Monday, 27 October 2025

తుఫాను ముందు నిశ్చలత.

 తుఫాను ముందు నిశ్చలత.


తుఫాను ముందు వాతవరణం చాలా నిశ్చలంగా ఉంటుంది. స్థంభించిన చిన్నెలు కనపడతాయి,చూసే కన్నూ,మనసూ ఉండాలి. ప్రకృతి చిన్నబోతుంది. ఈ రోజు ఉదయానికే ప్రకృతి స్థంబించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై రాత్రిని తలపిస్తోంది. చిన్నచినుకు ప్రారంభమైనది,ఇదే తుఫానుకు సంకేతం. 

తుఫానుకోసం తీసుకోవలసిన జాగరతలు అనంతం, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం,అందుచేత వ్యక్తి భద్రత ముఖ్యం, ఆ తరవాతది ఆస్థి భద్రత. చాలా జాగరతలు చాలా సార్లు చెప్పేను, మళ్ళీమళ్ళీ చెప్పే ఓపికలేదు.

1.పాలు,నీళ్ళు జాగరత చేసుకోండి. కరంటు ఉండకపోయే సావకాశాలే హెచ్చు.

2.పిల్లలు,మందులు జాగరత. 

3.ఇంటిపైన,బయట చుట్టూ పారేసిన పనికిరాని వస్తువులు ఎగిరిపోకుండా చూడండి.అవి ఎగిరిపోతే నష్టం కాదుగాని ఇతరులకు హాని కలిగించచ్చు. 

4.సెల్ ఫొన్ ల్లో రిఛార్జి ఉందో లేదో చూసుకోండి. అనవసరంగా సెల్ ఉపయోగించద్దు. 

5.మీభద్రత కావలసినవారితో పంచుకోండి. 

6. అనవసరంగా బయట తిరగద్దు.  

7. కొంత సొమ్ము దగ్గరుంచుకోండి,అవసరం కావచ్చు.

8.ముసలి,ముతకల్ని గమనించండి.


జాగరతలు  అనంతం, ప్రమాదం  చెప్పిరాదు సుమా!

3 comments:

  1. జాగ్రత్తలు ఎన్ని సార్లు చెప్పినా తక్కువే సర్.
    కాళ్ళ క్రిందకు నీళ్ళు వచ్చేవరకూ కూడా జనాలు పెద్ద ఖాతరు చెయ్యరు కదా, కాబట్టి పదేపదే హెచ్చరించడం తప్పు లేదు.,

    ReplyDelete
  2. విన్నకోట నరసింహా రావు27 October 2025 at 19:14
    నిజమే సార్!
    తెలిసిన ప్రతివార్తా నిజమని నమ్మద్దు,ప్రచారం చేయద్దు. దీనికి నిన్ననొక అనుభవం,కాకినాడలో వాతావరణం భయంకరంగా ఉందని ఒకవీడియొ వైరల్ అయింది. పోలీస్ వెంటనే స్పందించి నిజం తెలియజేసేరు. ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన ప్రకారం తుఫాను మచిలీపట్నం-కాకినాడల మధ్య తీరం చేరుతుందని అంచనా. ఈ వార్త పై నా అంచనా. ఇది 1996 తుఫాను ను పోలి వున్నట్టుంది. అనగా అంతర్వేది-మొగల్తూరు ల మధ్య తీరందాటచ్చనుకుంటున్నా. దీని ప్రభావంతో పగోజి కోనసీమ లకు నష్టం కలగచ్చు.వరిచేలు పడిపోయి ఉన్నాయి,నీటిలో. తాడిస్న ధాన్యం మొలకెత్తకుండా ఉప్పునీరు జల్లమని శాస్త్రఙుల సలహా! చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం...
    మా కైతే నిన్నరాత్రంతా చిన్న చినుకు. ఉదయం నుంచి సూర్యుడు మబ్బుల్లో దోబూచులాడుతున్నాడు. వెర్రిగాలి లేదు. తరవాత వాతావరణం ఎలా మారుతుందో!

    ReplyDelete
  3. నిన్నటి నుంచి చినుకులు రాలుతూనే ఉన్నాయి,అడపాదడపా ఆగినా! గాలి పెద్దగాలేదుగాని కొన్ని చెట్లు పడిపోయి అంతరాయం కలిగించాయి. కరంటు నిన్న ఉదయం 11 కి పోయింది. రాత్రై 10 గంటలకి కష్టాలే పడి కరంటు ఇచ్చారు,ఊరంతకీ! మరి మేము ప్రత్యేకం కదా, ట్రాన్స్ఫార్మర్ పోయింది, ఉదయమే ఆ పని మీద ఉండి ట్రాన్స్ఫార్మర్ మార్చారు, ఇందులోనూ మా ప్రత్యేకత మాది సింగిల్ ఫేజ్ 11ఖ్వ్/259వ్ 25ఖ్వ్ దీన్ని మార్చి కరంటు ఇచ్చారు, కరంటువారికి ధన్యవాదాలు. కరంటు లేక నిన్న సాయంతరం నీళ్ళు రాలేదుగాని ఈ రోజు ఉదయమే నీళ్ళు వచ్చాయి. ఇక గాలికి పొడుగు వరివంగడాలు పడిపోయాయి,నీళ్ళలో ఉన్నాయి చేలు. నీరు లాగుతోంది. సముద్రం నీరు తీసుకుంటోంది,పున్నమి పోటుకు ఇంక సమయం ఉందిగనక. ఉప్పు నీళ్ళు జల్లుతున్నాము,మొలక రాకుండా. పొట్టి వంగడాలకి బాధలేదు,చేలలో నీరు నిలిచే సావకాశాలు తక్కువగానే ఉన్నట్టుంది
    కోనసీమ,ప.గోజిలు దెబ్బతిన్నట్టే ఉంది. ప్రాణ నష్టం ఉన్నట్టు లేదు.
    అనుకున్నట్టే తుఫాను అంతర్వేది మొగల్తూరు మధ్య తీరందాటినట్టు అనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి మాకు మాత్రం గాలి,చినుకు కూడాలేవు, మబ్బు మాత్రం దిట్టంగానే ఉంది.

    ReplyDelete