Thursday, 22 December 2022

ఈసారొస్తే! ఇంతే సంగతులా?

 


ఈసారొస్తే! ఇంతే సంగతులా?

ఒమిక్రాన్ ప్రపంచాన్ని వదిలేసినా చైనాని వదల్లేదు, పుట్టింటి ప్రేమకదా!ప్రజలు ఈ లాక్డవున్ జైలు జీవితంకంటే చావుమేలు వదిలెయ్యండని గోల చేస్తే వదిలేసింది చైనా, వారo, కితమే. వారంలో భరతదేశాని కొచ్చిందంటున్నారు.ఇది మోడీ చేతకాన్తనం అనలేదెవరూ ఇప్పటిదాకా! ఇకముందంటారేమో చూడాలి. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోండి, మళ్ళీ మాస్కులేసుకోండి, దూరంపాటించండి అంటోంది. కొంతమంది ఈ వేరియంట్ సోకితే లక్షణాలు కనపడవు, ఒక్కసారిగా న్యుమోనియా చుట్టుముడుతుంది అంటున్నారు.  చలికాలం, జాగర్త్తలు అవసరమే! ఈ సారొస్తే ఇంతే సంగతులా? అని అనుమానం. కాని ఆధార్ పూనావాలా అంటారూ, దేశంలో చలామందికి వేక్సీన్ ఇచ్చాముగనక భయం లేదంటున్నారు. చైనాలో మాత్రం కరోనా రోగులు పడుకోడానికి మంచాలు లేక కటికనేలమీద పడుకోబెడుతున్నారుట. ఇక శవాలు  వరసలోనే ఉంటున్నాయట, అంత్యక్రియలకి. ఎవరు చేసిన కర్మ వారనుభవించకా ఏరికైనా తప్పదన్నా! ఏనాటి ఏతీరు ఎవరు చెప్పాగలరు, అనుభవింపక తప్పదన్నా!అనుభవించుట తథ్యమన్నా!! 

  కొత్తవేరియంట్ కోనసీమకి చేరినట్టువార్త


హరి సంకీర్తన 

మార్గశిరమాసం జొరబడి పదేనురోజులు కావస్తోంది, నెలపట్టి ఈరోజుకి ఎనిమిది రోజులు. ఈనెల హరి సంకీర్తనం ముఖ్యం. జనం చలికి జడిసి ఉదయం ఏడైనా తలుపులు తీసుకు బయటకే రావటం లేదు, ఈ హరిదాసులు ఇంకా పాతకాలపు సంప్రదాయం వదలలేక  హరిసంకీర్తన కి బయలుదేరేరిలా! వందనం అభినందనం!!వందనం హరి కొరకై వందనం. వ్యత్యస్త పాదారవింద, ఇందిరాహృదయానంద!

1729   కత చెప్పిన రామానుజన్.




ఈ రోజు శ్రీనివాస రామనుజన్ పుట్టిన రోజు. మహానుభావులు అరుదుగానే పుడతారు. గొప్ప లెక్కల్లోని లెక్కల మనిషి. మనం ఎవరిని బతికుండగా లెక్కచేయం.విదేశీయులు గుర్తిస్తే మనం మనవాడే అని కీర్తిస్తాం.  చచ్చిపోయాకా జన్మదినాలు చేస్తాం. మనం భారతీయులం కదా! ఇదింతే!! పాణిని సూత్రాలలో ఒక సూత్రాన్ని ఎవరూ వివరించలేకపోయారిప్పటిదాకా! మొన్న ఒక వారం కిందటే ఒక భారతీయుడే దానిని వివరించాడు. ఎవరు గుర్తించారు?మనం మారం!!!


11 comments:

  1. ఈ సారొస్తొరా?

    ReplyDelete
    Replies

    1. bonagiri22 December 2022 at 11:04
      బలే (pun) పన్నేరు సారూ!ఈ సారొస్తారు!, ఈ సారొస్తారు!!

      Delete
  2. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అనాలేమో చైనా విషయంలో?

    అవునూ, కోనసీమకు చైనాకు రాకపోకలున్నాయా ఏమిటి 😁😁 (jk)? రేవు దాటి మరీ కోనసీమలోకి ప్రవేశించిందా వేరియంట్? అయితే ఇక్కడే ఎక్కడో తిరుగుతోందన్నమాట. పొంచి ఉన్న ప్రమాదమే.

    బూస్టర్ డోస్ తో సహా మూడుసార్లు పొడిపించుకున్న వాళ్ళేమన్నా సురక్షితులంటారా 🤔?

    భారతీయ వైఖరి ఇంతేనంటారా? అంతేననుకుంటాను లెండి. పాణిణి సూత్రాన్ని ఓ భారతీయుడు ఛేదించాడని మీరిక్కడ చెప్పి మంచి పని చేసారు మా బోంట్లకు. వెదికితే మరిన్ని వివరాలు దొరికాయి 👇. గర్వించదగిన మాట.

    https://odishabhaskar.in/news/paninis-2500-yr-old-grammatical-puzzle-solved-by-indian-phd-student-at-cambridge/

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు22 December 2022 at 12:04
      లెస్స బలికితిరి కదు సార్!
      వారు వీరను తేడా లేదని వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల మాట. మనకు భయం లేదు, ఇమ్యూనిటీ ఉంది, జాగరత్తలు అవసరం అని విజ్ఞుల మాట.
      ఐనవిల్లి సివారు కుగ్రామానికి ఒక మహిళ దుబాయ్ నుంచి గాల్లో విజయవాడ లో దిగి అక్కడినుంచి కారులో ఐనవిల్లి సివారు గ్రామం చేరిందిట. ఆమెకు గన్నవరం లో టెస్ట్ చేసారు, అనుమానం మరేమో గాని ఇక్కడి అధికారులను హెచ్చరించారట. వార్త వక్రీకరించబడిందో నిజమేదో! తెలియదు.
      మనం భారతీయులం ఈ జబ్బు మన నరనరాన ఇంకిపోయింది, ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పొస్తున్నట్టుంది. నిన్న మా కాలేజిలో రామానుజన్ పుట్టినరోజు ఘనం గా జరిపి,ఒక కాంస్య విగ్రహం ప్రతిష్టించారు. ఒక వారం ముందు ఒక గణిత సహస్రావధానిని సత్కరించారు. మార్పు మెల్లమెల్లగా ప్రారంభమైనదనుకుంటా!

      Delete
  3. పాణిని సూత్రాలలో ఒక సూత్రాన్ని......

    ఈ పాటి దాన్ని శ్యామలీయం మేష్టారు గారు‌ ఎప్పుడో కనిపెట్టేసుంటారండి. May be థీసిస్ గా చెప్పి‌ ( వ్రాసి) వుండకపోయుండొచ్చు

    ReplyDelete
    Replies
    1. Anonymous22 December 2022 at 17:50
      మనం భారతీయులం, అందునా తెనుగువారం.మనవారి గొప్పతనాన్ని ఛస్తే ఒప్పుకోం. మీ కామెంట్ అసూయకి పరాకష్ట. మారండి! శలవు!!

      Delete
  4. పుట్టింటి ప్రేమ కదా . 👌👌
    హరిదాసు ఫోటో 👌👌

    ReplyDelete
    Replies
    1. Anonymous22 December 2022 at 18:06
      నిన్న ఉదయం నడకనుంచి వస్తుంటే కనపడ్డారు

      Delete
  5. "ఇంతే సంగతులా" అంటే మీ ఉద్దేశ్యం? ప్రపంచం అంతమవుతుందనా లేక భారతదేశం అంతమవుతుందనా లేక ఇంకేమైనా అవుతుందనా? కొంచెం వివరిస్తారా?

    ReplyDelete
  6. Anonymous22 December 2022 at 20:27
    ప్రపంచం ఏంకాదు, భారతదేశానికేం కాదు, ప్లవలోనే కరోనా నుంచి బయటపడ్డామే, మళ్ళీ కష్టమా! అని

    ReplyDelete
  7. శుభవార్త
    భారత్ బయోటెక్ కరోనాకి ముక్కులో రెండు చుక్కలు వేస్తే పని చేసే టీకా కనుగొంది.
    ముక్కులో రెండు చుక్కలు వేస్తే, ఇదివరలో ఏది టీకాగా బూస్టర్ డోస్ గా కూడా పని చేస్తుందని. ఈ టీకాను భారత్ బయోటెక్ తయారు చేసింది. అన్ని పరిక్షల తరవాత దీనిని టీకాగా ఉపయోగించవచ్చని ప్రభుత్వం తెలిపింది.

    మేరా భారత్ మహాన్! _/\_

    ReplyDelete