Monday, 5 July 2021

అనుమానం పెను భూతం

      అనుమానం పెను భూతం పెద్ద సంకటం


ఏ కఱ్ఱని నిప్పుంటే ఆ కఱ్ఱే కాలుతుంది.


నిజం నిలకడమీద గాని తెలియదు.


తనకోపమె తన శత్రువు 

తన శాంతమె తనకు రక్ష 

దయ చుట్టంబౌ


ఆత్మ స్తుతి పరనింద ఆత్మహత్యా సదృశాలు.


అకారణ వైరం అకారణ ద్వేషం ఆత్మ వినాశకాలు.


శత్రువు కూడా క్షేమంగా ఉండాలి.


ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం లేదు.


ఐనవారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ.......లోక తీరు.


అసత్యం రుచించినంతగా సత్యం రుచించదు.


సంతోషము సగము బలము.


ఎంత చెట్టుకు అంత గాలి.

 

చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.










21 comments:

  1. 🙏🙏
    శాంతము లేక సౌఖ్యము లేదు 🙏.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      శాంతమూ లేదూ.... సౌఖ్యమూ లేదూ.....

      Delete
  2. ఇన్నేసి సామెతల్ ! ఏ
    దన్నా కత మున్నదేమొ ? అన్నా ! ఒకచో
    నన్నియు గుట్టేస్తిరి , శ్రీ
    మన్నారాయణుని కెరుక మాకే మెరుకా ?

    ReplyDelete
    Replies
    1. రాజావారు,

      జిలేబి ఐతే ఈ పాటికి ఒక కత అల్లి ఉండేది.

      నీరు పల్లమెఱుగు నిజము దేవుడెరుగు.

      Delete
    2. కందమ్మా ! రావలె , మీ
      రందమ్ముగ వేనవేలు రాత్రిందివముల్
      కందమ్ములు గట్టగవలె ,
      అందున , తమ కబురు తెలుప నగు వేగిరమే .🙏

      Delete
    3. రాజావారు,
      కందమ్మ కబురు కోసమే ఈ తపన.తెలిస్తే చెప్పండీ...

      Delete
  3. శర్మ గారు,
    “జిలేబి” గారికి పంపించిన ఇ-మెయిళ్ళకు స్పందనేమీ లేదు. వారి ఫోన్ నెంబర్ “శంకరాభరణం” బ్లాగర్ శంకరయ్య గారి దగ్గర ఉండవచ్చేమోనని నా అంచనా. ఎందుకంటే అక్కడ ప్రచురణ ఖర్చులు వగైరాల నిమిత్తం ఓ సారి “జిలేబి” గారు తన వంతు ఇచ్చారు గదా గతంలో, ఆ సందర్భంగా తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారేమో?

    ReplyDelete
    Replies
    1. హా.. ఔనౌను ఆచార్య.. అపుడెపుడో స్కిమ్ చేసినపుడు ఆ శంకు చక్ర కందిపప్పు శంకరయ్య వారి బ్లాగ్ నందు ఓ పెద్ద లిస్టింగే పెట్టినారు.. అందులో వియన్నారాచార్య వారు తెలిపినట్లుగా ఉండవచ్చునేమో.. నేనోమారు ప్రశ్న వేస్తే అది కందం మూలం సాధు కాదు అంటు ప్రత్యుత్తరమిచ్చి తీసివేశారు వారు.. బహుశ వారిని అడగదల్చుకున్న వారు వారికి సాటిగా చంపకమాల, కందం లో తెలుపాలేమో మరి. అయినా బిజిలే అమ్మణ్ గారు కోవిడ్ నార్మ్ పాటిస్తు క్షేమంగానే ఉండి ఉంటారనుకుంటున్నాను..! హరోం హర

      Delete
    2. శ్రీధరా,
      అలాగే ఆశిద్దాం 🙏.

      Delete
    3. విన్నకోటవారు,

      అస్తు!

      కృషితో నాస్తి దుర్భిక్షం
      జపతో నాస్తి పాతకం
      మౌనేన కలహో నాస్తి
      నాస్తి జాగరతో భయం

      మీ ప్రయత్నం నేనెందుకు కాదనాలి.
      జయొస్తు

      Delete
    4. కృషితో నాస్తి దుర్భిక్షం
      జపతో నాస్తి పాతకం
      మౌనేన కలహో నాస్తి
      నాస్తి జాగరతో భయం

      Those who strive hard, will never face hardships.
      Those who chant hard, will never face difficulties.
      Those who remain calm, will never face quarrels.
      Those who remain alert at all times, will never face fears.

      Delete
  4. ఆహా వినసొంపైన నానుడులు. అపుడెపుడో నా మూడో యేటా పెదబాల"సిచ్చ" అనుకుంటా నాన్నగారు తెచ్చారు.. అందులో చుశానివి.. అదేవిటబ్బాయి మూడో యెటే తెనుగు వచ్చా అదెట్లా అని అనుకునేరు.. తెచ్చింది మూడో యేటనే.. కాని తిప్పి చూసింది ఐదో యేటా.. నాలుగో యేటా మా అమ్మ గారు నేర్పించారుగా తెనుగును.. !

    ReplyDelete
    Replies
    1. అనుమానం పెను భూతం పెద్ద సంకటం

      _అనుమానమనేది మనసున ఎపుడు రాకూడదు. వస్తే ఎంత పెద్ద మానైనా మట్టి కరవాల్సిందే.. అది చిన్న చిన్నగా ఒక్కటై వినాశనానికి దారి తీయ్యగలదు._

      Delete
    2. ఏ కఱ్ఱని నిప్పుంటే ఆ కఱ్ఱే కాలుతుంది

      _ఎవరైనా మంచివారికి, నిజాయితిపరులకు హాని తలపెట్టాలని చూసినా ఆ చేసే చెడు వలన తలపెట్టిన వారికే పెద్ద చిక్కువచ్చి పడుతుంది._

      Delete
    3. నిజం నిలకడమీద గాని తెలియదు

      _ఏదైనా సరే వారిదాక చేరేవరకు దానిలోగల మంచి చెడు బోధ పడదు ఎవరికిని. అలానే ఓపిక నశించని వారికే విషయం బోధ పడుతుంది_

      Delete
    4. ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం లేదు.

      _ఏదైనా తగాదా వచ్చినపుడు దానిని సాగదీసి పెద్దది చేసినంత మాత్రాన అది సమసిపోదు సరికదా ఇంక ఎక్కువ తలపోటుకు కారణం కాగలదు. అంచేత వదిలిపెడితేనే క్షేమం.. ఎలా ఐతే జులపాలు ఎక్కువైతే పేనుకొరుకుడు ఉంటుందో అదే జుట్టే లేకుంటే హాయేహాయి కాని జాగ్రత ఎవరైనా విసరగలరు రాయి_

      Delete
    5. [05/07, 23:33] σριδηαρανιθα βυκψα: అకారణ వైరం అకారణ ద్వేషం ఆత్మ వినాశకాలు

      _దొరికిందే తడవుగా లేనిపోని మాటలతో దెప్పిపొడిచినంత మాత్రానా మంచివాడు చెడ్డవాడు ఐపోడు (డిడ్ యు రీడ్ ఇట్ యాజ్ ఐపాడ్) అలానే కోపధారిగా ఒకరిపై బురదజల్లటం మూలానా ఒరిగేదేమి లేదు ఎంచేతంటే బురద జల్లే వారి కాళ్ళు చేతులు మొదటగా తడిచేది ఆ బురదలోనే_
      [05/07, 23:36] σριδηαρανιθα βυκψα: శత్రువు కూడా క్షేమంగా ఉండాలి

      _మిత్రుడు క్షేమంగా ఉంటే ఆనందం. అదే శత్రువు సైతం బాగుంటే పరమానందం. ఒకరి నాశనం కోరుకోవటం ఆత్మగౌరవానికి అటంకమే. అరి సైతం బాగుంటే కయ్యానికి కాలుదువ్వడు. అపుడు అంత మంచిదేగా.._
      [05/07, 23:40] σριδηαρανιθα βυκψα: ఐనవారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ

      _మన రక్తసంబంధికులు ఉంటే వారిని ఎలా పలకరించినా పలుకుతారు.. వ్యవహారశైలి తెలుసు కాబట్టి.. అదే పరులైతే మరింత జాగ్రత వహించాలి, అపుడే విలువ హెచ్చుతుంది.._
      [05/07, 23:44] σριδηαρανιθα βυκψα: చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు

      _ఇంగితం, లౌక్యం లేని వారి ఎదుట ఒ కిసుక్కు వేసి చక్కిలిగిలి పెట్టినా.. తనపైనే వ్యంగ్యాస్త్ర ప్రయోగము చేశారనుకుని చీవాట్లు పెడతాడే తప్పితె నిజానిజాలను గ్రహించలేడు._

      Delete
    6. శ్రీధరా!
      తెనుగు నేర్పిన తల్లి కి నమస్కారం, నేను ఇద్దరమ్మల దగ్గర నేర్చుకున్నా తెనుగు

      Delete
  5. శ్రీధరా!
    ఆత్రగానికి బుద్ధి మట్టు అని నానుడి.ఎదుటివారిని కించపరిచేస్తున్నామనుకోడమేగాని, మన .....కు బయట పెట్టుకుమ్టున్నామన్న అలోచన లేకపోవడమే

    ReplyDelete
    Replies
    1. ఈ తాత్పర్యాలన్ని టపా కు సంబంధించినవే. వ్యక్తిగతమైన భావాలను ఇచ్చోట పంచలేదని బ్లాగ్ ముఖముగా తెలియజేస్తున్న శర్మాచార్య.. కాపోతే మీటర్ మటుకు స్యాడ్ ఉండటం మూలానా మీకలా అనిపించి ఉండవచ్చునేమో..!

      Delete
    2. Not adverse any thing

      Delete