ఒక చిన్నారి, అభిమాని, పాతికేళ్ళ వయసుకే జీవిత సమస్యల సుడిలో చిక్కుకుంది.ఒడ్డు చేరుతున్నాననగా ఐదు నెలలకితం అనారోగ్యం, ప్రకృతి చికిత్సతో నిలదొక్కుకుని జీవితంలోకి మళ్ళీ దూకుతూ నాకో మెయిలిచ్చింది, నన్ను గుర్తుచేసుకుంటూ. ఈ కింది ఫోటో గురించిన కథ చెప్పమని. నాకైతే కథ తెలియదుగాని వివరం చెబుతానని ఇలా చెప్పా..
ఇక చిత్రం గురించి. ఈ చిత్రంలో చిత్రకారుడు ఇది చెప్పదలుచుకున్నాడు.
కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, మనసు. మనసు ఇంద్రియాలను శాసిస్తుంది కాని ఇంద్రియ సుఖాలకు లోబడిపోతుంది. మనసుకి మరొక ఆరుగురు మిత్రులలాటివారున్నారు. తెలిసినవారు వారిని అంతశ్శత్రువులు అంటారు. ఈ ఆరుగురు మనసును స్వాధీన పరచుకుంటూ ఉంటారు. వారే కామ,క్రోధ,మోహ,లోభ,మద, మాత్సర్యాలు. ఈ ఆరిటిని చిత్రంలో చూపించాడు.
కామం:- నీరు, అంతులేని సముద్రంలాటిది, కోరికల అలలు పుడుతూనే ఉంటాయి.
క్రోధం:- ఇది మనిషిని ఆవహించినపుడు మృగంలా మారతాడు. ఉచ్చనీచాలు,మంచిచెడ్డలు,పెద్ద చిన్న, పాపం పుణ్యం, ఇలా ఏవీ కనపడవు. దానిని సింహంలా చూపాడు.
మోహం:-కనపడదుగాని మొసలిలా పట్టుకుంటుంది, మనసును. ఒక వస్తువు మీదనో,మనిషి, లేదా ప్రాంతం ఇలా ఒకదానిమీద మనసు నిలిచిపోయి ఉంటుంది, మోహం కమ్ముతుంది. దీనిని మొసలి రూపంలో చూపాడు.
లోభం:- సగంపైగా కొట్టి వేయబడ్డ చెట్టును చూపాడు. అది ఏక్షణంలో నైనా నీటిలో పడచ్చు, మరణం సంభవించవచ్చు. కాని దాని చిగురున ఉన్న పండుకోసం ఎక్కడమే లోభం. ఇది జీవితంలో కూడా చూస్తుంటాం. ప్రమాదమని తెలిసి కూడా తొందరపాటు పనులు చేస్తుంటాం.
మదం:- మదం నాకేంటి అనే ధోరణి. తెలివైనవారం,అందమైనవారం, బలమైనవారం, అధికారమున్నవారం అన్న మదం బుసలు కొడుతూ ఉంటుంది.అది ఎంతదాకా అన్నది మరచిపోతుంటారు. దీనిని పాములా చూపాడు.
మాత్సర్యం:- విరిగిపోతున్న కొమ్మలాటిది. దీని మూలంగా తను నాశనమవుతున్నా వదలిపెట్టలేనిది. ఎదుటివారి గొప్పతనాన్ని మంచిని గుర్తించలేనిది. ఏం తెలివిలే,అబ్బో పెద్ద అందం, ఆ డిగ్రీలన్నీ బూటకంట. ఇలా రకరకాల చిత్ర చిత్ర భావనలతో తనను తాను దిగజార్చుకుంటూ పోయేది ఈ మత్సరం అనే అసూయ.
ఈ ఆరుగురు శత్రువులను గెలవగలమా? అసాధ్యం.అంతశ్శత్రువులను గెలిచానన్నవారిని నమ్మను. అందరూ అంతో, ఇంతో, కొంతో వీటి బారిన పడేవారే. వాటిబారిన పడి ములిగిపోక బయటపడేవారే విజ్ఞులు.
vidhee entho vichitram
ReplyDeleteTelisi teliyani vinta naatakam
Kshanakaalam ubalaatam maru nimisham nirvedam
Allukipoye Bandhaalu konni, Chentaku cheranivi konni
Raagadweshaala Bhaavodwegaala Jeevitam
Choosi choodani Ghatanalaa Samaahaaram
Enaleni mamakaaraala tenepattu
Konni bandhaalu manishiki manishiki naduma
Marikonni bandhaalu manasuku manasuku madhya
Kondari Jeevitaalu terachina pustakaalu
Mari kondarivi mandutunna aashala agaathaalu
Kondaru Jeevitaanni vekkiristaaru
Marikondaru Ade Jeevitaanni auposana padataru
Kaalagamanam lo andari payanam ate aina
Ela ilaa daaparikaalu.. mamataanuraagaala maatu rege vinta prashnalu
Konni bandhaalu kshanakaalame aina jeevitakaalam gurthundipotaay
Prakrutilo Silaksharaalugaa Migilipotaayi
Marikonni isuka tinneluga maari sandram alala nuragalai uvvettuna egasi marali vellipotaayi
Jeevitamane pustakame manadi, andulo kopaalu taapaalu bandhaalu baandhavyaalu premalu aapyaayatanuraagaabhimaanaalu kastasukhaalu kalabosina O kammani kaavyamaalika
Deleteఏంటో అర్ధం కాలేదండీ :)
శర్మ గారు.. అభివాదాలు.. మీరు అరిషడ్వర్గాలను గూర్చి ప్రస్తావించారు.. నేను జీవిత పుస్తకం లో బంధాలు బాంధవ్యాల గూర్చి కవితగా వ్రాశాను, ఇంగ్లుగులో.. అంతే తేడ..!
Deleteశ్రీధర్,
Delete“ఇంగ్లుగు” కన్నా సాధారణంగా తెంగ్లిష్ Tenglish అంటారు.
తెలుగులో ఉంటే ఏం చెప్పేరో తెలుసుకోగలిగే వాడినేమో సుమా
Deleteతప్ప కుండ ఆచార్య..!
Deleteరావు వారికి.. ఇందులో మెలిక ఉంది.. తెలుగును ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ లో వ్రాస్తే అది ఇంగ్లుగు.. అదే ఇంగ్లిషు పదాలనే తెలుగు లిపిలో వ్రాస్తే తెంగ్లీషు..
ఔనూ ఆచార్య.. మీరు తర్జుమ చేసిందే.. కాని నా ఇంగ్లూగు వలన తచ్చు అప్పులున్నాయి అందులో.. సవరించి ఇక్కడ వ్రాస్తున్నాను..
విధి ఎంతో విచిత్రం
తెలిసి తెలియని వింత నాటకం
క్షణ కాలం ఉబలాటం మరు నిమిషం నిర్వేదం
అల్లుకుపోయే బంధాలు కొన్ని చెంతకు చేరిన చేరువ కానివి కొన్ని
రాగద్వేశాల భావోద్వేగాల జీవితం
చూసి చూడని ఘటనల సమాహారం
ఎనలేని మమకారాల తేనెపట్టు
కొన్ని బంధాలు మనిషికి మనిషికి నడుమ
మరికొన్ని బంధాలు మనసుకి మనసుకి నడుమ
కొందరి జివితాలు తెరిచిన పుస్తకాలు
మరి కొందరివి మండుతున్న ఆశల అగాధాలు
కొందరు జీవితాన్ని వెక్కిరిస్తారు మరికొందరు అదే జీవితాన్ని ఔపోసన పడ్తారు
కాలగమనంలో అందరి పయనం (అటే) అయినా
ఏలా ఇలా దాపరికాలు.. మమతానురాగాల మాటు రేగే వింత ప్రశ్నలు
కొన్ని బంధాల నిడివి క్షణకాలమైనా వాటి విలువ జీవితకాలం గుర్తుండిపోతాయి ప్రకృతిలో శిలాక్షరాలై మిగిలిపోతాయి
జీవితమనే పుస్తకమే మనది, అందులో కోపతాపాలు బంధాలు బాంధవ్యాలు ప్రేమలు ఆప్యాయతనురాగాభిమానాలు కష్టసుఖాలు కలబోసిన ఓ కమ్మని కావ్యమాలిక
Deleteకామింట్లను తెలుగులో రాస్తేనే చదివే వాళ్లు తక్కువ. ఇట్లా ఇంగ్లుగులో రాసీ గీసీ దానికి మరో తర్జుమా వ్రైటర్ కి పని కల్పించి ఇంత హైరానా పెట్టనేలా తాతగార్ని :)
జిలేబి
శ్రీధర్,
Deleteనాకా చిత్రంలో అరిషడ్వర్గాలు చూపినట్టనిపించింది. మీరింకేం చెప్పి ఉంటారబ్బా అనే కుతూహలం.
జీవితం గురించి బాగా చెప్పారు.
కొన్ని జీవితాలు అజాగళస్తనాలు మరికొన్ని ఎండమావులు
కొన్ని పచ్చటి పంట పొలాలు మరికొన్ని ఎడారులు.
కొందరి జీవితాలు రసప్లావితాలు మరికొన్ని కటు తిక్తాలు
కొందరు జీవితం లో నటిస్తారు మరికొందరు జీవిస్తారు
ఇదే వింత నాటకం.విధి ఆడించే వింత నాటకం
Deleteజీవితం గురించి కవితాత్మకంగా చాలా బాగా, మనోహరంగా చెప్పారు.
థాంక్యూ, తాతగారు.
జిలేబి
మీరు శెలవిచ్చిన మాట వాస్తవం గురువర్య..
Deleteతెలిసి తెలియని వింత నాటకమ్
ReplyDeleteక్షణకాలమ్ ఉబలాటమ్ మరు నిమిషమ్ నిర్వేదమ్
అల్లుకిపొయె బంధాలు కొన్ని, చెంతకు చేరనివి కొన్ని
రాగద్వేషాల భావొద్వేగాల జీవితమ్
ఛూసి చూదని ఘటనల సమాహారమ్
ఎనలేని మమకారాల తేనెపట్టు
కొన్ని బంధాలు మనిషికి మనిషికి నడుమ
మరికొన్ని బంధాలు మనసుకు మనసుకు మధ్య
కొన్దరి జీవితాలు తెరచిన పుస్తకాలు
మరి కొందరివి మందుతున్న ఆశల అగాథాలు
కొన్దరు జీవితాన్ని వెక్కిరిస్తారు
మరికొందరు అదే జీవితాన్ని ఔపొసన పడతారు
కాలగమనమ్ లొ అందరి పయనమ్ అటె ఐన
ఏల ఇలా దాపరికాలు.. మమతానురాగాల మాటు రేగె వింత ప్రశ్నలు
కొన్ని బంధాలు క్షణకాలమె ఐన జీవితకాలమ్ గుర్తుండిపొతాయ్
ఫ్రకృతిలొ శిలక్షరాలుగా మిగిలిపొతాయి
మరికొన్ని ఇసుక తిన్నెలుగ మారి సంద్రమ్ అలల నురగలై ఉవ్వెత్తున ఎగసి మరలి వెళ్ళిపొతాయి
జీవితమనె పుస్తకమె మనది, అందులొ కొపాలు తాపాలు బంధాలు బాంధవ్యాలు ప్రేమలు ఆప్యాయతానురాగాభిమానాలు కష్టసుఖాలు కలబొసిన ఓ కమ్మని కావ్యమాలిక
ఇలా తెలుగించుకున్నా ఇంతేనా?
Deleteతెలిగించుకుని చదువ నే
ర్చె లబ్జు గా విదురుడిచట శ్రీధరనిత వ్యా
ఖ్యల తోరణమును పదవే
జిలేబి నీవున్ను నేర్వు శీఘ్రముగ సుమీ :)
జిలేబి