Monday, 31 August 2020

పిలవని పేరంటం



అవి ఒక పట్నంలో ఉండి పల్లెల ఉద్యోగం చేస్తున్న రోజులు. ఏరోజూ ఖాళీ ఉండేది కాదు.  టవున్ లో పని చేస్తున్నతను  ఔట్డోర్ పరిచయం తక్కువున్నవాడు. టవున్ కి కేబుల్ ప్లాన్ వేయాల్సివచ్చి వేసి పంపితే రెండు సార్లు తిరిగొచ్చిందని, సాయం చేయమని కోరేడు, టవున్ జె.యి. ఉండడం టవున్ లోనే ఉన్నా గాని పూర్తిగా టవున్ చూడలేదు. టవున్ ఒక సారి కాలి నడకనే తిరగాలి అని బయలుదేరి మూడు రోజులు సందులు గొందులు తిరిగేసేం. మూడో రోజు నడుస్తుండగా ఒక ఇంటి ముందు నా సహచరుడు నన్ను ఆపి నేం బోర్డ్ చూపించాడు. నా ఇంటి పేరు కనపడింది, చుట్టాలా? ప్రశ్నించాడు. ఒకే ఇంటి పేరు అనేకమందిలో ఉంటుందనీ, ఒకే ఇంటి పేరున్నవాళ్ళంతా చుట్టాలు కారని చెప్పి ముందుకు అడుగేయబోయా. మిత్రుడు మాత్రం వీళ్ళు మీ వాళ్ళే, ఈయన ఊళ్ళో కొంచం పెద్దవాడు కూడా. కలిసొద్దాం అని లోపలికి అడిగేశాడు. నేను అడుగు కలపక తప్పలేదు.

ఆయన హాల్ లోనే ఉన్నాడు, పెద్దవాడని బీరువాలూ పుస్తకాలూ వగైరా చెప్పకనే చెబుతున్నాయి. మా మిత్రుడు తనను తను పరిచయం చేసుకుని, నన్నూ వీరు ఫలానా, పల్లెటూళ్ళు చూస్తారు, మీ ఇంటి పేరువారే అని పరిచయం చేశాడు, తను ఆయన ముందున్న కుర్చీ లాక్కుని కూచుంటూ. ఆయన కనీసం కూచోమని కూడా అనలా.  కుర్చి లో కూచున్న ఆయన కొద్దిగా ముందుకు కూడా వంగలేదు, అంటే కనీసం కుతూహలం కూడా చూపించలేదు. మాటా లేదు, చూస్తూ ఉండిపోయాడు, కనీసం మంచి నీళ్ళు తీసుకుంటారా అని కూడా అడగలేదు.. నాకైతే ఏం మాటాడాలో కూడా తోచలేదు, నోరు పెగుల్చుకుని, నాపేరు చెప్పుకుని ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నా, టెలిఫోన్ జ్.యి గా,  మా ఇంటి పేరు కూడా మీ ఇంటి పేరే! మిత్రుడు చెబితే పెద్దవారిని కలుద్దామని వచ్చాము, వేరే ఏమీ పని లేదని, చూచి పోదామని వచ్చామని చెప్పేను. ఆయన చూడడం అయిందిగా ఇక దయచెయ్యమన్నట్టు ముఖం పెడితే చాలా ఇబ్బంది పడ్డాను, నన్ను చూసి మిత్రుడు ఇబ్బంది పడిపోయాడు, కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. నేను లేచి నమస్కారం, వస్తాం అని చెప్పి వెను తిరిగి చూడక వచ్చి బయటికి వచ్చేశాను. మిత్రునితో కూడా మాటాడాలనిపించలేదు. నన్ను చూసి మిత్రుడూ పలకరించలేదు. ఇంటి కొచ్చేశాం. 


ఇంటికొచ్చిన తరవాత ఇల్లాలికి విషయం చెప్పాను.ఇల్లాలు ''పిలవని పేరంటానికి వెళ్ళ కూడదు, జరిగిందేదో జరిగింది, మరచిపొండి'' అంది. నేను సద్దుకో లేకపోయా! అవమానంగానే తోచింది. మర్నాడు మిత్రుడు వచ్చి కలిసి, " సారీ! మిత్రమా, నిన్న సాయంత్రం నేను చేసినది తప్పు,మన్నించు" అన్నాడు. ఇల్లాలు నాకు చెప్పినమాట మిత్రునికి చెప్పాల్సివచ్చింది.

చుట్టాలకి దూరంగా నీటికి దగ్గరగా ఉండాలని సామెత. 

46 comments:

  1. కాలం మహిమ ఆచార్య.. కలికాల మాయ అనవచ్చునేమో..
    మన అనుకున్న వారే మన కానివారిలా చూసే ఈ రోజుల్లో.. నాకూడ ఇలాంటిదొకటి జరిగింది. పక్క వీధిలో ఒకానొకరు మా ఇంటె పేరిటనే ఉండెవారుట.. ఆ విషయం మాలో ఎవరికి తెలియదు. ఒకానొక సారి మా ఇంటి గడప దగ్గర ఒక ఎన్విలప్ ఉండింది.. చూస్తే ఇంటి అడ్రస్ ఒకటే కాలని పేరు వేరు.. మేమేననుకుని ఆ సదరు పోస్టమ్యాన్ ఇక్కడ వేసి వెళ్ళాడు. ఆ కవరూ పై కాన్ఫిడెన్షియల్ పాలిసి లెటర్ అంటు రాసుంటే నేనుగా వారింటికి వెళ్ళి ఇచ్చి వచ్చాము. తీరా ఆమే.. ఓహో అలాగా.. సరే.. అని ఆ ఎన్విలప్ తీసుకుని తలుపేసుకుంది.. కనీసం కూర్చోండి, ఇది మీ దగ్గరకెలా వచ్చిందని ఆరా కూడా తియ్యలేదు. ఆ తరువాయి ఎపుడైనా మాది కాని ఏ కవరో ఎన్విలపో గడప దగ్గర కనిపిస్తే వాటిని తీసుకెళ్ళి తపాల వారింట జమ చేసి తప్పుడు అడ్రస్ అని ఇచ్చేసి రావటం అలవాటు చేసుకున్నా..

    ఇంకొక విషయం గురువర్య..
    ఒక్కోసారి మన అనుకున్న వారే కావాలని దూరం పెడితే.. దారిన పోయేవారెవరో "మనం ఇంత క్రితం కలిశాం, గుర్తుందా.. బాగున్నారా!" అంటు కూడా పలకరించే వారున్నారు..!

    ~శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్,
      అవి రిటయిర్ ఐ వచ్చిన తర్వాత ఐదారు సంవత్సరాల మాట.మా రోడ్ జంక్షన్ లో కలుస్తుంది. ఆ రోడ్ మూసేసి పోలీస్ అడ్డంగా కూచున్నారు. వెనక్కి తిరిగి వెళ్ళండని చెబితే బండి స్టాండ్ వేసి పోలీస్ లతో కబుర్లు చెప్పడం మొదలెట్టాను, మాటాడు కుంటున్నాం. ఇంతలో అందులో ఒకతను గురువుగారు మిమ్మల్ని ఎక్కడో చూశాను, కాదు ఎక్కడో కూచుని చాలా సేపు మాటాడు కున్నాం అన్నాడు. నేనెప్పుడూ పోలీస్ స్టేషన్ కి రాలేదే అన్నా. దాని కతను నవ్వుతూ అదికాదులెండి. మీ రెక్కడ పని చేశారు అడిగాడు. చెప్పాను. ఆ దొరికారు. మనం మద్రాస్ కలకత్తా ట్రంక్ రోడ్ మీద కాకినాడ గోకవరం రోడ్ సెంటర్లొ నడిరోడ్ మీద కుర్చీలేసుకుని ఒక రాత్రంతా కూచుని కబుర్లు చెప్పుకున్నాం. అన్నాడు. నాకూ గుర్తొచ్చింది. నిజమే రాజీవ్ గాంధీనిహత్య చేసిన రోజు రాత్రి ఆ రోడ్ సెంటర్లో కూచున్నమాట. ఆ తరవాత బాగున్నారా? బాగున్నారా? కబుర్లయ్యాయి. విడిపోయాం. మళ్ళీ కలవలేదు, అతని పేరు నాకు తెలీదు, నా పేరతనికి తెలీదు. ఒక తీపి అనుభవం.ఇప్పుడు మీరంటే గుర్తొచ్చింది... ఇటువంటివారూ ఉంటారు.

      Delete
    2. శర్మ గారు.. నిజమే.. కొన్ని సందర్భాల్లో మనిషిలోని మానవత్వం తరిగిపోలేదని అనిపిస్తుంటుంది.

      Delete
    3. శ్రీధరా!
      మానవులు,దానవులు అన్నదమ్ములే :)

      Delete
  2. అవును శర్మ గారు, అటువంటి అనుభవాలు నాకూ ఎదురైనాయి .... స్వదేశంలోనూ విదేశంలోనూ. సరే, విదేశం అంటే కొంత వరకు అనుకోవచ్చు ... అక్కడ నివసిస్తున్మ ప్రవాసులకు డాలర్ల లెక్క కాస్త ఎక్కువేమో మరి? మెయిలైతే జవాబు కూడా ఇవ్వరు లేదా మనం కష్టపడి ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేస్తే అంటీముట్టనట్లు మాట్లాడతారు. కానీ ఇక్కడ వారు కూడా కొంతమంది అనాసక్తిగా స్పందిస్తారు ఏమిటో? .

    బంధుప్రీతి అన్నది రెండు వైపులా ఉండాలి కదా. అందువల్ల నేను పాకులాడడం బాగా తగ్గించేశాను. (ఈ నియమాన్ని అప్పుడప్పుడు మర్చిపోతుంటాను కూడా లెండి, మొన్నీమధ్య జరిగినట్లు 😁😁).

    ReplyDelete
    Replies
    1. VNR sir,
      //అందువల్ల నేను పాకులాడడం బాగా తగ్గించేశాను. (ఈ నియమాన్ని అప్పుడప్పుడు మర్చిపోతుంటాను కూడా లెండి, మొన్నీమధ్య జరిగినట్లు 😁😁).//
      ఇది మీ పట్ల కొంచం ఎక్కువే :)
      కొద్దిగా వినికిడి ఉన్న రోజుల్లో కొంతమంది విదేశీ అభిమానులు ఫోన్ చేసేవారు. నాకో మూడు నిమిషాలు మాటాడటం అలవాటు. అరగంటైనా వదిలిపెట్టరే:)

      Delete
    2. అభిమానులు కదా, అలాగే ఉంటారు మరి. మీరేమో టెలిఫోన్ డిపార్టుమెంటులో పని చెయ్యడం వలన “మూడు నిమిషాలు” మాట్లాడడం అలవాటేమో, హ్హ హ్హ హ్హ ? (jk 🙂)

      Delete
    3. విన్నకోటవారు,
      నిజమేనండి. అలా అలవాటు.ఉన్న విషయమేదో సూటిగా మాటాడితే ఆ సమయం చాలు.

      ఎన్ని రకాల అభిమానుల్ని చూశానండీ. ఎన్ని రకాల అభిమానల్ని అనుభవించాను.రాస్తే ఒక పెద్ద టపా. ఎన్ని అనుభవాలు, ఒక అభిమాని నా భార్య చనిపోయిన వార్తకి చంకలు గుద్దుకోగా చూశాను. టపా రాయను.

      Delete
    4. అలా చంకలు గుద్దుకున్న వ్యక్తి “అభిమాని” ఎందుకవుతారు, వైరివర్గానికి చెందిన వారవుతారు గానీ.

      Delete
    5. విన్నకోటవారు,
      అభిమానులు మూడు రకాలు.
      వీరాభిమానులు,
      గుళ్ళూ గోపురాలూ కట్టించేస్తారు, సొమ్ముల వ్యవహారం.
      ప్రేమాభిమానులు.
      మీ ఫోన్ నంబర్ చెప్పండి, మెయిల్ అడ్రస్ ఇవ్వండి.
      మీతో మాటాడచ్చా!
      ఎప్పుడు వీలు కుదురుతుంది?
      మిమ్మల్ని చూడ్డానికి వస్తానూ.
      ఇలా కొనసాగిపోతాయి
      కొందరు వస్తారు, ఇక వారు.
      మిమ్మల్ని ముట్టుకోవచ్చాండి?
      మీ పక్కన సోఫాల్లో కూచోచ్చాండి?
      ఆవకాయి అన్నం కలిపి మొదటి ముద్ద నా చేతిలో పెట్టరూ!
      ఆశీర్వచన మంత్రం చెప్పి ఆశీర్వదించండి.
      మీరిద్దరూ మా ఇంటికి తప్పక రావాలి.
      ఈ సొమ్ము ఉంచండి.
      మీరూ మామ్మగారు బలే దెబ్బలాడుకుంటారండి, ఎలా తోస్తాయండి ఆ మాటలు?
      ఇలా ఎన్నని చెప్పను? వీరిదంతా అభిమానం పొంగిపోతూ ఉంటుంది. ఒక్కొకప్పుడు భరించడమూ కష్టమే! అల్ప సంతోషులు. అప్పుడప్పుడు చిరాకనిపించినా, ఎదుటివారి ఆనందం కోసం పళ్ళ బిగువున ఆనందించడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ జరిగినవే, ఎవరిని ఎగతాళీ కోసం చెప్పినవి కావు, ఇదంతా అభిమానం వ్యక్తం చేయడం లో వివిధ రూపాలంతే!
      ఇక చివరగా రాక్షస అభిమానులు,
      వీరు వైరభక్తి అని చెప్పు౭కుంటూ ఉంటారు. ఛస్తాను ఛస్తానంటావు ఎప్పుడు ఛస్తావు! నువు చచ్చిన రోజు పండగ చేసుకుంటా.
      వీడి పెళ్ళాం పోయింది. మా బలే అయింది, అని చంకలెగరేసినవారు, వారిని చూసి చప్పట్లు చరిచినవారు.
      మరి ఇదే కదా సమాజం. వీరి మధ్యనే బతకాలి,తప్పదు.


      Delete
    6. // "ఆవకాయి అన్నం కలిపి మొదటి ముద్ద నా చేతిలో పెట్టరూ!" //

      Super 😀😀. ఇటువంటి అభిమానులు కూడా ఉంటారా? మరీ సినిమా ఫక్కీలాగా ఉంది.

      పైన మీరు చెప్పిన మొదటి కోవ జనాలు అరవదేశంలో ఎక్కువ కదా, "జిలేబి"గారు చూసుకుంటారు 😀.

      కొందరి విషయంలో నేను రెండవ కోవ లోనికి వస్తుంటాను కదా 🤔?

      మొత్తానికి అద్భుతమైన వర్గీకరణ చేశారు 👌👏

      Delete
    7. విన్నకోటవారు,
      నిజం కల్పనకంటే చిత్రమనది కదండీ. శత్రువు కూడా చనిపోతే అయ్యో అంటాం కదా! మరి సాటివారు చనిపోవాలని కోరేవారినేమంటారండి.


      Delete


  3. ఇలా తాతగారి వద్దకు పిలవని పేరంటంగా వచ్చి జిలేబి ఎన్ని మార్లు వెళ్లలే అయినా వస్తూనే వున్నా తాతగారేమో ఉలుకూ పలుకూ లేకుండా వున్నారాయె



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబియే బామ్మ. బామ్మ తాతగారు ఎంత పెద్దవారో?

      Delete
    2. జిలేబికి తింగరి పనులు చెయ్యడం సరదా. తింగరి పని చేసిన ప్రతిసారి గుమ్మం బయట నిలబెట్టడం అలవాటూ :) అలా రెండు మూడు రోజులు బిక్కమొహంతో గుమ్మం దగ్గర నిలబడ్డ జిలేబిని చూసి అయ్యో! మన జిలేబి కదా అని జేరదీయడం అలవాటైపోయి. అది వ్యసనమైపోయింది.

      పై సంఘటనకి జిలేబి చెప్పే దానికి పోలిక లేదు :)

      Delete
    3. బోనగిరిగారు,
      తాతకి ముఫై సంవత్సరాల వయసులో జిలేబి కాకినాడలో పకవాటాలో ఉండేది, ఐదేళ్ళు వయసు. ఆతరవాత వాళ్ళ నాన్నతో మద్రాస్ వెళ్ళిపోయింది. తాతవయసు ఎనభై జిలేబి వయసెంత? కొంచం ఈ లెక్క చెప్పరూ?

      యంగ్ బామ్మ, మీకే కనపడచ్చు బెంగలూరులో, అదేది బొమ్మన హళ్ళి యా అక్కడ వింటేజి ఫియట్ కార్లో తిరుగుతుంటుంది.కారు వెనక అద్దం మీద జిలేబి అని తెనుగులో రాసుంటుంది, కనిపిస్తే చూడండీ

      Delete


    4. బొమ్మన హళ్లి జిలేబీ
      అమ్మమ్మో తిరుగుతోంది గా రోడ్లెంటా
      యెమ్మా స్పీడు ఫియట్లో
      తమ్ముడు పత్తా తెలిసి‌న తాతకు చెప్మా :)



      జిలేబి

      Delete
    5. Fabbrica Italiana Automobili Torino SpA
      (Italian Automobiles Factory, Turin)

      Premier Automotive Limited Padmini Car

      Delete
    6. శ్రీధరా!
      ఇది ఇటలీ సరుకా? ఇప్పటిదాకా తెలీదు సుమా

      Delete
    7. ఔను గురువర్య.. వివిధ దేశాలకు బహుశ మొదట స్కూటర్లను, కార్లను ఇటలీ వారే రూపొందించారుట. ఈ ఫియట్ అక్కడిదే.. అలానే వారి తొలి స్కూటర్ ఒకపుడు లాంబి అని పిలవబడే పొడువాటి బండి.. అసలు పేరు లాంబ్రెటా.. ఆ మధ్య ఎల్ ఎమ్ ఎల్ మరియు ఇటలీ పియాగియో వారి జాయింట్ వెంచర్ తో గేర్డ్ వెస్పా ఉండింది.. మరల కొద్ది ఏళ్ళ క్రితం గేర్ లెస్ వర్షన్ కూడా వారిదే.. అలానే "బియ్యం డబ్బులు" అని సరదాగా పిలిచే సరుకు, మరియు ఫోక్స్ వ్యాగన్, ఆడీ, మర్‌సిడీస్ బెంజ్, పార్శ్‌చ్ సైతం జర్మని వారిది.. "ష్కోడా" జెక్ రిపబ్లిక్ వారిది.. డుర్రు డుర్రు సౌండ్ చేసే కేటీయమ్ ఆస్ట్రియ వారిది.. అశోక్ లేల్యాండ్, బజాజ్, ఈషర్, హీరో, మహింద్ర, మారుతి, టాటా, తిరుక్కురుంగుడి వెంగరం సుందరం అయ్యరు వారి టీవిఎస్ భారతావని సరుకు.. ఫియట్, డుకాటి, ఫెరారి, లాంబోర్గిని, పియాగియో ఇటలీ.. అలాగే డాట్‌సన్, హోండ, ఇసుజు,కవాసాకి, నిస్సాన్, సుజుకి, టయోట, యమహ జపనీయులది.. బుగాతి, పిగాట్, రెనాల్ట్ ఫ్రాన్స్ సరుకులు.. హ్యూన్‌డాయి, కియా సౌత్ కొరియావి.. వోల్వో స్విడెన్.. జాగ్వర్, రోల్స్ రాయిస్ యూస్ వీ..

      Delete
    8. శ్రీధర్,
      ఇటలీ సరుకంటే బామ్మకి బాగా ఇష్టమనుకుంటానండీ :)


      Delete
    9. జిలేబి గారు సింగపూర్ టైం జోన్ లో ఉన్నట్టున్నారు.

      Delete
    10. బోనగిరిగారు,
      // సింగపూర్ టైం జోన్ లో ఉన్నట్టున్నారు.//

      ఆయమ్మ ఊసు మనకేల బావులూ. ఒగ్గీ నేరా? :)


      Delete
  4. మీముప్పైలో ఐదే
    ళ్ళా మనవడు? నిక్కరేయు లాగున్నాడే!
    ఏమందుమిపుడు ఫిఫ్టీ
    పైమాటేగాని, షిక్స్టివయసునబడలే .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      మాస్టారనిపించారు. FIFTY కావచ్చు లేదాSIXTY కావచ్చు లేదా NIFTY లా రోజూ పెరుగుతూ తరుగుతూ ఉండచ్చు :)

      Delete
    2. ఎవరి వయసు గురించి మాట్లాడుతున్నామో వారు గనక ఆడలేడీస్ అయితే ..... మీరు చెప్పిన ఆ మూడోది కరక్ట్ 😁😁

      Delete
    3. FIFTY కావచ్చు లేదాSIXTY కావచ్చు లేదా NIFTY లా రోజూ పెరుగుతూ తరుగుతూ ఉండచ్చు :) - ఈ వ్యాఖ్య అద్భుతం శర్మ గారు. Wonderful comment sir😁🙏

      Delete
    4. ఉమర్ పచపన్, దిల్ బచపన్...

      Delete
    5. రాజా వారు..
      షుమారుగా రమారమి ((ఇప్తి+ఇక్స్‌టీ)÷౨)=పదైదుల ఐదొకట్లు.. లేకుంటే శర్మ గారు శెలవిచినట్లు వయసు సైతం ఓ రకంగా సెన్సిటివ్ ఇండెక్స్ ఆఫ్ ఫిజిఖల్ యాండ్ సైకాలాజికల్ గ్రోథ్ కనుక.. దేహానికే వయసు..బోనగీరి గారు పలికినట్లు మనసు అభీ మాసూమ్.. ఇహ ఇపుడు ఈ కామింట్లు జూసి బిజిలే అమ్మణ్ గారు ఏ పోకిరి మూవిలో సాంగ్ ను సైతం గద్య పద్యాలంకరణ గావించి వ్యాఖ్యానిస్తారేమో.. సింహాద్రి అపన్న..!

      ~°!°~
      ~శ్రీత ధరణి (శ్రీధరనిత)

      Delete


    6. ప్రముఖుల జీవితాలలో కొన్ని విషయాలను కొందరు భలే dramatise చేస్తారు.

      కష్టేఫలి గారు సంఘటనలను మంచి నాటకీయత తో వర్ణిస్తారు :)



      జిలేబి

      Delete
    7. ముఖములెన్నియో ప్రముఖులకు ,ఒక్కోము
      ఖానికొక్కొకవయసా నిఖార్స?,
      అసలుముఖముదెలుప నార్యులుసెలవిచ్చు
      టైమురాద తమబడాయి పోద?.

      Delete
    8. విన్నకోటవారు,
      అంతే! అంతే!!

      Delete
    9. బుచికి గారు,
      కెవ్వు! కేక!!

      Delete
    10. బోనగిరిగారు,
      సాబ్ బోలా ఠీక్

      Delete
    11. శ్రీధరా!
      బామ్మ రిపార్టీ పూర్వపు వాసనే! డొక్క ఎండిపోయింది బాబూ

      Delete
    12. బామ్మా! నేను గొల్లపూడి కాదు :)

      Delete
    13. రాజావారు ఆశా జీవి :)

      Delete
    14. // “బామ్మా! నేను గొల్లపూడి కాదు” //

      తెలుగు బ్లాగులోకంలో మీరూ అంతకు తక్కువేమీ కాదు గానీండి ... ఇక్కడ “జిలేబి” గారి వ్యాఖ్యలోని కవిహృదయం వేరే అనుకుంటాను. తను కూడా ప్రముఖ వ్యక్తి అని చెప్పకనే చబుతున్నట్లు అనిపిస్తోంది సుమండీ నాకైతే.

      Delete
    15. విన్నకోట సార్,

      నేను గొల్లపూడి కాలేనుగానండి బామ్మ ఎప్పుడూ ప్రముఖ వ్యక్తి అవాలనే ఆశండి.కాని ఆ ప్రముఖ వ్యక్తి ఫియట్ కారు అమ్ముకున్న పోలిక రాకుండాలని కోరికండి.


      Delete
  5. https://youtu.be/DkZ5fRjrJxM
    ధర్మస్ధలి ఆలయం బుల్లి ఏనుగు అల్లరి చూడండి.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి సార్,
      బలే అల్లరి చేసిందండి


      Delete
  6. శర్మ sir. మీరు dot లో పని చేశారా. అయితే మనకు దూర సంచార బంధం ఉన్నట్లే. నేను ఇటీవలే ' స్వచ్ఛంద ' విరమణ తీసుకున్నాను. 🙏

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  7. జిలేబి కావాలి కథ చెప్పవా బామ్మా
    అని అడిగితే మిమ్మల్ని అడగమంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. బోనగిరిగారు,
      //తాత కనుదెరిస్తే మన
      పాతకథలు దెలియగలవు //

      ఈ సలహా చెప్పినవారినే అడగమనండి, ఆ కతలేవో


      Delete