Thursday, 10 June 2021

మృత్యుర్మృత్యుమ్ నమామ్యహమ్

  ఉగ్రం వీరం మహావిష్ణుం

జ్వలంతం సర్వతో ముఖమ్

నృసింహం భీషణం భద్రం

మృత్యుర్మృత్యుమ్ నమామ్యహమ్


శ్రీమనృసింహ విభవే గరుడధ్వజాయ,

తాపత్రయోపశమనాయ, భవఔషధాయ,

తృష్ణాది, వృశ్చిక, జలాగ్ని, భుజంగ, రోగ,

క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే 







23 comments:

  1. "నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు" అన్నారు‌ కదాా 🙂.

    Welcome back, శర్మ గారు 🙏.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      సీ. నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దురితజాలములెల్ల ద్రోలవచ్చు
      నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - బలువైన రోగముల్‌ బాపవచ్చు
      నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - రిపు సంఘముల సంహరింపవచ్చు
      నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దండహస్తుని బంట్లఁదఱుమవచ్చు
      తే. భళిర నేనీ మహామంత్రబలముచేత - దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు
      భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!






      Delete
  2. Replies
    1. శ్రీధరా!
      అర్ధం కాలేదు, జిలేబిని అడుగుదామంటే కనపడటం లేదు, మీకేమైనా తెలుసునా?

      కుశలమా? మీకు కుశలమేనా??
      ఇన్నినాళ్ళు కనపడక ఏదో ఏదో అడిగాను అంతే!

      కుశలమా? జిలేబి కుశలమేనా?












      Delete
    2. శర్మాచార్య వారికి నమస్సులు.. మీరు కుశలమనే తలుస్తున్నా.. ఇహ వివరాలకు వెడితే.. నేను బాగున్నాను.. దాదాపుగా రెండు మాసాల (విడుపు?) తరువాయి పలకరింపు.. అదిన్ను నరసింహ స్వామి వారి శ్లోకముతో.. అంచేతనే తమిళములో "నరసింహాయ" అని సంబోధించితిని.. అనట్టు బిజిలే అమ్మణ్ గురించిన వివరాలేవి తెలియరాలేదు సుమి.. వారి "వరూధిని" లో గాని "కందోత్పల కంది శంక చక్ర శంకర శాస్త్రి" వారి టపిలకు పద్యముల మాలలు లేవు.. బహుశ బాగానే ఉన్నారను కుంటాను ఆచార్య.. సర్వే జనః సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ. మా అమ్మ నాన్నలు, చెల్లి బావగారు,నా మేనల్లుడ్, నా కళత్రం, మా పుత్రికపుత్రాదులు సర్వం బాగుగానే ఉన్నారు.

      Delete
    3. శర్మాచార్య.. మీకోక ఆసక్తి కరమైన విషయం చెబుతాను.. మా మాతృక కు కొంచం సంబంధితమై ఉంటుంది మరి..
      ఐతే.. మహింద్ర కార్ల గురించి మీకు కాస్త అవగాహన ఉండే ఉంటుందనుకుంటున్నాను, ఐతే అందులో కొన్ని కార్ల పేర్లు మా భాషలో వేరే అర్థాలు వచ్చేలా ఉంటాయి..
      మహింద్ర రినాల్ట్ లోగాణ్ అనే కార్ పేరు వినే ఉంటారుగా.. లోగాణ్ అంటే మా మాతృక లో కూరా.. ఉదా.. భేజ్రార్ లోగాణ్ అంటే టమొట కూర.. అలానే మహింద్ర బోలేరో .. బోలేరో అంటే మా భాషలో పలికేటిది అని అర్థం.. రీసెంట్ గా వచ్చిన మహింద్ర మరాజ్జో ఐతే నవ్వాలో ఏడ్వాలో తెలియదు.. మరాజ్జో అంటే మా భాషలో చావటానికి రా అనే అర్థం వస్తది..! ఐతే ఎపుడైనా ఈ పేర్లున్న కార్లు కనబడితే ఓ స్మైల్ అలా వచ్చి వెళుతుంటుంది.. మా కార్ మారుతి సుజుకి యాల్టో ౮౦౦ ఎల్ఎక్స్ఐ.. నాకైతే మహింద్ర ఎక్స్ యూ వి ౩౦౦, సుజూకి ఎస్ క్రాస్, టయోట ఇన్నోవా క్రిష్టా, హ్యూందాయి వెన్యూ, టాటా టియాగో, కియా షెల్టోస్, నిస్సాన్ మాగ్నైట్ నచ్చుతాయి.

      Delete
    4. శ్రీధరా!
      కృషితో నాస్తి దుర్భిక్షం.
      ఆశావాదిని.అమ్మణ్ణి ఆచూకి కోసం ప్రయత్నిద్దాం.

      నాకు కాని భాష అవడంతో ఇబ్బంది అంతే!
      అందరం కుశలమే! అమ్మ కరుణ మీ ఆదరణతో

      అయ్యో! కార్ల గురించా! నన్నే అడిగారా! అంబాసిడర్ చూశాను, కొన్ని సార్లు ఎక్కి ప్రయాణం కూడా చేశానంతే! రైలెక్కడమే గొప్ప! ఇక మీరు చెప్పెదంతా నాకు గ్రీకు లాటిన్,విమానం ఎక్కి చూడలేదెప్పుడూ, బొమ్మల్లో చూడ్డం తప్పించి, పల్లెటూరు వాడిని కదండీ, ఏదో ఈ సారికిలా పోనిద్దురూ

      Delete
  3. ఆర్తరక్షణ పరాయణుడైన నరసింహ స్వామియే ఈ విపత్తులనుండి సర్వులనూ కాపాడాలి.

    బాగున్నారా?

    ReplyDelete
    Replies
    1. తల్లీ భారతి,
      అమ్మ కరుణ మీ దయ కాలాన్ని నడిపిస్తూ ఉంది.
      దయ ఉంచండి.



      Delete

  4. జిలేబి జాడ ఎవరికైనా తెలిస్తే చెప్పండి

    ReplyDelete
    Replies
    1. “జిలేబి” గారు తన వివరాలేమీ బ్లాగులోకంలో బయటకు చెప్పకుండా బహు జాగ్రత్త వహించారు కదా, ఇక వారి జాడ ఎవరికైనా ఎలా తెలుస్తుంది?

      “మాలిక” నిర్వాహకుల వద్ద “జిలేబి” గారి ఇ-మెయిల్ అడ్రస్ గానీ ఫోన్ నెంబర్ గానీ ఉంటే వారేమైనా ప్రయత్నిస్తే ఫలితం ఉండచ్చేమో?

      రోజూ పొద్దుటే బ్లాగుల్లో దర్శనమిచ్చే “జిలేబి” గారు ఇన్ని రోజుల నుండీ ఉలుకూపలుకూ లేకుండా ఉన్నారంటే ఆదుర్దా పడవలసిన విషయమే. “మాలిక” భరద్వాజ రంగం లోకి దిగితే బాగుంటుంది.

      Delete
    2. విన్నకోటవారు,
      కృషితో నాస్తి దుర్భిక్షం.
      ఆశావాదిని.

      Delete
    3. “మాలిక” అగ్రెగేటర్ నిర్వాహకులైన భరద్వాజ గారిని ఇ-మెయిల్ ద్వారా అడిగాను “జిలేబి” గారి ఫోన్ నెంబర్ ఉంటే ఇమ్మని. “జిలేబి” గారు తన గురించి ఏ వివరాలూ ఇవ్వలేదని చెప్పారు. కాబట్టి ఆ ఆశ లేదు.

      కావాలని మరీ ఎక్కువగా ముసుగు కప్పుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.

      Delete
    4. విన్నకోటవారు,
      జాడ తెలిసినవారు ఆచూకి చెపుతారనీ ప్రయత్నం. చూదాం, జిలేబీ కనపడుతుందేమో! ఆశా జీవిని.కబురు తెలియకపోతే అంతా కుశలమే అనుకోమన్నది పెద్దల మాట.
      ధన్యవాదాలు.

      Delete
    5. అంతే కదండీ. No news is good news అని ఆంగ్లంలోనూ నానుడి. అలాగే అనుకుందాం.

      Delete
    6. హాఖాషవాని వఱంఘళ్ ఖేంఢ్రం.. ణిళయంలో షమయం ఱెందు ఘంఠళ ఫఢి ణీంసాల్.. ఇషాఫఠం నూణ్‌ఢి ఱీళె ప్రషాఱమింథట్తో సమాఫ్టం.. టిఱ్ఘీ ఉడ్యం ఫ్రఛాఱంళో మిడియం వేవ్ ఎంప్లిటుడ్ మాడిలోషిన్ పై పునః ప్రారంభం.. అంథ వరక్ సేలవ్.. నమసుప్పు

      Delete
    7. ఈ ఉదయం ప్రసారం ఏమిటి, శ్రీధరా? ఇది ఏ భాష, బాబూ?
      ——————
      ఇదేనా మీరు చెప్పదలుచుకున్నది 👇? కరక్టేనా?
      “ఆకాశవాణి వరంగల్ కేంద్రం .. నిలయంలో సమయం రెండు గంటల పది నిమిషాలు .. విశాఖపట్నం నుండి రిలే ప్రసారమింతటితో సమాప్తం .. తిరిగి ఉదయం ప్రసారంలో మీడియం వేవ్ ఏంప్లిట్యూడ్ మాడ్యులేషన్ పై పునః ప్రారంభం .. అంత వరకు సెలవు .. (“నమసుప్పు” ఏమిటో అర్థం కాలేదు).
      ———————

      Delete
    8. నికచ్చిగా అదే వియన్నారాచార్య.. కాపోతే.. హ్యూమర్ ఇండ్యూస్ చేద్దామని ఒత్తు దీర్ఘాలు వాడాను.. తెలుగే.. ఇహ నమసుప్పు ఏమిటంటే.. నమస్‌కారం అంటాం కదూ.. ఆ కారం బదులు ఉప్పేశానంతే.. యాంప్లిట్యూడ్ మాడ్యూలేషన్..

      ఆకాశవాణి.. వరంగల్ కేంద్రం నిలయంలో సమయం ఏడు గంటలు దాటి పన్నెండు నిమిషాలు.. కథావాహిక శిర్షికన "ఢాంఢిమేల్" దీపావళి ప్రత్యేక ధారావాహిక గుంటూరు నుండి రిలే.. Radio

      Delete
    9. Thanks.
      “నమస్సుప్పు” 😁😁.
      మీరు // “ హ్యూమర్ ఇండ్యూస్ చేద్దామని ఒత్తు దీర్ఘాలు” // వాడారేమో గానీ ఈ కాలంలో అదే … చ్చాలా చ్చాలా … ఫాషన్ అయిపోయింది.

      Delete
  5. శర్మగారికన్న సరియైన చోటేది
    విన జిలేబిగారి విథము దెలియ
    శంకరాభరణము సభలోన నొకకొంత
    దెలియనగును వారిపలుకుబడిని .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      గత పదేళ్ళుగా నా blog జిలేబి ఎంతగా అభిమానించినది మాటలలో చెప్పడం కష్టం. జిలేబి కనపడకపోతే కనుక్కోవాలి కదు సార్!

      Delete
    2. వారు తమకు ముఖత పరిచయమేనని ,
      ఊరు కూడ దగ్గ రూరనిన్ని
      తికమక పడితిని , తెలియదా సరిసరి !
      ఎక్కడున్న క్షేమమే గదండి .

      Delete