25, మే 2026, సోమవారం

రోహిణీ కార్తె ప్రవేశ శుభకామనలు.

 రోహిణీ కార్తె ప్రవేశ శుభకామనలు.


ఈ రోజు రోహిణి ప్రవేశించింది. From May 1st.ఇప్పటి వరకు 40/45 డిగ్రీల వేడి మలమల మాడ్చింది. వేడిగాలులు వీచాయి. నేటి నుంది 44/48 మధ్య వేడి ఉంటుందని సూచనుంది తగినట్టుగానే నేడు 44/46 మధ్య వేడి దంచుతోంది.వేడి గాలులు వీస్తున్నాయి.  కరంటు ఉండడం మా అదృష్టం మీద ఆధార పడిఉంది. కరంటు వాళ్ళు మాత్రం మనుషులు కారా! వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వేడికి జంపర్లు కాలుతున్నాయో,ట్రాన్స్ఫార్మర్లు పేల్తున్నాయొ!  మరో వారందాకా ఇంతేలా ఉంది. వారందాకా మా లాటి ఘటాలు ఉంటాయా? భగవదేఛ్ఛ.   

6 కామెంట్‌లు:

  1. మొన్న బుధవారం చెవిపోటు దంచుతోంటే డాక్టర్ దగ్గరకి వెళ్ళక తప్పలేదు. ఆటోలో ప్రయాణం పది నిమిషాలు నిప్పులగుండంలో ఉన్నట్టే ఉంది.డాక్టర్గారి దగ్గరకి వెంటనే వెళ్ళేను,అక్కడ పది నిమిషాలూ ఎ.సి లో బాగుంది. మందులు రాయించుకు బయటికొచ్చా! కూడా వచ్చిన మరో ఇద్దరూ డాక్టర్ కలవాలంటే అక్కడ నిలవక తప్పలేదు,ఏ.సి లేదు. మండిపోతుంటే పక్కనే ఉన్న మెడికల్ షాపు దగ్గరకి పరిగేపెట్టేను. షాపతను నన్నుచూసి ఈ ముసలాడు మరికొద్ది సేపు బయటుంటే బాల్చీ తన్నేస్తాడనుకుని తలుపుతీసి లోపలికి తీసుకుపోయి (షాపులో ఎ.సి ఉంది),మంచినీళ్ళిచ్చి,కుర్చీలో కూచో బెట్టి సేద తీర్చాడు.ధన్యవాదాలు చెప్పేను,మీరెవరు,ఇల్లెక్కడ వగైరా ప్రశ్న లేసి, మీరా? అని ఆశ్చర్యపోయి మావాళ్ళకి అప్పజెబితే పదినిమిషాల్లో ఇంటికొస్తే ఈలోగా కూడా వచ్చినవాళ్ళు వచ్చి మందులు కొని మళ్ళీ ఆటో కరంటు పోయింది, మా అదృష్టం ఎండకాస్తే కరంటుపోతుంది,కొద్ది చినుకులు పడితే కరంటు పోతుంది. ఒక సారిపోతే మూడు గంటలలో కరంటు వస్తే అదృష్టం. ఇలా నడుస్తోంది. 45/48 వేడి నడుస్తోంది. వెల్ కం లేదు అంతా గో గో లాగే ఉంది😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Bsnl రోజులు గుర్తుకొస్తున్నాయా :)

      తొలగించండి
    2. నా దంతా DOT సర్వీసే,చివరలో బి.ఎస్.ఎన్.ఎల్ తో "ఇదుగో పసుపు అదుగో ముసుగు" యవ్వారమే😘

      తొలగించండి
  2. -

    'ఇదుగో పసుపు అదుగో ముసుగు"

    దీని కతాకమామీషేమిటండీ తాత గారూ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ నానుడి నేటికి వర్తించనిదే పొరపాటుగా దారితప్పి బయటికొచ్చేసింది.

      అడిగావు కనక చెబుతున్నా, ఇది చరిత్రకు సంబంధించినది. ఒకప్పుడు బాల్యవివాహాలు అందునా వృద్ధులతో పసిబాలలకు వివాహం జరగడం ఆ వృద్ధులు పీటలమీదనే కాలం చెల్లిపోవడం జరిగేవట. ఆ తరవాత ఆ పసిబాలికను విధవనుచేసి విరూపిని చేయడం ఆచారంగా వర్ధిల్లింది. నా రోజులనాటికే ఇటువంటివారిని సకృత్తుగా చూసాను.
      వివాహం జరుగుతూనే వైధవ్యం పొందడానికి ఈ నానుడి చెప్పేవారు.

      నాకు ఎలా వర్తింపు అన్నది కొచ్చను.
      డాట్ లో పనిచేస్తూ రిటయిర్ అయిన ఆఖరురోజునే బి.ఎస్.ఎన్.ఎల్ లో భర్తీ అయ్యాను.ముందు భర్తీ అయ్యాను,వెంటనే రిటయిర్ అయ్యాను. ఆ ఆర్డర్ ఒకచేత్తో రుఇచ్చారు ,మరో ఆర్డరు మరో చేత్తో ఇచ్చారు అదీ సం గతి. తెరియమా?

      తొలగించండి