9, సెప్టెంబర్ 2026, బుధవారం

justice delayed is....

justice delayed is.....

 https://www.ssbcrack.com/2026/09/crpf-havildar-who-became-sadhu-returns-to-duty-after-27-years-following-legal-battle.html


CRPF Havildar Who Became Sadhu Returns to Duty After 27 Years Following legal Battle For years, Tomar lived between two worlds, performing worship at a temple while simultaneously fighting through the courts for the right to wear his uniform again. By SSBCrack Last updated: September 2, 2026 Share Bijapur / Morena, September 2, 2026: After nearly three decades away from service, Girvar Singh Tomar has made an extraordinary return to the uniform of the Central Reserve Police Force (CRPF), bringing to an end a 27-year struggle that began with his dismissal from the force in 1999. IMA Mug ₹499 Shop Now IAF Mug ₹499 Shop Now NDA Mug ₹499 Shop Now Navy Mug ₹499 Shop Now NSG Coffee Mug ₹499 Shop Now The 54-year-old native of Chhichhawali village in Madhya Pradesh’s Morena district recently reported for duty with the CRPF’s 85th Battalion in Bijapur, Chhattisgarh. His return is particularly remarkable because much of the period between his dismissal and reinstatement was spent living the life of a sadhu. On the night of August 25, Tomar boarded a train from Morena for his new posting. After reaching Bijapur the following morning, one of his first stops was a barber shop. The long hair and flowing white beard he had maintained during his years as a sadhu were cut away. By afternoon, the mustard-coloured robes associated with his spiritual life had been replaced by a crisp CRPF khaki uniform, cap and polished boots. More Read Indian Army Signs MoU with Jaipur School, Offers Up to 50% Fee Concession for Soldiers’ Wards Lieutenant Badal Tops Young Officers’ Course at College of Military Engineering Pune Indian Army Major Questioned as Madras Regiment Armoury Theft Probe Widens; 12 Firearms Still Untraced “It is all by the grace of God. It feels as if I have returned home,” Tomar said after rejoining the force. Tomar joined the CRPF in 1991 and served for around eight years before his career was abruptly interrupted. His service came to an end on October 21, 1999, following a departmental inquiry arising from a dispute involving a senior officer. Tomar has maintained that the allegation at the centre of the dispute — that his bicycle had struck the officer’s vehicle — was false. According to him, his decision to contest the accusation ultimately made matters worse. “I contested the allegation that my bicycle hit his vehicle. That made the situation worse,” he recalled. Court records identify him as Constable Driver Girwar Singh Tomar, force number 913126828, and state that he was charge-sheeted in July 1999. Following his dismissal, his departmental appeal and subsequent revision were rejected in 2000. Unwilling to accept the decision, Tomar approached the Allahabad High Court, beginning what would become a legal battle spanning more than two-and-a-half decades. A significant breakthrough came on April 10, 2007, when a single judge of the Allahabad High Court concluded that even if the allegations against Tomar were accepted, the punishment of dismissal was harsh and disproportionate to the alleged misconduct. The court consequently granted him relief. However, his return to service was still far away. The Union of India and the CRPF challenged the ruling through a special appeal and secured a stay. The litigation subsequently remained pending for years, leaving Tomar in an unusual state of uncertainty over his future. As the legal proceedings dragged on, Tomar’s life took a dramatically different direction. After returning to Morena, he joined the Nirmohi Akhara around 2001 and embraced the life of a sadhu. He became known as Baba Girvar Das and later as Girvardas Maharaj. He initially spent time at the Barahdwari temple near his village before spending around two decades at Morena’s Gufa Mandir. His days were increasingly devoted to prayer and temple duties, but his fight to regain his CRPF service continued. Tomar reportedly travelled for court proceedings whenever required, moving between his spiritual responsibilities and a legal battle over a uniform he had once worn. Despite becoming a sadhu, he remained connected with his family. Tomar is the son of Damodar Singh Tomar. His wife, Manju Devi, and their four children remained part of the household he continued to support. His daughters Shivani and Radha are married, while one of his sons, Abhishek, serves in the Indian Air Force. His other son is Krishna. The decisive development finally came in August 2025, when a Division Bench of the Allahabad High Court disposed of the Union government’s appeal and directed that Tomar be taken back into service within three months. Even then, his reinstatement was not immediate. The CRPF reportedly faced difficulties retrieving records connected to a case dating back more than two decades. Further notices followed as Tomar waited for the High Court’s direction to be implemented. Nearly a year later, the long wait finally ended. The CRPF issued orders for him to rejoin service around August 26, 2026, posting him with the 85th Battalion in Bijapur. From his dismissal in October 1999 to his return to uniform in August 2026, Tomar had spent almost 27 years fighting to regain his place in the force. His return also meant entering a CRPF very different from the one he had left behind. Most of the personnel with whom he had once served have long since retired or moved on. Tomar said only one or two people from his earlier period of service remain, but his new colleagues welcomed him warmly. “Only one or two people from my time remain, but colleagues here are so welcoming and caring, it is as if I never left,” he said. Despite exchanging his robes for the CRPF uniform, Tomar says his return to service does not represent an abandonment of his spiritual beliefs. The years spent as Baba Girvar Das remain an important part of his life, even as he resumes the duties of a uniformed member of the force. He has also indicated that his battle may not be entirely over. Tomar intends to pursue the promotions and associated service benefits he believes he would have received had his career not been interrupted by the dismissal. His story stands out even among India’s many prolonged service-related legal disputes. A CRPF personnel dismissed from service, a court battle lasting nearly three decades, approximately two decades spent living as a sadhu, and finally a return to active duty at the age of 54 make his case exceptionally unusual. For years, Tomar lived between two worlds — performing worship at a temple while simultaneously fighting through the courts for the right to wear his uniform again. Now, after 27 years of petitions, appeals, stays and waiting, the mustard robes of Baba Girvar Das have once again given way to CRPF khaki. For Girvar Singh Tomar, returning to the 85th Battalion is more than simply resuming a government job. It marks the restoration of a career he had fought nearly half his life to reclaim — and an extraordinary homecoming to the uniform he first wore in 1991.

Read More: https://www.ssbcrack.com/2026/09/crpf-havildar-who-became-sadhu-returns-to-duty-after-27-years-following-legal-battle.html

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

గిరి జామాతను గిరిజామాతను

                       తలతును నే గిరి జామాతను గిరిజామాతను

తలతును గోవర్ధన గిరిధారిని తన దేవేరిని
తలతును సత్యలోక నివాసిని సరస్వతిని
తలతును నేవారిని యెల్లవేళల తాదాత్మ్యమునన్!
Courtesy:Anant

14, ఆగస్టు 2026, శుక్రవారం

పెరటి మామిడిచెట్టు-లే...దు.

పెరటి మామిడిచెట్టు-లే...దు. 


పచ్చటి చెట్టు తీసేస్తున్నారే ఒకరి ఓదార్పు.

మామిడాకులకి మరెక్కడికిపోవాలో మరో ఇల్లాలి వేదన.

పళ్ళు కాయలుబాగుండేవి,తీసేస్తున్నారేంటో  మరొకరివగపు. 
 శ్రావణమాసం వెళ్ళనివ్వకపోయారా? మరొకరి మాట. 

ఇలా అన్న ఈ నోళ్ళే ఒకప్పుడు చెట్టు తీసెయ్యండి,దోమలొస్తున్నాయి,చీమలొస్తున్నాయి,పాములొస్తున్నాయన్నవే! నేటికిన్నీ అవశేషాలు పూర్తిగా తొలగింపబడలేదు.  

ఇదెలా జరిగింది?  

చెట్టు తీసెయ్యమన్న మాట ఈనాటిదికాదు,దశాబ్దం పైగా ఉన్నదే. చివరికి ఇల్లాలి ఆరోగ్యానికి కూడా లింక్ పెట్టి భయపెట్టడమూ జరిగింది. కాని నేనూ ఇల్లాలూ కూడా ఏకవాక్యంగా ఖండించడం జరిగింది. ఈ మధ్య ఈ మాట కొంత ఊపుతీసుకున్నది. అబ్బాయి నాతోనే చెట్టు తీసేద్దాం అన్నాడు. ఏదో చెప్పాను,ఎందుకు తీసేద్దాం అంటే కారణాలు చెప్పలేకపోయాడు. ఆకులు రాలితే ఎత్తించుకోండని సలహా చెప్పి ఊరుకున్నా. ఆ తరవాత కొంత కాలానికి కుటుంబ సమావేశంలో మరలా చర్చకు వచ్చింది. చివరిమాటగా నేనున్నంత కాలం ఉంచండి,ఆపై మీ ఇష్టం అని వీటో చేసేసేను. 

మరోసారి చర్చకు వచ్చింది. నిరుడు కాయలేదు,ఈ సంవత్సరం కాస్తుంది,పై సంవత్సరం తీసేద్దామన్నా. అయిష్టంగానే ఊరుకున్నారు. 

కాలం గడిచింది,మొన్ననొక రోజు ఎండ మాడుస్తోంది. మధ్యాహ్న భోజనం తరవాత కునుకు తీసి లేచేటప్పటికి కరంటు పోయింది. ఎప్పుడు పోయిందని వాకబు చేస్తే మీరు పడుకున్న అరగంటకన్నారు. ఏమయిందిట అడిగితే మన ఎదురుగానే 11 కె.వి వైర్ తెగింది. కబురు చెప్పేరట,వస్తామన్నారు. వేడికి తెగి వుంటుందన్నా. కాదు వెనక పెరటిలోని పెద్ద ఉసిరి చెట్టు వేళ్ళతో సహా గాలికి లేచిపోయి, లైన్ మీద పడిందని నెమ్మదిగా చెప్పేరు. ఈ సారి మరలా కుటుంబ సమావేశంలో మన మామిడి చెట్టుకూడా ఆ రోజు ఊగింది,అదౄష్టం మన చెట్టు నిలిచింది అన్నారు. ఆపై మన చెట్టుకూడా ఇలా ప్రమాదం కొనితెస్తుందేమో, బిల్డింగుల మధ్య ఉన్నది, అని భయం పాదుకొలిపేరు. ఆపై మనచెట్టు తీసేద్దాం అన్నారు,మూకుమ్మడిగా, వీటొ చేయలేకపోయాను. అంతేకాదు. నేటికాలం వారిది,వారి ఆలోచనలు,అవసరాలు వేరు,వాటిని కాదని ఎదురు చెప్పడం మంచిదికాదనే జ్ఞానజ్యోతి వెలిగింది,దానితో  ఇష్టం లేకనే తీర్మానానికి తలొగ్గేను. అంతే నిమిషాల్లో పురమాయింపులైపోయాయి. శుక్రవారం సాయంత్రం నెట్ వైర్ దింపి పట్టుకుపోయాడు. శనివారం పొద్దుట పని ప్రారంభించారు. శనివారం ఉదయమే చెట్టు దగ్గరకు చేరి ఇలా ప్రార్ధించాను.     
 
"ఓ వృక్షరాజమా! ఇంతకాలం నీవు మాకు నీడ,ఇచ్చావు. మా శభం కోరి ఆకులిచ్చావు,కాయలిచ్చావు,పళ్ళు తిన్నాం.  నేడు నీవా 40 అడుగులపైన పెరిగావు,శాఖలతో బాగా విస్తరించావు. ఒక వేళ గాలికి జరగరానిది జరిగితే అనే భయంతో నిన్ను తీసేస్తున్నాము,మరో చోట పెంచడానికి ప్రయత్నం చేస్తాను. నిన్ను కంటికి రెప్పలా కాచి చూచుకున్న ఇల్లాలు గతించింది,నేనా గత ఎనిమిదేళ్ళుగా నీ మంచి చెడ్డలు చూడలేదు,ఇక చూడలేను. నన్ను క్షమించు, అని నమస్కారం చేసి ఒకసారి మనసారా కావలించుకుని కన్నీటితో వీడ్కోలు చెప్పేను." 

ఆపై ప్రతిరోజూ పని పూర్తి ఐన తరవాత మాత్రమే చూసాను. నలభై ఏళ్ళు పెంచినచెట్టు నాలుగురోజుల్లో భూమట్టానికి చేర్చేసేరు. 

మరోసారి వృక్షరాజానికి మనఃపూర్వక నమస్కారం తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.  
       




 









7, ఆగస్టు 2026, శుక్రవారం

ఎలపట దాపట.

 ఎలపట దాపట.


ఎలపట దాపట అనే పదాలకి అర్ధం నేటి కాలంవారికి తెలిస్తేనే విశేషం. ఈ పదాలు నిఘంటువులకి కూడా ఎక్కినట్టవుపడటం లేదు. 


ఎలపట దాపట ఎడ్లదోలుకో

చాలు తప్పక కొండ్ర వేసుకో

ఇత్తనమ్ములిసిరిసిరి జల్లుకో

సినిమాలో కొసరాజువారి గీతంలో పల్లెటూరి వాసనకొడుతున్న మాటలు.🤣


ఇప్పుడెందుకీ గోల అనికదా విసుగు చూపుతున్నారు. చిత్తగించండి. 


సుగర్ వ్యాధి ఉన్నవారికి మెట్ఫార్మిన్ వాడక తప్పదు. అలా మెట్ఫార్మిన్ వాడినా,వాడకపోయినా అవకరాలు తప్పవు. కళ్ళు,కాళ్ళు పోవడం అందులో కొన్ని. ఇప్పుడివన్నీ ఏకరువుపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కళ్ళు పోవడం అంటే కనపడకపోవడం. ఇది కాట్రాక్టుతో మొదలవుతుంది.


ఇలా చాలా సంవత్సరాలు ఎలపటలో కాటరాక్టు పెరగడం తో ఒక కంటితో ఇబ్బంది పడలేక ఎనిమిదో పదిలో పుట్టినరోజు బల్లేక్కేను,అంటే మా పల్లెటూరి భాషలో సర్జరీ  చేయించుకుని కళ్ళజోడేసుకుని కాలక్షేపం చేసా, దాపటకన్ను మొండికేసి ఉన్నదే కాని ఎలపటకన్ను మొండికెయ్యడం ప్రారంభించింది.  డాక్టర్ గారి దగ్గరికిపోయా. ఆయన చూసి బల్లెక్కండి తప్పదు అని చెబుతూ ఈ చిన్నకత చెప్పేరు. 


మీలాటి రైతు ఎడ్లని బండికి అరకకి కట్టి పని చేయించుకునేవాడు. ఎలపట మొండి కేసింది. భారం దాపట మీద పడి కొంతకాలాని అదీ మొండి కేసింది. దాంతో బండాగిపోయింది. ఎలపటని పనిలో తర్ఫీదిచ్చి ఉపయోగించుకోడం మొదలెట్టేడు. పని జరుగుతోంది కదా అని అశ్రద్ధ చేసేడు. దాపటకి తర్ఫీదివ్వక వదిలేసేడు. దాంతో రెండెద్దులూ పని చెయ్యక బండి మొండికి పడిపోయింది. అలా కాకుండా ఉండాలంటే బల్లెక్కాల్సిందే,అన్నారు. భయపడుతున్నారని కోడలమ్మాయి కొస ఇచ్చింది. దానికి డాక్టర గారు మొదట బల్లెక్కినప్పుడే భయపడలేదు కదా! మరి ఇప్పుడెందుకూ భయం అన్నారు. తేరుకోగలనా అనేదే భయంసార్,చెప్పేసా!  ఓస్! అదా భయం లేదు,నేనున్నగా అన్నారు. బలెక్కేసేను. 

సర్జరీకి మేడం వచ్చారు. ఇదేమిరా అనుకున్నా. బల్లమీద బుట్టలో తలపెట్టుకు పడుకున్నా. రోటిలో తలదూర్చి రోకటిపోటుకు వెరువ తగునా అనే సూక్తి గుర్తు చేసుకున్నా. సర్జరి మొదలుపెడుతూ మేడం ఇలా లైట్ కేసి చూడండి, చేతులు పక్కనపెట్టుకోండన్నారు. తెలిసినదేగా, అలాచేస్తూ నాకు తెలియకనే కను రెప్ప వాలుతోంది అన్నా! అదా నేను చూకుంటాలెండి అని భరోసా ఇచ్చారు. ఇంకేం! ధైర్యం వచ్చేసింది. పది నిమిషాల్లో బల్లదిగమన్నారు. రెండు చేతులూ ఎత్తి చూపు ప్రదాతకి నమస్కారం చేస్తే, కన్ను బాగుంది భయంలేదన్నారు. ఇంటికెళ్ళచ్చన్నారు. మరునాడు డాక్టర్ గారు కన్ను చాలాబాగుంది. మీకెలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్పేను.     జాగ్రత్తలు  చెప్పి కంటిలో చుక్కలేసుకోమని ఇచ్చి పంపేసేరు. 20 రోజుల తరవాతెళ్ళేను. చెక్ చేచేసేరు, కళ్ళ జోడు కొత్తదానికి రాసిచ్చారు. వెలుతురు చూడడం కష్టంగా ఉందంటే కంటిలో మరికొద్దికాలం చుక్కలేసుకోమన్నారు. వెలుతురుకు కన్ను అలవాటు పడుతుందని చెప్పడంతో మరో వారం అన్నిటికి దూరంగా ఉండిపోయాను. కొత్త కళ్ళజోడు రావడానికి కొంత ఆలస్యమయింది. నేడు క్షురకర్మచేయించుకుని నెత్తిననీళ్ళు పోసుకుని ఇలా తయారయ్యాను.

 గత రెండు నెలలకితం  శ్యామలీయంవారు రెండు కళ్ళూ విజయవంతంగా సర్జరీ చేయించేసుకున్నారు. అలాగే విన్నకోటవారు, మొదటికన్నుసర్జరీ  తరవాత, కొద్ది ఎక్కువ విరామం  తరవాత రెండవకన్ను చేయించుకున్నారు. విజయవంతంగానే ఉన్నారు. కళ్ళజోదుకు మరువారం వెళతారు. 


నా కళ్ళు ఇరవైల్లోనూ మనసు ముఫ్ఫైల్లోనూ వయసు తొమ్మిది పదుల్లోనూ నడుస్తోంది. అంతా కొత్తగా ఉంది.  🤣

ఇదీ ఎలపటదాపట కత.     

శుభమస్తు   

with new glasses.
    

6, జులై 2026, సోమవారం

నేటి వైద్యం తీరు

  నేటి వైద్యం తీరు.

Courtesy. Owner through WhatsApp.

విత్తం కొద్దీ వైభోగం.

4, జులై 2026, శనివారం

రాత్రివేళ డబ్బు లెక్కించకు.

రాత్రివేళ డబ్బు లెక్కించకు.

పెద్దలమాటిది.ఏం? కొచ్చను నేటి మాట.

రాత్రి కుటుంబ సభ్యులు అంతా నిద్రపోయే సమయం. నీవు డబ్బు లెక్కించడం మొదలు పెడితే భార్యకు ముందు నిద్ర చెడుతుంది. లెక్కలో తేడా ఒక్క రూపాయొచ్చినా మనసు వ్యాకుల పడుతుంది,ఎక్కడ పారేసేను?ఎవరు కొట్టేసి పట్టుకుపోయారు?పడిపోయిందేమో కింద,వెతుకుదాం. ఇలా రకరకాల ఆలోచనలతో సరే తరవాత చూదామనుకున్నా,రాత్రి నిద్ర పట్టదు. సొమ్ము పోయిందేమో అనే పూనకం ఆవహిస్తే ఆ రాత్రివేళ ఇంటి అందరిని లేపికూచోబెట్టి పంచాయతీ జరపచ్చు. ఇలా రకరకాల పోకడలు రావచ్చు. ఇది టూకీగా చెప్పడం. అంచేత రాత్రి డబ్బు లెక్కించకు. 


 ఎంతచెట్టుకు అంత గాలి.

చెట్టుగాలి వీస్తుందా? వీచదు. తనను ఆవహించిన గాలిని నిరోధించి పక్కలకు నెట్టుతూ తాను ఊగుతుంది,తాను గాలి సృష్టించదు. మరిదేమి మాట? చెట్టు ఎంత పెద్దదైతే అంత వ్యాపించి ఉంటుంది,అంతగాలిని నిరోధించి పక్కలకు నెడుతుంది. అలాగే ఎంత ఎక్కువ రాబడి ఉన్నవారికి అంతకు తగిన ఖర్చులూ ఉంటాయి,అని చెప్పడమే ఈ మాట అర్ధం. ఎవరి తాహతును బట్టి వారి సంపాదన అలాగే ఖర్చూ వారి తాహతును బట్టే ఉంటుందనీ, ఎవరి అదృష్టం,యోగ్యతలను బట్టే సంపాదన,ఖర్చూ గౌరవాలుంటాయని తాత్పర్యమని నా ఊహ.   


మూర్ఖునితో, నీచునితో వివాదపడకు.

తెలియక ఒకరితో వివాదపడ్డాము. ఆ పెద్దమనిషి మూర్ఖుడని గుర్తించాము,అంతే కాదు గుణంలో నీచుడని గుర్తించాము. ఆపై చేయవలసినదేమి? వారిని మరల దరిజేరనీకు,వారి దరి జేరకు. వీళ్ళనే "న స్మరంతిగాళ్ళు" అంటారు పెద్దలు. అంటే గుర్తు తెచ్చుకోవడం కూడా కూడదని పెద్దలమాట.

ఒకవేళ వివాదం కొనసాగిస్తే మన చెప్పుతో మన దవడమీద మనమే కొట్టుకున్నట్టు. ఇ0కా చెప్పాలంటే మన దవడ మీద వాలి దోమను చంపడానికి మన దవడ మీద మనమే చరుచుకుంటాం. దోమ చావచ్చు లేదా ఎగిరిపోవచ్చు. ఏమైనా మన  దవడ  ఛెళ్ళుమనడం మాత్రం ఖాయం.  


సంతోషము సగము బలము.

మనసు ఉత్సాహంగా ఉండడమే సంతోషమని అనుకుంటా. శరీర బలమే బలం కాదు. బుద్ధి బలం,యశో బలం,ధైర్య బలం ఇలా రకరకాల బలాలుంటాయి. ఇవి శారీకం కాదు మానసికం.  ఏ అవసరంలో ఆ మానసిక బలం కనక చేకూరితే, కలగజేసుకునే అలవాటు పొందితే అదే సగం పనిని నెరవేర్చగలదు. అందుకే సంతోష0 సగం బలము అన్నారు. 

20, జూన్ 2026, శనివారం

మరచిపోనివాళ్ళు.

 మరచిపోనివాళ్ళు.


లోకంలో ఎవరూ ఎవరినీ గుర్తుపెట్టుకోరు, బంధువులు,స్నేహితులు, సంతాప సభదాకా.  కొడుకులు,కోడళ్ళు;కూతుళ్ళు,అల్లుళ్ళు రోజులెళ్ళేదాకా, విధిలేక;సొమ్ములేమైనా ఉంటే పంపకాల దాకానే. ఆ తరవాత నమోనారాయణ. మరచిపోవడమే అందరి నైజం,కనపడినంతవరకే కత నడిచేది.  


కాని మరచిపోని ఆఫీసర్లు ఇద్దరున్నారు

బతికున్న కాలంలో పెన్షన్ చెల్లించే ఆఫీసరు, డిజిటల్ లైఫ్ సర్టిఫికట్ కోసం,చేయని ప్రయత్నం అంటూ ఉండటంలేదు. పెన్షనర్ కి విసుగొచ్చేలా ఎస్.ఎం.ఎస్ లు ఇచ్చి ఇచ్చి విసిగిపోతారు. వాటికి సమాధానం లేకపోతే, పెన్షనర్స్ యూనియన్లకి తెలియ జేస్తున్నారు.    పెన్షనర్ బేంకు నుంచిగాని,పోస్టాఫిస్ నుంచి గాని  పెన్షన్ సొమ్ము తీసుకుంటుంటే ఆ ఆఫీసులవాళ్ళకి రిమైండర్ మీద రిమైండర్ ఇచ్చి పెన్షనర్ ఇంటికి వెళ్ళండి,అతని పరిస్థితి చూడండి.  లైఫ్ సర్టిఫకట్ ఇవ్వలేదు,ఇచ్చినదాని కాలం చెల్లిపోతోంది. కాలం చెల్లిన లైఫ్ సర్టిఫికట్ పై పెన్షన్ చెల్లింపు కుదరదు,పెన్షన్ ఆపేయాల్సి వస్తుంది. పెన్షనర్ కదలలేని స్థితిలో ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఏమైనా కదలలేని  ఇబ్బందిలో ఉన్నా, ఇంటి దగ్గరనుంచే లైఫ్ సర్టిఫికట్ ఇచ్చే ఏర్పాటు చూడండి. కష్ట సమయంలో పెన్షన్ లేకుండా చేయకండి,అనిపోరుతున్నారు. ఇది మీ బాధ్యతకూడా, అతని పెన్షన్ అక్కౌంట్ మీదగ్గరుంది గనక అని పెద్దరికం కూడా వహిస్తున్నారు.  


ఇక రెండవవారు ఇన్ కం టాక్స్ ఆఫీసరు.   

మీరు ఇన్ కం టాక్స్  ఐ.టి.ఆర్ ఫైల్ చేసే సమయం దగ్గరపదుతోంది,తొందరలో చెల్లించవలసిన టాక్స్ చెల్లించండి,ప్రశాంతంగా ఉండండి.సమయం దాటితే పెనాల్టీలు పడతాయి,సొమ్ము చెల్లిOచండని ఒకటే పోరు. ఇక వీరైతే చనిపోయాకా కూడా వదలిపెట్టరు. బతికున్నకాలంలో సంపాదించిన సొమ్ముకి టాక్స్, పోయినా వసూలు చేస్తారు. పోయాకా, పోయినవారి పేరవచ్చిన సొమ్ముల మీద కూడా టాక్స్ పుచ్చుకోక వదలరు. వారసులు చెల్లించకపోతే పోయినవారి ఆస్థులు,బేంక్ ఏక్కౌంట్లతో సహా సీల్ చేసి,తమకురావలసిన సొమ్ములు వసూలు చేసుకు తీరతారు.  


బతికుండగానూ పోయాకా కూడా గుర్తుంచుకునేవారు,ఇన్ కం టాక్స్ ఆఫీసరు. బతికుండగా వెంటబడి లైఫ్ సర్టిఫికట్ కోసం గుర్తుచేసి,అది పుచ్చుకుని పెన్షన్ చెల్లించే, పెన్షన్ ఆఫీసర్. 

18, జూన్ 2026, గురువారం

చినుకు భాగోతం

 చినుకు భాగోతం


చిందు భాగవతం కాదు సుమా! ఇది చినుకు భాగోతమే! జూన్ నెల సగం గడిచినా చినుకు కనపడలేదు,మా దగ్గర. మా వాట్సాప్ గ్రూప్లో దీనిమీద మహాపుణ్యాత్ములున్నచోట చినుకు పడుతుందయ్యా! వగైరా,వగైరా చెణుకులు నడుస్తున్నాయి. 


బుధవారం మధ్యాహ్నం భోజనం తరవాత పడకేసాను ఒంటిగంటకి.  రెండు గంటలకి టక్కున లేవడం రోజూ అలవాటు. కాని మూడుదాకా మెలకువరాలేదు, ఇంత సేపు నిద్రా అనుకున్నాగాని,ఇది రాబోయే కష్టానికి సూచన అనుకోలా! . మెలకువొచ్చేకా అల్పాచమానానికి బయట పాయఖానాకి వెళ్ళాను. వేడి,ఎండ తోడు వడగాలి చుర్రు మనిపించాయి. వెళ్ళిన పని పూర్తిచేసుకుని రయమున లోపలకొచ్చిపడ్డా! మరో పావుగంటలో కోడలమ్మాయి,మబ్బేసింది, గాలిచల్లబడింది వార్త చెప్పింది,గాలేస్తోందని కూడా చెప్పింది. ఇంకేం అనుకుంటూ లేవబోయే లోగా కరంటు పోయింది. బయటి కొస్తే గాలి వేస్తోంది,చల్లగా ఉందిగాలి. అరే! ఇప్పటిదాకా ఉన్న వేడి ఏమయిందబ్బా అనుకునే లోగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఎలా? మొన్న తమ అల్లుడు జిలేబీని ఆశీర్వదిస్తూ శ్యామలీయంగారు చల్లిన స్వాతి చినుకుల్లా! గాలి ఆగిపోయింది, ఇక చూడురాజా! మా బతుకు! కుమ్ములో పెట్టిన చిలకడ దుంప చందమైపోయింది. లోపల వేడి బయట కాంక్రీట్ జంగిల్ మీద పడ్డ చినుకులకి లోపనుంచి,భూమి నుంచి వేడి తన్నుకొచ్చింది. ఇంకేం చెప్పీది?చినుకు భగోతం? ఇది ఒక అరగంట సాగింది. వేడి తగ్గలేదు. కరంటు రాలేదు. షరా మామూలుగానే రాత్రి 8.30 కి వచ్చింది,మళ్ళీ పోయినా వచ్చేసి స్థిరంగా ఉంది, అదొక్కటే సంతోషం.


ఈ సందర్భంగా కొన్ని సంభాషణలు గుర్తొచ్చేయి. కితం ఎన్నికలరోజు ఎండలు మండుతున్నాయని ఒకాయనంటే మరొకరు బాబొస్తాడుగా, బాబొస్తే కరువొస్తుందని ఆ పార్టీవాళ్ళె అనుకుంటున్నారని చెప్పేడు,అది నిజమా? ఏమో!  కరువుకి ఆయన ఎన్నికకి సంబంధం ఏంటబ్బా !


నిన్నఒకరు నేరేడు పళ్ళు ఎక్కువ కాస్తే కరువొస్తుందని చెప్పేరు. అది నిజమే, నిరుడు నేరేడు పళ్ళు కేజి.400 నుంచి 600 అమ్మింది. నేడు 200 నుంచి 300 లో దొరుకుతున్నాయి. నేరేడు పళ్ళు ఎక్కువకాయడానికి కరువుకి లింకేంటండీ అంటే , నేరేడు చెట్టు రాబోయే కాలంలో నీరు లేక తనజాతి నశిస్తుందని ఎక్కువ బీజాలు ఎక్కువ ఉత్పత్తి చేస్తుందట. ఇది ప్రకౄతి సూత్రమన్నారు.నిజమా! మనవారి ప్రకౄతి పరిశీలన ఇంతా నిశితంగా ఉండేదా! 


వారంకితం శ్యామలీయంగారితో మాటలో చినుకులేదనివాపోతే మాకు వర్షం పడుతోందండీ, మీకూ పడుతుందని ఆశీర్వదించారు. మొన్న శోధిని శ్రీనవాస్ గారితో మాటలో ఇలా వాపోతే మాకు వర్షం ఉందిగాని వేడి తగ్గలేదు,మీకూ వర్షం పడుతుందిలెండన్నారు. పుణ్యాత్ముల ఆశీర్వచన ఫలితం కావచ్చు నిన్నటి చినుకు భాగోతం. నేడు ఎండలేదు, వేడి,వడగాలి షరా మామూలే! ఇదండీ బాబూ,మా చినుకు గోల.      

14, జూన్ 2026, ఆదివారం

మనిషి సాయం కావాలి

 మనిషి సాయం కావాలి


కుటుంబాలు చిన్నవైపోయాయి. మనిషి సాయం అవసరం కనపడుతోంది,పట్నాలలోలాగే పల్లెలలో కూడా.


కుడి చేతికి పక్షవాతం,కాలు కదులుతోంది,రోజూ ఉదయం ఒక గంట మనిషికావాలి,కూడా ఉండి నడిచేటప్పుడు తోడు.


ఓ పెద్దాయన, బయతికి ఒకసారి తీసుకెళ్ళి ఒక గంట తిప్పి తీసుకురావాలి, అంతే, తోడు కావాలి.


మరొకాయన డాక్టర్ దగ్గరకు తీసుకుపోయి,తీసుకురావాలి. దీనికి తోడు కావాలి, అక్కడ కూడా ఉండాలి.  


ఒకాయన చెట్లంటే పిచ్చి,పెంచాడు,మామిడాకులు రాలుతుంటాయి. ఆకులు వారానికోసారి ఎత్తి పారబోసేందుకు మనిషికావాలి.  


ఒక కుటుంబంలో నలుగురు, అంతా బిసీ, వారానికి ఒక రోజు ఇంట్లో బట్టలు వాషింగ్ మిషన్ లో వేసి ఆ తరవాత ఆరేస్తేచాలు. బట్టలు మిషన్లో ఉన్నంత సేపు ముసలామెతో కబుర్లు చెబితే చాలు.


భర్తపోయాడు ఒకతే ఐపోయింది. కొడుకు అమెరికా,కూతురు హైదరాబాదు. మనిషికావాలి కూడా ఉండి వండి పెట్టి తోడుండడానికి.  


మరొకామె భర్తపోయాడు. శరీర కింది భాగం కదలడం కష్టం. ఒకడే కొడుకు బొంబాయి వాసం, తీసుకుపోలేడు. తల్లిని చూసేందుకు మనిషికావాలి.

 

ఇలా మానవావసరాలు పల్లెలలో కూడా పెరుగుతున్నాయి. ఇవి మా దగ్గర నేను చూచినవి.రోబోట్లు ఈ సేవలు చేస్తున్నయంటున్నారు, అందరూ రోబోట్లు కొనుక్కోగలరా?  ఇటువంటి సేవలకి తగిన మూల్యం ఇస్తే పట్నాలలో మనుషులు నమ్మకమైనవారు,వెబ్సైట్  ద్వారా దొరుకుతున్నారు. కాని ఇది పల్లెలలో కష్టమైపోతూ ఉంది.  రాజమండ్రి,కాకినాడ లాటి పట్టణాలను కేంద్రంగా ఇటువంటి సేవల కోసం వెబ్సైట్ ఎవరేనా ప్రారంభిస్తే బాగుణ్ణు.

13, జూన్ 2026, శనివారం

మోడిగారేంచేస్తున్నాడేం?! Take it easy 😘

 మోడిగారేంచేస్తున్నాడేం?! Take it easy 😘


ఎండ కాసేస్తోంది,వేడి దంచేస్తోంది ఏరో జు 40 మాటేగాని తగ్గనంటోంది. రుతుపవనాల్ని ఎనినో పట్టుకుందిట,దానినుంచి రుతుపవనాలని విడిపించచ్చుగా! మోడిగారేం చేస్తున్నట్టబ్బా!!!!! 


వేదికి తట్టుకోలేక ఏ.సిలో కూచోడంతో పొట్ట పెరిగింది,బద్ధకమూ పెరిగింది. మోడిగారేంచేస్తున్నట్టూ!


ఇంటి పెద్దలాటోడుకదా  ప్రధానమంత్రంటే, నా కొంపలో ఏమున్నాయో,ఏం లేవో చూసి, నేను పొద్దుటే తయారయ్యే సరికి ఇస్త్రీ బట్టులు రెడీగా ఉంచి,నా బండిలో పెట్రోల్ పోసి,నా జోబీలో నాలుగు పెద్దనోట్లు కుక్కి బయటికిపోయి తిరిగిరారా అన్నపాపాన పోయింది లేదు. తిరిగిగొచ్చేసరికి వాయి రెడీపెట్టి ఉంచి, తినేసి,ఏ.సి వేసుకుని గుర్రు కొట్టి సాయంత్రం లేచి,మొహం కడిగి బట్టలేసుకుని,స్ప్రే కొట్టుకుని పవుడర్ రాసుకుని బార్ కి వెళ్ళి నాలుగు పెగ్గులు లాగించి,ఇంటికొచ్చి తరవాత కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏ.సిలో బెడ్డుమీద....... నిద్దరోవాలి కదా ,ఈ ఏర్పాట్లు చూడక మోడిగారు ఏంచేస్తున్నట్టో!  

8, జూన్ 2026, సోమవారం

శివ సంకల్పమస్తు



త్రయంబకం యజామహే 
సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకవిమ బంధనాత్
మృత్యో ముక్షీయ మామృతాతన్మే శివ సంకల్పమస్తు












 

28, మే 2026, గురువారం

పాఠకదేవుళ్ళు-సందేహాలు.

 పాఠకదేవుళ్ళు-సందేహాలు.  

ఎవరో మెయిలిచ్చారు. ఈ టపాలో,కామెంట్లలో ఉన్న కొన్ని మాటల అర్ధం, వివరణ ఇవ్వండి, అన్నారు. ఆ మాటలేవో చెప్పలేదు. అనగా ఆ మాటలు నేనే కనుక్కొవాలి,వాటి అర్ధమూ నేనే చెప్పాలి,చిత్రం. మరో విశేషం సమాధానం ఇక్కడే బ్లాగులోనే చెప్పాలి,ఇది తియ్యటి ఆజ్ఞ,పాఠకదేవులది. వీలు వెంబడి చెబుతా,ముందు వాటిని వెతికి పట్టుకుని. 🤣😘 వేడి దంచుతో ఉంది మరి.

 

ఆ ప్రకారంబుగా టపాను,కామెంట్లను చదివినవాడనై సోచాయించితి కాని నాకెక్కడను కొత్తపదముల జాడ కనుపట్టనే లేదు. మరలనొకసారి జాగరూకుడనై టపా మొత్తము పదము పదముగా చదువగా రెండు నిత్యమూ వాడుకలో లేని పదములు కనుపట్టినవి. ఆపై కామెంట్లలో మరొకటిన్ని కనుపట్టినది,అవి ఈ విధముగానున్నవి.

1. కరారావుడు చుట్టడం.

2. గుంటబెట్టి గంట వాయించడం. 

3. నెత్తిన చేటగొట్టడం.

 వీటిని నానుడులని కూడా అంటారు. వీటిని మా పల్లెటూరివాసులు బహు రమ్యంగా వాడుతుంటారు,అందుకు అలా దొర్లిపోయాయనమాట సందర్భానుసారంగా. వీటిని వివరించమన్నారు గనుక. 


కరారావుడు చుట్టడం:- క కింద రవత్తిస్తే క్ర, ఈ రావత్తును వడి చుట్టడం అగా ముందుకు,వడిగా చుట్టడం,అంటే రవత్తును పూర్తిచేస్తే సున్నా అయింది. దీన్ని 'క్రావడి' చుట్టడం అనేవారు కాలంలో  సున్నా అని చెప్పడానికి గాను కరారావుడు చుట్టేసేరు అంటుంటారు. ప్రస్థుత  సందర్భం, " DMK కాంగ్రెస్ ను తమిల్నాట ఇకముందు  కరారవుడు చుట్టేసినట్టే". అంటే DMK ఇకముందు కాంగ్రెస్ కు తమిల్నాటు సున్న చుట్టేసినట్టే అని అర్ధం.  



గుంటబెట్టి గంట వాయించడం:- చనిపోయినవారిని తగులబెట్టడంగాని పూడ్చి పెట్టడంగాని చేస్తారు. భారత దేశంలో వైవిధ్యం ఎక్కువ. కొందరు తగులబెడితే కొందరు పూడ్చి పెడతారు. ఈ పూడ్చి పెట్టడం లోనూ తేడాలున్నాయి. కొందరు పడుకోబెడితే కొందరు కూర్చోబెట్టి ఖననం చేస్తారు. ఈ కూర్చోబెట్టి ఖననం చేసేవారిలో కూడా తేడలున్నాయి. కొందరు కొందరు కూర్చోబెట్టి పూడ్చేటప్పుడు గంట కొడతారు. గుంటబెట్టి గంట వాయించేరంటే ఖననం చేసేరని అర్ధం. ప్రస్థుత సందర్భం "ఇండీ అలయన్సును  గుంటబెట్టి గంట వాయించినట్టే" అంటే ఇండీ అలయన్సును ఖననం చేసినట్టే అని. 


నెత్తిన చేటగొట్టడం:- ఇంట్లోని దుమ్మును చీపురుతో ఊడుస్తారు,అదే చీపురుతో చేటలోకి ఎత్తుతారు. దుమ్ముతో ఉన్నచేటను బయట పారబోస్తూ చేత ఉన్న చీపురుతో చేటను కొడతారు,మిగిలినది కూడా పోవడానికి. ఇక ప్రస్థుత సందర్భం, "రాఘవఛద్దా కబుర్లు చెప్పి కేజ్రీవాల్ నెత్తిన చేటగొట్టి, మరో ఆరుగురుని కూడా తీసుకుపోయాడు,పోతే పోయేడు బి.జె.పిలో చేరిపోయాడు". రాఘవ ఛద్దా ఆమాద్మీ  పార్టీగుర్తు చీపురును పట్టుకుని  పార్టిలో ఉన్న దుమ్ము తుడిచి చేటలో ఎత్తి కేజ్రీవాల్ నెత్తిన చేటతో పోస్తూ చీపురుతో కొట్టినట్టు, తన కూడా ఉన్న మరో ఆరుగురుని కూడా తీసుకుపోయాడు,పోతే పోయాడు,బి.జె.పిలో చేరి పోయాడే అదికదా బాధ.      


ఇక్కడికీ అంకం  యినట్టేనా? 


మరో ముచ్చట, మరో పాఠకదేవులదే! దీనికి ఓ వారం ముందేమో, ఒకరు మెయిలిస్తూ మీ బ్లాగు టపాల పి.డి.ఎఫ్ పంపగలరన్నారు. ఏడుపే వచ్చింది, నా బ్లాగుటపాలు పుస్తకాలుగా వేసేను. కినిగేవారు వేసేరు,కొంత సొమ్మూ రావాలి, ఈ లోగా కినిగే మూసేసేరు,నా సొమ్ములూ రాలేదు,వారు కనీసం నా books పంపలేదు. ఇదే పాఠకదేవునికి విన్నవించా!

శలవు.        

25, మే 2026, సోమవారం

రోహిణీ కార్తె ప్రవేశ శుభకామనలు.

 రోహిణీ కార్తె ప్రవేశ శుభకామనలు.


ఈ రోజు రోహిణి ప్రవేశించింది. From May 1st.ఇప్పటి వరకు 40/45 డిగ్రీల వేడి మలమల మాడ్చింది. వేడిగాలులు వీచాయి. నేటి నుంది 44/48 మధ్య వేడి ఉంటుందని సూచనుంది తగినట్టుగానే నేడు 44/46 మధ్య వేడి దంచుతోంది.వేడి గాలులు వీస్తున్నాయి.  కరంటు ఉండడం మా అదృష్టం మీద ఆధార పడిఉంది. కరంటు వాళ్ళు మాత్రం మనుషులు కారా! వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వేడికి జంపర్లు కాలుతున్నాయో,ట్రాన్స్ఫార్మర్లు పేల్తున్నాయొ!  మరో వారందాకా ఇంతేలా ఉంది. వారందాకా మా లాటి ఘటాలు ఉంటాయా? భగవదేఛ్ఛ.   

11, మే 2026, సోమవారం

రాష్ట్రాల ఎన్నికలు-రాజకీయాలు.

 రాష్ట్రాల ఎన్నికలు-రాజకీయాలు.


అసోం,ప.బంగాల్,తమిల్నాడు,పుదుచ్చేరి,కేరళం రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి,ఫలితాలూ వచ్చాయి. ఒక్కో రాష్ట్రరాజకీయం ఒకోలా వుంది,చూదాం,స్థూలంగా. 

 

అసోంలో ఎన్.డి.ఎ పరిపాలిస్తోంది,ఆ పార్టీయే మళ్ళీ 102/126 లో మెజరిటీలో ఉంది. ప్రతి పక్షంగా ఇండీ అలయెన్స్ కు 24/126 వచ్చాయి. కాంగ్రెస్ కలిసిన ప్రతిపక్షం,ఇక్కడ మరియు ప.బంగాల్ లో  ఎన్నికలు దొంగిలించబడ్డాయంటోంది. తాను మెజారిటీ సాధించిన చోట దొంగిలింపబడలేదా? అంటున్నారు,నెట్ జనులు🤣. ఇక్కడే రాజకీయంలేదు.  


ప.బంగాల్ లో స్వతంత్రం రాకముందూ రక్తపుటేరులు పారేయి.

https://rayssolassspace.quora.com/If-the-BJP-comes-into-power-in-Delhi-in-2025-will-Jawaharlal-Nehru-University-be-shut-down

https://india-and-the-world.quora.com/Revenge-of-Hindus-how-KOLKATA-was-saved-from-becoming-part-of-Pakistan-the-story-of-GOPAL-PATHA-Jinnah-chose-Kol

ఇప్పుడూ పారుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎన్.డి.ఎ 206/294 సాధించింది, అధికారంలో ఉన్న మమత దీదీ నేనే నెగ్గేను,ము.మంత్రి పదవికి రాజీనామా చెయ్యనంటోంది. ఆ తరవాయి గవర్నరు  సభనే రద్దు చేసేరు,ఇక మమత రాజీనామా చేసిన మానినా ఒకటే! దీదీ పరిపాలనలో మాటాడటమే కాదు,వోటెయ్యడానికీ జనం భయ పడ్డారంటున్న వార్తలు మిక్కుటం. రక్తం పారింపుకు ఆదిగా సువేందు అధికారి పి.ఎ హత్య చేయుబడ్డాడు,ఎన్నికల తరవాత.  ఇక కలకత్తాలో రక్తం పారిన సంఘటనలు కోకొల్లలు. 


స్వతంత్రం తరవాత కాంగ్రెస్ పాలనలో మొటగా బి.సి.రాయ్ లాటివారు ముఖ్యమంత్రయితే చివరికి  సిద్ధార్థ శంకర్ రాయ్,(ఇందిరమ్మకి ఎమర్జన్సీ పెట్టమని సలహా ఇచ్చినవాడు) లాటివాడు CM.. ఆ కాలంలో ఆ రోజుల్లో పేపరు తీస్తే ఉదయమే కాంగ్రెస్ కార్యకర్తల హత్యలే కనపడేవి అలా కమ్యూనిస్టులు భయం సృష్టించి ప.బంగాల్ ని వశపరచుకున్నారు. 34 సంవత్సరాల పరిపాలనలో భయమే నెలకొంది. ఆపై కాంగ్రెస్, బాజపాయి ల సహాకారంతో మమత ప.బంగాల్ను స్వాధీన పరచుకుని కమ్యూనిస్టులను తలెత్తుకోనీయక0డా వారిపంధాలోనే పరిపాలన చేసి 15ఏళ్ళ తరవాత ఓడిపోయింది. ఇంతకాలంలోనూ ప్రజల రక్తంపారింది,భయోత్పాతమే సృష్టంపబడింది. ఇక ముఖ్యమ0త్రిగా ఎన్నికైన సువేందు అధికారి ఎన్.డి.యే పాలనలో ఎలా ఉంటుందో చూడాలి.


పుదుచ్చేరిలోనూ ఎన్నికలు జరిగేయి,కనుకలిగినట్టుగా. అక్కడ ముఖ్యమంత్రి ఎన్.రంగసామి సైకిల్ మీద తిరుగుతూ బడ్డీ కొట్టు దగ్గర టీ తాగి డబ్బులిచ్చి వెళ్ళే రకం. మళ్ళీ ఆయనే ఎన్నికయ్యాడు,మెజారిటీ వచ్చింది,మళ్ళీ ముఖ్యమంత్రీ అవుతాడు. ఈ రాష్ట్రమూ ఎన్.డి.ఎ కాతాలో ఉన్నదే!


తమిల్నాడులో ఎన్నికలు జరిగి డి.ఎం.కె ను మట్టికరిపించి మరో పార్టీని కూడా ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ను కూడా అధికారానికి దూరంగా ఉంచారు. ఇక మూడో శక్తి టి.వి.కె నుకూడా అధికారానికి పూర్తిగా దగ్గరకు చేరనివ్వక మెజారిటీకి పదికి తక్కువగా సీట్లిచ్చి నిలబెట్టేరు. ఇక తమిల్ సినిమా కత మొదలయింది. ఎక్కువ సీట్లొచ్చాయి,మెజరిటీ లేకపోయినా నేనే ముఖ్యమంత్రి అంటాడు,ప్రమా స్వీకారం చేయించెయ్యండి, అన్నాడు. నిన్ను బలపరుస్తున్నవారి సంతకాలతో letters పట్టుకురావయ్యా అంటే మూడు సార్లు తిరిగాడు, పనికాలేదు. ఈలోగా గవర్నర్ను,బి.జె.పిని తిట్టుకున్నవారు కోకొల్లల్లు. చివరగా మద్దతు ఇచ్చిన MLAలు ఇద్దరున్న పార్టీ హిరణ్యాక్షవరాలతో మద్దతివ్వడంతో, నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది, 13వ తారీకు లోగా సభలో మెజారిటీ నిరూపించుకోవాలి,ఇది గవర్నర్  తాకీదు. ఏమి జరగనుందో,చూడాలిసిందే! 

పెద్ద చిత్రం తమిల్నాట జరుగుతోంది. డి.ఎం.కె పనుపున CPI,CPM,IUML,CVK పార్టీలు అధికారకుర్చీ నాలుగుకోళ్ళులా మారాయి, విజయ్ పార్టీని, అధికార కుర్చీబలపరుస్తున్నాయి,ఇదెంతకాలం కొనసాగేనో! కాంగ్రెస్,CPI,సిపిఎం,సివికె   పైకి కుస్తీ లోపల దోస్తీ రాజకీయం జరుగుతోందా? ఎవరి తరఫున? ఇది బయటపడుతుంది,నెమ్మదిగా!!!   


ఇక చివరగా కేరళంలో ఎల్.డీ.ఎఫ్ ను దించి యు.డి.ఎఫ్ కు అధికారమిచ్చారు. ముఖ్యమంత్రెవరో దగ్గరగా పదిరోజులవుతున్నా అధికారానికొచ్చిన కాంగ్రెస్ తేల్చుకోలేకపోతోందంటున్నారు. 


ఇన్ని ఎన్నికలలోనూ జాతీయ పార్టీలకి జరిగిన లాభనష్టాలేమి? కొచ్చను. 

జాతీయ పార్టీలు బి.జె.పి,కాంగ్రెస్,సి.పి.ఐ,సి.పి.ఎం. చివరై రెండు పార్టీలు జాతీయపార్టీలా అంతర్జాతీయ పార్టీలో తేల్చుకోలేకపోయాను. బి.జె.పి. అసోం,పుదుచ్చేరిలను తననుంచి వదులుకోలేదు, ఇక ప.బంగాలు లో అధికారం చేజిక్కించుకుంది. ఇక tamilnaadu లో,కేరళంలో అధికారానికొస్తానని అనుకుని ఉండదు. 


కాంగ్రెస్ కు చెప్పుకోతగ్గ విజయం కేరళ. అసోంలో 24/126 ప్రతిపక్షం.   ప.బంగాలులో-2,తమిల్నాట-5 సీట్లు గెల్చుకుంది.కాంగ్రెస్ కి లాభం కంటే నష్టమే ఎక్కువ,దేశవ్యాప్తంగా.  తమిల్నాట అధికారకుర్చీ కోడుగా మారిపోవడమేకాదు,డి.ఎం.కె తనను మోసంచేసిందని తెగతెంపులు చేసుకుంది.DMK congress ను తమిల్నాట, ఇకముందు  కరారావుడి చుట్టేసినట్టే!  ఇక ఉత్తరాదిని ఎస్.పి ఆలోచనలో పడింది. ఇండీ అలయన్సును గుంటబెట్టి గంటవాయించినట్టే.   


ఇక సిపిఎం,సిపీఇ పార్టీలు.  సి.పి.ఎం ప.బంగాల్ లో-2 సాధించింది. తమిల్నాట-2 సాధించి తమిల్నాట అధికార కుర్చీకోడుగా మారిపోయింది,తమ సహచర సి.పి.ఐ-2 తో కలసి.   


 చిత్రం ఏమంటే ప.బంగాల్ లో పదిహేనేళ్ళుగా మమతపరిపాలనలో తృణమూల్ స్వాధీనం చేసుకున్న  కాంగ్రెస్,సి.పి.ఎం పార్టీలు తమ  ప్రాంతీయ ఆఫీసులను, (బి.జె.పి అధికారంలో కొచ్చిన తరవాత) తిరిగి  స్వాధీనం చేసుకుంటున్నట్టు వార్తలు.         

26, ఏప్రిల్ 2026, ఆదివారం

రాముని రాజ్యం-భరతుని పట్టం-4

 రాముని రాజ్యం-భరతుని పట్టం-4 

   

ఇంతకు ముందు భాగాలు లింకుల్లో చదవండి.

https://kasthephali.blogspot.com/2023/03/1.html

https://kasthephali.blogspot.com/2023/04/2.html

https://kasthephali.blogspot.com/2026/02/3.html

తరువాయి...


భరత గుహుల మధ్య మొదటి బేటీ ముగిసింది.తరవాత భేటీ రాత్రి, పురంలో మొదలయింది,ఆదర గౌరవాల మధ్య. గుహుడు మాటాడుతూ ఆ రోజు రాముడు పురంలోకి రాలేదు,కారణం వనవాసం చెప్పేడు, ఆ రాత్రికి గారచెట్టుకింద గడ్డిలో శయనించాడు.  మేమిచ్చిన పళ్ళు కూడా తీసుకోలేదు,కారణం ముని వృత్తి అనిచెప్పేడు.లక్ష్మణడు తెచ్చిన గంగతాగేరు,అంతే! ఏమీచేయలేకపోయాం అని చెబుతూ సీతారాములు ఆ రోజు రాత్రి శయనించిన గారచెట్టు దగ్గరకి దారితీసాడు. గారచెట్టుకింది గడ్డిని పరిశీలించిన భరతుడు అక్కడ సీతారాములు శయనించిన గుర్తులు చూసి, అన్నా, వదినలు హంసతూలికా తల్పం మీద శయనించేవారు,ఇలా గడ్డిలో పడుకోవడాన్ని చూసి, ఇవిగో రాత్రి పడుకున్నపుడు గడ్డి ఒత్తుకున్న ఆనవాళ్ళు,ఇదిగో సీతమ్మ చీరకొంగునుంచి గడ్డిని అంటుకున్న బంగారు జలతారు పోగు , ఇలాపరిపరివిధాల వేదనపడి మూర్ఛపోయాడు. తల్లులు ముగ్గురూ వచ్చి భరతుని సేద తీర్చారు. 


ఆపై గుహుడు భరతునితో ఇలా చెప్పేడు.   సీతారాములు శయనించగా లక్ష్మణుడు విల్లంబులతో రక్షణగా నిలిచాడు. అప్పుడు నేను లక్ష్మణా నేనే స్వయంగా విల్లంబులు తీసుకుని రక్షణగా ఉంటా నీవూ శయనించన్నా! వినలేదు. ఇక్కడ ఆకు కదిలినా మాకు తెలియక కదలదు,ఈ ప్రాంతంలో మమ్మల్ని గెలవగలవారు లేరు.  ఇక్కడ నీటి పైనగాని అడవిలోగాని మా ఆధిపత్యానికి తిరుగులేదు,నీవు భయపడకు అని చెప్పినా వినక లక్ష్మణుడు సీతారాములకు రక్షణగా రాత్రి అంతా నిలిచాడు అని చెబుతూ లక్ష్మణుని గుణాలు చాలా సేపు పొగిడాడు. ఇంత చేసిన గుహుడు భరతుని నమ్మలేదు,ఏమాటాలోనూ! 


ఆ రాత్రి గడచింది,మర్నాడు ఉదయం గుహుడు భరతుని సైన్యంతో సహా గంగ దాటించాడు,ఏనుగులతో సహా,పడవలమీద. ఏనుగుల్ని కూడా దాటించిన పడవలు ఎంత పెద్దవో!   గంగ దాటించాకా వారికి భరద్వాజ ఆశ్రమం దాకా దారి చూపి వస్తాడు. 

ఇప్పుడు విశ్లేషణ. దీనినుంచి మూడు ప్రశ్నలు పుట్టుకొచ్చాయి.

1. రక్షణగా నిలచిన లక్ష్మణునికి చెప్పినట్టు గుహుడు భరతునికి ఇంత వివరంగా తమ బలం,బలగం గురించి ఎందుకు వివరించాడు? 

2. భరతుని దగ్గర లక్ష్మణుని అంతగా గుహుడు ఎందుకు పొగిడాడు?

3. ఇంత చేసిన  గుహుడు,భరతుని నమ్మక,  మర్నాడు ఉదయం,తన బలం,బలగం ప్రదర్శిస్తూ భరతుని సేనతో సహా గంగ ఎందుకుదాటించాడు. 

తార్కికమైన సమాధానాలకోసం చూదాం.    

1.గుహుడు అంత వివరంగా భరతునికి చెప్పడమంటే "ఈ ప్రాంతంలో నీటి మీద,అడవిలోనూ మా అధిపత్యానికి తిరుగులేదు,ఎంతటి సైన్యం మా ముందు దాసోహం కావలసిందే! నీవు బలప్రయోగం చేదామనుకుంటే కుదరనిదే. మమ్మల్ని నీ సైన్యంతో జయించలేవనే"  బలమైన హెచ్చరిక చేయడం.    

2.లక్ష్మణుడు రామునికి అంత నమ్మకమైన తమ్ముడు రామునిపై ప్రేమ కలవాడు,గొప్పవాడు; నీవూ రాముని తమ్ముడివే,అంత ప్రేమ అభిమానాలున్నవాడివా? అని ప్రశ్నించడం,పరోక్షంగా  

3. ఇది గంగ దాటించడమనే ఉపకారంలా కనపడుతుంది. కాని ఇదొక పెద్ద సైనిక వ్యూహం. భరతుడు నిజంగా రాముని వెనక్కి తీసుకురావడానికే వెళుతున్నట్టైతే ఇది సహాయం. లేదూ,రామునితో యుద్ధం చేయడానికి రాముణ్ణి అడవులలో కూడా ఉండకుండా చేయడానికి ప్రయత్నంగా అనుకుంటే. రామునితో యుద్ధం జరిగితే, అటునుంచి రాముడు ఎదుర్కుంటాడు,వెనకనుంచి గుహుడు తనపరివారంతో ఎదుర్కుంటాడు, అప్పుడు భరతుని సైన్యానికి దిక్కు తోచడు. అది అసలే అడవి, వెనక గంగ. వెనక్కి పోడానికీ దారిలేదు,గుహుని సైన్యం చంపుతుంది,అడవిలోనూ,గంగమీద కూడా. భరతుని సైన్యం అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయి,రామునికి దాసోహం కావలసిందే!. ఇది మిత్రుడైన రామునికి సాయమే కాక అత్మరక్షణ కూడా!     


ఇప్పుడు చెప్పండి రామాయణం చదవాలా? చదివితే కాదు,పారాయణ చేయండి,బుద్ధిని ఉపయోగించండి. జీవితాలను ఫలవంతం చేసుకోండి.

స్వస్తి.    

 

25, ఏప్రిల్ 2026, శనివారం

నెట్ కి మూడినట్టే...నా?

నెట్ కి మూడినట్టే...నా? 


రష్యా యూక్రైన్ యుద్ధం నాలుగేళ్ళుగా జరుగుతూనే ఉంది. రష్యానుంచి యూరప్ దేశాలకి ఆయిల్ సరఫరా చేసే గొట్టాలు యూక్రైన్ మీదుగా ఉన్నాయి. వాటిని పాడుచేసేరు. యూరప్ కి ఆయిల్ సరఫరా రష్యానుంచి ఆగిపోయింది. రష్యాకి నష్టం చేస్తున్నామనుకుని యూరప్ కాళ్ళు నరికినట్టయి ఆయిల్ సరఫరాలేక యూరప్ అల్లాడుతోంది. ఆ గొట్టాలని సరిజేసేరు, అవి రెండురోజుల్లో ఉపయోగం లోకి రావచ్చనుకుంటున్నారు. ఇప్పటిదాకా చెల్లింపులలా కాక వేరువిఢంగా చెల్లింపులు కావాలంటోంది,రష్యా. ఇది కుదిరితే మళ్ళీ ఆయిల్ యూరప్ కి ప్రవహించచ్చు. 

 

మరో యుద్ధం ఇరాన్-ఇస్రయెల్,అమెరికాలమధ్య రెండు నెలలుగా జరుగుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణలో ఉన్నారు,ఇరు పక్షాలూ. ఎవరూ తగ్గుతున్నట్టు లేదు. ఎవరిమాట వారిదేలా ఉంది. ఇరాన్ జలసంధిని మూసేసింది. మరోపక్క అమెరికా మూసేసింది. ఆయిల్ సరఫరాలు తగ్గిపోయాయి,ప్రపంచానికి. దీనికితోడుగా IRGC గల్ఫ్ కి వచ్చే International OFC  cables పాడుచేసి ప్రపంచాన్ని స్థంభింపజేస్తామంటో ఉంది. అదే జరిగితే మళ్ళీ శాంతి నెలకొని కేబుళ్ళు బాగుచేసేటప్పటికి ఎంతకాలం పదుతుందో. ఎన్ని దేశాలు దీనికి బలైపోతాయో తెలియదు. నెట్ కి మూడినట్టే ఉంది.     


https://www.moneycontrol.com/world/iran-s-irgc-flags-undersea-cables-cloud-networks-as-potential-targets-in-persian-gulf-amid-fragile-truce-article-13896622.html

18, ఏప్రిల్ 2026, శనివారం

పిలక కత్తిరింపు మహోత్సవం.

 పిలక కత్తిరింపు మహోత్సవం.

వేసవిలో తలపై జుట్టు చికాకుగా ఉందని నిన్న అంబష్టుడిని రమ్మాన్నా! గుండు గీస్తూ పిలక దగ్గర కొచ్చాడు. దాన్ని ముట్టుకోడు,ఎప్పుడూ. నేనే పిలక చిక్కుబడినట్టుంది,చూడు! అన్నా. ఉత్సాహంగా దాన్ని పట్టుకుని చూసి,చిక్కడిపోయిందండీ! చిక్కు రాదు అన్నాడు. 

ఎలా అన్నా! అదేమో జానడు పిలక. 

కత్తిరించక తప్పదండి తీసెయ్యనా! అంటే, వద్దు దాన్ని అలా వదిలెయ్యి,నేను చూసుకుంటా! అనడంతో,ఒక్కవేటు, తీసేస్తాకదండి అని ముందుకెళ్ళబోయాడు.నేనే తీసేస్తా! ఈ రోజుల్లో పిలక పెట్టుకునేవాళ్ళే లేరు,మాటల్లో నైనా శర్మగారి పిలక కత్తిరించేననక,ఉండలేవు,అంచేతా నేనే కత్తిరించుకుంటే సరిపోతుందిగా! అనగా ఊరుకుని మిగిలిన కార్యక్రమం పూర్తిచేసేడు. ఆతరవాయి నేను పిలకని పరిశీలించి,చిక్కు ముడి విప్పడానికి ప్రయత్నం చేసి విఫలమై చివరకి ముడిపైకి కత్తిరింపు మహోత్సవం విజయవంతంగా పూర్తి చేసేను. ఇప్పుడు చూస్తే బెత్తెడు పిలక మిగిలింది. అమ్మయ్యా,అనుకున్నా!  

 

శ్రీ వందేమాతరం రామచంద్ర రావుగారని ఒక రాజకీయనాయకుడు. ఈయన అసెంబ్లీలో ఉంటే ప్రభుత్వానికి,బయట ఉంటే అంటే ఓడిపోతే ఆయనపై నెగ్గినవాడికి దినదిన గండమే అనుకునేవారు. ఆయన మహామహులమీద పోటీ చేసి తనపై నెగ్గినవారందరిని కోర్టుకు ఈడ్చి నెగ్గి, పదవులు ఊడగొట్టినవాడు.  


శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారు, వీరిని తెలియనివారు ఉండరు, తలపై టోపీ లేకుండా ఎప్పుడూ కనపడలేదాయన. ముఖ్యమంత్రిగా ఉండగా సభలో టోపీ కనక సద్దితే ఎవరికో మూడిందని చెప్పుకునేవారు.    


ఇక మర్రి చెన్నారెడ్డిగారు, ఈయన చేతిలో ఎప్పుడూ ఒక కర్ర ఉండేది. దీనిపై చాల కతలున్నాయి. కర్రచెయ్యి మారితే అయినట్టే అని చెప్పుకునేవారు. అంతేకాదు  'నాట్ అప్రూవ్డ్',తరవాత కాలంలో 'నోట్ అప్రూవ్డ్' అవడాని ఒక  అక్షరం తేడా అనీ అనేవారు.


నిన్న వుమన్స్ బిల్లు వీగిపోయింది మూడిట రెండు వంతుల మజారిటీ లేక, మేం నెగ్గేం అంటే మేం నెగ్గేమంటున్నారు,ఇరువురూ. మరి చూసినవాళ్ళు స్వయం పిలక కత్తిరింపుకీ దీనికి పోలికుందా? అనుకుంటున్నారు.       

15, ఏప్రిల్ 2026, బుధవారం

ఆబోతుల కుమ్ములాటలో......

                                  ఆబోతుల కుమ్ములాటలో...........  



1.కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.

2.కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టు.

3. అంచుకు తొగరు లేనట్టు

4.కోతికి కొబ్బరికాయ దొరికినట్టు.

5.ఆబోతుల కుమ్ములాటలో లేగదూడల కాళ్ళు విరగదొక్కినట్టు. 

6.ఉండలేక సిండ కాల్చుకున్నట్టు.

7.చదవేస్తే ఉన్నమతి పోయినట్టు.

8.పెనం మించి పొయ్యిలో పడ్డట్లు.

9.అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు.

10.వెదకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు. 

11. కుండ వేరైతే గుణం వేరయినట్టు.

7, ఏప్రిల్ 2026, మంగళవారం

ఏడ్చేదాని మొగుడొస్తే .....

 ఏడ్చేదాని మొగుడొస్తే 


1.బండరాళ్లు గాలికి కొట్టుకుపోతుంటే పుల్లియాకు నా గతేమని ఏడ్చినట్టు.


2.ఏడ్చేదాని మొగుడొస్తే ఏకులొడికేదాని మొగుడొచ్చినట్టు.


3.మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకున్నట్టు.


4.కాలు జారితే వెనక్కి తీసుకోగలం, నోరు జారితే వెనక్కి తీసుకోలేమన్నట్టు.


5.గంగకి ఇద్దరి మేలు అద్దరి కీడు లేనట్టు.


3, ఏప్రిల్ 2026, శుక్రవారం

చద్ది కంటె ఊరగాయ ...

 చద్ది  కంటె ఊరగాయ.....


చద్ది  కంటె ఊరగాయ  ఎక్కువైనట్టు.


కన్నుపోయేటట్టు కాటుక పెట్టుకున్నట్టు.


కునికే నక్కమీద తాటిపండు పడ్డట్టు.

 

ఆశకి అంతు ఆకాశానికి చివర లేనట్టు. 



12, మార్చి 2026, గురువారం

Tax on GB

 Tax on GB


ఒకప్పుడు నెలకి నాలుగు వందలు నెట్ బిల్లు కట్టుకుంటే కష్టంగా ఉండేది. మరి ఎన్ని జి.బి ఇచ్చేవారో గుర్తులేదు,15 ఏళ్ళకితం మాట. జి.బి 400 రోజులు కూడా ఉండేవిట. ఇప్పుడో ఒక జి.బి నాలుగు రూపాయలంటే రోజుకి వంద జి.బి వాడేవాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు నాకే రోజుకి 10 జి.బి దాకా అవుతోంది😂😜 ఇంటి మొత్తమ్మీద 8 మంది జనాభాకి నెలకి 1500 జి.బి అవుతోంది,వాడకం. పన్ను వేద్దామని ఆలోచించక్కరలేదు,వేయడమే మంచిది. 

ఎందుకంటే డాటా  ఖరీదు తగ్గడంతోనే అవసరవాడకం కంటే అనవసర వాడకం,అనగా సోషల్ మీడియాలో, గోచీ పెట్టుకోడం కూడా చేతకానివాడు కూడా నాలాగ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నాడు.😂 అవి బ్లాగులు కావచ్చు,ఇన్స్టా కావచ్చు,టెలిగ్రాం కావచ్చు,ఫేస్ బుక్కు కావచ్చు, వాట్సాప్ కావచ్చు. చిత్రంగా ఆరట్టై వాడేవారు కనపట్టంలేదు,దేశీ కదా ,అంతా విదేశీ మోజే. 

చెత్త బ్లాగులు చెత్త పోష్టులు చెత్త వ్యాఖ్యలు గుంపులే
ఎత్తి పోతలు వింత భాషల చెత్త కైతలు పోగులే
మొత్తుకోళ్ళులు నెత్తిపొడ్పులు సుత్తిమాటలు రాశులే

వత్తురా యిక పాఠకుల్ మన బ్లాగులోకపు జోలికిన్ 

శ్యామలీయం బలే తిట్టేరు. ఐ లైక్ ఇట్. 


ఇక యు చ్యూబ్ గురించి చెప్పేదే లేదు. ఏదో ఒకటి షూట్ చేసి పెట్టెయ్యడమే. ఆ ఆకు తిను, సుగర్ మాయం,మూడు రోజుల్లో అనేవాడు, కాళ్ళు తిమ్మిర్లా,ఇది రాయి దెబ్బకి తగ్గుతాయనేవాడు,ఇలా అందరూ వైద్యులే. ఇందులో ఏ ఒక్కటి పనిచేసినా మందుల కంపెనీలు మూసుకోవాలి,డాక్టర్లు గోచీలు పెట్టుకుని పందుల్ని కాచుకోవాలి లేదా పల్లీలు అమ్ముకోవాలి. కుక్క ఎదురొచ్చి ఏ పక్కనుంచి వెళితే మంచిది,దీనిమీద ఒకడికి పండితుడి వేషంవేసి కార్యక్రమం, ఇలా ఎన్నని చెప్పేదీ? కొన్ని ఉదాహరణలే .


   ఇక సోషల్ మీడియాలో  హేటువాదులకి దేశద్రోహులమాట చెప్పేదే లేదు. కట్పేస్టు,కాపీ పేస్టు  ప్రొఫెసర్లు గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి విదేశాల సొమ్ము చేరడం వీటికోసం అదనం. ప్రభుత్వం మీద విషం చిమ్మేవారికి లోటే లేదు. వీరి వీరభక్తులకు లెక్కా,జమా లేనేలేదు. వీరందరి డాటా ఉపయోగం మీద పన్ను వేయాల్సిందే.  తల్లిపాలుతాగి రొమ్ముగుద్దిన చందంగా విదేశాలనుంచి దేశద్రోహ ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది. ఇక కమే (ఎ.ఐ) వచ్చాకా ఫేక్ వీడియోలు,ఆడియోలు రకరకాలు కనపడుతున్నాయి,వీటి మీద అదుపు కనపడటం లేదు.             

 నెట్ కి అతుక్కుపోయే పిన్నా పెద్దా అంతా ఒకలాగే ఉన్నారు. ఎవరూ చెప్పేవారు లేరు,వినేవారసలే లేరు.  


సులభా పురుషా రాజన్  

సతతః ప్రియవాదినః 

అప్రియస్య చ పధ్యస్య

వక్తా శ్రోతాచ దుర్లభః 

                     మారీచుడు

ప్రియమైనమాటలు చెప్పేవాళ్ళే దొరుకుతారు,ఎప్పుడూ. అప్రియమైనా సత్యం చెప్పేవాడు దొరకడు దొరికి చెప్పినా వినేవాడు లేడని, మారీచుడు రావణునికి చెప్పినమాట.   🙏 

  ఇలా టేక్స్ వేస్తేనైనా వాడే సమయం తగ్గుతుందని ఆశట.ఇది జరిగేనా? ఏమో చూదాం . 


7, మార్చి 2026, శనివారం

రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసినంతలో

 రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసినంతలో



మాటలొచ్చిన కుక్కని వేటకు తీసుకెళితే ఉసుకోమంటే,ఉసుకోమంది. 

రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసినంతలో పిల్లలు పుట్టరు.

పచ్చకామెర్లరోగికి లోకం పచ్చగా కనపడుతుంది. 

విడవమంటే పాముకి కోపం కరవమంటే కప్పకు కోపం.


2, మార్చి 2026, సోమవారం

కార్లు బాబోయ్ కార్లు.

 కార్లు బాబోయ్ కార్లు.


ఒకప్పుడు ఊరికో కారుంటే గొప్ప. అదిన్నీ అంబాసిడరే. కారంటే అంబాసిడర్ మాత్రమే అనుకున్నరోజులూ ఉన్నాయి. ఆ తరవాత పడవంత కారు ప్లిమత్ చూడ్డం జరిగింది. ఆ తరవాత బుల్లికారున్న షోకిలా అబ్బాయి అన్నట్టు ఫియట్ చూసాను. ఎప్పుడూ కార్లు నాచుట్టూ ఉన్నాయిగాని కారెక్కిందే బహు తక్కువ. ఇప్పుడు చెప్పెదేలేదు ఇంటి చుట్టూ కార్లే. ఇంటి ముందు మూడు కార్లు ఎప్పుడూ నిలబడి ఉంటాయి. బయటికి లోపలికి తిరిగేందుకు జాగా ఉండదు ఒక్కో సారి.ఇంటి ముందు, ఒక కార్ పార్క్ స్థలం ఖాళీ చేయించుకోడానికి కష్టపడ్డాము.    


మాది పెద్దపల్లెటూరనే చెప్పాలి.మా చుట్టూ 20 దాకా గేటెడ్ కమ్యూనిటీ లు ఉన్నాయి. అంటే తక్కువలో తక్కువ 400 కార్లు లెక్క. ఇక బయటవాటితో లెక్కేస్తే 500 ఉండచ్చు,మా ఏరియాలోనే . ఊరు మొత్తం మీద 100 పైన గేటెడ్ కమ్యూనిటీ లున్నాయి. ఎన్ని కార్లున్నట్టు? ఏ గేటెడ్లో కూడా కార్ పార్క్లు ఖాళీగా ఉండవు.ఒంటరి ఇళ్ళలో కార్లు లెక్కేయ లేదు. ఊళ్ళో అద్దెకు కార్ పార్కులు వెలిసాయి. నెలకు 3000 అద్దె ఒక కార్ పార్క్ కి. మల్టీ స్టోరీ కార్ పార్క్ లు తొందరలోనే వచ్చే సావకాశం ఉందనుకుంటున్నాను. ఒక్కొక ఇంట్లో మనుషులకంటే కార్ల సంఖ్య ఎక్కువున్నటే ఉంది. ఒకాయన పక్క కాళీ స్థలంలో కార్ పార్క్ కట్టరాదా అని అడిగితే వేసిన లెక్కిది.   


1. 50 లక్షల విలువైన 400చ.గ  స్థలంలో మరో 50 లక్షలు ఖర్చుచేసి ఇల్లు కట్టి అద్దెకిస్తే నెలకు వచ్చే అద్దె 10వేలు మించదు.  

   

2. 50 లక్షల విలువైన 400 చ.గ ల స్థలంలో ఒక కార్ పార్క్ కడితే అయే కర్చు 3నుంచి 4 లక్షలు. ఒక తాళం వేసే  కార్ పార్క్ లో 8 కార్లు నిలపచ్చు.కరంటు ఖర్చు నెలకు 500.పంచాయతి పన్ను సం.కి 5 వేలు మించదు.  


3. పై స్థలంలో,రెండంగుళాల బోర్ కొట్టి, (300 అడుగుల్లోగాని నీరు దొరకదు,నాలుగు లక్షలవుతుంది).  కార్ వాష్ షెడ్ కు,ఉన్న చెట్లు వగైరా కదల్చకుండా ఉంచి, సంవత్సరానికి 12వేలు అద్దె ఇస్తూ, నాలుగేళ్ళ తరవాత బోర్,సబ్మెరిస్బుల్ మోటార్లను పనిచేసే స్థితిలో వదిలేసి వెళ్ళడానికి అద్దెకివ్వడం. 3ఫేస్ కరంటు ఇవ్వాలి,బిల్లులు కట్టుకుంటాడు. పై షరతులతో అద్దెకివ్వడం. 

ఏది తెలివైన పెట్టుబడి?     

26, ఫిబ్రవరి 2026, గురువారం

చెత్త బ్లాగులు-వాసన లేని పువ్వు

 చెత్త బ్లాగులు-వాసన లేని పువ్వు

వాసన లేని పువ్వు


వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు, భక్తి వి

శ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్,సద 

భ్యాసము లేని విద్య, పరిహాసము లేని వచః ప్రసంగముల్, 

గ్రాసము లేని కొల్వు, కొఱగానివి పెమ్మయ సింగధీమణీ!



వాసనలేని పువ్వు నాకు తెలిసి మొల్ల,తెల్లగా ఉంటుంది,వాసనుండదు.బుధవర్గము లేని పురంబు,తెలివైనవారు లేని పట్టణం.నేటి కాలంలో అన్ని పట్టణాల్లోనూ మేధావులే ఉన్నారు కదా! భక్తి విశ్వాసములేని భార్య, పెళ్ళి తగులాటం ఎందుకు? ఉద్రేకం కలిగిందా మగ ఆడ ఆ రాత్రికి దాన్ని చల్లర్చుకుంటే సరి,ఇటువంటి జంటలే పెరుగుతున్నకాలం. ఇక భక్తి విశ్వాసం కతలేం లేవు. గుణవంతుడు కాని కుమారుడున్,అందరూ గుణవంతులే, కాని ఆశ్రమంలో చేర్చేస్తారు,చాకిరీ చెయ్యద్దూ! నిత్యమూ మననం చేసుకోని విద్య,ఆచరణలో లేని విద్య,నిత్యం పుస్తకాలన్నీ చదువుతామా!కావలసివచ్చినప్పుడు రిఫర్ చేస్తాం ఇదీ నేటి విద్య,ఎవరిని తప్పు పడతాం.నోటి లెక్కకి కూడా కేల్కులేటర్ వాడే రోజులుగా!  పరిహాసము లేని వచః ప్రసంగముల్, సంభాషణలో చిన్నపాటి హాస్యం ఉండాలిట,నేడు అది అపహాస్యమే, హాస్యం కాదు. గ్రాసములేని కొల్వు, జీతం లేని ఉద్యోగం నేడు ఎవరూ చేయటం లేదు. ఇవన్నీ కొఱగానివి, పనికిరానివన్నారు,కవిగారు. కాని నేటికాలంలో అవే ఉన్నపుడు ఏం చేయగలమన్నదే కొచ్చను????  

వాసనలేని పూవు పద్యం చదివినతరవాత ఈ కింది పద్యం గుర్తొచ్చింది శ్యామలీయం వారిది,జిలేబి బ్లాగులో కామెంటుగా. 

చెత్త బ్లాగులు చెత్త పోష్టులు చెత్త వ్యాఖ్యలు గుంపులే
ఎత్తి పోతలు వింత భాషల చెత్త కైతలు పోగులే
మొత్తుకోళ్ళులు నెత్తిపొడ్పులు సుత్తిమాటలు రాశులే
వత్తురా యిక పాఠకుల్ మన బ్లాగులోకపు జోలికిన్

శ్యామలీయం గారు,
వందనం. 🙏
మీరు జిలేబి మీదకు తోలినది పెద్దపులో,ఏనుగో తేల్చుకోలేకపోయాను,నా వల్ల కాలేదు. పద్దెం మాత్రం బహు సొగసుగా ఉంది. నడక అద్భుతం, పంచకళ్యాణి నడకలా ఉంది. గణవిభజన చేయలేకపోయా,మన్నించి ఏ వృత్తమో చెప్పగోర్తాను.

 ఇది మీరు జిలేబి మెడలో వేసిన అభినందన మందారమాలగా తలుస్తున్నాను. 'పగున్నచోట తిడితే భక్తున్నచోట తగిలిందనీ' నానుడి.
ఇకపద్యంలో కెళితే చెత్తపోస్టులు,చెత్త వ్యాఖ్యలు గుంపులే,ముమ్మటికిన్నీ నిజం. నా బ్లాగుల్లో ఉన్నవన్నీ చెత్తపోస్టులే,నాకుతోచిన గాలిమాటలు రాసుకున్నాను. "శర్మ కాలక్షేపం కబుర్లు" అని మకుటం పెట్టి మరీ రాసుకున్నా కదుసార్! ఎవరినీ నా బ్లాగుకు రమ్మని పిలవలేదు.వచ్చినవారిని పలకరించక మానలేదు. సరే ఇక నా వ్యాఖ్యలు కూడా చెత్తవే. నిజంగానే పోస్టులు,వ్యాఖ్యలు గుంపులే కాదు రాశులే.నా మీద అభిమానం కొద్దీ గుంపులనేసేరు,అంతే! తరవాత సత్యం చెప్పేరు సార్! అవన్నీ జిలేబి ప్రత్యేకతలని చెప్పక చెప్పేరు కదు సార్! ఎంతేని జిలేబి మీద అభిమానంకదా! మీ జిలేబి శతకాలకి కృతిభర్త కూడా కదా,జిలేబి. అభిమానాన్ని ఈ రకంగా కూడా వ్యక్తం చేయచ్చన్నమాట. కొత్త సంగతి తెలుసుకున్నా సార్!      


వత్తురా యిక పాఠకుల్ మన బ్లాగులోకపు జోలికిన్


సోషల్ మీడియా మొదట్లో ఇదొక్కటే మాధ్యమం.అందరూ ఇక్కడికే గుంపుగా చేరేరు. అప్పుడే తెనుగులో రాయడానికి రావదంతో బ్లాగులు జోరందుకున్నాయి. సాధారణంగానే ఈర్ష్యాద్వేషాలు రాజ్యమేలాయి,కొంతకాలానికి. అప్పటికి మొదటి దెబ్బ ఫేస్ బుక్ రూపంలో తగిలింది. ఆ తరవాత రకరకాల మీడియాలొచ్చేసినా,ఇంకా బ్లాగుల్నే పట్టుకు వేలాడుతున్న జీవులు కొన్ని మాత్రమే ఉండిపోయాయి. కొందరు ద్విచరాలు,త్రిచరాలు,చతుశ్చరాలు, బహుళచరాలవారు ఉన్నారనుకోండి.దాంతో మజ్జిగ పలచబడింది, మంది పెరిగితే మజ్జిగ పల్చబడిందన్న నానుడికి ఉల్టాగా  మంది తగ్గితే మజ్జిగా పలచబడిందికదండీ. ఏ మాధ్యమంలో చూసినా ఈర్ష్యాద్వేషాలు,కులద్వేషం కొట్టొచ్చినట్టు కనపడుతూనే ఉన్నాయి కదు సార్! ఇక్కడికి ఇంక చదువరులు వస్తారని ఆశించడం పేరాశ కాగలదేమో సార్! ఇదంతా నా ఊహ సుమా!


ఇవన్నీ నా పిచ్చి,పిచ్చి మాటలు,ఇందులో ఎవరినీ ఎత్తిపొడిచిందిగాని,ఎకసెక్కెం చేసిందిగాని,అపహాస్యం చేసిందిగాని,ఏవిధంగానూ కించపరచిందిగాని  లేదని సవినయంగా మనవిచేస్తూ,చివరిగా ఎవరిష్టం వారిది,ఎవరిని ఎవరూ కట్టడి చేయలేరనే మాట చెబుతూ విరమిస్తున్నా! పొరపాట్లు మన్నించెయ్యండి.

స్వస్తి.   





21, ఫిబ్రవరి 2026, శనివారం

రేగు వడియం

 రేగు వడియం




    బుర్రుంటే బూడిదమ్ముకు బతకొచ్చన్నా ఒకప్పుడు. ఇప్పుడు చెబుతున్నా మరో యాపారం. అదే రేగొడియం. రేగువడియం తెలియనివారు,తినని తెనుగువారుంటారనుకోను. రేగు పళ్ళు సంవత్సరంలో 4 నెలలేవస్తాయి అక్టోబరు చివర  మొదలుకొని మార్చి మొదలు వరకు. దేశం మొత్తం మీద రేగుబాగానే పండుతుందిగాని,ఇలా రేగువడియం పెట్టుకోవడం ఒక తెనుగువాళ్ళ సొత్తే అనుకుంటా. ఇంత చెబుతున్న రేగువడియం ఎలా ఉంటుంది రుచికి? పుల్లపుల్లగా,తియ్యతియ్యగా,కారంకారంగా బలేరుచితో ఉంటుంది. వానాకాలంలో వర్షం పడుతుండగా ఒక రేగు వడియం తింటూ కూచుని వర్షం చూస్తుంటే బలే బావుంటుంది.  ఇంతకీ రేగు వడియం పెట్టుకోడమెలా? రేగుపళ్ళు కడిగి ,తగు బెల్లం,ఉప్పు,పచ్చి మిర్చి  చేర్చి కచ్చాపచ్చాగా తొక్కుకుని తగు జీలకర్ర,ఇంగువ వేసుకుని ముద్ద చేసుకుని చిన్న చిన్న ప్లాస్తిచ్ కవర్లలో చిన్న ముద్దపెట్టి ఒక్కనొక్కు గాలాసుతోనో గిన్నెతోనో నొక్కితే రేగువడియం పెట్టుకోడం అయిపోయింది. వీటిని ఎండలో ఎండబెట్టుకుంటే సంవత్సరం పొడుగునా తినచ్చు. నిలవ ఉంటాయి. గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే మరీ మంచిది. 

యాపారం ఎలా అనికదా కొచ్చను. ఒక బస్తా రేగుపళ్ళు అంటే పది కేజీలు సీజన్ లో కొనుక్కుని వడియాలు పెట్టుకుని అమ్ముకోవచ్చు. ఈ రేగువడియం  తయారీ ఖర్చు ఒక్కొకటి రెండు నుంచి మూడు రూపాయలలోపు ఉంటుంది. ఐదు రేగు వడియాలు ఒక పేకట్ పాతిక రూపాయలకమ్ముకుంటే లాభం ఎంతబ్బా? ఓపికుంటే ఎగుమతీ కూడా చెయ్యచ్చుఅవిడియాలు ఊరికే చెప్పెయ్యరు,కరుసవుద్ది. 

పెపంచం మొత్తమ్మీద తెలుగోళ్ళు చాలా దేశాల్లో ఉన్నట్టాపడతాంది,ఇంకేటాలీసెం వద్దు తొరపడు సోదరా! తాక్స్ 200% వేసినా కొంటారు,రుచి అసుమంటిది,మరీ😜 మల్లీ ఏడేలే,సీజనైపోయింది.