Friday, 23 November 2018

కుక్కకు మాంసం దొరికినది

కుక్కకు మాంసం దొరికినది
అది వంతెన మీదకుపోయినది
నీటిలో నీడను చూచినది
వేరొక  కుక్కని తలచినది
భౌ! భౌ!! భౌ!!! యని అరచినది
మాసం ముక్క పోయినది.

6 comments:

  1. పంచతంత్రం కథల్లో బావినీటిలో తన ప్రతిబింబాన్ని చూసి తనకు పోటీగా మరొక మృగరాజు వచ్చిందని భ్రమ పడుతుంది కదా సింహం. అట్లా ఉంది గానీ ... ఇంతకీ ఈ సంగతి దాని చుట్టూ కథేమీ లేకుండా ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేశారేమిటి శర్మ గారూ? ఏమన్నా అంతరార్థం ఉందా?

    ReplyDelete
  2. విన్నకోట నరసింహా రావుగారు,

    బిజీ,బిజీ ఖాళీయే లేదు. పని చేసుకుంటుండగా చిన్నప్పటి ఈ పాట గుర్తొచ్చింది, సగం. మెల్లగా దానిని పూర్తిగా గుర్తు చేసుకుని బ్లాగులో పెట్టేనండి. అంతే
    ధన్యవాదాలు.


    ReplyDelete


  3. కుక్కకు దొరుకగ ముక్కయు
    టక్కున వంతెను పయి చని ఠారెత్తెను తా
    నక్కడ నీటిని కుక్కను
    ముక్కనుగని మొరుగ నోటి ముక్కయు పాయెన్‌ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,

      ఆత్రగొట్టుది. దొరికినది చక్కహా తినచ్చుగా! కుక్కబుద్ధి.


      Delete
    2. జిలేబీ గారు‌,
      పిల్లి అంటే బిడాలం ఆని చెప్పినట్లుంది మీ గిద్యం.

      Delete


  4. పిల్లియన బిడాలమనెడు
    లొల్లి వలెకలదు జిలేబి లుకలుక పద్యం
    బల్లిన విధము సుమా! కవు
    లెల్లరె లాతాళిరో బలియగుచు నరరే !


    జిలేబి

    ReplyDelete