వ్యత్యస్త పాదారవింద.
వ్యత్యస్త పాదారవింద ఇందిరా హృదయానంద.
ఎప్పుడేనా విన్నారా? ఇది భజనపాళీ లో పాడేది, అన్నటు నేడు వేల్పుల
భజనలు లేవుగా తెరవేల్పుల భజనలే తప్పించి. :)
వ్యత్యస్తం అంటే అపసవ్యంగా ఉండడం, అపసవ్య పదారవిందాలున్నవాడు.అంటే ఎడమపాదం కుడివైపు వేసుకుని ఒకపాదం మీద నిలబడి రెవండవకాలి బొటనవేలు భూమిమీద ఆనించి నిలవడడం. అబ్బే ఎంత చెప్పినా అర్ధం చెయ్యలేనేమో. కృష్ణుని బొమ్మ చూశారా? చూసేవుంటారు. నిలబడి ఉన్న కృష్ణుడు వ్యత్యస్తపాదాలతో, చేత మురళితో, వెనక గోవుతో,పొన్నచెట్టు నీడ నిలబడినట్టు ఉంటాయి. ఏమిటి దీని తిరకాసు?అసలు కృష్ణుడు అలాగే ఎందుకు నిలబడతాడు చెప్పండి? కొచ్చను.
Courtesy:Google
ఎడమకాలు ఎత్తి కుడికాలి మీంచి కుడి కాలి కుడి వైపు వేసి నిలబడగలరా? ప్రయత్నించద్దు, పడిపోతారు. ఇలా అడుగులేసి నిలబడటమే వ్యత్యస్త పాదాలు.ఇలా నిలబడటం చాలా కష్టం. యోగాలో దీనిని గరుడాసనం అంటారు.ఇలా నిలబడి రెండు చేతులూ పైకెత్తి మోచేతులనుంచి మెలిక వేసి రెండు అరచేతులూ నమస్కార ముద్ర పట్టడమే గరుడాసనం. ఎందుకిది పనిలేక అనికదా కొచ్చను. ఇలా నిలబడగలిగితే మనిషికి స్థిరత్వం కలుగుతుంది.మనిషి ఆలోచన కూడా సవ్యమైన దిశలో నడుస్తుంది. అబ్బే నమ్మం, చిత్తం తమకి నచ్చదని తెలుసు. :)
మొన్నీ మధ్య నాసా అనుకుంటా ఒక అంతరిక్ష నౌకని పంపింది, అందులో ఒక అంతరిక్షిణి వెళ్ళింది. ఆ అంతరిక్షిణి తన ఖాళీ సమయంలో ఈ గరుడాసనం వేస్తూనిలబడిన ఫోటోలను నెట్ లో వైరల్ చేసేరు. ఆవిడకేం పనిలేక ఈ గరుడాసనం వేసిందా? కాదు అంతరిక్షంలో కూడా స్థిరంగా నిలవాలంటే ఈ గరుడాసనం ఉపయోగిస్తుందిష.
ఇక వృక్షాసనం అని ఒకటుంది, ఇందులో ఒకకాలిపై నిలచి రెండవకాలు మొదటికాలి మోకాలి దగ్గర ఉంచి నిలవాలి, చేతులు పైకి చాచి నమస్కార ముద్ర పట్టాలి.. ప్రయత్నించద్దూ! పడిపోతారు. నాకే పూచీలేదు. ఇదీ నెట్ లో వైరల్. ఎందుకుషా? ఈ ఆసనం పదిసెకండ్లు వేసి నిలవలేనివారు పదేళ్ళలో పోతారూ, అని చెబుతున్నారు. మనవారేంచెబుతున్నారూ! సాధనమున పనులు సమకూరు ధరలోన, ప్రయత్నం చెయ్యండి, ఎంత సేపైనా నిలవగలరు, హాయిగా జీవించగలరు. ఇలా నిలిచి తపస్సు చేసిన మహానుభావులు ఎంతమందో, ఎంతకాలం తపస్సుచేసేరో ఎవరికెరుక? ఏది పాసిటివ్ తింకింగ్ బాబూ! పదేళ్ళలో చస్తావన్నదా???
"అంతరిక్షుఁడు - మురాసురుని కొడుకు. ఇతఁడు శ్రీకృష్ణునిచే చంపబడెను." అంతరిక్షణి అనే పదం నిఘంటువులో లేదు. వ్యోమగామి అంటారు కాబోలు. నెట్ లో వచ్చే వార్తలనే నమ్ముతున్నారూ? హతోస్మి.
ReplyDeleteAnonymous30 December 2022 at 18:35
Deleteఅంతరిక్షుడు నామవాచకం ఉన్నట్టు తెలియదు. ధన్యవాదాలు.కొత్త మాటలు పుట్టించకపోతే ఎలా. భాష సజీవమైనది కదా! అంతరిక్షుడికి స్త్రీలింగం అంతరిక్షిణి బాగానే ఉందిగా!!
నెట్ అన్నాగాని ఫారిన్ ఇంగ్లీషు పేపర్లలో వార్త సారూ!
ఇలా అష్ట కష్టాలూ పడి ఆసనాలు వేసి వేసి బతికే బతుకూ బతుకేనా ?
ReplyDeleteAnonymous30 December 2022 at 23:21
Deleteసమాధానం పెద్దదిగా ఉంటే ఓపిగ్గా చదువుకోండీ!
మన చెయ్యీ కాలూ మనమే కదుపుకోవక్కర్లేదు, మరొకరు కదుపుతారుగా, ఎందుకీ తిప్పలు అనుకుంటే బాధే లేదు. అన్నట్టు మరచానండోయ్! కాలూ చెయ్యీ కదపమని చెప్పడానికి నోరుండాలి కదా! యోగాలో ’సింహ’ ఆసనమని ఉంది. సింహంలా కూచుని గర్జిస్తారు. నేనూ ఏంటిదీ వీళ్ళు పిచ్చివాళ్ళా అనుకున్నా! కాదు సుమా! ఇది స్వరపేటికకి కూడా వ్యాయామం. పాపం పంతంజలి మహర్షి కి ఎంత ముందుచూపో కదా! మనలాటి అర్భకులు కూడా పుడతారని అనుకున్నాడు సుమా!
ఏమనుకోవద్దూ! మరోమాట.జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించినదాని మీద చర్చ జరిగింది. అందులో ఒక రాజకీయుడు నా కుక్క కూడా స్ట్రెచెస్ చేస్తుందని హేళన చేశాడు. దానికి మరొకడు నీ కుక్కకి బుద్ధి ఉంది సుమా! అని ఒక చిన్న చురకంటించాడు.అర్ధమయిందా??
చివరగా ఒక ఆసనం మనకి ఇష్టం ఉన్న లేకపోయినా వేస్తాం! తప్పదూ! అందరికీ తప్పదు సుమా! ఆసనం పేరు చెప్పనూ! బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలనేదే తాపత్రయం. తమకొద్దు లెండి. నేటిరాత్రి చుక్కేసి పక్కెయ్యండి!బెస్ట్ ఆఫ్ లక్!!!
ఆసనాలు మంచివే లెండి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి దోహద పడతాయి.
ReplyDeleteడైటింగ్ అనే వేలంవెర్రి అలా కాదు కదా. దీని మీద ప్రవచనకర్త గరికపాటి గారి ఉపన్యాసం వినండి 👇. హాస్యభరితంగా చెప్పినా ఆయన మంచి ఉద్దేశంతోనే చెప్పారు లెండి 🙂🙂.
https://m.youtube.com/watch?v=zeYc3k48XoM
విన్నకోట నరసింహా రావు31 December 2022 at 01:30
Deleteఅతి సర్వత్ర వర్జయేత్! ఆసనాలు ఆరోగ్యానికి దోహద పడతాయి.నేటి కాలంలో సయాటికా నెప్పి సామాన్యం అయింది. మందులేసుకున్నా ఉపశమనం అంతంత మాత్రమే! వృక్షానసం వేస్తే కొంత ఉపశమనం. గోడని ఆనుకుని మొదలు పెట్టచ్చు. మొదటిలో అదీ కష్టమే! దేన్నేనా పట్టుకుని ఆ ఆసనం గోడ దగ్గర వేయచ్చు. కొంతలవాటు తరవాత, పట్టుకోనక్కరలేదు, దేన్నీ కాని గోడకి జేరబడక తప్పదు. ఆ తరవాత అలవాటయి నిలబడచ్చు,ఒంటి కాలు మీద, పట్టుకోనక్కరలేక. ఇంకా సయాటికా ఉపశమనానినికి (బాసింపట్టు) అదే సుఖాసనం. ఇలా కూచుంటే ఎడమపాదం కుడితొడకిందికి కుడిపాదం ఎడమతొడ కిందికి వస్తాయి. సరిగా సయాటిక్ నరాన్ని నొక్కుతాయి. ఉపశమనంగా ఉంటుంది. చెప్పడమే నాధర్మం.....
డయటింగ్, జీరో సైజ్, సిక్స్ పేక్ ఇలా అతి జరుగుతున్నట్టుంది.
ఏంటో ’కవి’ని కదా!
వ్యత్యస్త పాదారవింద
ReplyDeleteఇందిరా హృదయానంద
అన్నాను టపాలో, కాని కీర్తనలో
వ్యత్యస్త పాదారవింద
విశ్వవందిత ముకుంద
అని మిత్రులు శ్యామలరావుగారు సరిచేసేరు. నమస్కారం.
పల్లెలలో వాడుక నేను చెప్పినట్టే వుంది. కారణం భజన చేసేవారు పలకడానికి ఇబ్బంది మూలంగా, దానిని ఇందిరా హృదయానందగా ఎవరో మార్చేసేరు. నేను మొదట కామెంట్ లో తప్పు టైపు చేసాను, మరల ఇప్పుడు సరిచేశాను.