ఒండుకున్నమ్మకి ఒకటే కూర దండుకున్నమ్మకి అన్నీ కూరలే
వండుకుంటేఒక కూరే వండుకుంటారు, ప్రత్యేక కార్యక్రమం లేకపోతే. మరిక దండుకోవడమంటే? బలవంతంగా పుచ్చుకోవడం. అదెలా? రకరకాలు.'' వదినా కూరేం చేశావు?'' ''వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర''. అబ్బ ! ''మీ అన్నయ్య కెంత ఇష్టమో! మార్కెట్లో మంచి వంకాయే దొరకలేదనుకో''! వండుకున్నావిడ కొంచం కూర పె ట్ట క ఛస్తుందా? మరో చోటైతే మరో చిట్కా! ''నువ్వు పెట్టే నూనిమాగాయంటే మనపరగణాలో చెప్పుకుంటారనుకో!'' పొగేస్తే పెట్టక ఛస్తుందా? ''ఐపోవచ్చిందొదినా ఇదే మిగిలింది మళ్ళీ పెట్టాలి ఎండల్లో!'' ఇలా దండుకున్నావిడకి కూరల లోటుంటుందా?
ఇందమ్మ అంటేనే అందమ్మ అంటారు.
ఆదాన ప్రదానాలు జీవితంలో ఒక భాగమే! ఇవ్వాలి పుచ్చుకోవాలి, దానికి సమయం సందర్భమూ ఉండాలి. ఇచ్చేదానికి పుచ్చుకునే దానికి వెల చూడకూడదు, ఇవ్వడం వెనక మనసు చూడాలి.అలా చూడాలంటే పెట్టే మనసుండాలి. :) అదే ఇందమ్మ అంటే అందమ్మ అనడం
కడుపులో లేనిది కావలించుకుంటే రాదు.
కావలించుకోవడం ఎప్పుడు జరుగుతుంది? మసులో ప్రేమ ఉన్నపుడు. మనసులో ప్రేమలేక కావలించుకున్నంతలో ప్రేమ పుట్టదు :)
అబ్బ! ఎంత అందంగా శిల్పిలా మీ టపాలు తీర్చిదిద్దుతారండీ తెలుగు బ్లాగుల్లో మీ లాగు రాసేవారే లేదండి
ReplyDeleteవారి లాగు రాసేవాల్లెవరుంటారండీ మీరు మరీను :)
DeleteAnonymous11 December 2022 at 13:16
Deleteఇందులో చెక్కేందుకేం లేదండీ :) అంతా లోకరీతి,అందుకే నానుడి.
//తెలుగు బ్లాగుల్లో మీ లాగు రాసేవారే లేదండి//
కాదమో సుమండీ! నా లాగూ :) రాసేవాళ్ళూ :) ఉన్నట్టున్నారు, చూద్దురుగాని వేచి చూడుడీ :)
DeleteAnonymous11 December 2022 at 20:34
ఎవరిలాగూ :) వాల్లే రాసుకుంటాఆండీ :) అదే లోకరీతి, కాని సోషల్ మీడియా నీతి వేరనుకుంటానండీ. నాలాగూ :) రాసేవాల్లు :) ఉన్నట్టున్నారండీ. వెఛీ ఛూస్తారా?
బలే కామెడీ జరుగుతున్నట్టుంది ఇక్కడ
DeleteAnonymous12 December 2022 at 17:31
Deleteజీవితమే ఒక వైకుంఠపాళీ నిజం తెలుసుకో భాయీ!
రాసుకున్నమ్మకి ఒకటే టపా దోచుకున్నమ్మకి అన్నీ టపాలే ! :)
శర్మ గారు,
Delete// “ రాసుకున్నమ్మకి ఒకటే టపా దోచుకున్నమ్మకి అన్నీ టపాలే ! ” //
మీ స్వానుభవం 🙂. మీరూ బాధితులేగా.
సామెతగా రూపాంతరం చెందే అర్హత కలది 👌👍.
విన్నకోటవారు,
Deleteజీవితానుభవాలే కాలంలో నానుడులు కదండీ :)