బలవంతుడ
బలవంతునికే మిత్రులుంటారు. శత్రువులూ ఉంటారు. కాని బలహీనునికి శత్రువులేగాని మిత్రులుండరు. అలాగని బలవంతుడు
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి బ్రతుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ!
అంచేత బలమున్నవాడు ప్రతివాడితోనూ శత్రుత్వం తెచ్చుకోకూడదు.
అధికారము,ధనము,అందము,బలము, యవ్వనము,మిత్రులూ శాశ్వతం కాదు
బలయుతులకు దుర్భలులకు
బల మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్
బల మెవ్వఁడు ప్రాణులకును
బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా!
అందరి బలమూ పరమాత్మే నీ స్వంతబలమే లేదు సుమా గర్వ పడకని ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపునకు చెప్పినమాట, ఇది నిత్య సత్యం.
బలం (అధికార బలం.. ధన బలం..జన బలం) శాశ్వతం కాదని గుర్తుంచుకుంటే సరి
ReplyDelete
ReplyDeletesrinivasrjy28 June 2025 at 15:20
నిజమేకానండి,సమయానికి గుర్తురావు. అవసరానికి గుర్తురాని కర్ణుని అస్త్రాలలా 🤣 మళ్ళీ,మళ్ళీ చెప్పుకున్నా సరే!