్లోకొచ్చి చాలా కాలమైంది.ఏంటి జిలేబీ బ్లాగులన్నీ ఇలా చప్పచప్పగా బోరుబోరుగా ఉన్నాయీ!

      Delete

    3. అంతా ఓల్డీస్ అయిపోయిండ్రు :)

      మీ సమ ఉజ్జీ "జీవి" మీ వెనుకే వచ్చేస్తే వేగం , వేడి పుంజుకొనును :)



      ఇట్లు
      నారదాయ నమః
      జిలేబి

      Delete
  2. శర్మ గారు,
    “సోలన్” అన్న ఈ ఊరి సంగతి తెలియలేదు. అందువల్ల గతంలో హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినా గానీ ఈ ఊరు చూడలేక పోయాను.

    ఆలయ ప్రాంగణం అద్భుతంగా ఉన్నట్లు తోస్తోంది పై వీడియోలో చూస్తుంటే. ఇటువంటి కట్టడాలు చూసినప్పుడు / విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది - ఆ పాతకాలంలో అంత గొప్ప నిర్మాణాలు అంత ఎత్తైన కొండల మీద ఎలా చెయ్యగలిగారు అని. పోనీ రాళ్ళంటే కొండ మీదే దొరికాయనుకుందాం. కానీ తతిమ్మా. నిర్మాణ సామగ్రి కొండ క్రింద నుండే తీసుకు వెళ్లాలి కదా ... యంత్రాల సౌకర్యం ఇంకా రాని కాలంలో అవన్నీ కొండ మీదకు ఎలా తరలించారా అని ఎంత ఆలోచించినా నా ఊహకు అందటం లేదు.
    మహానుభావులు 🙏.

    ReplyDelete
    Replies

    1. విన్నకోటవారు,
      హిమాచల్ లో సోలాన్ జిల్లాలో బతేలి గ్రామంలోని గుడి ఇది. శ్రమకి ఓర్చి కట్టేరు, స్థానికంగా దొరికే వనరులే ఉపయోగించి ఉంటారు. ఈ కళ మరుగున పడిపోయిందంతే.
      తమిల్నాడులో వైగై ఎక్సుప్రెస్ బోగీలొకప్పుడు నదిలోకి దూసుకుపోయాయి, పెద్దలు వాటిని తీయడానికి ప్రయత్నంచి విఫలమయ్యారు. స్థానికులే ఏ యంత్రాలూ అవసరం లేకనే వాటిని బయటకు తీశారు, గుర్తొచ్చిందా?.

      Delete
    2. అవును శర్మ గారు.
      రెండేళ్ళ క్రితం గోదావరిలో మునిగిపోయి ఇరుక్కుపోయిన లాంచీ విషయంలో కూడా అంతేగా. బయటకు తియ్యడానికి పెద్దలు విఫలమయ్యారు గానీ సత్యం అనే ఈతగాడు మోకుల లాంటి మామూలు సాదా సీదా పరికరాలు మాత్రమే ఉపయోగించి బయటకు తెచ్చాడు గదా.

      Delete
  3. రెండు ప్రమిదలు జంట గూర్చుండ బెట్టి ,
    మూడు పోగులు పెనచి , నీపుణ్యమెంచి ,
    ఆవునెయ్యివోసి , జీవాత్మ నందు నిలిపి ,
    జ్యోతివెలిగించ , తిమిరవియోగ మందు .

    ReplyDelete
  4. అసతోః మా సద్ గమయ
    తమసోః మా జ్యోతీర్ గమయ
    మృత్యోః మా అమృతం గమయ
    శాంతిః శాంతిః శాంతిః

    ReplyDelete
    Replies
    1. తమసోమా జ్యోతిర్గమయ

      Delete
  5. శర్మ గారు,
    మొన్న మహా శివరాత్రి నాడు శ్రీశైలంలో జరిగే కార్యక్రమం చూడవచ్చని టీవీ ముందు కూర్చున్నాను. గుడి పైన ఒకాయన నాలుగు వైపులా తెరల లాగా కడుతూ తిరుగుతాడు ఆ రాత్రి (నాకు 25, 26 యేళ్ళ వయసులో ఒకసారి మహా శివరాత్రికి శ్రీశైలం వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూశాను. మా సహోద్యోగి తన తండ్రిగారు అక్కడ ప్రోజెక్టులో ఇంజనీర్ గా పని చేస్తున్నారని తను వెడుతూ నన్ను కూడా రమ్మన్నాడు). టీవీ వచ్చిన తరువాత టీవీలో చూపించేవారు.

    ఇంతకీ మొన్న రాత్రి జరిగిందేమిటంటే శ్రీశైలంలో ఆ కార్యక్రమం బదులు సాయంత్రం నుండీ దాదాపు అన్ని ఛానెళ్ళు ఆయనెవరో కోయంబత్తూరు గురువు గారట ఆయన తన ఆశ్రమంలో పెద్ద శివుడి విగ్రహం పెట్టి చేసిన షో చూపిస్తూ గడిపాయి. బహుశః దండిగా డబ్బులు ముట్టాయేమో? చాలా సేపు ఎదురు చూసి చివరకు టీవీ ఆఫ్ చేసేశాను.
    వ్యాపార సంస్కృతి అన్నిచోట్లా బాగా కమ్మేసింది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      పాగా ఉత్సవమని చేస్తారుట.
      అన్నీ వ్యాపారమేనండీ.ఆయన సద్గురు

      Delete
    2. అవును శర్మ గారు. శ్రీశైలంలో మహా శివరాత్రి నాడు అర్థరాత్రి చీకటిలో (మొత్తం లైట్లన్నీ ఆర్పేసి) నగ్నంగా (చేసే వ్యక్తి నగ్నంగా ఉండి) చేసే ఆ అలంకరణ కార్యక్రమం పేరు “పాగాలంకరణ” ట.  పేరు ఇందాక గుర్తు రాలేదు. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🙏 .

      http://www.srisailamonline.com/festivals.html

      ఈ వెబ్-సైట్లో ఇచ్చిన వివరణ (ఆంగ్లంలో)
      ==============
      “The Pagalankarana is a unique custom finds only in Srisailam temple and is the most significant event of the festival. In this a person belongs to weavers community (Devanga) tie a lengthy new white cloth called as Paga (Turban) starting from the Sikhara of the Swayvari Vimana Gopuram passing around the Nandi idols placed on the Mukhamandapam of the temple. The interesting feature of this event is that the Devanga will decorate the Paga with naked body in total darkness and all the lights at that time are put off in the temple.
      ===============

      Delete

    3. విన్నకోటవారు,
      పాగా అలంకరణ గురించి పెద్దల ద్వారా విన్నది మనవి చేస్తాను.దేవాంగులు అని వాడుకలో అంటారు కాని వారు దేవ/దేవాంగ బ్రాహ్మణులు, అలా అనడమే సరి. వీరిలో ఒక కుటుంబంవారు తరతరాలుగా మల్లన్న పాగా అలంకరణ సేవ చేస్తున్నారు. ఈ కుటుంబంవారు పరిశ్రమ అంతా కుటుంబ సభ్యులే చేస్తారు, కుటుంబ యజమాని ఈ వస్త్రాన్ని నేస్తారు. కుటుంబం మొత్తం నియమ నిష్టలతో ఈ పాగాను రెండు (?) నెలలలో నేస్తారు. మహాశివరాత్రిరోజు లింగోధ్భవ కాలం లో ఆలయ శిఖరం పైకి ఎక్కి నగ్నం గా ఈ పాగా అలంకరణ చేస్తారట, ఆ సమయంలోనే కరంటు ఆపుజేస్తారని/లైట్లు తీసేస్తారని, తెలుసుకున్న మాట. .

      Delete
  6. రగిలిన భక్తికి నిలయము ,
    భగవన్నామ జప యఙ్ఞ పావనకార్యం ,
    బగణితసంపత్కరము , త్రి
    జగ సన్నుతము , హృదయాలు జ్వలితం బగుతన్ .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      నమోన్నమః .

      Delete
  7. శతథా సహస్రథా తమ
    నుతపదములకు నమములు , మనోఙ్ఞ విభుధా !
    మతిమాలి , యెదేనియు ,నను
    చిత మాడితినా? , నమములు చెప్ఫితి రనఘా !

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      అదేంకాదు, పద్యానికి వందనం

      Delete