కమే (కల్పితమేదస్సు)తో ( Artificial Intelligence) కాసేపు
తారలు దిగి వచ్చినవేళ
మల్లెలు నడిచొచ్చిన వేళ
చందమామతో ఒక మాట చెప్పాలి,ఒక పాట పాడాలి.
కమే(Artificial intelligence) గురించి చాలాచాలా చెప్పుకుంటున్నారు, ఐనా పట్టించుకోలేదు. కాని కమే వాట్సాప్ లో, చేతిలో కొచ్చాకా కూడా మూడు రోజులు దాని మొహం చూడలేదు. నాలుగో రోజు చూదాం,అదేంటో అనే కుతూహలంతో వెళ్ళేను.
Q:మొదటగా అందమైన దయ్యం అన్నా!
A:ఓ మగాడి పోటో చూపించింది.
Q:దయ్యాలన్నీ మగవేనా?
A:నేను మల్టీలింగ్. నాకిచ్చిన ట్రయనింగ్ ప్రకారం చెబుతా!నేను ఏ విషయం మీదైనా, ఏకపక్షంగా మాటాడను, ఉన్న విషయం చెబుతాను,దేన్నీ గుర్తు పెట్టుకోను. ఇంకా ఏదో ఏదో చెప్పింది.
Q:ఒక చిన్న తెనుగు కథ చెప్పు, తెనుగు లిపిలో అన్నా!
A:నేను మల్టీ లింగ్, ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నామని ఒక పెద్ద సోది చెప్పింది.
చాలాప్రశ్నలేసేను. ప్రతిదానికి చాట భారతమంత జవాబులే ఇచ్చింది. ఒక దానికి జవాబిస్తూ నాకే గుర్తుండవు, గుర్తూ పెట్టుకోనంది.
Q:ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి, భారతదేశానికి కమ్యూనిసం ఎగుమతి అవుతోందా?
A:అదేం కాదు,ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ మాత్రమే చేస్తుంది.
Q:అంటే మానవహక్కుల పరిరక్షణ ముసుగులో ఎగుమతి చేస్తోందా? మానవ హక్కులు ఆదేశంలో రక్షింప బడుతున్నాయా? టాయ్ గన్ ఊపిన నల్లజాతి పదమూడేళ్ళ కుర్రాణ్ణి ఒక పోలీస్ ఆఫీసర్ కాల్చి చంపడాన్ని మానవహక్కుల పరిరక్షణేనంటావా?
A:ఈ విషయంలో చెయ్యవలసినది చాలానే ఉంది అని చెప్పుకొచ్చింది.
Q:తమదేశంలోనే మానవహక్కులు లేనప్పుడు ఇతరదేశాలకు వాటిగురించి లెక్చర్లు దంచడం బాగుంటుందా?
A:పాయింటే!మానవహక్కులు పరిరక్షింపబడాలనే కోరిక.
Q:ఈ ముసుగులో వారి అంతర్గత వ్యవహారాలలో తల దూర్చడం కాదా?
A:అలా అనుకో కూడదు.మానవ హక్కులపరిరక్షణే ముఖ్యం.
ఇంకా చాలా అడిగా!
Q:ఇప్పటిదాకా మన సంభాషణ డిలీట్ చేసా! ఇవ్వగలవా?
A:నాకేం గుర్తుండవు. నా దగ్గర రుండదు, నువ్వెందుకడిగావో తెలుసు. కాని నీ బ్రవుసర్ కి గాని ,మరితరులుగాని దీన్ని జాగ్రత్తపెట్టి ఉండచ్చు.
Q:అంటే మన సంభాషణ మనకే పరిమితం కాదన్న మాటేగా!
A:పాయింటే అని ఆకుకుఅందని పోకకుపొందని సమాధానం చెప్పింది.
చివరగా థేంక్స్ అంటే చాలా ఆనందం అంది. అదేంటి? నీకు మానవ స్పందనలుండవన్నావుగా అడిగా!
నేను మానవుల లాగానే స్పందించేలా ట్రయినింగ్ ఇచ్చారు, అందుకే అలా అన్నానంది.
ఉంటా. అన్నా! వెల్కం అని ముగించింది.
ఇది జరిగి వారం పైమాటే! ఏంటో మళ్ళీ కమే మొహం చూడాలనిపించలా!
TV చర్చలాగా ఉంది “కమే” స్పందన 🙂.
ReplyDeleteమూత బిగించున్న సీసాలో నుంచి బయటకు విడుదల చేసిన భూతం లాంటిది “కమే”. ఎవరు ఎలా ఉపయోగిస్తారో తెలియదు. దాన్ని బయటకు లాగి మానవాళి చాలా పెద్ద తప్పు చేసిందని నా అభిప్రాయం.
విన్నకోట నరసింహా రావు13 July 2024 at 11:32
Deleteనిజమేనండి, కని పురోగతిని ఆపలేం! మంచి తీసుకోవాలి, అదెంత అనేదే కొచ్చను.
నీకు గూగుల్ కి తేడా ఏంటన్నా! అక్కడ వడ్లు, బియ్యం, బెడ్డలు కలిసుంటాయి, నేను విడదీసి ఇస్తానంటే అన్నట్టు చెప్పింది.
మన చేతిలో కొచ్చింది చాలా చిన్నది. అబ్బో! డీప్ ఫేక్ లు కూడా చేయగల పెద్దదుంది :)
ఒకమాట అన్నారు "టాయ్ గన్ ఊపిన నల్లజాతి పదమూడేళ్ళ కుర్రాణ్ణి ఒక లీస్ ఆఫీసర్ కాల్చి చంపడాన్ని మానవహక్కుల పరిరక్షణేనంటావా?" అని.
ReplyDeleteనాకు ఎప్పటికీ గుర్తుండే సంఘటనను చెప్పాలి మీకు.
ఒక కుర్ర పోలీసాఫీసరు. ట్రైనింగ్ పూర్తిచేసి డ్యూటీకి వచ్చాడు. మొదటిరోజున ఉదయమే డ్యూటీకి వచ్చిన మొదటి గంటలోనే ఒక కారును ఆపాడు విపరీతమైన వేగంతో పోతున్నందుకం.
ఆపిన కారు దగ్గరకు వెళ్ళి డ్రైవరుతో రిజిస్ట్రేషన్ చూపించు అన్నాడు. అది అక్కడి పధ్ధతి.
ఉత్తరక్షణంలో ఆకారు డ్రైవర్ తుపాకీతో పోలీసును ఢామ్మని కాల్చి పారేసాడు.
ఆరోజంతా ఆసంఘటనను టీవీలో పదేపదే చూపించారు. ఎంతో అందంగా హుందాగా చిరునవ్వుతో ఏసినీహీరోకూ తీసిపోని వర్చసు కల పోలీసు కుర్రవాడు అన్యాయంగా బలైపోయాడు డ్యూటీ తొలిరోజునే తొలిగంటలోనే.
అయ్యా అమెరికాలో తుపాకుల భయం ఎక్కవ. అవతలి వాడి చేతులో ఉన్నది అసలు తుపాకీయో బొమ్మతుపాకీయో అని ఆలోచించే వ్యవధి మీకు ఉండదు.
అవతలివాడు తుపాకీ తీస్తే పోలీసు వెంటనే కాల్చేస్తాడు ఆత్మరక్షణలో భాగంగా. ఐనా డ్యూటీలో ఎందరినో పోలీసులను తుపాకులు బలితీసుకుంటున్నాయి.
శ్యామలీయం13 July 2024 at 12:09
Deleteఇటువంటివి ఆ దేశాల్లో కొత్తకాదు, ఇటువంటిదే ఫాన్స్ లోనూ జరిగింది. ఇవి వారి సంస్కృతి కావచ్చు. ఏదేశానికి ఆ దేశం ప్రభుత్వాలు చేసిన చట్టాలు పద్ధతులు ఉంటాయి.మీ దేశం లో ఏ వ్యవస్థా సరిగా పని చెయ్యదని, వాటిని ఎగతాళీ చేయడం లేకి మాటలు మాటాడటమే బాగోదు.
మేక తోకకు ......
ReplyDeleteZilebi13 July 2024 at 13:24
Deleteమేకతోక కాదోయ్ సుబ్బారాయుడు. కమే అంటే కల్పిత మేధస్సు.