Monday, 6 October 2025

శ్రీ శ్యామలీయంగారికి సతీ వియోగం.

 శ్రీ శ్యామలీయంగారికి సతీ వియోగం.


ప్రముఖ బ్లాగరు శ్రీ తాడిగడప శ్యామలరావు గారికి సతీమణి శ్రీమతి శారద గారు నిన్న(5.10.2025) ఉదయం 7.43 నిమిషాలకు ఇహలోకయాత్ర 

చాలించినట్లు 

శ్రీ శ్యామలీయంవారి ద్వారా ఇప్పుడే తెలిసింది. 


శ్రీమతి శారదగారు బహుకాలంగా డయాలిసిస్ తో ఉన్నట్టు తెలిసిన సంగతే. కొద్దికాలంగా హాస్పిటల్ లో ఉండి వెంటిలేటర్ కూడా పని చేయక, రెండురోజుల కోమా తరవాత ఇహలోకయాత్ర చాలించిన దుర్వార్త తెలిసి ఖిన్నుడనయ్యాను. మాటాడటానికి మాట పెగలలేదు. 

సంతానం లేని శ్యామలీయంగారు,ఈ కష్ట సమయంలో  మనసు కుదుట పరుచుకోవాలని కోరుతున్నా.  


శ్రీమతి శారదగారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్ధిస్తూ, శలవు.

15 comments:

  1. శ్రీమతి శారదగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ,
    శ్రీ శ్యామలరావు గారికి, ధైర్యాన్నిచ్చి, త్వరగా ఈ బాధ నుండి కోలుకునేలా చేయమని శ్రీరామచంద్రుడుని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  2. శ్రీ శ్యామలరావు గారికి ఈ వయసులో ఈ దెబ్బ తగలడం, ఇక. వంటరితనం చుట్టుముట్టడం చాలా విచారించవలసిన విషయం.

    ఈ వార్త ఇందాక మీరు నాకు చెప్పిన మీదట శ్రీ శ్యామలరావు గారికి ఫోన్ చేసి పరామర్శించాను.

    శ్రీమతి శారద గారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను 🙏.

    ReplyDelete
  3. శ్రీమతి శారద గారికి శ్రద్ధాంజలి. 🙏

    ReplyDelete
  4. ఈ కష్ట సమయంలో శ్యామల రావు గారికి
    రఘువీరుడు బాసట యగు గాత !

    ReplyDelete
  5. ఒంటరితనము నాకంటంచి జగదాంబ
    యింటికి చేరె నాకంటివెలుగు
    రెక్కలు తెగినట్టి దిక్కుమాలిన యొంటి
    పక్కి నైతిని రామభద్ర నేను
    బాధలుడిగి యంబవద్ద నుండెను తాను
    బాధతో నేనింటి వద్ద నుంటి
    సాధుశీలకు కలిగె సద్గతి నాకిట్టి
    దుర్గతి ప్రాప్తించె తోరముగను

    యేది జరిగిన శ్రీరామ నీదు లీల
    నడుపుచుండిన యీజగన్నాటకమున
    భాగమే యని యెరిగియు బాధపడక
    యుండుటే నాకు చేతగాకున్న దయ్య

    అంబ సన్నిధి శారద కబ్బె నిపుడు
    నీవు నను బిల్చు టెన్నడో దేవదేవ
    సర్వలోకేశ శ్రీరామచంద్ర భక్త
    వరద ‍నీయిఛ్ఛ యెటు లట్లు జరుగు గాక

    అని విన్నవించి రాముని
    పనుపున ధర నుండు నట్టి వాడను నన్నే
    మని హరి నియమించిన నా
    పనులను నెరవేర్చి జనెడు వాడను మరియున్

    ReplyDelete
    Replies
    1. మీరు ఒంటరి కాదండి. మీ బంధుమిత్రులతో పాటు, బ్లాగు మిత్రులు కూడా మీతో ఉన్నారు. 🙏

      Delete
  6. శ్రీమతి శారద గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ. 🙏

    ReplyDelete
  7. శ్రీమతి శారద గారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను 🙏 🙏 🙏

    ReplyDelete
  8. వదిన ఆత్మకు సద్గతులు చేకూరుగాక!
    అన్నయ్యకు మేమంతా కలిగిన సంతానము వంటి వారమే..
    మేమందరమూ ఉండగా అన్నయ్య ఒంటరి కాలేడు.
    అందరినీ మించిన తోడు, ధైర్యం.
    శ్రీరామ చంద్రుడు. ఆ దైవమే అన్నయ్య వెన్నంటి ఉండగా ఇక
    ఒంటరి అగుట కళ్ళ.

    ReplyDelete
  9. శ్యామలీయం వారు,

    ఋణానుబంధ రూపేణా
    పశు పత్ని సుతాదయః
    ఋణ క్షయే క్షయంయాంతి
    తత్రకా పరివేదనా.

    ఇదం కాష్టం ఇదం కాష్టం
    నద్యం వహతి సంగతః
    సంయోగశ్చ వియోగశ్చ
    కా తత్ర పరివేదనా

    యావత్కాలం భవేత్కర్మ
    తావత్తిష్టంతి జంతవః
    తస్మిన్ఖ్షణే వినస్యంతి
    తత్ర కా పరివేదనా

    ఇవి మీకు తెలియనివా? కాని ఈ సమయంలో.... ఇదే జీవితం.
    జరగవలసినది జరిగిపోయింది. వేదన తప్పదు,పరివేదన చెందద్దు. ఎవరేమి చెప్పినా,ఎవరెంత చూసినా, మనసులో ఏర్పడ్డ వెలితిని ఎవరూ పూరించలేరు, ఈ ఒంటరితనం తప్పదు. చివరిరోజు ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియదు, జంటలో మిగిలినవారు,చివరిరోజుదాకా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతే హాస్పిటల్ పాలైతే చూడగల ఓపిక,తీరిక ఎవరికీ ఉండదు. మీ ఆరోగ్యం కాపాడుకోండి,మానసికంగా కృంగిపోవద్దు.(Don't get depressed). రాముడే మీకు పెద్దతోడు.

    ReplyDelete
    Replies
    1. తెలియక కాదండి
      స్వరసవాహీ విదుషోపి తథారూఢాభినివేశః
      ప్రాణిసహజమైన ఈమరణం గురించిన నిర్వేదం విద్యావంతులకూ సహజమే. కాని వారివారి ఆధ్యాత్మిక హసాధనానుసారంగా న్యూనాతిరిక్తాలుగా ఉంటుంది. నాకు కూడా ఈ నిర్వేదం ఒక passing cloud అవుతుంది. దానికి కొంచెం సమయం కావాలి. అంతే.

      Delete
  10. Syamaliyam garu: Be brave. God will lead you. Sorry for the loss.

    ReplyDelete
  11. శ్రద్ధాంజలి.

    శ్రీ తాడిగడప వారు ఈ వియోగమును అధిగమించగలరు.

    ఇదే కాలమున బ్లాగరు, ఐ ఐ టీ ప్రొఫెసరు శ్రీ గుర్రం ప్రభాకర శాస్త్రి గారు కూడా కాలగతిని పొందినారు.

    వారికిన్ని శ్రద్ధాంజలి.


    ReplyDelete
    Replies
    1. Sorry to hear that. వారికి సద్గతులు కలగాలని ప్రార్ధిస్తున్నాను .

      Delete
  12. GPS గారికి సద్గతులు కలగాలని పరమాత్మను వేడుకుంటున్నాను.

    ReplyDelete