Wednesday, 29 October 2025

0/0=2

 0/0=2


How possible? Here it is!

Proof

100-100/100-100=2

( 10 square- 10 square ) / (10 square - 10 sqare) =2

( 10 + 10 ) ( 10 - 10 )/ ( 10  ( 10 -10)= 2

Cancelling ( 10 - 10 ) on numerator  and denominator 

10+10/ 10 =2

20/10=2

LHS= RHS

Hence proved.

What do you say!



Monday, 27 October 2025

తుఫాను ముందు నిశ్చలత.

 తుఫాను ముందు నిశ్చలత.


తుఫాను ముందు వాతవరణం చాలా నిశ్చలంగా ఉంటుంది. స్థంభించిన చిన్నెలు కనపడతాయి,చూసే కన్నూ,మనసూ ఉండాలి. ప్రకృతి చిన్నబోతుంది. ఈ రోజు ఉదయానికే ప్రకృతి స్థంబించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై రాత్రిని తలపిస్తోంది. చిన్నచినుకు ప్రారంభమైనది,ఇదే తుఫానుకు సంకేతం. 

తుఫానుకోసం తీసుకోవలసిన జాగరతలు అనంతం, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం,అందుచేత వ్యక్తి భద్రత ముఖ్యం, ఆ తరవాతది ఆస్థి భద్రత. చాలా జాగరతలు చాలా సార్లు చెప్పేను, మళ్ళీమళ్ళీ చెప్పే ఓపికలేదు.

1.పాలు,నీళ్ళు జాగరత చేసుకోండి. కరంటు ఉండకపోయే సావకాశాలే హెచ్చు.

2.పిల్లలు,మందులు జాగరత. 

3.ఇంటిపైన,బయట చుట్టూ పారేసిన పనికిరాని వస్తువులు ఎగిరిపోకుండా చూడండి.అవి ఎగిరిపోతే నష్టం కాదుగాని ఇతరులకు హాని కలిగించచ్చు. 

4.సెల్ ఫొన్ ల్లో రిఛార్జి ఉందో లేదో చూసుకోండి. అనవసరంగా సెల్ ఉపయోగించద్దు. 

5.మీభద్రత కావలసినవారితో పంచుకోండి. 

6. అనవసరంగా బయట తిరగద్దు.  

7. కొంత సొమ్ము దగ్గరుంచుకోండి,అవసరం కావచ్చు.

8.ముసలి,ముతకల్ని గమనించండి.


జాగరతలు  అనంతం, ప్రమాదం  చెప్పిరాదు సుమా!

Wednesday, 15 October 2025

మరోమారు అధిక విద్యావంతులప్రయోజకులైరి....

మరోమారు అధిక విద్యావంతులప్రయోజకులైరి....


అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)




పైవీడియో పంపుతూ విన్నకోటవారు ఇలా ఐతే ఏదీతినలేం కదు సార్! అన్నారు, దానికి నేను అన్నీ అవేతింటున్నాం సర్! అన్నా!. 
  
అన్నానుగాని ఒక అనుమానం పీడించింది. నిజమే ఒక మోస్తరుగా మనదగ్గర కూడా ఇది జరుగుతోందిగాని ఇంతలా కాకపోవచ్చేమో అనేది. అంతేకాదు, ఇది నిజమా అదీ ఒక విదేశంలో లా ఉందే! అక్కడకూడా మన దగ్గరలాగా కల్తీ జరుగుతుందా? ఒక సందేహం. అదేకాదు నేటి కల్పిత మేధస్సు కాలం లో నిజమేదో తెలుసుకోవడమంత వీజీ కాదు. నేడు అన్నీ నిజంలాటి అబద్ధాలు,అబద్ధం లాటి నిజాలు కనపడుతున్నాయి. బియ్యంలో రాళ్ళు ఏరుకున్నట్టు వేరు చేయడం అంత తేలిక కాదనిపించింది. 

ఇక వీడియోని పరికిస్తే ఒక అధికవిద్యావంతుడే ఈ కల్తీ  చేస్తున్నట్టు ఉంది. ఒకటీ , రెండూ కాదు నిత్యావసర కూరగాయలన్నిటి మీదా ఇలా చేస్తున్నట్టు ఉంది. మరి అధిక విద్యావంతుడు ఒక లేబ్ లో ఇది చేస్తున్నాడంటే,ఆ లేబ్ ని నిర్వహిస్తున్నాడంటే, ఏదేశపు వాడైనా ఈ అధిక విద్యావంతుడు అప్రయోజకుడే. వీళ్ళని చూసికదా నిరక్షరాస్యులు మరీ చెలరేగిపోతున్నది. 

మన దగ్గర నేనెరిగి పుచ్చకాయకి ఇంజెక్షన్ ఇస్తారు ఎర్రగా కనపడ్డానికి. ఇది పాదుని కాయమీద ఉండగానే చేస్తున్నారు. ఇక అరటిపళ్ళూ ఇతర పళ్ళు మాగబెట్టడానికి బేటరీ వాడతారన్నది నిజం. ఈ మధ్య సీతాఫలం మీద కూడా ఈ పని జరుగుతున్నట్టు ఉంది. ఈ సంవత్సరం సీతాఫలం డజను 400,500 పైన అమ్ముతోంది.  పాలలో కల్తీ చెప్పేదేలేదు. బర్రెలకి ఆవులకి ఎక్కువ పాలు ఇచ్చేందుకు కార్టిసోన్ ఇంజక్షన్లు చాలాకాలంగా తెలిసినదే. ఆకుకూరలు నవనవలాడుతూ తాజాగా కనపడుతున్నాయంటే మందులో ముంచినవే సుమా!డ్రగ్ ఇనస్పెక్టర్లు  చిదంబర రహస్యం. ఏదేశమైనా ఇంతేనా! అధిక  విద్యావంతులు మరో సారి అప్రయోజకులేనా?    

Wednesday, 8 October 2025

90 ఏళ్ళనాటి మాట(Telephone service)



90 ఏళ్ళనాటి మాట(Telephone service)
  
Courtesy: Facebook,google

Monday, 6 October 2025

శ్రీ శ్యామలీయంగారికి సతీ వియోగం.

 శ్రీ శ్యామలీయంగారికి సతీ వియోగం.


ప్రముఖ బ్లాగరు శ్రీ తాడిగడప శ్యామలరావు గారికి సతీమణి శ్రీమతి శారద గారు నిన్న(5.10.2025) ఉదయం 7.43 నిమిషాలకు ఇహలోకయాత్ర 

చాలించినట్లు 

శ్రీ శ్యామలీయంవారి ద్వారా ఇప్పుడే తెలిసింది. 


శ్రీమతి శారదగారు బహుకాలంగా డయాలిసిస్ తో ఉన్నట్టు తెలిసిన సంగతే. కొద్దికాలంగా హాస్పిటల్ లో ఉండి వెంటిలేటర్ కూడా పని చేయక, రెండురోజుల కోమా తరవాత ఇహలోకయాత్ర చాలించిన దుర్వార్త తెలిసి ఖిన్నుడనయ్యాను. మాటాడటానికి మాట పెగలలేదు. 

సంతానం లేని శ్యామలీయంగారు,ఈ కష్ట సమయంలో  మనసు కుదుట పరుచుకోవాలని కోరుతున్నా.  


శ్రీమతి శారదగారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్ధిస్తూ, శలవు.