వీడియో చూసారా! నాకనిపించినది.
కన్య వరుని మెడలో మాల వేసింది.హుందాగా స్వీకరించాడు. వరుడు మాల వేసేలోగా ఏదో ఇబ్బంది, అందుకు కన్య వరుణ్ణి సున్నితంగా హెచ్చరించింది, కర్తవ్యాన్ని, చేతిని సున్నితంగా తాకడం ద్వారా. చిక్కును విడతీయడానికి సాయపడింది. ఆనందంగా వంగి మాల స్వీకరించింది, వంగాలసిన అవసరం లేకున్నా! ఆపై కన్య వరుని కాళ్ళకి నమస్కారం చేసింది. వరుడూ కన్య కాళ్ళకి నమస్కారం చేసాడు, పైనుంచి మరోమాట వినిపిస్తున్నా! ఆ తరవాత కన్య మొహంలో గొప్ప అనుభూతి,భావోద్వేగం కనపడ్డాయి. పక్కవారెవరూ లేకుంటే ఒక్కసారిగా భర్తను వాటేసుకునేదేనేమో అనిపించింది. వీరి జీవితం మూడు పూవులు ఆరుకాయలే!
నాకనిపించింది, ఇద్దరి మధ్య ఒద్దిక ఉంటే రానేరావు పొరపాట్లు, చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు, సినీకవి మాట నిజం,నిజం, నిజం. అంతేకాదు వరుడు నిజంగా తిక్కమొగుడే! భార్య అంటే అంత ప్రేమ, అభిమానం, ఆమెకోసం ఏం చెయ్యమన్నా చేసేస్తాడు, అంతే.
దీవిద్దాం
దీర్ఘాయుష్మాన్భవ.
దీర్ఘ సుమంగళీభవ.
అయిపోయాడు, అయిపోయాడు అంతే☝️.
ReplyDeleteసర్లెండి ఆశీర్వదించేద్దాం ✋ తరువాత అతని భాగ్యం 😁😁.
అవునండీ, సినిమాల పట్ల ఆసక్తి లేదంటుంటారు, సినిమా పాటల రిఫరెన్సులు విరివిగానే ఇస్తుంటారే ?
copy peshTu chesTumTaaremo
Deleteవిన్నకోట నరసింహా రావు27 February 2023 at 10:47
Deleteఎంతనేర్చినా ఎంతజూచినా
ఎంతవారలైన కాంతదాసులే!
త్యాగరాజు గారి మాట.అందరూ పైకి కబుర్లు చెప్పేవారేకదండి. వీడైతే తిక్కమొగుడు కనక తనకి తన పెళ్ళానికి నచ్చినది చేసేస్తాడు, భయపడడు, సిగ్గూ పడడు ఎవరికి.
సినిమాలంటే విముఖత నిజం, అదీ కొంత కాలం తరవాతే. సాహిత్యానికి సంగీతానికి ఎప్పుడూ పెద్దపీటే, ఆనందమేనండి. కొన్ని పాటలైతే అస్తిగతమైపోయాయి, హత్తుకుపోయాయి మనసుని. అందుకే కొంచం ఎక్కువగా సినిమా పాటలనుంచి చెబుతుంటాను, ఎక్కువమందికి చేరేందుకు.
నిదురపో! నిదురపో!! నిదురపో!!
నిదురపోరా తమ్ముడా!
నిదురపోరా తమ్ముడా!
నిదురలోనా గతమునంతా
ని ముసమైనా మరచిపోరా
కరుణలేని ఈ జగానా
కలత నిదురే మేలురా
నిదురపోరా తమ్ముడా!
కలలు పండే కాలమంతా
కనులముందే కదలిపోయే
లేతమనసుల చిగురుటాశా
పూతలోనే రాలిపోయే
నిదురపోరాపోరా తమ్ముడా!
Anonymous27 February 2023 at 12:30
Deleteతమ భావం అర్ధం కాలేదు.
👌👌🙂🙏
Delete