Thursday, 22 September 2016

మనుషులకి జంతువులకీ ఎంత తేడా?

Courtesy:Suneev Tandon

8 comments:

  1. Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      క్రమ శిక్షణ ఉన్నవి జంతువులు, మనం జంతువులం కాము కదండీ :)
      ధన్యవాదాలు.

      Delete
  2. శర్మ గారూ నమస్కారములు .

    ఆ జంతు జాలాలను అదుపులో పెట్టేవాళ్ళు ఈ మానవులు . అందుకే అవి క్రమశిక్షణను అలవరచుకొని , ఆచరిస్తున్నాయి .
    మఱి ఈ మానవులను అదుపులో పెట్టే ఆ భగవంతుడు / భగవతి కళ్ళకెదురుగా లేకపోవటం వలన పేట్రేగి పోతున్నారు .

    మానవుల నుంచి నేర్చుకొని చక్కటి జీవనం సాగిస్తూ , ఎంతో మందికి ఉపయోగపడ్తున్నాయి . మానవులు జంతు జాలాలకు తమకు వచ్చిన , తెలిసిన విద్యలన్నీ నేర్పుతూ , వాళ్ళు ఆచరణను వదిలేశారు . ఆ జంతు జాలాలు మానవతను చూపుతున్నాయి మానవుల మీద , ఈ మానవులేమో ఆ జంతు జాలాల డానవత్వాన్ని పుణికి పుచ్చుకొని దానినే అకుంఠిత దీక్షతో గోప్ప ఘనంగా ప్రదర్శిస్తున్నారు .
    ఎదుటివారికి నేర్పినంత మాత్రాన మనం మరచిపోకూడదు అన్నది ఆ మానవులు తెలుసుకొనటం ఎంతైనా శ్రేయస్కరం .

    ReplyDelete
    Replies
    1. శర్మాజీ,
      ఎదుటివారికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి!
      తను చెప్పేది మానవుడు ఆచరించడు, అదే మనిషంటే
      ధన్యవాదాలు.

      Delete
    2. శర్మ గారు
      మీ వ్యాఖ్యానాన్నిసమర్దిస్తున్నాను

      Delete
    3. ASRK Reddyగారు,
      ధన్యవాదాలు

      Delete
  3. 'కష్టేఫలి' శర్మ గారు, అనారోగ్య ఇబ్బందులని శ్యామలీయం గారి బ్లాగులో వ్రాశారు మీరు, ఇప్పుడు మెరుగయిందని తలుస్తాను.
    ఎడతెరిపి లేని వానల ప్రభావం మీ ఊరి మీద కూడా బాగానే పడిందని టీవీలో అన్నారు. అప్రమత్తతో ఉండండి.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      గత 72 గంటలుగా ఎడతెరిపి లేని వాన, ఇంకా పడుతూనే ఉంది, ఇంకా పడ్తుందిట కూడా. మాకు పడే వర్షం తక్కువ తూ.గో.జి ఐనా! మాది మెట్ట ప్రాంతం. మాకే వర్షం దారుణంగా ఉంది.
      ఇలా ఎడతెరిపి లేని వర్షాలు పడుతుంటే, (ఆ రోజులలో ఒక వారం, పది రోజులు వర్షం అలా పడుతూనే ఉండేది,) అప్పుడు పల్లెలలో స్త్రీలు వంట చేస్తున్న పొయ్యిలోంచి ఒక కొరకంచు, మండు తున్నదానిని తెచ్చి ఆకాశానికి చూపేవారు, అదేం అలవాటో తెలియదు.
      వయసు మీదబడింది, ఎనిమిదో పదికి నాలుగేళ్ళ దూరం, వర్షం, దానితో అనారోగ్యం. ఇరవినాలుగు గంటలుగా బాత్ రూంలోనే నివాసమైపోయింది, ఇప్పుడు బాగుంది. మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

      Delete