నేలవిడచి సాము
సాము అంటే కత్తితిప్పడం, కఱ్ఱతిప్పడం. పూర్వకాలంలో కత్తులు, కర్రలతోనే యుద్ధాలు చేసుకునేవారు. ఈ కఱ్ఱ,కత్తి తిప్పే అలవాటు ఒక్క రోజులో వచ్చెయ్యదు, దానికి కొంత నిత్య అభ్యాసం అవసరం, దీన్నే సాము నేర్చుకోడం అంటారు.ఇందులో చాలా మెలకువలూ ఉన్నాయి. ఏది చేసినా నేలమీదనే చెయ్యాలి.అవసరాన్ని బట్టి ఎగరడం దూకడం కూడా ఉంటాయి. ఎగిరినా దూకినా అది గాలిలో ఉండడం కొద్ది క్షణాలే, ఆ తరవాత నేలకి రాక తప్పదు. అంటే నేల విడిచి సాము చెయ్యలేరు. అదే ఈ నేల విడచిసాము. ఇదెందుకూ ఇప్పుడని కదా! వస్తున్నా!!
సుగర్ వ్యాధి లేనివాళ్ళు తక్కువ, నేటి కాలంలో. దీనికి అలోపతి వైద్యం తప్ప, మరో వైద్యం లేదూ అంటున్నారు.ఆయుర్వేదం బహు పురాతన వైద్యం, కాని ఇది నెమ్మదిగా అడుగంటి పోయింది, గత వందేళ్ళలో. నేనెరిగి కూడా ఆయుర్వేదమే పల్లెలలో వైద్యం. మనదగ్గర వైద్యం లేదు, అంతా పడమటివారిదే అనే మేధావులూ ఉన్నారు, నమస్కారం. ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదాన్ని బతికించాలనే ప్రయత్నం సాగుతూ ఉంది, సంతోషం. ఈ సందర్భంలో సోషల్ మీడియాలో సుగర్ గురించిన వైద్యం, మందులు, విచ్చలవిడిగా కనపడుతూనే ఉన్నాయి. ఏది నిజం, తెలియటం లేదు. ఒక వేళ ఏదైనా ఒకరి దగ్గర మందువాడితే అది వికటిస్తే, అప్పుడు అలోపతీ వైద్యానికెళితే, జరిగేదేమో చెప్పాలా? ఈ ఆయుర్వేద వైద్యులు ఎక్కడో దూరంగా ఉంటున్నారు, అందుబాటులో ఉండరు, పల్లెలలో ఆయుర్వేద వైద్యులు లేరు, అక్కడక్కడ కొద్దిగా హోమియో వైద్యులు ఉన్నారు. కొన్ని మందులను భారతప్రభుత సర్టిఫయ్ చేసిందని చెబుతూ ప్రకటనలు వస్తున్నాయి. సంతోషించే సంగతే, కాని వైద్యులు లేకుండా మందులు ఎవరిమటుకు వారు వేసుకుని స్వంతవైద్యం చేసుకుంటే...వికటిస్తుంది. వైద్యుడూ,వైద్య పర్యవేక్షణ లేక వైద్యమా? అందుచేత భారత ప్రభుత, ఆయుర్వేదమందులు తయారు చేసే కంపెనీలూ వైద్యులను తయారు చేయకపోతే ఇది నేల విడచి సామే అవుతుంది.
డాక్టర్ పట్టా పుచ్చుకోవడానికి యూత్ ముందు కొస్తారాండి ?
ReplyDeleteBAMS (Batchlor of Ayurvedic medicine and surgery) అనే కోర్స్ ఉంది. దేశం లో నాలుగే యూనివర్సిటీలు ఈ కోర్స్ ఇస్తున్నాయి. ఆంధ్రాలో మూడే కాలేజీలున్నాయి. అది వైద్యమేకాదని ప్రచారం చేసే వర్గాలున్నాయి. యువత సిద్ధంగానే ఉంది, ప్రభుత్వ సహకారంలేదు, MBBS కాలేజిలు మాత్రం పుట్టగొడుగుల్లా మొలుచుకొచ్చేస్తున్నాయి.
Deleteఈ MBBS చదువుతోనూ ఒక చిక్కు ఉందండి నేడు. MD చేయకపోతే రాణింపు గుండుసున్నా. ఎక్కడన్నా డ్యూటీ డాక్టర్ ఉద్యోగం తప్ప దొరకదు. పోనీ పల్లెలకు వెళ్ళి ఈ MBBS డాక్టర్లు ప్రాక్టీస్ చేయమంటే చేయరు.
ReplyDeleteశ్యామలీయం
DeleteMBBS ఐనా సరుకుంటే చెల్లుబాటేనండి,డొనేషన్ కాలేజి చదువులు, అక్కడ వైద్య విద్య చెప్పేవారు ఉండరు, ఇతర సౌకర్యాలూ ఉండవు, కాలేజి ఉంటుంది, దానినుంచి తయారైనవారెలా ఉంటారు? ఇక డ్యూటీ డాక్టర్ అంటే కర్రపెత్తనం, నరం ఇంజక్షన్లతో సహా అన్నీ నర్సులే చేస్తారు. ఎండి లు అంతంతమాత్రంగానే ఉన్నారు. కార్పొరేట్ లలో కొట్టుకుపోతున్నారంతే!