Monday, 23 December 2024

అంత మనిషైనా

 అంత మనిషైనా


 అంత మనిషైనా,ఇంత మనిషైనా, ఎంత మనిషైనా, భార్య కాళ్ళ దగ్గర కూచునేవాడే.

ఎంత నేర్చినా ఎంత జూచినా ఎంతవారాలయిన కాంత దాసులే.


8 comments:

  1. ఇప్పటికైనను జ్ఞానోదయమాయె :)


    ReplyDelete
    Replies
    1. Zilebi23 December 2024 at 16:09
      ఙ్ఞానోదయమయింది కదా నీకు అస్తు! అస్తు!!😊

      Delete
    2. అబ్బే అదన్నది మీకండోయ్ తాతగారు


      Delete
    3. Zilebi23 December 2024 at 19:10
      రెండు రెళ్ళు ఆరు సినిమా డయలాగ్ లాగ "మాట మారుస్తున్నావా?"

      Delete
  2. బధ్ధకముగ లేచి , గద్దించి కసిరిన
    సతికి , నెస్ కాఫీ యొసంగి , లేపి
    బూష్టిచ్చి పిల్లల , కష్టకష్టాల్ వడి ,
    స్నానాదికముల వేసట ముగించి ,
    వంట జేసి , పొసగ వడ్డించి బాక్సులన్ ,
    పిల్లలన్ స్కూళ్ళకు వెళ్ళ దిగిచి ,
    సతికి దోసెలు వేసి , శాపనార్థాల్ దిని ,
    మధ్యాహ్న బాక్సు ప్రేమారనొసగి ,

    చచ్చి చెడుచు , ఆఫీసుకు వచ్చిపడగ ,
    అచటనూ తిట్లతో చంపు ' ఆడబాసు ' ,
    వద్దురా , మోడరన్ ' మగవాళ్ళ ' వెతలు ,
    మహిళ 'మహరాణి' ఇంటి రామాయణమున .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల23 December 2024 at 19:12
      బతుకు తెఱువు బాగా చెప్పేరు సార్!🤣

      Delete
  3. కొంత కాలమే కాంత దాసులు,
    తరువాత కనక దాసులే...

    ReplyDelete
    Replies
    1. bonagiri24 December 2024 at 09:53
      మీరు చెప్పిన మాట పచ్చి నిజం సార్! 👌 కాంతా కనకాలు కవలపిల్లలు కదండీ. కాంతతో ఓపిక తగ్గేకా కనకం మీదే మోజు. దాని వేనకనే పడతారు, వెనక పడితే అందదు, ఆ వెలుగులో కళ్ళు మూసుకుపోతాయి. కనకం కూడా నడిచినా ఆ వెలుగులో కళ్ళు మూసుకునే పోతాయి. ఇక కాంతతో కనకం(చిన్నతల్లి) వెనక నడిస్తే ఆ వెలుగులో జీవితం నడిచిపోయి,తెల్లవారిపోతుంది కదండీ. కనక సంపాదన ఎంత కావాలన్నది నిర్ణయించుకోడం తేలిక కాదు. తాగిన కొద్దీ ఈ దాహం పెరిగేదే! అదీ చిత్రం. ఎక్కువ చెప్పేనా?😊

      Delete