ఆవు,దూడ బాగానే ఉన్నాయి, గుంజకొచ్చింది గురక తెగులు.
ఇదొక నానుడి, తెనుగునాట చెప్పుకునేది, ముఖ్యంగా గోజిలలో చెప్పుకునీదీ.
గుంజ అనేది అవు,దూడలని కట్టే కఱ్ఱ. ఇది వంపుతిరిగి భూమిలో పాతపెట్టబడి ఉంటుంది. పలుపుతాడును ఆవు మెడలోనూ గుంజకి కట్టేస్తారు. ఈ గుంజని కట్టుకొయ్యి,కట్రాట వగైరా పదాలతోనూ వాడుకలో ఉంది.
ఇక గురక తెగులు అనేది పశువులకొచ్చే భయంకర వ్యాధి. దీనినే దొమ్మ తెగులు అని కూడా అంటారు. గిట్టలు చీలివున్న పశువులకొచ్చేది. ఈ వ్యాధి వస్తే పశువు జ్వరంతో బాధ పడుతుంది, గొంతువాస్తుంది, నోట పుళ్ళు పడతాయి, గిట్టల మధ్య ఒరుస్తుంది, కొంతకాలం బాధపడి పశువు చనిపోతుంది. ఈ వ్యాధికి నేటికీ మందులేదు. వాక్సిన్ కూడా లేదు. ఈ వ్యాధిలో చాలా రకాలుండడమే వాక్సిన్ లేకపోడానికి కారణం. దీనిని ఇంగ్లీష్ లో ఫుట్ అండ్ మౌథ్ అంటారు. ఇది వ్యాపించడం గిట్టల ద్వారా జరుగుతుంది గనక.
విషయంలో కొస్తే ఈ తెగులు వస్తే ఆవుకి రావాలి లేదా దూడకి రావాలి గాని వాటిని కట్టేసే ప్రాణం లేని గుంజకెందుకు వస్తుంది? రాదు. అంటే ఈ వ్యాధికి గుంజకి అసలు సంబంధమే లేదు.
మరి ఇలా ఎందుకంటారు? ఆవుకి రాక దూడకీ రాక ఈ వ్యాధి గుంజకొచ్చిందంటే, అపసవ్యమని, ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన అభిప్రాయభేదం గురించి, అసలు వారు బాగానే ఉన్నా, ఇబ్బందులు లేక, సంబంధం లేని మధ్యవారు బాధపడిపోడంగా, కొట్లాడుకోడంగా, చెబుతారు, ఈ నానుడి.
🙂🙂
ReplyDeleteమీరు సూపరండీ అసలు, ఆఁయ్ 🙏.
విన్నకోటవారు,
Deleteసావాస దోసమంటారా? సార్ :)
(No satire intended)
🙂🙂
Deleteజీవం లేని గుంజలకు ఏ బాధలు ఉండవు.. జీవం, మనస్సు, స్పందించే హృదయం ఉన్నవారికే బాధ కలుగుతుంది. 🙏
ReplyDelete
DeleteAnonymous11 October 2022 at 10:48
అస్తు!
idivaraku vinalEdu ee saametha. kandakulEni durada kattipeeTaku (lEka bachchaliki) kooDa ilaaTidE. meeru tETatellamgaa ceppinaa ceppakapOyinaa idi ciranjeevi-garikipaaTi vivaadaniki saripOtundi. vaaLLiddaroo baagaanE vunnaaru. vaari abhimaanulE (ekkuvagaa ciranjeevi vaaLLE) ayaasapaDipOtunnaaru.
ReplyDeleteAnonymous11 October 2022 at 21:03
Deleteఇదివరకు వినలేదు ఈ సామెత. కందకులేని దురద కత్తిపీటకు (లేక బచ్చలికి) కూడ ఇలాటిదే. మీరు తేటతెల్లంగా చెప్పినా చెప్పకపోయినా ఇది చిరంజీవి-గరికిపాటి వివాదనికి సరిపోతుంది. వాళ్ళిద్దరూ బాగానే వున్నారు. వారి అభిమానులే (ఎక్కువగా చిరంజీవి వాళ్ళే) అయాసపడిపోతున్నారు.
========================================
మీ తెంగ్లీష్ భాషని తెలుగీకరించడానికి కష్టపడ్డాను. ఈ సామెతా పాతదేనండి,తక్కువమందికి తెలిసుంటుందని ఇది చెప్పాను. కందకకులేని దురద...సామెత కూడా చెబుతారు. వివాదం గురించి, లోకో భిన్నరుచిః. సామెతలో గురకరోగం చాలా భయంకరమైనది. దాని గురించి కూడా చెప్పాలన్నది ఉద్దేశం. పశువులకి దొమ్మరోగం వచ్చేరోజులు కూడా ఇవే!
తమాషా ఏటంటే గుంజలేసంకలు గుద్దుకోడం. సూపరో సుపరు.
ReplyDeleteAnonymous12 October 2022 at 05:03
Deleteలోకో భిన్నరుచిః.
మీరీ పాట చూసారో లేదో. రాం మిర్యాల, ఈ ప్రహసనం జరుగుతుందని ముందే ఊహించి పాడాడనుకుంటాను.
ReplyDeletehttps://youtu.be/ilPfqZX41GU?t=95
కాంత్ జీ
Deleteనేను కవిలో సగం, క ఏగాని వి లేదు. చూశాను, మీరు చెప్పినదాన్ని బట్టి వారు ముందే ఇటువంటివి ఊహించి ఉంటారంటారా? మేధావులు సుమీ!