ఎవరు చేసిన కర్మ
వారనుభవింపకా
ఏరికైనా తప్పదన్నా
ఏనాటి ఏ తీరు ఎవరు చెప్పాగలరు
అనుభవింపక తప్పదన్నా
అనుభవించుట తథ్యమన్నా.
కరోనా పుట్టింట కథాకళీ చేస్తోందని వార్త.
పుట్టింటి వారి బంధులింటా నిన్నటిదాకా కథాకళీ చేసినట్టుంది.
లోకువ వాళ్ళని చూసి నవ్వకు.
నవ్విన నాపచేను పండింది(ట).
పుట్టిన రోజు శుభాకాంక్షలు, శర్మగారు.. 💐
ReplyDeleteమిత్రులు బోనగిరిగారు,
ReplyDeleteధన్యవాదాలు.
----------------------------
శరీరం మీద అనారోగ్యం దాడి పెరగటంతో తారీకుల ప్రకారం ఈ రోజు, పుట్టినరోజన్న సంగతి మరచాను. గుర్తు చేసినందుకు మరో సారి
ధన్యవాదాలు.
---------------------
ఇది నమస్కరించవలసిన సమయం, నా పట్ల మీరు తీసుకున్న శ్రద్ధకి, కాని చిన్నవారికి నమస్కరించడం సంప్రదాయం కాదు గనక, ఆశీర్వచనం, మీకు మీ కుటుంబ సభ్యులకు,
శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి, శతమేన మేన శతాత్మానం భవతి శతమనంతం భవతి శతం దీర్ఘమాయుః, మరుతయేనా వర్ధయంతి.
దీర్ఘాయుష్మాన్భవ.
పండుగ రోజున మీ ఆశీర్వచనానికి కృతజ్ఞతలు.
Deleteమిమ్మల్ని చూడాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను, ప్రయత్నిస్తాను.
జన్మదిన శుభాకాంక్షలు, శర్మ గారు 💐.
Deleteఏదో పని హడావుడిలో పడి మరచిపోయాను సారీ 🙏.
మిత్రులు బోనగిరిగారు,
Deleteరండి! రండి!!రండి!!!
దయచేయండి,
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
మీ అభిమానానికి పొంగిపోయను, అవాక్కయ్యాను.మీ అభిమానానికి ప్రతిగా ఏమివ్వగలను, బహుమతిగా? పేదవాడిని, అక్షర సుమాలే సమర్పించుకుంటాను.మీ రాకకై రాముని కోసం ఎదురు చూచిన శబరిలా వేచి ఉంటాను.
ధన్యవాదాలు.
మిత్రులు
Deleteవిన్నకోటవారు,
జర శరీరాన్ని ఆక్రమించింది, రుజ వేధిస్తోంది, విడదీయలేని రెంటితో.
వయసు శరీరానికే కాని మనసుకు కాదని మనసుని ఉత్సాహ పరచుకున్నా శరీరం సహకరించటం లేదు.రుజకి ఔషధ సేవ తప్పటం లేదు.ఔషధాలు మరపునే కలగ జేస్తున్నాయి. ఒక రకంగా మంచిదేననిపిస్తూంది కాని కష్టం గా ఉంది. సారీల కాలం కాదు కదు సార్!అంతా షష్టి పూర్తి దాటిన వాళ్ళం కదా!మీ అభిమానానికి
ధన్యవాదాలు.
జన్మదిన శుభాకాంక్షలు, శర్మ గారు 💐.
ReplyDelete🙏
జరయు రుజయును దోస్తులు , చరమపదము
ReplyDeleteచేరు నందాక , వారితో చేయి కలిపి ,
నిర్వికార పరత్వ మూని , పరమాత్మ
భజన సేయుటె మార్గము , భాస్కరన్న !
రాజావారు,
Deleteఅకలి, దప్పిక;శోకం,మోహం; జర, మరణం ఊర్ములు. ఎవరివి వారే అనుభవించాలి,తప్పదు.అందుకే ఎవరి చావు వారే చావాలన్నారు పెద్దలు.జరను సాధకులు కొంతకాలం రాకుండా అడ్డుకోగలరేమో కాని తప్పించుకోలేరు. జరతో పాటుదే రుజ కూడా. నలభై ఏళ్ళొచ్చేదాకా మనిషి అన్నం తింటాడు, ఆపై అన్నం మనిషిని తింటుందన్నారు, ఇదీ పెద్దల మాటే.నేతి నేతి అనుకుంటూ పోతే ఈ శరీరం నేను కాదు అని తెలుస్తుంది, కాని అనుభవంలోకి తెచ్చుకోవడం బహు కష్టం. మహానుభావులు రమణుల గురించి ఒక చిన్న మాట.
ఒక సారి రమణులు గిరి పై నడుస్తుండగా కాలు ఒక చెట్టుకు తగిలి దాని పై ఉన్న తేనె పట్టు కొద్దిగా చెదిరింది.ఈగలు వెంఠనే రమణులు కాలును పొడిచాయి. రమణులు కాలు వెనక్కి తీసుకోలేదు. కాలు వాచిపోయింది. అంతేవాసి ఆశ్రమానికి తీసుకొచ్చి వైద్యుని పిలిచి మందు వేయించారు.స్వామీ తేనెటిగలు కుడుతోంటే కాలు వెనక్కి తీసుకోలేదేమని అడిగితే, కాలును చూపిస్తూ వీరు వారింటిని పాడు చేశారు, దానికి వారు శిక్ష వేశారు అన్నారట. అలా వారు బాధ ను అనుభవించలేదు, సాక్షిగా చూస్తూ ఉండిపోయారు. ఈ కథ ఇంకా ఉంది, ఇక్కడికి ఆపుతా.
జరతో రుజాగ్రస్తమైన శరీరంతో సహజీవనం తప్పదు. భగవానుడు కర్మ పరిపాకం పూర్తి అయేదాకా, ఈ ఉపాధిలో ఉంచుతారు. అప్పటిదాకా నేను వేరు శరీరం వేరు అన్న భావం చెప్పే వరకే కాక అనుభవం లో కి తెచ్చుకోగలిగితే గాని బాధలు తప్పవు కదా! అది తెచ్చుకోగలిగితే బాధ మిధ్య, శరీరమూ మిధ్య కదా !
ఇదంతా తమకు తెలిఅయదని కాదు, జరలో కలిగే అనేక అవకరాల్లో ఇదీ ఒకటికదా! దయతో మన్నించండి.
స్వస్తి.
చేదు నిజం శర్మాచార్య.. ఎంత మనదనుకుంటే కాని ఏదినూ శాస్వతం కాదు ఈ జగాన! హరిః ఓం!!
ReplyDeleteశ్రీధరా!
Deleteఅంతా మిధ్య తలంచి చూచిన కాంతల్ పుత్రులు ఇది ధూర్జటి మాట, కాళహస్తీశ్వర శతకంలో....
జాయతే గఛ్ఛతే ఇతి జగం. వచ్చేది పోయేదే జగం. ఏది వచ్చేది? ఏదిపోయేది? ఈ సృష్టిలో కి వచ్చేవి పోయేవి అన్నీ అనగా చరాచరాలన్నీ కాలానికి లోబడినవే!కొన్ని జీవులు కొన్ని గంటలు జీవిస్తే తాబేలు లాటివి కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తాయి. ఇక మనం అచలాలు అనుకున్నవి కూడా కాలంతో పాటువే, కాలానికి లోబడినవే, అవి కొన్ని వేల సంవత్సరాలు ఉండచ్చు. మానవ శరీరం నూట ఇరవై సంవత్సరాలు జీవితానికి నిర్మింపబడినది. మనం మన చేతకానితనంతో దానిని సగానికి తగ్గించేసుకున్నాం. అరవై దాటి జీవిస్తే గొప్ప అనుకునే కాలమైపోయింది. సరే చెప్పుకుంటే చాలా ఉంది.
చిన్నప్పటి నుంచి ఈ శరీరమే నేను అనే భ్రమలో పెరిగాం. ఈ శరీర నేను కాదు అని తెలుసుకునే సరికి కాలం గడిచింది. ఈ శరీరం నాదనుకుంటే, నేననుకుంటే దీని కష్ట సుఖాలు కూడా నావే. ఈ శరీరం నేను కాదనుకుంటే దీని బాధలు,వ్యధలు సుఖాలు నావి కావు. కాని ఈ స్థితప్రజ్ఞత చేరుకోవడం సాధ్యమా? అందుకే బాధలు తప్పటం లేదు. ఈ శరీరం నేను కాదనుకోవడం మెట్ట వేదాంతంలా అనిపించి, కనిపిస్తూ ఉంది.కాదనుకోలేకనే బాధలు. అనుభవింవపక తప్పదు..తప్పదు..తప్పించుకోలేం...ఈ చక్ర భ్రమణం ఇంతే.. పునరపి జననం పునరపి మరణం...ఇబ్బంది కలిగిస్తే....... క్షంతవ్యుడిని.
అయ్యయ్యో ఆచార్య.. మీరు ఉదహరించినది ఆచరింపదగిన సిసలైన నిజం, శర్మాచార్య.. మీతో ఏకిభవిస్తాను కూడా. ఆది ఉండే వాటికి అంతం కూడా ఉంటుందనేది కాదనలేని వాస్తవిక నిజం. ఐతే ఇహపరభేదాలనేవి కాయానికే కాకుంటే ఆత్మకు కాదు. శంకరాచార్య వారి పద్యం అదేగా చెప్పేది.. "జఠరే శయనం". ఊపిరి ఉన్ననాళ్ళే ఉబలాటారాటం. చరాచర జీవరాశులన్ని కాలాన్ని జయించలేవు.. ఈ మధ్య ఓ పాటలా.. "వెలుతురు తింటది ఆకు (Photosynthesis).. ఆకును తింటది మేక (Herbivore)..
Deleteమేకను తింటది పులి (Carnivore).. ఇది కదరా ఆకలి..
అ.. అ.. అ.. అఅఅ..
పులినే తింటది చావు.. చావును తింటది కాలం.."
Back to Square One, ఈ పరమపదసోపాన కాలమానం నిరంతర ప్రక్రియ.. The World is a Theatre and Everyone Plays their Role.
ఇబ్బందేమి లేదు గాని మీ ఆరోగ్యం జాగ్రత శర్మాచార్య..
~శ్రీధర్