ఓం రవయేనమః
ఓం సూర్యాయనమః
ఓం భానవేనమః
ఓం ఖగాయనమః
ఓం పూష్ణేనమః
ఓం హిరణ్య గర్భాయనమః
ఓం మరీచయేనమః
ఓం ఆదిత్యాయనమః
ఓం సవిత్రేనమః
ఓం అర్కాయనమః
ఓం భాస్కరాయనమః
భాస్కరుడు ఫిబ్రవరి నెల ముగియ కుండానే ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయమే దట్టమైన మంచు తొమ్మిదికి గాని భాస్కర దర్శనం లేదు. మధ్యాహ్నానికే 38 కి వేడి జేరిపోతోంది.సాయంత్రానికి కూడా చల్లబడటం లేదు, రాత్రి చలి. ఇలా ఉన్న వాతావరణం లో అనారోగ్యం పెరగటం ఖాయం. నిరుడు ఇదే రోజుల్లో అంటు కున్న కరోనా సడలింది అనుకునే లోగా మళ్ళీ పుంజుకుంటోందనే వార్త. ఇదివరలో పద్నాలుగు రోజులు కాలం ఉండేది ఇప్పుడు మూడు రోజుల్లో అంతా తేలిపోతుందని భయపెట్టే వార్తలు, లక్షణాలు ఇవి అని చెప్పేందుకు లేదు. వస్తే ఈడ్చెయ్యడమేనని సోషల్ మీడియా వార్తలు భయపెడుతున్నాయి. నేటి కరోనా విషయంలో ప్రభుత్వం కొద్దిగా వార్తలిస్తే ఈ బెదిరింపులు తగ్గుతాయేమో! పిల్లలు బడికి వెడుతున్నారు, ఇంతలో ఒక సోషల్ మీడియా వార్త కరోనా పెరిగిపోడంతో బడి, కాలేజిలకి రెండు నెలలు శలవులని. ప్రజలు బేజారెత్తి పోయారు. ఇలాటి వార్తలు ప్రచురించేవారిని కఠినంగా ప్రభుత శిక్షించాలని కొరిక. వార్త ఉత్తిదేనని ప్రభుత వివరణ ఇచ్చేలోగా జరగ వలసినది జరిగిపోయింది. ఇటువంటి నీలి వార్తలు ప్రచారం చేసేవారు పొందే ఆనందం ఏమిటో!
పైశాచికానందం 👻👻
ReplyDeleteవిన్నకోట సార్,
Deleteవీరి సంఖ్య పెరుగుతోంది సార్
శ్లో: మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ
ReplyDeleteమరీచ ఆదిత్య సవితృ అర్క భాస్కరేభ్యోం నమ:
అని కదా? చివరి నుంచి రెండో నామం "అర్క" అని ఉండాలి.
DG SIR,
Deleteపొరపాటు సరిజేసేను
ధన్యవాదాలు.
>> ఇటువంటి నీలి వార్తలు ప్రచారం చేసేవారు పొందే ఆనందం ఏమిటో!
ReplyDeleteప్రపంచంలో ఎవరికైనా సరే మొదటి కర్తవ్యం - ప్రజల్ని ఏడిపించుకు తినడం. వాళ్ళు ఏడుస్తూంటే కళ్ళు తుడిచి నోట్లో అన్నం ముద్ద పెట్టి - చూసారా నేనెంత గొప్పవాణ్ణో అనిపించుకోవడమూ కదా? ఇందులో ఏమిటి వింత?
DG sir,
Deleteముడ్డి గిల్లి జోలపడ్డం అంటే ఇదేనాండి?
అవునండి. పాత కాలంలో అయితే హిరణ్యకశిపుడు వాడి తమ్ముడూ తొడలు గొడుతూ, గద చేత్తో పట్టుకుని గాలిం గుంభినగ్ని నంబువలనాకాసస్థలిన్ .. అని బ్రహ్మదేవుణ్ణి కోరుకుని (అంటే లీగల్ రైట్స్ సంపాదించి) రణధర్మం పాటిస్తూ అయినా జనాలని చావగొట్టేవారు. ఇప్పుడు సూటూ బూటూ వేసుకుని లాప్ టాప్ చేత్తో పట్టుకుని ధర్మం అంటే ఏమిటో కూడా తెలియక్కర్లేకుండా ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. ఒక్కటే తేడా. అప్పట్లో పేరు 'నేను హిరణ్యకశిపుణ్ణి కాచుకో' అని ధైర్యంగా చెప్పేవారు. ఇప్పుడు అలా పేరు చెప్పడానికి నామోషీ కనక పేరు కాసిప్ హెచ్ అనో, హెచ్. కాస్యప్ అనో మారుస్తున్నారు. పూర్తి పేరు చెప్పుకోవడం నామర్దా! కాలం కల్సొచ్చినప్పుడు అందినంత దండుకోవడమే. పుణ్యమా అదెవడిక్కావాలి? పాపమా? అంటే ఏవిటయ్యా? ఒక పెద్దాయన ఉవాచ - పాపం చేసేవాళ్ళు అనుభవిస్తారని అంటార్లెండి కానీ అదేనాడూ జరగదు. చేతకాని వాళ్ళు అలా పైకొచ్చేవాళ్ళని చూసి ఏడుస్తూ ఏం చేయలేక అనే మాటలు అవన్నీను. మోసాలు చేసి పైకొచ్చేవాళ్ళు హాయిగా ఉన్నారుగా? ఆహా, ఏం అద్భుతమైన సమాధానం!!
DeleteDG గారు
Deleteహిరణ్య బ్రదర్స్ అండ్ కో ని ఫాలో ఐపోదాం సార్
ఏ ఎండకా గొడుగు చందాన.. ఇచ్చోట సూర్యదేవరుని తందాన.. ఓరుగల్లులో మా ఇంటి లోపల ప్రచండోత్పాత తాపం.. ౩౭°సెంటిగ్రేడ్.. అదిన్ను మార్చ్ మొదలు.. ఇహ ఏప్రిల్ మే జూన్ లు ఎలా ఉంటాయో.. గాలి కోసం కిటికి తెరిస్తే దోమల బెడద.. ఆలౌట్ లాంటిది పెడదామంటే చంటి పిల్లలిద్దరు.. ఏసీ లేదు.. కొనాలి.. ప్రచండ భాను ప్రతాపం.. "భాట చిరావ జూఁ తడకో*" అంటే ఇదేనేమో.. (*రాళ్ళు పగిలేలా ఎండ)
ReplyDeleteశ్రీధరా!
Deleteమనం చేతులారా చేసుకున్న పనుల ఫలితాలు సర్. తప్పదు ఏ.సి కొనెయ్యండి, మీకోసం కాదు లేండి, :) పిల్లల కోసం కదా! :)
ఈ చుట్టుపక్కల కాలని లలో ఇళ్ళు కడుతూ, రోడ్లు వేస్తుంటారు, ఒక ఇంటికి మరో ఇంటికి నడుమన గోడంత ఖాళి మాత్రమే.. చెట్లు పొదలు ఆయా ఇంటి ఆవరణ లోపలే.. వెలుపలంత కాంక్రీట్ జంగల్ శర్మాచార్య.. మాయావిడ వారి మేనమామ ఓ డొక్కు డిజర్ట్ కూలర్ ఇచ్చారు పెళ్ళిలో అదైతే ఒకటే రొత.. చెవులపై మోత.. కరెంట్ బిల్లు వాత.. అందుకే ఈ నెలో తరువాయో కొనాలిక ఏయిర్ కండీషనర్ ఎతావాత..! నిజమే అక్కేమో రెండేళ్ళు, బాబుమేమో నెల
Deleteశ్రీధరా!
Deleteనిర్ణయం తీసుకోడానికి ఆలస్యం జరగచ్చు కాని అమలు చేయడాని ఆలస్యం కూడదంటారే పెద్దలు :)
ఇటువంటి 'నీలివార్తలు'
ReplyDeleteకటువేమరి , కాని సారు ! కలమున్నది దా
పట కందాలు గిలుకుటక?
అటులైతే 'మీఢియా'మహాత్మ్యం బేమౌన్?
రాజావారు,
Deleteఅంతేనంటారా సారూ! కందమ్మ కనబట్టం లేదు రెండు రోజులనుంచి, మీకేమైనా ఆచూకి తెలుసా!
సారూ ! వారు మహాత్ములు🙏,
ReplyDeleteవారగ గురుదేవు🤔తోటి వరసన్మానా
లారసి కడు😄పుణ్యఫలము
చేరలతో🤗ద్రావ సభల చెంతకు జనిరో ?
Deleteవారు మహాత్ములు! తాతా
వీరున్ను మహాత్ములంచు విదులెల్లరినీ
ధారాళముగా మెచ్చుట
మా రాజావారి మంచి మనసుకు పొడయౌ! :)
జిలేబి
పొడగిట్టనోళ్ళు కొందరు
ReplyDeleteపడిపడి మొక్కినను మండిపడుదురు విహితా !
చిడిముడివడుటే వారికి
కడుంగడు ముదంబె యేమొ ఘనహితమంతా !
రాజావారు,
Deleteతమకు చెప్పేటంతవాడిని కానేమోగాని, మన పొడ గిట్టని వారి దగ్గరకి ఎకెందుకు పోవడం. వదిలేద్దురూ
Delete... వారి దగ్గరికి ఏకేందుకు ఎందుకు పోవడం అన్నారా :) హన్నా !
జిలేబి
Zilebi.
Delete:) జిలేబి నల్లి కళ్ళకి బలే కనపడతాయే :)
రాజావారు,
Deletetypo
తమకు చెప్పేటంతవాడిని కానేమోగాని, మన పొడ గిట్టని వారి దగ్గరకెందుకు పోవడం. వదిలేద్దురూ
ReplyDeleteపొడగిట్టనోళ్ల గ్రక్కున
విడవండీ రాజ! వారి వికటపు చేష్టల్,
మడిగట్టుకున్న పద్ధతు
లు, డంబములు సరి విదితములు కదా యెపుడో!
జిలేబి
బుజ్జమ్మా!
Deleteరెండు రోజులుగా ఎక్కడా కనపడకపోతే ఎలా వున్నారో నని అడిగా అంతే! బాగున్నట్టు వారత చెప్పి కడుపులో చల్ల పోశారు :)
రోజులు లెక్కబెట్టుకునే........
>> రెండు రోజులుగా ఎక్కడా కనపడకపోతే ఎలా వున్నారో నని....
Deleteచిత్రం. నేను రోజులతరబడి మౌనంగా ఉండిపోయినా ఈబ్లాగుప్రపంచంలో ఎవ్వరూ పట్టించుకోరు కదా!
శ్యామలీయం వారు,
Deleteచిక్కు ప్రశ్నే :)
పెద్దలడిగారు కనక సమాధానం చెప్పడానికి ప్రయత్నం.
తమరేమో రామనామంతో కనపడుతూనే ఉన్నారు. నిజానికి మిమ్మల్ని పలకరించడం, మీ ఏకాగ్రతను భంగం చేయదమే.....ఇక...మిగిలినది చెప్పనూ :)
సార్థక నామధేయులు తమరు శ్యామల్ రావు సర్.. రాముని తలుచుకునే ఆంజనేయునిలా మీ బ్లాగ్ లో మీరు రచిస్తున్న కీర్తనలు ఈ కాలపు రామదాసులా, ఒహపటి వాల్మీకిలా అనిపిస్తారు.. నాకూ భక్తి ఎక్కువే.. రామదీక్ష దక్షతకు ప్రణవిల్లుతున్నాను.. శర్మ గారు చెపినట్లుగానే రామనామము దలచే మీవంటి వారిని తలుచుకోవటమూ పుణ్యమే.. అందరూ క్షేమమనే తలుస్తున్నాను.. శ్రీరామజయం, జై శ్రీమన్నారాయణ.
Deleteసోషల్ మీడియా వార్తలు చిన్నప్పుడు స్కూల్ లో చదివిన సోషల్ సబ్జెక్టు లాంటివి. అస్సలు ఉపయోగం లేదు. వదిలెయ్యండి.
ReplyDeleteసూర్యా జీ
Deleteవాట్స్ ఆప్ వార్తలు నమ్మను, కాని ఈ వార్త పిల్లల్ని నన్ను ఇబ్బంది పెట్టింది.