పంపకాలు.
అనగనగా ఒక పల్లెటూరు. ఒక కలిగిన కుటుంబం, తల్లి తండ్రికి ఇద్దరు కొడుకులు. వారిని బాగా పెంచి విద్యా బుద్ధులు చెప్పించి, ప్రయోజకుల్ని చేసి, తల్లి తండ్రులు గతించారు, ఆస్థులు పంచుకోడానికో విల్లు రాసి. పంచుకుందాం లే అని కాలయాపన చేసేరు, అన్నదమ్ములిద్దరూ. ఒక రోజు తీరుబడిగా విల్లు తీసి చదువుకుని పంపకాలు మొదలెట్టేరు.
పంపకాలు సాగుతున్నాయి చిన్న పెద్ద పోట్లాటలతో. చివరికొచ్చినట్టే అనిపించింది.
ఇంతలో తమ్ముడు అన్నా! నాన్న చేసిన పంపకాలలో తేడా ఉంది, కొన్ని కొన్ని విషయాలు నాన్న విల్లులో రాయలేదు.
నీవాటాకొచ్చిన పొలంలో పెద్ద మోటర్ వేయించాడు, నా వాటాకొచ్చిన పొలంలో చిన్న మోటర్ వేయించాడు. నాది నాలుగంగుళాల బోరు, నీది ఆరంగుళాల బోరూ. మోటర్లు వేయించినప్పటినుంచి నీవాటా పొలంలో మోటరుకి ఖర్చు ఎక్కువైంది, నాకు ముదరా రావాలి. ఇటువంటివి చాలా ఉన్నాయి. అంతే కాదు నువ్వు నాకంటే మూడేళ్ళు ముందు పుట్టేవు. నీకు ఖర్చు చాలా పెట్టేరు, నువ్వు ఇంతకాలం ఉమ్మడిలో నా కంటే ఎక్కువ ముద్దలే తిన్నావు,రోజూ, నేను తక్కువ తిన్నాను. తిండి విషయం లో, దీనికీ ముదరా రావాలన్నాడు. నీకు నాకంటే ముందు పెళ్ళి చేసేరు,పెళ్ళామొచ్చింది, ఆవిడా తింటూనే ఉందిగా. నీకో కొడుకు పుట్టేడు, వాడు పెద్ద మనవడని మురిసిపోయి, ఎవేవో చేయించారు. వాటికి ముదరా చూసుకోవాలిగా. ముదరా ఇలా చెప్పుకుపోతున్న తమ్ముణ్ణి చూసి, అన్నకి ఏం చెప్పాలో అర్ధం కాక తలపట్టుకున్నాడు.
ఇది నిజంగా జరిగింది, నేను ప్రత్యక్షంగా చూసేను.
ఇంత అధమస్ధాయికి దిగజారిన ఆలోచనలు కూడా ఉంటాయా 😳? కలికాలం అనుకోవాలి.
ReplyDelete
Deleteవిన్నకోట నరసింహా రావు9 July 2024 at 09:50
మేరా భారత్ మహాన్, ఆలోచనలకి లోటు లేదు, మానవమేధ ఎన్ని రకాలుగా ఆలోచించగలదో చెప్పలేము, అందులో ఇదొకటి.
మాతాపుత్రవిరోధాయ
ReplyDeleteహిరణ్యాయ నమోనమః
శ్యామలీయం9 July 2024 at 11:28
Deleteమాతా లేదు పితా లేదు ఉన్నది,కనపడుతున్నది రూపాయి.
ఎవరా (పిచ్చి) పెద్దమనిషి విల్లు రాసి పెట్టింది?
ReplyDeleteతన్నుకు చావండ్రా ఆస్థులతో అని బాల్చీ తన్నేసి వుంటే ఏదో ఒహటి తేలిపోయేది :)
Zilebi9 July 2024 at 11:44
Deleteకొడుకింత మేధావి అవుతాడని ఊహించలేని పిచ్చివాడు! తన తరవాత పిల్లలకేదో ఆస్థి ఇచ్చిపోవాలనుకున్నా సగటు తండ్రి.