కడుపుతో ఉన్నమ్మ
కడుపుతో ఉన్నమ్మ కనక మానదు.
ఒండుకున్నమ్మ తినక మానదు.
ఇదొక నానుడి కడుపుతో ఉన్న ఆవిడ సమయానికి ప్రసవిస్తుంది. అలాగే వంట చేసుకోడమెందుకు? తినడానికే! దానికీ సమయం ఉంటుంది. అది ఆకలేసిన సమయం. అప్పుడే తింటుంది, వద్దన్నా మానదు. పల్లెటూరివాళ్ళు ఈ మాటని జరగవలసిన పని జరగవలసిన సమయం లో జరిగి తీరుతుంది, వద్దంటే మానదని చెప్పడానికి చెబుతారు. ఒక్కొకపుడు సమయం నడుస్తున్నట్టే కనపడదు, ఒక్కొకప్పుడు సమయం పరిగెడుతున్నట్టే ఉంటుంది. మనం చెప్పినట్టూ, మనకి కావలసినట్టూ సమయం నడవదు. ఎన్నికలవుతున్నాయి. పూర్తైన తరవాత లెక్కింపూ,ఆపై ఫలితాల ప్రకటనా ఉంటుంది. మనం కంగారు పడినంతలో సమయం పరుగెడుతుందా?
కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు.
కూతురుంటే తల్లికి చేదోడని ఈ నానుడి భావం. కూతురు
పెద్దదై తల్లికి తోడవుతుంది. కొడుకు పెద్దవాడై తండ్రికి శత్రువవుతాడు. ఇది లోకరీతి.
చిన్న పామైనా పెద్ద కఱ్ఱతో కొట్టాలి
No comments:
Post a Comment