23, మే 2025, శుక్రవారం

మళ్ళీ కోవిడ్?


మళ్ళీ కోవిడ్?

Health first everything next.

ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన కరోనా మరోసారి పురి విప్పిందట. సింగపూర్ లో రోజుకి 12500 మందికి సోకిందని వార్త. మాస్కులు,దూరాలు,చేతులు కడగటం,మూతుల ముచ్చట్లు బంద్! లాక్ డవున్ తప్పదా? మళ్ళీ హాస్పిటల్,బెడ్లు షరా మామూలే! ఈ సారి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కర్చు రాసేసినట్టే! 


మనకి సింగపూర్ ఎంత దూరం? రెండు గంటలేగా! అసలే మనకి సింగపూర్ వాళ్ళంటే చచ్చేటంత ప్రేమాయె! ఎగిరొచ్చేస్తుంది, తస్మాత్ జాగ్రత.



3 కామెంట్‌లు:

  1. కోవిడ్ అనే కరోనా JN-1 అనే కొత్త పేరు పెట్టుకుందిట. ఇది కరోనాకి కొత్త వేరియంటు.
    సింగపూర్ నుంచి బయలుదేరి హాంకాంగ్ నుచూసి ఇప్పుడు పుట్టిల్లు చైనాని చూస్తోందిట. భారత్ లో పుట్టింటి చుట్టాలిల్లు కేరళా చేరుకుందిట. పుట్టింటివారి మిత్ర పత్రికవారు ఆనందంగా వార్త ప్రచురించారు.
    ఇది మన దగ్గరికి రావడానికి సమయం పట్టక పోవచ్చు. మాస్కులు వాడండి,దూరం పాటించండి,అందులోనూ కోవిడ్ పుట్టింటి చుట్టాలకి దూరంగా ఉండండి. చేతులు కడగండి,మూతుల ముచ్చట్టలు మరచిపోండి. బతికంటూ ఉంటే బలుసాకు తినయినా బతకచ్చు. జాగ్రత్త.
    చెప్పడమే నాధర్మం,వినకపోతె నీ కర్మం.

    రిప్లయితొలగించండి
  2. మళ్ళీ కోవిడ్ వచ్చేస్తోందా.. మరో డోస్ వేక్సీన్ అంటారేమో :(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. srinivasrjy21 May 2025 at 12:34
      ఈ వేరియంట్ ప్రమాదకరమైనదంటున్నారు.

      ఐతే మనం వేసుకున్న వాక్సేన్ అన్ని వేరియంట్లని అరికడుతుందన్నారు. మనం వేసుకుని నాలుగేళ్ళవుతోంది. మనం వేసుకున్నది, ఈ వేరియంట్ను కూడా నిలువరించగలదా? మళ్ళీ వేసుకోవాలా? వివరాలు తెలిసేదాకా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నా ఊహ.


      గాడిదగుడ్డేంకాదూ భయపెట్టి చంపడం, వచ్చినప్పుడు చూసుకుందామనే వారికి నమస్కారం.

      తొలగించండి