పెళ్ళిపాట.
============
ఏ దేశాన్నించొచ్చేరయ్యా మా దేశానికి
మేడలు మిద్దెలు కలవారనీ మీవారు చెబితిరి
ఇంత అద్దె ఇళ్ళల్లో వున్నారని ఎరక్కపోతిమి IIఏ దేశాన్నించిII
ఇశాపట్నం కలకటేరని పిల్లనిస్తిమి
ఇంత కన్నం వేసేవాడని ఎరక్కపోతిమి. IIఏ దేశాన్నించిII
చెన్నపట్నం జమీన్దార్లని పిల్లనిస్తిమి
ఇంత చెప్పులు మోసేవాళ్ళని ఎరక్కపోతిమి IIఏ దేశాన్నించిII
కంటెలు కాసులు పెడతారని మీవారు చెప్పిరి
ఇంత,ఇంత, ఒక్క పుస్తెముక్క కడతాడని ఎరక్కపోతిమి IIఏ దేశాన్నించిII
జానపదం
జానపదం
ReplyDeleteతాతగారీ నడుమ వరసబెట్టి పెళ్లి గలాటాలలో పడినారు-
ఏమన్నా విశేషమా :)
జిలేబి
జిలెబి,
Deleteఆరు నెలలనుంచి తిని కూచుంటే, వ్యాయామం కూడా లేక బి.పి, సుగర్ డబల్ అదే విశేషం. డాకటర్ల ప్రదక్షిణ విశేషం :)
ఆమా.. ఆమా.. విశేషం ఎల్లారుకు.. అవనకు తెరియాద్.. ఈవనకు తెరియాద్.. అదేల్లామే కళ్యాణం జానపద పాటు దా.. మట్రుమ్.. ఇసుకపటం, అన్కాబెల్లం, రాజమందొర, బెంజ్వాడ, ఓరుగల్, సెకండ్రాబాదు సిరిపి కడల్ నన్డ్రి..! బిజిలే అమ్మణ్..!
ReplyDelete(విశాఖపట్నం లో సంద్రపు ఇసుక స్పెషల్, అనకాపల్లి లో బెల్లం స్పెషల్, రాజమహేంద్రవరం కాటన్ దొర హెవ్లాక్ స్పెషల్, విజయవాడ లో బెంజ్ సర్కిల్ స్పెషల్, వరంగల్ ఆలయాల్లో రాతి శిల్పాలు స్పెషల్, హైదరాబాద్-సికిందరాబాద్ లలో జంట నగరాలుగా పురాతనమైన హైదరాబాద్ తర్వాత సికింద్రాబాద్ స్పెషల్)
Deleteశ్రీధర్ జీ,
Deleteగోజీలు పూతరేకులు, పులసలు,బొంగులో చికెన్ స్పెషల్ చెప్పబోతే శానా ఉన్నాయి. :)
గుంటూరు గోంగూర, కొరివి కారం స్పెషల్, హైదరాబాద్ దమ్ చాయ్,బిరియాని స్పెషల్
శర్మ సర్.. నేను ఊరి పేరు ఆ ఊరి విశిష్టత తెలియ వచ్చేలా వాటినలా వ్రాశాను.. పోర్ట్ మాంటేయు లా.. జిహ్వాకో రుచి పుఱ్ఱెకో బుద్ధి అంటారు కదా.. ఏదేమైనా.. హైదరాబాది దమ్ బిరియాని,సంధ్య థియేటర్ కూడలిలో బావర్చి లో మెహ్ఫిల్ లో చికెన్ బిరియాని, బీచ్ రోడ్ పాండురంగపురం లో తందూరివాలా లో పనీర్ బిరియాని, సామలకోట-రాజమహేంద్రవరం బెల్లం డ్రై ఫ్రూట్ పూతరేకులు, మామిడి తాండ్రి, చార్మినార్ దరి ఇరాని ఛాయి, గుంటూరు ఘాటు మిరప బజ్జి.. హ్మ్.. పెళ్ళి పాట టపాలో విందు భోజన ప్రస్తావన.. :)
Delete~శ్రీత ధరణి అనబడే శ్రీధర్ భూక్యా
Deleteచీ చీ చీ నాన్‌వెజ్జు నో నో నో :)
బామ్మా!
Deleteఅందరూ తినకపోవచ్చు.
ఎక్కడో ఆస్ట్రేలియా దగ్గరనుంచి బయలుదేరి మా దగ్గరకొచ్చి న విలస, తీపి నీరు తాగి పులస అవుతుంది. పుస్తెలు తాకట్టు పెట్టైనా పులస తినాలని నానుడి. అసలైన పులస ఒక్కొక్కటి వేల ఖరీదు. పులస వండడం అందరికి చేతనైన పని కాదు. వండి కుమ్ముటామదం పోసి నిలవ ఉంచి రెండు రోజులు, మగ్గిన తరవాత నేమాను పంపడం గోజిల ప్రత్యేకత,స్పెషల్. అదే చాలా గొప్ప.
Deleteపులసా :). యాక్
ఒకే మత్స్యగంధి వాసన
:)
జిలేబి
పులస వండు పద్ధతి / నిలవ చేయు విధానం మీకెలా తెలుసు, శర్మ గారో ?
Deleteవిన్నకోటవారు,
Deleteఅదో కతండి :)
ఒక రాజకీయ మిత్రుడు. పులస వండించి ఎవరికో పంపడానికి పూనుకున్నాడు. ఆ సందర్భంగా ఒక వంట మనిషిని పిలిపించి ఒక బంగ్లా ఏర్పాటు చేసి పులస వండించాడు. ఆ సందర్భంగా కొంచం సూపర్వైజ్ చేయాల్సి వచ్చింది. చేపల కూరకి ఇంత హడావుడా అనుకున్నా. వంట మనిషిని ఇంటర్వ్యూ చేస్తే చాలా చెప్పుకొచ్చింది. ఆమదం పోస్తారంటే ఆశ్చర్యపోయా. ఇంకా చెప్పింది ఆ ఆముదం కూడా కుమ్ముటామదం అని. జీవితానుభవాలు :)తినకపోయినా తెలుసుకోడం తప్పు కాదు కదండీ :)
ఎంత మాత్రమూ తప్పు కాదు 🙂. కానీ ఆ పని మెళుకువల అనుభవం లేకుండా ఎదుటి వారి పనిని సూపర్వైజ్ ఎలా చేస్తారండీ సారూ? ఎదుటి వాళ్ళు మనల్ని ఆడించెయ్యరూ? ఆఁ, ఉత్త కఱ్ర పెత్తనమైతే అది వేరే సంగతి లెండి 🙂.
Delete
Deleteతాతగారా మజాకాయా "పెత్తనముతో "బీయెస్సెన్నెల్ నే గడగడ లాగించగాలేనిది పులస వండే వారో లెక్కా :)
జిలేబి
విన్నకోటవారు,
Deleteజిలేబి,
కర్రపెత్తనమే లెండి :)
శ్రీ జిలేబిసారు ఛీఛిఛీ యనిరంటె
ReplyDeleteరుచికిపడిరనేగ! రోజురోజు
పులస దొరుకునేమి ? జలపుష్పములటన్న
వెజ్జెగాని, నానువెజ్జుగాదు.
రాజావారు,
Deleteజిలేబికి అన్నీ ఇష్టమే అనుకుంటా :)
Deleteఅన్నీ యిష్టంబేమో
పన్నీరును చల్లి భళి లబక్కున ఓ రా
జన్నా మ్రింగు జిలేబీ
మిన్నగ గలదంచు స్వీటుమీటనుచు సుమీ :)
ఛీ, పాడు జిలేబు లసలు ,
Deleteచేపల్లో ' కొఱ్ఱమీను ' చేపిష్టంబౌ ,
మాపక్క పులస దొరకదు,
వేపుళ్ళకు చందవ కడు ప్రియమగు హితుడా !
రాజావారు,
Deleteమావాళ్ళూ కొఱ్ఱమీను,చందువా ఇష్టంగానే తింటారుగాని పులస స్పెషల్ కదా! పుస్తెలు తాకట్టు పెట్టైనా పులస తినాలంటారు మావాళ్ళు :) సంవత్సరానికి ఒకసారే దొరుకుతుంది. అదికూడా మాకే, మరెవరికి దొరకదు.
పులస కంటే పొట్టేలు రుచిగా ఉంటుందేమో ట్రై చెయ్యకూడదూ? వెల్లుల్లి వేసి ఒక వెర్షనూ వేయకుండా ఒక వెర్షనూ అయితే డబుల్ టేస్ట్!!☺️
Deleteవియ్యాల వారు ఇలాంటి పాటలు పాడుకుంటే వియ్యం కాస్తా కయ్యం అవుతుందీరోజుల్లో!☺️
Deleteసూర్య గారు,
Deleteపాత కాలంవి కదండీ :) ఇప్పుడు కయ్యాలేగా ఉన్నవీ :)
వెల్లుల్లి/నాన్ వెల్లుల్లి వెర్షన్ పొట్టేలు తలకాయి బాగుంటుందంటారండి :)
et tu, Sarma garu? మీరు కూడానా 😳😒😱 ?
Deleteఅసలు బ్లాగుల్లో ఆదివారం నాడు మాత్రమే మాంసం దుకాణం, చేపల బజారు తెరవడానికి అనుమతి అని రూల్ పెట్టాలి .... ఎక్కడా, భరద్వాజుడెక్కడా ?
బ్లాగరుల తలలు పాఠక
Deleteవాగరుల మెదళ్ళు తినుచు పచరించు మహా
భాగులకొకలెక్కగునా
తాగరుల తలలు తినంగ దడయురు రేలో ?
జిలేబి మెత్తళ్ళ దుఖానం
Deleteఆధిభారము మాత్రమే తెర్వా బడు
థెనుగు వారికి హమ్మ భడునా
రాజావారు,
ReplyDeleteలెస్సబలికితిరే