మంగళం జయ మంగళం.
======================
మంగళం జయామంగళం
మా వియ్యపురాలి నడతలకి జయా మంగళం.
చింతమాను చిగురే చూడు,
వియ్యపురాలి మోము చూడు,
కనులు తిప్పుతు మాటచూడు,
వయ్యారంపు నడక చూడు...........Iమంగళం I
ప్రేమతోటి వియ్యపురాలికి
అరటిపండు చేతికిస్తే
తినుట ఎరుగని వియ్యపురాలు
తొక్కమింగి కక్కుకొనియె..........Iమంగళం I
పల్లెటూరి వియ్యపురాలు
పట్నవాసం పక్కకొస్తే
కారు చూచి హడలిపోయె
అన్నవచ్చి గుండె రాసే...............Iమంగళం I
భక్తి కొద్దీ వియ్యపురాలు
తులసిపూజకు తాను వెళితే
గాలి వీచి పైట ఒదిగే
అన్నవచ్చి సద్ది వెళ్ళె..........Iమంగళం I
జానపదం
జానపదం
వియ్యపురాలి మీద విసుర్లు బాగానే ఉన్నట్లున్నాయే జానపదాల్లో?
ReplyDeleteబాగానే ఉంది గానీ అన్న వచ్చి పైట సర్దటమేమిటండీ?
విన్నకోటవారు,
Deleteఇది పెళ్ళి కూతురు తల్లి పెళ్ళి కొడుకు తల్లిని ఉద్దేశించి పాడే పాట. వియ్యపురాలు పల్లెటూరిదనీ అరటిపండు తినడం కూడా తెలియనిదని ఎద్దేవా. వియ్యంకుడు తనకు వరసకు అన్న అవుతాడుకదా! పైట కూడా సద్దుకోడం తెలియని వియ్యపురాలికి ఆమె భర్తవచ్చి పైట సద్దేడని ఎగతాళీ. :)
అయితే ఓకే 🙂.
Deleteఅబో అబో అబబబబబో.. కోకనాడ పిల్ల మేమ్ కోక్ తాగలేదా
ReplyDeleteమేమ్ కోక్ తాగలేదా మీరు కేవ్వు కేక యనలేదా
అన్నారన్నార్లే తొండి చాల్లే మరి.. చల్ల ముంతను దెచ్చి కల్లని వాగలేదా..
తాటిచెట్ల పిల్ల మేమ్ తాడు తేలాదా.. తాడు తేలేదా మీకు మంచె కట్టలేదా..
బురదగుంట పెల్ల మేమ్ బురద తేలేదా.. బురద తేలేదా మీరు అందులో మునగలేదా..
ప్చ్.. నాకూ ఒక మరదలుంటే బాగుండేది శర్మ గారు.. సరదాగా ఆట పట్టిచే వాణ్ణి.. నా భార్య కు చెల్లెళ్ళు లేరుగా అన్నలు తప్పా..! వాళ్ళు బావమరదులకి తక్కువ స్వార్థపరులకు ఎక్కువ.. వాడి కూతురికి ఐదువేలు పెట్టి బట్టలు తీసుకుంది నా భార్య.. నా కూతురు కోసం వాడు పది రూపాయలు కూడా ఖర్చు పెడితే .. బావ పది రూపాయలయ్యింది కావాలి అంటాడు..! అందుకే నువ్వేమి కొనొద్దే నని మాయావిడికి మొట్టికాయలేశాను..!! రఘు కుంచే గారి పాటలా.. నీ పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు.. అని వియ్యపురాలు పాడితే.. అమ్మో అమ్మో.. అసలే బంగారం ధర అమాంతం నింగికెగిషింది.. అంతలో ఎక్కడో పడెసినాడ్ జహాపనా అంటు ఫిరియాదు చేసినా చేష్టడి శర్మ గారు..!
శ్రీధర్,
ReplyDeleteకోక్ నాడ పిల్లా నువు కోక్ తాగలేదా నేను డబ్బు కట్టలేదా :)
నువ్వు కోక్ తాగలేదా నేను కెవ్వు కేకలేయలేదా
తాటిచెట్లపిల్లా నువ్వు తాడుతేలేదా నేను నీకు కట్టలేదా
కోక్ పిల్ల పెల్లామయ్యెగదు బాబా!
బామ్మర్దున్నాడే ఈడు పెల్లానికి తక్కువా యములోడికెక్కువా బిడ్డా
మొట్టికాయిలేసినా ముద్దుకాయలేసినా కరుసు కరుసే....
మరదేటోగాని ఆలివంకవారు ఆత్మబంధువులు, తండ్రి వంకవారు దాయాదులు, నిజం. బావమరిది బతకగోరు,దాయాది చావగోరు సామెతబ్బయ్యా :)
ఝుంకా గిరారే బారెల్లీ బాజార్ మే, ఝుంకా గిరారే :)
తంగం రేటు కొంసెం తగ్గిచ్చి పెరిగిపోతాదయ్యో !!! తంగం తంగం
అయ్యో..!! నా పాట పేరడి శృతి తప్పినట్లుంది.. సరి చేసినందుకు ధన్యవాదాలు ఆచార్య..
Deleteమీ కామెంట్ రిప్లై బయట కురుస్తున్న వాన జల్లు లా తెనీటి వరదొలే ఊరట నిస్తోంది శర్మ గారు అదీ మీ మార్క్ యాసలో అదుర్స్.. మీ సలహాలు శిరోధార్యమే..!
తంగం రేటు ఐమ్‌పత్తాయిన్‌తైరమ్ తగ్గనంటోందిగా తులానికి.. ఇహ తంగం విషయంలో తులాభారమే..!! :)
~కైలాసవాస కందర్పహారి~
~శ్రీధర్ భూక్యా
ReplyDeleteతాతగారు,
వినరా వారి ఈ తహ తహ ప్రశ్న కు జవాబిద్దురూ
తను చేసిన అస్త్రసన్యాసం ప్రకారం కర్ణుడు మొదటి పది రోజులూ ... అంటే భీష్ముడు పోరాడినన్ని రోజులూ ... యుధ్ధరంగంలో అడుగుపెట్ట లేదు కదా. మరి ఆ పదిరోజులూ అతడి అక్షౌహిణిని ఎవరు నడిపించినట్లు
జిలేబి
బామ్మా! కళ్ళు నెప్పులూ, కాళ్ళూ చేతులూ నొప్పులు,ఓల్డ్ ఏజ్ ప్రోబ్లెమ్స్ యు నో! పిలిచిన పేరంటాలకే వెళ్ళటం లేదుగా, పిలవని పేరంటాలకెందుకు చెప్పు :)
Delete
Deleteఇవన్నీ ఎప్పుడూ వుండేవే తాతగారు, కాస్త చూసి వినరా వారి తహతహ కు దోహదం చేయుడీ
జిలేబి
శర్మ గారు,
Deleteఅవును, పిలవని పేరంటానికి వెళ్ళ కూడదు I agree 🙂.
మహాభారతం గురించి మిమ్మల్ని అడగకుండా మాబోంట్లకు ఎలా గడుస్తుందండీ? మిమ్మల్ని పిలవకుండా ఎలా ఉంటాం?
అన్ని కోర్టులూ తిరిగి చివరకు ప్రివీ కౌన్సిల్ ను శరణు వేడేవారు (ట). అలాగే నేను కూడానన్నమాట. ముందుగాల👍 ... కురుక్షేత్రంలో ఆ సేనానుల జాబితా ఇచ్చిన ఆ బ్లాగర్ గారే నా సందేహాన్ని నివృత్తి చేస్తారేమో అని ఆశించాను. అది జరగ లేదు. మరెవరైనా పూనుకుంటారేమోనని చూశాను, సూర్య కూడా ప్రోత్సహించారు బ్లాగు జనాల్ని. తదుపరి బోనగిరి గారు తన అంచనా చెప్పారు,
చివరకు ప్రివీ కౌన్సిల్ లాంటి మిమ్మల్ని అడుగుదామని అనుకుంటూనే ఉన్నాను ఈ లోగానే మా లాయర్ గారు “జిలేబి” గారు అప్పీల్ వేసేశారు. సరే అదీ మంచిదే, ఇక మీరే నా సందేహ నివృత్తి చెయ్యాలి.
నరపతి విముఖుండవగా
ReplyDeleteసరియా తనసేన యుధ్దచాయలబోవన్?
అరుదీ ఆలోచన , ఆ
కురుపతికే లేని తపన గురులకు గలిగెన్ 🤔 .
Deleteఅరయగ పనిబెట్టిరి మా
నరసన్నయె భారత కథనమ్మున చెలరే
గిరి దిక్కు తెలియక జనులు
కురుపతికే లేని తపన గురులకు గలిగెన్ !
నారదా
చాన్నాళ్లాయె :)
మహాభారత “Privy Council” వారు చెప్పేశారండీ, “జిలేబి” గారు 🙂. కర్ణుడు వెనక నుండి ఆదేశాలిస్తూ తన సేనను నడిపించి ఉంటాడని అన్నారు.
Deleteనా “తహ తహ” ఏమిటంటే అనాటి కర్ణుడి దైనందిన సూచనల ప్రకారం సేనను నడిపించిన ఆ సేనాని నేనే కదా అనే అనుమానం పొడచూపుతూ ఉంచింది అన్నమాట, అది తెలుసుకుందామని తహ తహ 💂♀️ 😁😁.
(ఆంధ్రులు కౌరవపక్షానే యుద్ధం చేశారని ఎలాగూ మహాభారతంలో అన్నారు కదా 🙂)
// "కళ్ళు నెప్పులూ, కాళ్ళూ చేతులూ నొప్పులు" //
ReplyDeleteశర్మ గారు,
డయాబెటీసా? అయితే సంప్రదించండి ఒక .Com తెలుగు బ్లాగ్ వారిని. డయాబెటీస్ బాధితుల కోసం పలు రకాల సలహాలు పోస్ట్ చేస్తుంటారు ఆ బ్లాగులో.
(ఆ బ్లాగరు అమ్మాయి తన ఫొటోలో మరీ ముక్కుపచ్చలారనట్లు కనిపిస్తుంటే ఆ మధ్య నేను అడిగాను మీరు డాక్టరా / డయబెటాలజిస్టా అని. వారేమీ స్పందించలేదనుకోండి, అది వేరే సంగతి 😒.)
విన్నకోటవారు,
Deleteచెబితే శానా ఉంది...డయాబెటీస్ ముఫై ఏళ్ళ సహవాసి :)
తిప్పతీగదెచ్చి ఒప్పుగా మరిగించి
ReplyDeleteచల్లబరచి తేర్చి సగముగ్లాసు
దినము దినము త్రాగ దిటువౌనట శరీర
మార్య ! వెజ్జుదెలిపె , మంచి దేన?
రాజా వారు,
ReplyDeleteతిప్ప తీగను సంస్కృతంలో అమృత అంటారు. చాలా మంచిది. వైద్యుడు చెప్పినది నిజం. ఇలా రోజూ చేయలేరు. దీనినుంచి తిప్పసత్తు అని తయారు చేస్తారు. దానిని కొద్దిగా మోతాదులో సరైన నుపానంతో తీసుకుంటే...సరైన అనుపానం, మోతాదు మంచి అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యుడు చెప్పగలడు