వీళ్ళు మనపోలీసులండీ. ఇలా పడుకున్నారేంటంటారా? మొన్న ఎన్నికలకి ఎస్కార్ట్ వెళ్ళడానికి వచ్చి ఇలా పడుకున్నారు. పడుకోడానికి చోటులేక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకున్నారు. మరేదేశంలోనూ ఇలా ఉండదేమో! నిజంగా మనపోలీసులకి ఎంత సహనం వున్నదంటారు? ప్రభుత్వం వారు పోలీసులకి ఏర్పాటు చేసిన విడిది ఎంత పెద్దదిగా వుందో చూడండి! వీళ్ళూ మనుషులేగా!! మన అన్నదమ్ములేగా!!!
ఈ ఆడకూతుళ్ళేంటీ షాపింగ్ కి వెళ్ళొస్తున్నారనుకున్నారా! వాళ్ళ చేతుల్లో ఉన్నవి EVM లు, ఎన్నికల సామగ్రి సంచులు.
తుపాకులేంటంటారా? ఒక్కొ తుపాకి పాతిక కేజీల బరువుంటుందిట. అది పట్టుకుని నిలబడి వుండాలి. పాపం పోలీసులు.
Photos by mail Courtesy: KRRao


No comments:
Post a Comment