Friday, 21 August 2020

చేసుకున్న కర్మమోయ్


చేసుకున్న కర్మమోయ్ 
చెంబు (శంభు) లింగమా
అనుభవింపక తప్పదోయ్ 
ఆత్మలింగమా

కారుతో పాటు బతికి బయటపడే మార్గం చెప్పండి 

5 comments:

  1. టాక్సీ అనుకుంటాను, అటువంటి మూర్ఖులకు ఎవరేం చెప్పగలరు, సర్?. పోలీసులొచ్చి ఏమైనా సహాయ చర్యలు చేస్తారేమోనని ఎదురు చూడడమే.

    బస్సు అంటే పెద్ద బండి కాబట్టి దాటే అవకాశం కొంత ఉండచ్చేమో? బస్సులు కూడా కొట్టుకు పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా. ఈ కారువాడికి అజ్ఞానం, ఈకాలపు అహంకారం, నిర్లక్ష్యం ... వెరసి తన ప్రాణంతో బాటు కార్లో ఉన్న ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చిపెట్టే మూర్ఖత్వం. ఇటువంటి వాళ్ళను ఎవరూ బాగు చెయ్యలేరు.

    ఒడ్డున నిలబడి అరుస్తున్న వాళ్ళ కామెంట్లు మాత్రం మహా colourful గా ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఒక్కమాటలో చెప్పాలంటే మూర్ఖత్వం

      Delete
  2. టాక్సీ అనుకుంటాను, అటువంటి మూర్ఖులకు ఎవరేం చెప్పగలరు, సర్?. పోలీసులొచ్చి ఏమైనా సహాయ చర్యలు చేస్తారేమోనని ఎదురు చూడడమే.

    బస్సు అంటే పెద్ద బండి కాబట్టి దాటే అవకాశం కొంత ఉండచ్చేమో? బస్సులు కూడా కొట్టుకు పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా. ఈ కారువాడికి అజ్ఞానం, ఈకాలపు అహంకారం, నిర్లక్ష్యం ... వెరసి తన ప్రాణంతో బాటు కార్లో ఉన్న ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చిపెట్టే మూర్ఖత్వం. ఇటువంటి వాళ్ళను ఎవరూ బాగు చెయ్యలేరు.

    ఒడ్డున నిలబడి అరుస్తున్న వాళ్ళ కామెంట్లు మాత్రం మహా colourful గా ఉన్నాయి.

    ReplyDelete
  3. వరంగల్ ములుగు సబ్ జిల్లా అనుకుంటా సర్.. అకాడ జంపన్న వాగు ఒకటి.. మేడారం సమ్మక్క సారాలమ్మ తాడ్వాయి జాతర గురించి వినే ఉంటారు.. ఆయా వాగులన్ని అంచులు దాటి పొంగి పోతున్నాయి.. లక్నవరం కూడా అదే స్థాయిలో ఉంది.. ఈ వర్షాల ధాటికి ఆనకట్టలు, రోడ్లు, జలాశయాలు సైతం పెక్కుటిల్లి పోతున్నాయి.. మా అమ్మమ్మ వారి ఊరి నుండి మా నానమ్మ వారి ఊరు చేరుకునే దారిలో వాగులున్నాయి.. అవి కూడా పొంగి పొర్లి వియాడక్ట్ లు, కెనాల్ పార్చ్‌మెంట్ వాల్ ఇవన్ని కూడా కుంగిపోయి.. రోడ్లకు ఠికానా లేకుండ అధ్వానంగా తయారయ్యాయట.. ఇంత వరదలో ఈ మహమ్మారి కాలం లో సైతం అమాంతం ఇటువంటి ప్రయాణాలను దాదాపుగా నిలిపి వేస్తే బాగుంటుంది. చెరువు గట్ల ప్రస్తావన సైతం వర్ణనాతీతం..అవి కట్టలు తెంచుకుని పొలాల మడుల్లో నీరు చేరి దోమల బెడద.. ఊరు దాటలేని పరిస్థితి.. పైగా కరోన వలన ఆసుపత్రుల్లో కొరవడిన ఇన్-పేషంట్ బెడ్లు.. ఇరవై ఇరవై ఇరగదీస్తోంది.. అందరిని పట్టి పీడిస్తోంది.. అగ్ర రాజ్యాలకు సైతం మినహాయింపులు లేవాయే..! ఎటు పోతుందో ఇహ కాలమే చెప్పాలి..!

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్,
      ఇక్కడా వర్షాలు జోరుగా ఉన్నాయి. చేలన్నీ ములిగిపోయాయి. నీరు నెమ్మదిగా తీస్తోంది. వారం పడుతుంది. అమావాస్య కనక నీరు లాగుతోంది కోడు లోకి.ఇటువంటి చోట్ల జాగ్రత్త వహించకపోతే ప్రాణాలకే ముప్పు కదా. అసలు అగ్రరాజ్యాలు తెచ్చి మ్పెట్టిన ముప్పులే కదా!

      Delete