Tuesday, 19 September 2023

అంకెలతో ఆట

Match stick magic


 
అంకెలతో ఆడుకోడం ఆనందం. కొంతమందికి చిరాకు కూడా. ఇలా అగ్గిపుల్లలతో అంకెలు తయారు చేయడం వాటితో కొన్ని సమస్యలు సృష్టించడం నేడు జరుగుతున్న పని. ఇది కొంత  మేథను
 మథించేదేకాని ఉపయోగం శూన్యమని నా అవగాహన.
వీటి తో ఏమేo చేయచ్చో చూదాం....

ఒక అగ్గిపెట్టిలో పాతకాలంలో 60 పుల్లలుండేవి. వీటికి హార్స్ హెడ్ మేచ్ బాక్సులని పేరు,   వీటినే అగ్గిడెక్క లేదా డెక్క అగ్గిపెట్టి అనేవారు.. పెట్టిమీద రాసుండేది కూడా సిక్టీ మేచ్ స్టిక్స్ అని. నేటి కాలంలో అగ్గిపెట్టిలో50 గాని 52 కాని పుల్లలుంటాయి. 1 నుంచి 0 అంకెలు తయారు చేయడానికి 49 అగ్గిపుల్లలు కావాలి. ఈ 49 ప్రైమ్ నంబరా? కాదు. ఇలా అంకెలతో  ఆడుకోవడమో వ్యసనం కూడా, దీని గురించి మరో సారి.

ఇప్పుడు1నుంచి0 దాకా అంకెలలో మార్పులు చేర్పులుతో ఏమేం చెయ్యచ్చు....
  
చేర్పు/అదే అంకెలో చోటు మార్పు.

1. కి మరొక పుల్ల చేరిస్తే 7 చేయచ్చు. 
2. కి చేర్పువల్ల అంకె మారదు, ఒకపుల్లను అందులోనే చోటు మారిస్తే 3చేయచ్చు.
3. దీనికి ఒక పుల్ల చేరిస్తే 9 చేయచ్చు , ఒక పుల్ల చోటు మారిస్తే 2,5 చేయచ్చు .
4. ఏమి చేసినా మార్పు రానిది 4 మాత్రమని గుర్తుంచుకోవాలి.
5. ఒక పుల్ల చేరిస్తే 9,6 చేయచ్చు,ఒక పుల్ల చోటు మారిస్తే 3 చేయచ్చు .
6. ఒక పుల్ల చేరిస్తే 8  చేయచ్చు.ఒక్కపుల్ల చోటు మారిస్తే 0 చేయచ్చు.
7. ఒక పుల్ల చేరిస్తే మార్పు లేదు.
8. చేరిస్తే మార్పురాదు.
9. ఒక పుల్ల చేరిస్తే 8  చేయచ్చుఒక్కపుల్ల చోటు మారిస్తే 0 చేయచ్చు.
0. ఒక పుల్ల చేరిస్తే 8  చేయచ్చు.

ఒక పుల్ల తీసేస్తే
1 నుంచి  6 దాకా ఒకపుల్ల తీసేస్తే అంకెలో మార్పు రాదు.
7.లో పుల్ల తీసేస్తే 1 చేయచ్చు.
8.లో పుల్ల తీసేస్తే 0 చేయచ్చు.

ఇలాగే రెండు పుల్లలు చేరిస్తే,  ఏమవుతుంది చూడచ్చు.ఒక రూపాయి అగ్గిపెట్టేతో డబ్బులు సంపాదిస్తున్నారు, రోడ్ పక్క ఒక చిన్న స్టాండ్ వేసుకుని ఇలా సమస్యలు పెట్టి తికమకపెట్టి. ఇది ఒక మానసిక ఆటలా చెప్పి మనుష్యులని చిన్న సమస్య చెయ్యలేకపోయామనే కసిపెంచి, డబ్బులు పోగొట్టుకునేలా చేస్తున్నారు. అందుకే ఈ టపా..,.హెచ్చరిక. ఇందులో వింతే లేదు! ఇందులో చిక్కుకోకండి...
2-2=6 ఒక్కపుల్ల మార్చండి,   ఆ తరవాత 1-2=6. ఒక్కపుల్ల మార్చండి బహుమతి గెల్చుకోండంటూ అరుస్తున్నాడు. ఒక్క క్షణం ఇంత చెప్పిన నేనే బిత్తరపోయా!! ఆ తరవాత ఫక్కున నవ్వుకున్నా!!!!!

 డబ్బులుపోగొట్టుకునేవాళ్ళు పోగొట్టుకుంటూనే ఉన్నారు.

4 comments:

  1. పేకాటలతో అయిపోయింది‌
    ఇప్పుడంకెలతో అన్నమాట :)

    ReplyDelete
    Replies
    1. పేకాటలో మాత్రం అంకెలుండవా ఏమిటి. అవి పేకంకెలు. ఇవి పుల్లంకెలు. అదే తేడా

      Delete
    2. కాంత్20 September 2023 at 18:40
      రూపాలు వేరుగాని అన్నీ ఆ బాపతులోనివేనండి. ఇప్పుడు చెప్పడం మరచా! పూర్వంలో న్యూయార్క్ కాటన్ మార్కెట్ లేదా బ్రాకెట్ అనే ఆట ఆంధ్రదేశాన్ని జలగలా పీడించింది, ఇప్పుడు ఉందేమో తెలీదు. దానికి ఒక అంకె ఓపెనింగు, మరోటి క్లోజింగు, మొత్తం బ్రాకెట్టు. తగిలితే 70 రెట్లు,లేదంటే ఊడ్చుకుపోయినట్టే! ఊడ్చుకుపోయినవాళ్ళే ఎక్కువ. ఇదివరలో దీని గురించిన టపాలే ఉన్నాయండి. ఏవైనా అంకెలే! :)

      Delete

  2. Anonymous19 September 2023 at 12:09
    మనకంటే లొక్కుగా ఉన్నవాడిని పీడించడం జరుగుతున్న చరిత్రకదా

    ReplyDelete