దధ్యోదనం
అసలు పేరు దధ్యోదనం కాని అలవాటుగా దధ్యోజనం అని వాడేస్తున్నాం. ఈ మాటే బాగుందా? దధ్యోదనం అంటే పెరుగన్నం అని అర్ధం. దధి+ఓదనమా ఏసంధి? ఏ సమాసం, ఏది విగ్రహ వాక్యం, శలవీయాలి .. సరే ఇక ముందుకెళదాం. కొంచం తెలివి తక్కువవారిని ఎగతాళీ చేయడానికి వాడే మాటలలో ఇదొహటి. ఆ ఎగతాళీ మాటలు, పప్పూ, ముద్దపప్పూ,పప్పు సుద్దా, చలిమిడి ముద్ద, దద్దోజనం. కాని ఇవన్నీ గొప్పవి, శక్తినిచ్చేవి అదేగాక వ్యాధి నిరోధాకాలు కూడా, ఉదయాన్నే మంచి ఉపాహారం. దీనికేంగాని అలాముoదుకుపోదాం :)
రాత్రి తోడు పెట్టిన పెరుగు తీసుకోండి, గిలక్కొట్టండి, కొంచం నీరు పోసి.అందులో చిటికెడు పసుపు వేయండి, తగిన ఉప్పు వేసి కలపండి. బాణలి లో కొంచం నెయ్యి వేయండి దానిలో శనగపప్పు,వేసి కొంచం వేగనివ్వండి, ఆతరవాత చీల్చిన పచ్చి మిర్చి,కొంచం ఎండు మిర్చి చేర్చండి, వేగుతుండగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలేయండి,జీలకర్ర, కరివేపాకు వేయండి, ఆ తరవాత వాము చేర్చండి, చివరగా ఆవాలు వేయండి. వేగిన పోపును మజ్జిగలో చేర్చండి, పోపు వేయించడానికి ఇనపమూకుడు వాడండి.ఇష్టమైతే చిన్న ఇంగువముక్క పోపులోవేయండి.
ఇప్పుడు ఈ మజ్జిగలో వేడిగా వండుకున్న అన్నం చేర్చండి.పైన కొత్తిమీరి వేయండి. బలెబలే దధ్యోదనం తయారు.
ఇది మంచి రుచికరమైన ఆహారము మరియు మందు కూడా ఎలా?ఇందులో మజ్జిగ మందు, పసుపు,ఇంగువ,ఉప్పు,అల్లం ,జీలకర్ర, ఆవాలు,కరివేపాకు,కొత్తి మీరి అన్నీ ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే వ్యాధి నిరోధకాలే...ఆ పై తమ చిత్తం
తిన రుచికర మీ దధ్యో
ReplyDeleteదనము, పులుసన్నము తిన్న తదుపరి , సంధా ?
మనకెందుకు చింత గురూ !
ఘనులున్నారందుకొఱకు కఱ్ఱల నిరువన్ .
రాజావారు,
ReplyDeleteవారానికో రోజు మార్నింగ్ టిఫినిదే :)
ఐతే అటుకులతో :) బాగుంటుంది
ReplyDeleteరాత్రి తోడు పెట్టిన పెరుగు తీసుకోండి,
తోడు పెట్టిన పెరుగనగా నేమి ?
మాకు తెలిసినదల్లా హెరిటేజు, ఆరోక్య, నందిని వగైరా వగైరా పెరుగే :)
సుక్కు_ రవా, రమ్_ :)
జిలేబి
బామ్మా
Deleteపెరుగు కూడా కొనుక్కోడమే?. సుబ్బరంగా పాలు కాచుకుని పెరుగు తోడెట్టు కూడదూ. ఇంత బద్ధకమా :) వామ్మో! ఓ తల్లో!
సుక్కులారం కదా సుక్కులారం
మీరు మరీనూ శర్మ గారు. అంత తీరికే ఉంటే మరో నాలుగు కంద పద్యాలు, బ్లాగుల్లో వ్యాఖ్యలే వ్రాసుకోరా?
Deleteఅవును “జిలేబి” గారికి హెరిటేజ్, ఆరోక్య, నందిని, ఆవిన్ (తమిళనాడు బ్రాండ్), మిల్మా (కేరళ బ్రాండ్) వగైరాలు సింగపూరులో కూడా దొరుకుతాయా 🤔?
అంతేనంటారా?
Deleteఇంకా ఎక్కడ సింగపూరండి బాబూ!దేశంలో కొచ్చేసి సంవత్సరం పైన ఐపోయుండ్లా
సంవత్సరం అయిపోయిందా? ఎంత ప్రచ్ఛన్నంగా తిరుగుతున్నారండీ వీరు? ఘటికులు సుమండీ. నివాసం మళ్ళీ రాణీపేటేనంటారా?
Deleteవిన్నకోటవారు,
Deleteప్రఛ్ఛన్న మేమండి పబ్లిక్గ్గానే తిరుగుతుంటిరిగదా. సంవత్సరం పైమాటే. పాత రోజుల్లో పరిశీలించేవాడిని. వదిలేశా,మానేసానండి.
Deleteపబిలికు రాయ! జిలేబీ
కబురుల కొంత సమయమ్ము కనులెట్టితి వా
కబు చేయుచు నైపీలను
సబూతు లున్నవి కెడ గ్రహచారముగ సుమీ :)
డిటెక్టివ్ నర్సన్ వర్సెస్ షెర్లాక్స్ తాత :)
జిలేబి
“వర్సెస్” కాదు “జిలేబి” గారూ. and అనండి.
Deleteషెర్లాక్ (శర్మ గారు) and వాట్సన్ (నేనన్నమాట) 🙂
ఉమ్మడి జాసూసీ 😎.
జిలేబీ, పుల్లపెట్టే బుద్ధి ఎక్కడికిపోతుందీ
Delete
Deleteఅబ్బే ఉన్నమాటంటే ..... :)
జిలేబి
Zilebi
Deleteఇట్టజెపితే జాసూసీ మొదులెట్టేదేనబయా
ఈ మధ్య వంటకాల గురించి చదివేటప్పుడు భయం భయంగా చదువుతుంటాను ఎక్కడ చివరికొచ్చేసరికి వెల్లుల్లి తగులుతుందేమోనని 😳. కానీ ఇది పెరుగన్నం గురించి కాబట్టి ధైర్యంగా చదివేశాను 🙂. (ఏమనుకోకండి, సరదాగా వ్రాశాను. ఎవరి రుచులు, ఇష్టాలు వారివి 🙏)
ReplyDeleteతయారు చేసే విధానం బాగా వివరించారు. నా అసలు సందేహం ఏమిటంటే మొద్దబ్బాయిలకు దధ్యోదనంతో పోలిక ఎలా వచ్చిందీ అని. ఇది కాస్త వివరించగలరు. ధన్యవాదాలు.
విన్నకోటవారు,
Deleteవెల్లుల్లి అనగానే మరీ రాకాసుల్లా కనపడుతున్నామేంటండీ బాబూ!కొన్నిటిలో వెల్లుల్లి స్పెషల్ అంతే!
ఈ పప్పు, పప్పు సుద్ద, చలిమిడి ముద్ద, దద్దోజనమ్ అని పిలిపించుకునేవారంతా మేధావులు.ఐతే వీరికి లోక జ్ఞానం కొంచం తక్కువుంటుంది.
మా క్లాసులో జనార్దనాచారి అని ఒక మిత్రుడు, వాణ్ణీ ఒరే దద్దోజనం అని పిలిచేవాళ్ళం. వాడేమో ఛ! ఏంటిరా ఇదీ అనేవాడు. బహు చక్కగా పాడేవాడు. ఏంటో లోకంలెద్దురూ
This comment has been removed by the author.
Delete
Delete“రాకాసులు” అనం లెండి. కానీ ఒక ఉదంతం చెబుతాను ఏమనుకోకండి.
ఆ మధ్య ఒక టీవీ వంటల ప్రోగ్రామ్లో (ఇంటావిడ చూసే ప్రోగ్రాం; టీవీ హాల్లోనే ఉంటుంది కాబట్టి చెవిన పడుతుంటుంది; నేను ఛానెల్ మార్చలేను, బయటకు పోలేను 😕) ఒక మహిళామణి వచ్చి “వెల్లుల్లి పాయసం” అనే వంటకరాజం చేసింది ప్రేక్షకుల వైపు దరహాసంతో చూస్తూ 😳. దాంతో భయం ద్విగుణీకృతమయిందన్నమాట 😳😳😳😳.
పేరు చెప్పి పుణ్యం కట్టుకోరాదాండీ?
Deleteఓ నమస్కారం పెట్టుకుంటాం, ఎప్పటికైనా ఉపయోగపడకపోతుందంటారా నమస్కారం?
Deleteవెల్లుల్లీ ! నరసన్న గారికి గుబుల్వేస్తోందటా నువ్వు తూ
టాల్లా తాకెద వంచు వంటల టపా, టాక్ షోల చూడంగనే
తల్లీ వారిని కాస్త అక్కసపుటుత్సాహమ్ముతో చూడవే
కిల్లాకిద్దియె నీకు మాట వినుమా కిక్కున్న రోగఘ్నమా!
జిలేబి
వెల్లుల్లి పాయసాన్నపు
Deleteతిల్లానా జూచి నరసధీరుడు డంగై
మల్లీ మల్లీ వండిం
చుల్లము తనియంగ దినియె, నూహా? నిజమా ?
దధ్యోదనం లేదా పెరుగన్నం recipe బాగుంది శర్మ సర్. Especially in summer it is very beneficial.
Deleteవిన్నకోట sir
వెల్లుల్లి తో పాయసం చేస్తున్నారా. ద్యావుడా. త్వరలోనే వెల్లుల్లి జిలేబీ లు లడ్డూలు కూడా చేస్తారేమో.
ఉల్లి వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది అంటారు కానీ నాకు సహించదు.
శివానంద స్వామి onion and garlic are no to be taken అని చెప్పారు.
బుచికిగారు,
Deleteనేటి కాలానికి ఇది అవసరమని చెప్పానంతే :)
వెల్లుల్లి పాయసమా? ఏది ఎలాతింటే బాగుంటుందో అలాగే తింటే అందం,ఆనందం. ఉల్లిపాయసం తింటామంటే కాదనేది లేదు కదా!లోకో భిన్న రుచిః కదా. ఉల్లిపాయసం తినే వారికి శతకోటి వందనాలు.వెల్లుల్లి తిననివారికి అనంతకోటి నమస్కారాలున్నూ :) చిన్న మాట ఏమనుకోకండీ, అసలు ఇలా వెల్లుల్లి తినం,తినం అని భీష్మించేవారంతా దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నారబ్బా :) దాన్లో ఏదో ఉంది, వాళ్ళు అనుభవించేస్తున్నారు, మనకి కాకుండా పోయిందే అని బాధ కదూ :)
సాత్వికులు తినరు, వారికి వందనం. మా లాటి తామసులు తింటాం :) తినే ఆహారాన్ని బట్టి మనసు కదా :)
బుచికి గారు,
Deleteవెల్కం టు “వె.వె. క్లబ్” 🙂.
విన్నకోటసార్,
Deleteమీ క్లబ్బులో మెంబర్లు పెర్గుతున్నారని సంకలు గుద్దుకోకండి సార్! మేం తక్కువైనా బలవంతులం, మొండివాడు రాజుకంటే బలవంతుడు కదండీ :)
బుచికిగారు,
మరచిపోయానూ, ఉల్లి జిలేబీ వహ్వా! ఛీ !!పాడుకంపు జిలేబీ :)
'ఉల్లిజిలేబీ వహ్వా!'
Deleteమల్లా 'ఛీ!!పాడుకంపు' మాట ఇదేలా?
అల్ల 'జలేబీసారు'కు
చిల్లులువడునేమొ గుండె, శ్రీశర్మాజీ !
రాజాసాబ్,
Deleteజిలేబి గుండె ప్లాటినం, బహు కొద్దిగా దికే లోహం :) అంటే కాదండి, ఎంత వత్తిడికి వేడికి కూడా కరగనిది :) మరి ఉల్లి జిలేబి కంపేకదండి, మల్లి జిలేబీ కాదాయె :) ఎంతైనా మన జిలేబి కదండీ :) అసహ్యించుకోలేం. :)
Deleteప్లాటిన మండి జిలేబీ
పాటి యుడుకు గుండెకాయ పగలదు కనులం
దాటుచు చుక్కై నా రా
దీ టక టకయంచు వ్రాయు తెలిగంటి గడిన్
జిలేబి
ఎన్నమ్మా సౌక్యమా
Deleteఎప్పిడి ఇరికిది జిలేబి?
జిలేబి గుండెదా ప్లాటినం.ధైర్యం.
మనసుదా తంగం,తంగం. వెన్నపూస మాదిరి, దుడ్డు అడగాబాకు. :)
నోరుదా ఉల్లి కంపు. ఛీ చీ జిలేబి :)
Deleteప్లాటినము గుండె ధైర్యము
నోటడగకు చిల్లిగవ్వ నోచుకొనుట యే
నాటికి? తంగమగు మనసు !
నోటి గదురు ఉల్లి కంపు నొవ్వు జిలేబీ
జిలేబి
గుడ్ నైట్ :)
జిలేబి
Delete/గుడ్ నైట్ :)/
ఇదేంది అబ్బోడా!!! ఏంది కత? సూణ్ణే లేదూ
మా ఇంట్లో సింపుల్ గా దద్దోజనం అంటాం.
ReplyDeleteనిన్న ఇంటర్నెట్ లో తయారీ విధానం వెతికా. పెరుగుకంటే ముందు వేడిపాలు వేసి కలపమంటున్నారు ఏమిటో!
అయినా అన్ని పదార్ధాలూ ఉన్నా తయారు చెయ్యడానికి 45నిముషాలు పడుతోంది. ఇక పాలు తోడుపెట్టడం నుంచీ మొదలుపెడితే ఎప్పటికి అవుతుంది చెప్పండి!
సూర్యజీ,
ReplyDeleteచాలా మంది దద్దోజనం అనే అంటారండి. కొంతమంది దద్దోదనమూ అంటారు. అసలు మాటేంటీ అని వాకబు చేశానంతేనండి.ఇంతకీ ఇదేం సంధి సమాసం,విగ్రహ వాక్యం ఒక్కళ్ళూ చెప్పలేదు :)
వామ్మో! తినేది మనం,ఇప్పుడు తినవలసిందీ. రుచి కరమైన మందు ఆహార రూపంలో. దీనికి కూడా సమయం లెక్కేస్తే....కణ్ణా :)
ఏంటో! రోజూ మేం రాయడమేనా మీరూ రాయచ్చుగా :) మందో , మాకో :)
మిత్రులు శర్మ గారు,
Deleteదధి + ఓదనము = దధ్యోదనము. యణాదేశసంధి అంటారండి.
శ్యామలీయంసార్,
Deleteధన్యవాదాలు సార్
ఈ సంధులు,సమాసాలు గణాలూ, యతులు ప్రాసలు బుర్రకెక్కలేదండీ,చిన్నప్పుడు, ఇప్పుడున్నూ :) లేకపోతేనా జిలేబీని ఇటుకలతో కొట్టేసుండే పనిబళ్ళా