Tuesday, 13 February 2018

ఓం నమశ్శివాయ

https://youtu.be/1_UjqNOJxxU








26 comments:



  1. శివ శివ యనుమమ్మ మనసా శివకవి వలె,
    వర్ధ నుడనాది యోగియు వరము లివ్వ !
    రాధనముల నిచ్చెడు శివ రాత్రి యిదియె
    త్రికరణపు రీతి బడయ ధాత్రి, నిజముగను !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పద్యం బాగుంది.
      శివుని మీద మరో పద్యం గిలకలేకపోయారా?

      Delete


    2. అలికాక్షుడి కరుణ బడయ
      గిలకగ పద్యము లనేమి గిట్టుబడియగున్,
      గిలకొట్ట వలె మదిని తా
      శిలయై నదియై పరుగిడ శివశివ యనుచున్ !

      జిలేబి

      Delete
    3. అలికాక్షుడు మంచి పదం. వ్యుత్పత్తి అర్ధం చెప్పండి.

      Delete


    4. అలికమన లలాటమయా
      తెలివిగల విదుర! తమరికి తెలియకనా! సు
      ద్దుల నీకడ నేర్చె జిలే
      బి లబ్జు గన్ మాచనార్య, బీలేజీ యై !



      జిలేబి

      అలికాక్షుడు నొసలిచూపువేల్పు

      Delete
    5. సరసిజనాభ సోదరి అలికాక్షియా?

      Delete

    6. విశాలాక్షి ; శకాక్షి :)


      జిలేబి

      Delete
    7. సమాధానం తప్పుతోవ పట్టింది. సరసిజనాభ సోదరి అలికాక్షి యా?

      Delete


    8. కాదని కుంటా

      ఆలి కా శ్రీ :)


      జిలేబి

      Delete
    9. కాదని కుంటా :) ఏంటీ? కంటా కింటే :)

      ఆలికా శ్రీ జిలేబీ :)

      సరసిజనాభ సోదరి= లలిత= త్రినయన=అలికాక్షి :)

      తేజోవతీ ”త్రినయనా” లోలాక్షీ కామ రూపిణీ లలిత సహస్రం నుంచి.

      అలికాశ్రీకి సమానమైన నాలుగక్షరాలమాట చెప్పండి జిలేబీ :)

      Delete

    10. ఈక్వేషను కి వంద మార్కులు ఎంతైనా అనపర్తీశులు అనపర్తీశులే

      సరసిజనాభ సోదరి= లలిత= త్రినయన=అలికాక్షి :)


      అలికాశ్రీ కి నాలుగక్షరాల పదం

      తెలియదు


      జిలేబి

      Delete
    11. విరూపాక్షి

      విరూపమైన కన్నులు కలది=లలిత=అలికాక్షి
      విరూపాక్షి

      విరూపమైన కన్నులు కలది=లలిత=అలికాక్షి.

      ఈ వేళకి చాలా :) రేపు మళ్ళీ :)

      Delete

    12. వేసుకోండి వీరత్రాళ్లు

      జయహో అనపర్తీశా! జయ
      జయహో ! విజ్ఞాన ఖని! సుజన! మాచనుడా ! :)


      జిలేబి

      Delete
    13. మరీ అంతొద్దు :) డేంజర్ అపాయం :)

      Delete


    14. ఆడెన్నక్షులతో నా
      టాడే మాచన జిలేబి టాటా చెప్పెన్
      వేడుక పదముల జేర్చెన్
      బోడీ ! విదురుల కెలుకన బోల్డన కబురుల్ :)

      చీర్స్
      జిలేబి

      Delete


  2. అంతొద్దు ! మరీ డాంజరు!
    వింతగు పదముల జిలేబి విరిసెన్ గాదే !
    కొంతయు నేర్చితి మయ్యా
    చెంతన చేరుచు విదురుడ చెకుముకి రాయీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అలికాక్షి,చపలాక్షి,చంచలాక్షి, మీనాక్షి,విరూపాక్షి,మృగాక్షి, లోలాక్షి,తరలాక్షి,కామాక్షి,నళినాక్షి,నీరజాక్షి,పంకజాక్షి,పద్మాక్షి,పుష్కలాక్షి,వనజదళాయతాక్షి, సారసాక్షి,హరిణాక్షి,కమలాక్షి,కువలయాక్షి,కురంగాక్షి,విశాలాక్షి,సహస్రాక్షి,శకాక్షి.

      Delete
    2. అంబుజాక్షి, అంబురుహాక్షి, ధవళాక్షి, కమలపత్రాక్షి, హరిణేక్షి, జలజాక్షి, మదిరాక్షి, పుష్కలాక్షి, లోలాక్షి, తోయజాక్షి, శఫరాక్షి, సారసాక్షి

      Delete


    3. తేటగీతి


      అక్షి! అలికాక్షి ! చపలాక్షి! సారసాక్షి !
      పంకజాక్షి! కువలయాక్షి !చంచలాక్షి !
      అంబుజాక్షి!మీనాక్షి! పద్మాక్షి ! నీర
      జాక్షి!వనజదళాయతాక్షాశకాక్షి !


      జిలేబాక్షి :)

      Delete
    4. B Sreenivasuగారు,
      కామాక్షి కంజదళాయతాక్షి....... శ్యామశాస్త్రి కీర్తన కదూ!. ఇలా వెతుకుతూ పోతే చాలానే దొరుకుతాయనుకుంటానండి
      ధన్యవాదాలు.



      Delete
    5. Zilebiగారు,
      అమ్మ పేర్లతో పద్యం బాగుందండి
      ధన్యవాదాలు.



      Delete


    6. లవ్లీగా ఉన్నాయి పదాలు :)

      జిలేబి

      Delete
    7. నామావళి అంటే అష్టోత్తర శతమే కావాలి లేదా సహస్రం కావాలి :)

      ఇందువదన కుందరదన
      మందగమన మథురవచన

      Delete
  3. శ్యామాశాస్త్రి గారి కీర్తనంటారా శర్మ గారూ? ముత్తుస్వామి దీక్షితార్ గారిదా?

    ReplyDelete
    Replies

    1. ముత్తుస్వామి వారిదేనటండి,సరిజేసినందుకు
      ధన్యవాదాలు

      Delete


    2. శ్యామాశాస్త్రిది కాదే ?
      శ్రీ ముత్తుస్వామి వారి సిరి శర్మాజీ !
      భామ! నరసన్ననెరుగని
      దేమీ లేదౌ జిలేబి తెలివి మరీనూ :)

      జిలేబి

      Delete