Observe all notes and come down
It was printed as "I PROMISE TO PAY THE BEARER ON DEMAND THE SUM OF RUPEES.." on old bank notes. The words "ON DEMAND" discontinued since a long time.
Search your pocket and you will see that the words ''ON DEMAND'' are missing on your notes, from what time it is missing and why?
Rs.200 bank note to be issued today.
ReplyDeleteఎప్పటినించి on demand పోయే పొయ్యిందే అన్నదేనా మీ సందేహం ?
చాలా సింపల్ అండి - రూపాయ వేల్యూ పడిపోయినప్పటినించి జనాలు డిమాండు చెయ్యడం మానుకునేసారు :) డిమాండు లేని దానికి వృధాగా ప్రింటింగ్ ఖర్చెందుకని ప్రభుత కూడా మానేసారు :)
చీర్స్
జిలేబి
జిలేబి గారు,
Deleteతమరు అపర మహామేధావులన్న సంగతి ఎఱుక కలిగినదే!
రిజర్వ్ బేంక్ గవర్నర్ గా బి.రామారావు,హె.వి.ఆర్ అయ్యంగారు పని చేసినప్పుడు విడుదల చేసిన నోట్లు ఎరిగుండరు, బహుశః అప్పటికి పుట్టే ఉండరు :)
ప్రపంచంలో గోల్డ్ స్టాండర్డ్ అనేదుండేదని తమకి తెలిసుండాలే
నెనర్లు
Deleteపరమ మహా మేధావీ !
సరి కాదోయీ జవాబు చక్కని చుక్కా !
కడవన్నెల నాణ్యంబుల
నెరుగుదువా ?పుట్టినావ యెన్క? జిలేబీ !
జిలేబుల కే సవాలా :)
జిలేబి గారు,
Deleteతమరిమాట ఎప్పుడర్ధమయింది గనక :) ఇలాగే కొనసాగిపొండి, మారద్దు సుమ్మా! :)
నెనర్లు.
అడిగితేనే కదా ఇచ్చేది (అమ్మ అయినా కూడా 🙂). అటువంటప్పుడు on demand అని ప్రత్యేకించి స్పష్టం చెయ్యనవసరం లేదని ఏలినవారి అభిప్రాయం అయ్యుంటుందేమో శర్మ గారు.
ReplyDeleteమరోటి గమనించారా? బాగా పాత నోట్లల్లో కొన్నిటి మీద "I promise to pay ......... at the office of issue" అని కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. తరవాత తరవాత "....at the office of issue" అనే పదాలు అచ్చు వెయ్యడం మానేసినట్లున్నారు.
ఏమైనా కొన్ని పాత నోట్లు చూపించినందుకు ఆనందంగా ఉంది శర్మ గారు. ధన్యవాదాలు.
రెండువందల రూపాయల నోటు ప్రవేశపెట్టడం స్వాగతించవలసిన నిర్ణయం. రెండువేల రూపాయల నోటుతో బాటే తెచ్చుంటే ప్రజలకు చిల్లర కష్టాలు కొంతైనా తప్పుండేవి.
మీకు, మీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
విన్నకోట నరసింహారావు గారు,
Deleteరిజర్వ్ బేంక్ నోట్లన్నీ ప్రామిసరీ నోట్లే, కాల పరిమితి లేనివి. ప్రామిసరీ నోట్ కాలం మూడేళ్ళే మరి.
మీరన్నట్టు చాలా రకాలుగా వుండేవి. చివరికి ఇలా అయ్యాయి.
ప్రపంచంలో అందరూ గోల్డ్ స్టాండర్డ్ అనుసరించేవారు, మనతో సహా! 1935 లో రిజర్వ్ బేంక్ పుట్టేనాటికే గోల్డ్ స్టాండర్డ్ లేదు, మనమే చాలా కాలం కొనసాగించాం.
ఆన్ డిమాండ్ అర్ధం ఆ విలువకు తగిన బంగారం, నోట్ దాఖలు చేస్తే ఇస్తాననేదే ఆ మాట అర్ధం. గోల్డ్ స్టాండర్డ్ తీసేసిన తరవాత ఈ మాటా తీసేసేరండి, ఇదంతా మీకు తెలియదనికాదనుకోండి,చెప్పడం :)
రెండవ నోట్ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలకత్త నుంచి 1905 లో విడుదల చేసినది,ఇదీ ప్రామిసరీ నోటే, సంతకం పెట్టినవాడి డిజిగ్నేషనే లేదు, అదీ ఆ కాలంలో చెల్లిన మాట.
నెనర్లు