Thursday, 3 September 2020

చింతచిగురు పప్పు.

చింతచిగురు పప్పు.

చింతచిగురు,షీకాయ చెట్టు చిగురించే కాలం. షీకాయ చెట్టుకు ముళ్ళుంటాయి. చిటారు కొమ్మన ఉన్న చిగురు కోయడం తేలికేం కాదు. ఆ చిగిరు పప్పులో వేసుకుంటారు. బలే రుచి. :)

చింత చిగురు/షీకాయాకు చిగురు మెత్తగా నలిపేయండి, అరచేతులతో. స్టీలు గిన్నెలో వేసి తగిన పప్పు వేయండి కొద్దిగా పసుపేయండి. పప్పు ఉడికేదాకా ఉడకపెట్టండి. ఇది జారుగానూ చేసుకోవచ్చు,పొడిగానూ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఉడికిన తరవాత పోపు పెట్టండి, కావాలనుకుంటే ఇంగువ ముక్క వేసుకోండి, పోపులో. వెల్లుల్లి వేసుకుంటే అదుర్స్. షీకాయాకు పప్పు ఇలాగే వేసుకుంటారు,షీకాయాకు, చింత చిగురు కూడా పచ్చళ్ళుగా చేసుకుంటారు. షీకాయ ఆకు పచ్చడి నోరు రుచి లేనివారికి అనగా జ్వరపడి లేచినవారికి మంచి మందు అంటారు.

చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా
!

32 comments:

  1. పాక శాస్త్రమున లవణము లేకుండ ఏదీ రుచించదు
    ఆకలెంతైనా లవణము హెచ్చు ఐనచో కూర వ్యాకగును

    హెచ్చు తగ్గులనేవి జీవితానికి పరిపాటి
    ఉలుకు పలుకు మాట మౌనం సరిసాటి

    మమకారమెక్కువైనా పర్లేదు
    కారమెక్కువైతే మెర్లిన్ ఇంజన్ హద్దు
    ఉప్పెక్కువ తక్కువ కాకుండ మోస్తారైతే పర్లేదు
    ముప్పు రాకుండ జాగ్రత పడితే ముంపునకు గురికారు

    కడుపుతీపి బంధుప్రీతి సమపాళ్ళలో మేటి
    ఏది ఎక్కువైనా చివరాఖరున దగాతో మునిగే పుట్టి

    చింత చిగురు పులుపు వగరు భళిభళ
    అసూయ పొగరు నింద ఆడంబరత విలవిల

    ~శ్రీత ధరణి

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్,
      కవి హృదయాన్ని బాగా ఆవిష్కరించారు.జీవితంలో రసజ్ఞత అనే ఉప్పు సమపాళ్ళలో లేకపోతే ఆ జీవితం వ్యర్థం, వారెంత గొప్పవారైనా.

      ఇక చింత చిగురు రామలు వీటినే పరిగిలు,మెత్తళ్ళు అని కూడా అంటారట,కలిపి వండుకుంటే అద్భుతం(ట)

      రసహృదయం కావాలోయ్ అన్నాడో కవి

      Delete
    2. ధన్యవాదాలు ఆచార్య

      Delete
  2. ఏమిటో సర్, షీకాయ (సీకాయ??? రెండూ ఒకటేగా???) అంటే నాకు తలంటే గుర్తుకొస్తుంది. దాన్ని వంటలో కూడా వాడవచ్చని ఇప్పుడే తెలిసింది.

    ReplyDelete
    Replies
    1. ఈ షికాయ్/శికాకాయ్/కాయ్ రాజా కాయ్ తుమ్మ జాతి చెట్టు కు కాచే మీడియం సైజ్ పాడ్ కాయలట. వీటిని ఇంగ్లిషులో అకేషియ కొన్సిన్నా అంటారుట. ఈ పేరును నేను ఎక్కువగా ఏ మీరా షామ్పు యాడ్ లో వినడం జరిగింది. ఐతే తుమ్మ చెట్టు కుటుంబం వీ కనుక వీటికి ముళ్ళనేవి ఉంటాయట. సర్వసాధారణంగా కుంకుడుకాయలను, షికాయలను వెంట్రుకల కోసం వేరేలా జుత్తు వాష్ చేసుకోవడం కోసం ఉపయోగపడతాయని తెలుసు. మోన్నదేదో ఛానెల్ లో సంజయ్ తుమ్మ గారు కుంకుడుకాయలను మరగబెట్టి ఆ నీటిలోనే పంచదార పాకం పట్టి అందులో రస్ మలై తయారు చేశారు. ఆ నురగ వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాటివి రావా యేమో అనుకున్నా.. ఇపూడు గురువు గారి టపా లో షికాయ ఆకు చట్ని నూరటమనే విషయం తెలిసొచ్చింది వియన్నార్ గారు. (ఏన్నార్ లా). అదేమో తెలియదు గాని నా మూడో యేట నేను సదరు నల్లతుమ్మ చెట్టు బెరడు పై అంటి ఉన్న జిగురు పదార్థాన్ని తినటం జరిగింది. మరీ గట్టిగా కాకపోయినా ఇంట్లో చేసుకునే బెల్లం వేరుశెనగ చిక్కి లో బెల్లం తీరు గట్టితనం, అలాగే రుచి పచి లేని చప్పదనం అనిపించి వెంటనే ఊసేసా ఆ తుమ్మ జిగురును. ఆ యేడే ఎన్టీఓడు గారిని కళ్ళారా చూడడం జరిగింది. ఏదో టీడీపి మీటింగ్ కోసమని వచ్చారుట..! ఇంటికి కాదులేండి గుంపులో గోవిందంలా చూడటం జరిగింది.. అపుడు నాకు మూడేళ్ళే కదాండి.. మా నాయనమ్మ గారు నన్ను ఆ మీటింగ్ కీ తీసుకెళ్ళారనట్టు.. థమ్స్ అప్ ఇస్తే వాంతి చేసుకున్నా..

      Delete
    2. VNR sir,

      అది సీకాయాండీ, పల్లెటూరోళ్ళం షీకాయంటామండి.

      Delete
    3. శ్రీధర్
      ఇది తుమ్మ ఫేమిలీ, ముళ్ళుంటాయి, దీని చిగురు పుల్లగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువ,పప్పులో, పచ్చడిలో వాడతారు. షీకాయ కాయలు తుమ్మకాయల్లానే ఉంటాయి. వీటిని తలగడుగుకు, మందులలో,రంగుల తయారీలో వాడతారు.
      తుమ్మ రెండు రకాలు, నల్ల తుమ్మ,తెల్ల తుమ్మ. ”నల్లతుమ్మమొద్దు” అని తిడతారు. కర్ర అంత గట్టిగా ఉంటుందిట. దీనిని నాగలి దుంపకి వాడదతారు. తుమ్మ జిగురు మందులా వాడతారు, గ్రహణికి మందు.
      ఇక ముళ్ళ తుప్ప బలుసు ముళ్ళుంటాయీ. ఆకు దళసరిగా ఉంటుంది, పచ్చడి చేస్తారు, ఐరన్ ఎక్కువ. వాక తుప్ప, కాయలు ఎరుపు,పసుపు రంగులో ఉంటాయి, పుల్లగా ఉంటాయి, పచ్చి కాయలు తింటే దగ్గు వస్తుంది, అది కోరింత దగ్గు కూడా కావచ్చు. ఇదీ మందుగా ఉపయోగిస్తారు, పచ్చడి, పప్పులలో వాడతారు. దీనికి ముళ్ళు ఉండవు, విటమిన్ సి హెచ్చు.

      Delete
    4. మీరు తెలిపిన విషయాలు బాగున్నాయి, శర్మ గారు. బహుశ అందుకేనేమో వెజ్ లో ఉండే సహజ సిద్ధమైన వ్యాధినరికట్టే గుణం పుష్కలమన్నట్టు.. పైగా ఈ సామెత "బతికుంటే బలుసాకు తినొచ్చు" అని విన్నా కాని ఇందులో ఇన్ని న్యూట్రిటివ్ వ్యాల్యూస్ ఉంటాయని తెలియదు. ధన్యవాదాలాచార్య..!

      Delete
    5. శ్రీధర్,
      బతికుంటే బలుసాకు తినచ్చండంలో అర్ధం అదే! కరువు రోజుల్లో ఆహారం దొరకక బలుసాకు ఉడకబెట్టుకు తిని ప్రాణాలు నిలుపుకున్నారు, మన పూర్వులు.

      కూరలో కరివేపాకు తీసి పారేస్తాం. కరివేపాకు,ములగాకు ఇనపగనులు, ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటికి తేలిగ్గానే దొరుకుతున్నాయి. కరివేపాకు పచ్చడి బలే ఉంటుంది, ములగాకు గురించి మొన్నీ మధయనే చెప్పుకున్నాం కదూ. ఇవేమైనా చేదా? గలిజేరు వేళ్ళా తినలేకపోడానికి?

      రుచికరమైన, చౌకైన ఆహారం తినండి, ఔషధంగానూ పనికొస్తుంది, ఆరోగ్యమూ ఇస్తుంది కదా! వెతుక్కుంటూ పోతే అబ్బో ఎన్నో! అదృష్టం నిజంగా మనదే


      Delete
    6. అందుకే :-
      నీచు మానండోయ్
      బాబూ
      వెజ్జు తినండోయ్
      బాబూ

      అన్నారు 🙂.

      Delete
    7. ౦౬ డిసెంబర్ ౨౦౧౦ మొదలు, నాను వెజ్ మాత్రమే తింటున్నా ఆచార్య.. (సిక్కోలు యాస, స్వర్ణ కమలం లో పావల శ్యామల డైలాగ్ భానుప్రియ గారినుద్దేశించి ఆకాశంలో విమానం ఎగురటం చూసి.. "అమ్మా.. మీరెప్పుడైన యీనానం ఎక్కినారేటి.." "-లేదే అంత అదృష్టం కూడానా" "-నాను మా మాఁవా ఎక్కినం కదేటి.. కలలో.. ఆడెవుడో మా సీటూ అన్నాడు. దానికి మాము కాదు ఈ సీటూ మాదీ అన్నాం.. అలా.. ఆఁ...."); నాన్ వెజ్ జోలికి పోవట్లే.. అదీను పనీరంటే నెలకోమారు రుచి చూడాల్సిందే.

      Delete
    8. విన్నకోటవారు, శ్రీధర్,
      మాంసం నమలడం మంచిది కాదు అలవాటు పడ్డవారు నమలక ఉండలేరన్నది భీష్మాచార్యులవారి మాట ( ఎక్కడ ఎప్పుడు అడగద్దు :) )

      నేతిలో వేయించిన వాములో తగు ఉప్పేసుకుని మొదటి ముద్ద వేడి వేడి అన్నంలో నేయి కలుపుకుతిన్నారా?

      నేతిలో వేయించి కొట్టిన శొంఠిపొడి, పెద్ద నశ్యం పట్టంత, వేడి వేడి అన్నంలో ఒక్క ముద్దలో కలుపుకుని నేతితో తిన్నారా? ఆకలి


      లేదో అంటున్నారుగాని :)

      అసలు పచ్చి మిర్చి ఉక్కెర తిన్నారా?

      పైన చెప్పినవి అసలు తెలుసునా :)


      Delete
    9. శర్మ గారు.. పైపెచ్చు మా ఇంట్లో పెద్దవారందరికి ఈ నాన్ వెజ్ ఇష్టం..నా సతిమణి కూడా ఇందుకు మినహాయింపు లేదు.. కాని నాకు వెజంటేనే మహా మక్కువ.. పేర్లేవో వెరైటీకి కనపడుతున్నా కాని ఆయా కాంబినేషన్ లలో శొంఠిపొడి నేతి అన్నం ముద్ద, అలానే వాము అన్నం ఘుమఘుమలాడుతు ఆకలిని పెంచుతాయనటంలో అతిశ్యోక్తి లేదు. మిరప ను చీల్చి కాస్త ఉప్పు, మిరియం పొడి దట్టించి వేడి నూనేలో పొర కాలే వరకు వేయించి పప్పన్నం తో కలిపి తింటే ఆ రుచే వేరు. నా చిట్టితల్లికి నాకు లానే పెరుగన్నం ఇష్టం అందులో దానిమ్మ గింజలు కలిపి పెడితే అమాంతం ఆరగించుకుంటుంది. మాయావిడ పెరుగు ముట్టటం కేవలం మా పెళ్ళైన నాఠి నుండే.. అంతకు మునుపు ఆ హాస్టల్ వేపుళ్ళకు అలవాటు మరిగి ఏ రోజు పెరుగు రుచే చూడలేదుట.. తానెపుడు పెరుగు ఉందా అని అడిగే సరికే (మాయబజార్ లోలా.. శర్మ, శాస్త్రీ.. పులిహోర.. ఖాళి.. దప్పళం ఖాళి..) మిగిత వారికి వడ్డించగ ఖాళి పాత్రే చూపించేవారుట.
      ఏదేమైన ఒక మాట వాస్తవమండి.. కూరకాయల్లో ఉండే పోషక తత్వాలతో పోల్చుకుంటే మాంసాహారం లో బహుశ అన్ని ఎక్కువే.. కూరకాయలలో ఉండే పోషకాలన్నిటిని మన శరీరం సమంగా జీర్ణించుకుంటుంది.. అదే మాంసాహారమైతే మీరు అనట్టు గానే జీర్ణం కావాలంటే కనీసం గంట నుండి ముప్పావు గంట దాక పట్టవచ్చు.. ఆ వచ్ఛిన శక్తి మరల ఆకలి పుట్టే సమయానికి కూడా జీర్ణం కాని సందర్భమున ఏమి తినాలని పించదు.. మూలాన అజీర్తి త్రేన్పులు యాసిడిటి కడుపుమంట ఉబ్బరం ప్యాన్‌టాప్, రాజో డీ లు, గ్యాసోఫాస్ట్, ఈనోలు.. వీటి ద్వార కొద్దో గొప్పు కెమికల్ ఇంబాలెన్స్.. ఇలా చూసుకుంటే దాని వలన కలిగే లాభం కంటే కూడా నష్టము అంతే అనిపిస్తది, గురువర్య..!

      Delete
    10. శభాష్!
      నెల్లి కూర,పుంటి కూర, పొన్నగంటి కూర, తూటి కూర తెలుసా


      Delete
    11. తెలుసాచార్య వీటిలో కొన్ని తినట్టు గుర్తు.. పొనగంటికూర, తుంటికూర, బచ్చలికూర, తోటకూర, చుక్కకూర, పాలకూర, మునగాకుకూర, మెంతికూర, తెలుగులో ఏమంటారో తెలియదు కాని మా భాషలో మాకు తెలిసిన పై ఆకుకూరలతో పాటు నుణ్కి భాజి, (దీని ఆకులు ఆ మొక్క లానే చిన్నగా ఉంటుంది.. చుక్కశాకంలా కొద్దిగ పులుపు ఉంటుంది). రజాన భాజి (దీని ఆకులు అచ్చంగా తోటకూర లానే ఉంటుంది, కాని తిన్నపుడు జిగటగా ఉంటుంది, కాని మంచి రుచి) అలానే ఆంధ్ర శాకం శాకంబరి దేవి ప్రసాదంలా ఆరగించే గోగి కూరాకు. వీటన్నిటిలో దాదాపుగా తుంటి కూరనే కాబోలు నేను "పైప్ భాజి" అని పేరు పెట్టాను.. వాటి కొమ్మలను తుంచితే చిన్న గొట్టం లాగ ఉంటుంది. ఉల్లి పువ్వు కాండంలా ఈ ట్యూబ్ తో సైతం వాటర్ సిఫనింగ్ చేయవచ్చు. సిఫనింగ్ అంటే ఓ పెద్ద కుండ లేద ఏదైన పాత్రలో నీరు పోసి ఈ కాడను అందులో మునిగేలా పెట్టి చివరన గాలి పీల్చి నీరు వచ్చేలా చేస్తే దానంతట అదే ఆ పాత్రలో/కుండలో నీరంత నిండుకునే వరకు ఈ గొట్టం ద్వార బయటకు వస్తూనే ఉంటుంది క్యాపిలరి ఇఫెక్ట్ వల్ల..!

      Delete
    12. శర్మ గారు.. తమరు దాదాపుగా ఏడేళ్ళ క్రితం ఒకానొక చోట ఓ కథ ను బ్లాగ్ ప్రియులందరికి కడూ యింపుగా పెట్టితిరి.. మీ వజ్రోత్సవం మునుపు రెండెళ్ళపుడు.. అందులోనిదే ఆ వెంపాటారి దయ్యం కామెంటు.. ఐతే మీరు అర్ధం కాలేదంటే నేనే డిలీట్ కొట్టేశా పైన.. బిజిలే అమ్మణ్ గారు ఈ పద్యాన్ని చూచాయింపుగా వేసినారపుడు.. గూగుల్ సెర్చిలో దొరికిందా కథ.. మీ మోచేతికి బాలు దెబ్బ తగిలినపటి సంగత్..
      ఐతే నేను బిజిలే అమ్మణ్ గారిలా కాకుండ.. నాకు అందులో ఆ దయ్యం చేసే ఘింకారాలవి నచ్చాయని పునర్ నవీకృతంగా ఉల్లేఖించటం జరెగెందె ఆచార్య..

      కథకులు, కవిపుంగవులు, పద్యకవయిత్రులెల్లరికి సర్వేపెల్వి రాధాక్ఋష్ణ గారి జయంతి ఉత్సవ సందర్భముగా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాభినందనలు.

      ఉపాధ్యాయులంటే కేవలం బడిలో పాఠాలు చెప్పె వారే కాదు. మన జీవితం ప్రతి అడుగున మన శ్రేయస్సు కోరే తల్లిదండ్రులు, ఆప్తులు సైతం గురువులే.. గురుపూజోత్సవ కాంక్షల్

      Delete
    13. శ్రీధర్,
      అనుకోక సందర్భం లేక :) నా మాటల్లా ఉన్నవి కామెంట్ లో కనపడేటప్పటికి ఒక్క సారి అయోమయం అయింది.
      గుర్తు తగ్గుతోంది. ఏడేళ్ళ కితం టపా అందులో కతా,మరో బ్లాగు,వదిలేసిన దానిలోది మీరు చదివి ఉంటారని అనుకోలేకపోయాను :)ఏం అనుకోవద్దూ :)
      ఇటువంటి చిన్న కతలు ఆ బ్లాగులోని చాలా టపాల్లో ఉంటాయి.
      తాతా, బాబాయ్ ఇలా వరసలతో చాలా మంది సంబోధించేవారు, అదోకాలం, గడచిపోయిందంతే..

      ఆ టపాని ఈ రోజు మళ్ళీ వెతుక్కుని చదువుకుని నవ్వుకున్నా! నేను రాసిందేనా? అనిపించింది. :)

      ఉపాధ్యాయ దినోత్సవ శుభాభినందనలు


      Delete
    14. అ టపా రిఫరెన్స్ ప్లీజ్ ?

      Delete
    15. https://kastephale.wordpress.com/2013/08/22/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b9-2/

      Delete
    16. థాంక్స్, శర్మ గారు లింకిచ్చినందుకు. అక్కడకు వెళ్ళి మీ టపా చదివాను. మంచి దెయ్యం కథ బాగుంది. అక్కడే నా కామెంట్ కూడా పెట్టాను.

      Delete
    17. ఇంకో దయ్యం కథ మీకు తెలుసా రావు వారు..? మారుమూల రాజస్థాన్ లోగల ఒక కోట.. అది ఇప్పటికి హాంటింగ్ ఫోర్ట్ గానే ఖ్యాతి గాంచింది.. ఈ వెంపాటారి దయ్యం మాదిరి హెల్ఫ్ ఫుల్ ఐతే కాదు హెల్ ఫుల్.. వెస్ట్ అరుంధతి లాటిది.

      Delete
    18. Bangarh Fort (రాజస్థాన్) గురించా, శ్రీధర్? అవునట, అదొక దెయ్యాలకోటట. Trip to Bangarh అని ఒక సినిమా వచ్చింది. Netflix లో చూశాను.

      Delete
    19. ఔనాచార్య.. అదే..

      Delete
    20. ఔనాచార్య.. కరెక్ట్ గానే చెప్పేరు.. అదే. రాజస్థాన్ లో ఆల్వార్ జిల్లలో అతిపురాతనమైన భాన్‌గఢ్ కోట: రాజస్థాని గద్వాల్ సంస్థానం. అందులో యువరాణి రత్నావతి దేవి:రాజస్థాని అరుంధతి, సింఘియ:రాజస్థాని పశుపతి. ఇపటికి కూడా ఆ కోటలోకి సందర్శకులు సాయంత్రం ఏడు గంటలు దాటి ఉండకూడదని సాక్షాతు ఏ యసై వారు బోర్డ్ పెట్టటం గమనార్హం.. రాతిరి ఏడు గంటలు దాటినాక ఆ కోట నుండి ఏవేవో భీకరమైన అరుపులు కేకలు వినిపిస్తాయని అక్కడి లోకుల ఉవాచ.. సరిస్క అభయారణ్యమునానుకుని ఉంటుంది ఈ లొకేషన్..! చివరాఖరుకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియ వారు ఆ స్థలంలో సందర్శకులు సాయంత్రం ఏడు దాటినాక పరిసరాల్లో ఉండరాదని హోర్డింగ్ కూడ పెట్టి ఉన్నారట. ఐతే ఆ రాజస్థాని పశుపతి డైలాగ్ ఐతే అది కాదు.. "నీ అందానికి ఆకర్షితుడినై వశపరుచుకోవాలనుకున్న నాకు, నిర్వీర్యం జేసి బండరాయిగా మార్చి [ఏప్రిల్ మే జూన్] చేసిన (కాలం లో కలపేసిన) నిన్ను వడల బొంబాళై వడల" ట.. విచిత్రమేమంటే సర్.. మగధీర లో లా "కత కత కత వే.. దుము దుము వే దుము కత వడరోచ" అంటు మరుజన్మ లాటిదేది లేదుట.. అందుకనే ప్రతి రాత్రి నిత్యం ఏవో గుండెలవిసేలా గేవు కేకలు వినిపిస్తాయని అంటారు. పగటి పూట మాత్రం ఆ పురాతనమైన కోటను చూడవచ్చంటారు.

      ~ఓం~

      Delete
    21. పలు అంశాల గురించి శ్రీధర్ భూక్యాని మీటితే చాలు, బోలెడంత సమాచారం పలుకుతుంది 🙂. థాంక్యూ శ్రీధర్.

      ఇంత పరిజ్ఞానం కలిగిన వ్యక్తి IAS పరీక్షలు వ్రాయవచ్చు కదా?

      Delete

    22. విన్నకోటవారు,
      ఆ బ్లాగు నా చెయ్యి దాటిపోయింది.వదిలేశాను, నాలుగు నెలలయింది. ఇక మళ్ళీ దానిని స్వాధీనం చేసుకోగలననుకోను. కత నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
    23. వియన్నార్ సర్..
      జ్ఞానం, పరిజ్ఞానం, కుతూహలత, ఇవన్ని ఉన్నా.. ఒక్కోసారి కాలం కలసి రాకపోవచ్చు.. ఒక్కోసారి కలసి రావచ్చును కూడా.. గతాన్ని తవ్వుకుని ఆ అవశేషాలతో భవిష్యత్తును కట్టలేము కదా అని ప్రతితి అందుకే గతం గతః అన్నారు. ప్రయత్నం చేశాను.. కొన్ని యత్నాలు కాలంతో పాటు కనుమరుగయ్యాయి.. అలా అని నేను నిరాశ పడలేదు. ఎందుకంటే ఒక్కసారి నిరాశ ను ఆహ్వానిస్తే మరల ఆశకు కూడ చోటు లేకుండ ఆక్రమించేస్తుంది కనుక. ఇపుడు కూడ నా భార్య పిల్లలకు ఎటువంటి కొదవ లేకుండ ఉండెంత వెనకేసుకుంటున్నాను. చూడాలి ఈ కాలం మలుపులు రానురాను ఎలా ఉంటాయో..! పరిణితి, పరిపక్వత, ఓర్పు, సహనం, జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం తో పాటు కాలమూ కలసి రావాలిగా ఆచార్య.. ఆపై ఏడుకొండలవాని చల్లని కృప, మీలాటి పెద్ద మనషుల ఆశిర్వాదబలం, నా తల్లిదండ్రుల తోడ్పాటు. ఒకానొకప్పుడు నాకు గాయమైతే మీరు, శర్మ గారు, శ్యామల్ రావు గారు ఇచ్చిన ఆశిర్వచనాలు, మా అమ్మ నాన్నల దీవెనల వలన ఆనాడు త్వరిత గతిన కోలుకున్నాను. కళ్యాణమస్తు అంటు బిజిలే అమ్మణ్ గారు దాదాపుగ మూడేళ్ళ క్రితం ఆశిర్వాదమిచ్చారు, సౌమ్యురాలైన అమ్మాడి నా గృహలక్ష్మీ అయ్యింది. ఆ మేలిపి "ఆల్చిప్ప" వలన "ముత్యమంటి" పాపాయి.. మంచి కుటుంబాన్ని మించినదేది లేదంటారు లోకాన. ఒక విధంగా మంచి కోరే శ్రేయోభిలాషులు సమాజంలో ఉండటం మంచిదే.. సర్వే జనః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్భవేత్.. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవవిశిష్యతే, ఓం శాంతిః శాంతిః శాంతిః.

      Delete
    24. శ్రీధర్ కు విషయ పరిజ్ఞానంతో బాటు పరిణితి కూడా ఉన్నట్లు తోస్తోంది. అందువలనే చెయ్యవలసిన ప్రయత్నాలు చేసి, లభించినదానితో తృప్తి పడటం అలవరచుకున్నట్లు అనిపిస్తోంది. చాలా మంచి పోలసీ. కాలం కలిసి రావడమనే factor ఎప్పుడూ ఉంటుంది లెండి.. అయితే contentment ఇచ్చే మనశ్శాంతి మనల్ని కుదురుగా ఉంచి, చెయ్యవలసిన విధులను మనఃపూర్వకంగా నిర్వర్తించడానికి దోహద పడుతుంది. శ్రీధరుడు ఆ దిశలోనే పయనిస్తున్నట్లు అర్థం అవుతోంది.
      All the best to him and his family ✋.

      Delete
    25. Thank you Sir, I am always Obliged.

      Delete
  3. శీకాయనూరి మాత్రలు
    ప్రాకటముగ నాలుగైదు పరగడుపుననే
    స్వీకృతముసేయ జాండిస్
    పోకార్చును వారమందు మోదముగూర్చున్

    ReplyDelete
    Replies
    1. రాజావారు ఇప్పుడే౩ తెలుసుకున్నా, Jaundice కామెర్లకి వాడతారని.Intermittent fever పురాణ జ్వరాలకి ఇది ప్రసిద్ధి చెందిన మందు.


      Delete