Wednesday, 16 June 2021

భూత తృప్తి



 CourtesyWhats app

9 comments:

  1. రెండు పనులూ భూత తృప్తే 😁😁.

    ఈతకల్లు సేవించడానికి సామాజిక దూరం పాటించడం బ్రహ్మాండమైన ఐడియా 😁😁.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      రూలంటే రూలే :) సామాజిక దూరం పాటించాలి ఏం చేసినా :)

      Delete
  2. పైది.. కోతి పుండు బ్రహ్మ రాక్షసి: అనగా కల్లు, సారా, విస్కి, రమ్, వొడ్క, బీర్ వంటి వాటి జోలికి ఒక్కసారి వెళ్ళి.. ఆ అలవాటు కాస్త వ్యసనం అయ్యే పరిస్థితి దాక తెచ్చుకోవటం.. ఇంత కోవిడ్ సమయంలో కూడా కొందరికి ఇది నిత్య దర్శనం.. ఏ గుడికో, లేదా వేరే ఏ పుణ్యానికో వెళ్ళి రమ్మంటే రారు కొందరు కాని ఇలా ఔతే కొట్టుకునే దాక పోతుంది వ్యవహారం కదా శర్మాచార్య..! ఆ తాటాకు చానెల్ చూస్తుంటే నా చిన్నప్పుడు నేను, మా బాబాయి తయారు చేసుకున్న ఆముదపు ఆకు లేదా ఉల్లికాడ పువ్వు ట్యూబ్ చానెల్ మూలాన క్యాపిలరి ఎఫెక్ట్ అయ్యి సిఫనింగ్ గుర్తుకు వచ్చింది..

    కిందది.. పర్లేదు.. మిగిలి పోయిన వస్తువులను పారేయకుండ కొంతలో కొంత ఇలా మూగ జీవాలకు అందిస్తే మంచిదే.. కాపోతే వాటితో జర భద్రం.. మహబూబాబాద్ స్టేషన్ పట్టాలపై ఇవే దర్శనమిస్తాయి.. అరటి పళ్ళు, వాటర్ బాటల్, తినుబండారాలు లాక్కెళ్తాయవి..

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      ఈత కల్లు కుష్టు రోగానికి మందు,తాటికల్లు ఆకలి పుట్టిస్తుంది, ఐరన్ మయం,తాటి బెల్లం ఈ కల్లు నుంచే తయారు చేస్తారు, దాన్ని పాత బెల్లం అని కూడా అంటారు. ఇవి రెండు సంవత్సరంలో రెండు నెలలే దొరుకుతాయి, ఇంకా ఇప్పకల్లు, జీలుగు కల్లు చాలా ఉన్నాయి, అవి కూడా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే! మత్తు బాగా తక్కువని డైజీ పాం కలిపితే మొదలుకే మోసం.

      మరో మాట ద్రాక్ష సారా ”రెడ్ వైన్” రోజూ రెండు పెగ్గులు తాగితే గుండెకు మంచిది, రక్త నాళాలు మూసుకుపోవు.

      ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్
      సర్వజీవులు ఆహారం తీసుకోవాలి, మనం తిని పడుకుంటే సరిపోదు గదా! మిగిలినదే కాదు కొంత తిండి తగ్గించుకుని జీవులకు ఆహారం ఇవ్వాలి. మన చుట్టూ ఉండే ఉడుతలు, పక్షులు, కాకులు, పిచుకలు, ఇదివరలో వడ్లగంటలు కట్టేవారు తెలుసుగా!


      Delete
    2. తెలుసాచార్య మా నాయనమ్మ వారు పెట్టేవారు వడ్లగంటలు, వాటిని తినటానికి పక్షులు వచ్చేవి. మా అమ్మమ్మ వారైతే ఇపుడూ పెడుతు ఉంటారు.. పిచ్చుకల కోసం వారింట పిచ్చుక గూడు ఉండేది మరి..!

      ఏమో ఆ విషయాలు తెలిసి తెలియని వాణ్ణి.. ఇప్ప సారా విన్నా.. కల్లూ ఉంటుందా ఆచార్య.. ఏమోలే.. వాటి జోలికి జన్మలో వెళ్ళకూడదని నాన్నగారు నా చిన్నపుడే చెప్పారు.

      ఆ సారా కల్లు వలన కొన్ని జీవితాలు అతలాకుతలమైయ్యాయి అందుకే అవంటేనే చిరాకు నాకు. చుట్ట సిగరెట్, కరీంబీడీ

      Delete
    3. రూపమేదైనా వినాశనమే చివరాఖరున

      Delete
    4. జాగర్త! కల్లునేమైనా అంటే, ఒక రాష్ట్రం వాల్ల మనోభావాలు దెబ్బతిని.. కేసుల్లేకుండా ఈగలు తోలుకునే లాయర్లు.. మీ మీద కేసులుపెడతారు.

      Delete
  3. అరమరికలేక కోవిడు
    షరతులు పాటించి కల్లు చవిగొనుట భళా !
    పరిపరి మరిమరి విరివిగ
    సుర దాగెడు వారు భూమిసురులైరటగా !

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      షరతులు పాటించి తాగువారు ధన్యులు సుమతీ!
      నేడు సురతాగువారే గొప్పవారు కదసార్!

      Delete