Thursday, 6 August 2020

విందు చేసినారు వియ్యాల వారింట పాట

"విందు చేసినారు వియ్యాల వారింట
విందు మాట చెబితే వింతగా తోచును ||విందు||(2)

-------

(1). పప్పూ ఉడకలేదు , చారూ కాగలేదు

అరటికాయ కూర ఊసే అందలేదు ||విందు||
----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేము ఏలాగు భోంచేతుమో
ఈ విందు మేమేలాగు భోంచేతుమో
------------
(2). వియ్యపురాలొచ్చి నెయ్య వడ్డించింది
నెయ్యి వేయ మన్న చెయ్యి తడవలేదు ||విందు||

(3). విస్తళ్ళు వేశారు, చారెడేసి వెడల్పు లేవండీ
హస్తంబు కదుపుటకు ఔరౌర చోటు లేదు ||ఏలాగు||

(4). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||

(5). కూరే వంకాయ కూర, దానితోపాటే పచ్చడి లేదు

కలహంబులా కారం గుచ్చెత్తీనారూ   ||ఏలాగు||

(6). ముక్కాబియ్యము వండిరి, దానిలోకి ముద్దపప్పే వేసిరి
చెప్పుకుంటే సిగ్గవుతుంది, చెయ్యికడిగే వీలు లేదు ||ఏలాగు||

(7). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు

గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||

(8). లడ్డూ, జిలేబీలా పాకములో వడ్డించెరంట
వడ్డించే వదినె గారి వడ్డాణం జారిపోయె ||ఏలాగు||
-----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేముఏలాగు భోంచేతుమో

ఈ విందు మేమేలాగు భోంచేతుమో

7 comments:

  1. తాతగారూ నిదుర లేచినారు :)

    కుశలమేనా ?

    జిలేబి

    ReplyDelete
  2. బాగుంది శర్మ గారు 👌👏.
    ఆ విడియో మరోసారి విన్నాను. ఇప్పుడు నాకు అర్థమైన రీతిని బట్టి ఒకటి రెండు సవరణలు 👇.
    =============
    చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు లేదు, ఏలాగూ భోంచేతుమూ
    ————
    లడ్డూ ....... పాకములో మడ్డి తేలిందంట
    ...... వడ్డాణం ఊడిపోయె
    ——————
    చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు లేదు, ఏలాగూ భోంచేతుమూ
    ==========
    🙏

    ReplyDelete
  3. సంస్కరింపబడిన ప్రతి.

    ————

    "విందు చేసినారు వియ్యాల వారింట

    విందు మాట చెబితే వింతగా తోచును ||విందు||(2)

    -------

    (1). పప్పూ ఉడకలేదు , చారూ కాగలేదు

    అరటికాయ కూర ఊసే అందలేదు ||విందు||

    ----------

    ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో

    చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు లేదు, ఏలాగూ భోంచేతుమూ

    ఈ విందు మేమేలాగు భోంచేతుమో

    ------------

    (2). వియ్యపురాలొచ్చి నెయ్య వడ్డించింది

    నెయ్యి వేయ మన్న చెయ్యి తడవలేదు ||విందు||

    (3). విస్తళ్ళు వేశారు, చారెడేసి వెడల్పు లేవండీ

    హస్తంబు కదుపుటకు ఔరౌర చోటు లేదు ||ఏలాగు||

    (4). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు

    గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||

    (5). కూరే వంకాయ కూర, దానితోపాటే పచ్చడి లేదు

    కలహంబులా కారం గుచ్చెత్తీనారూ ||ఏలాగు||

    (6). ముక్కాబియ్యము వండిరి, దానిలోకి ముద్దపప్పే వేసిరి

    చెప్పుకుంటే సిగ్గవుతుంది, చెయ్యికడిగే వీలు లేదు ||ఏలాగు||

    (7). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు

    గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||

    (8). లడ్డూ, జిలేబీలా పాకములో మడ్డి తేలిందంట

    వడ్డించే వదినె గారి వడ్డాణం వడ్డాణం ఊడిపోయె||ఏలాగు||

    -----------

    ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో

    చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందులేదు ఏలాగు భోంచేతుమో

    ఈ విందు మేమేలాగు భోంచేతుమో

    ReplyDelete
  4. కొత్తగా పెళ్ళై తొలిసారి అత్తారింటికి భార్యతో కలసి వెడితే
    నాకు కొత్త బట్టలు పెట్టలేదు సరికదా నా భార్యకు సైతం పెట్టలే

    ReplyDelete
    Replies
    1. sri(dharani)గారు
      ''ఒకరేమి పెట్టను మనమేమి తినను, ఊరుకోవే మనస వండుకు తిందా''మని సామెతండి.

      Delete
    2. మాబాగ శెలవిచ్చారు..! ఎదుటివారి నుండి ఆశించి భంగ పడేకంటే మనకున్న దానితో సరిపెట్టుకుంటే సరెసరీ..!!

      Delete