Saturday, 18 July 2020

కరోనా తో వ్యవసాయం

18.4.2020
ముంజలగెలలు తో తాడి

18.6.2020
నారుమడి సిద్ధం చేస్తున్న రైతు

11.7.2020

కాలవ. పచ్చని చేలు
11.7.2020
ఊడ్చిన చేలు
11.7.2020
ఊడ్చడానికి నారు కట్టలు పడేసిన చేను
11.7.2020
వెదజల్లిన చేను

11.7.2020
ఊడ్పుకు వెళుతున్న కూలీలు

కాలవ. 11.7.2020
11.7.2020
కూలీల మోటార్ సైకిళ్ళు
  

14 comments:

  1. కనులకింపుగా ఉంది చూడ్డానికి. ఎంతైనా పచ్చటి చేలు, కాలువల అందమే అందం.

    అవును శర్మ గారు, గ్రామాల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? పట్టణాలలో ఉన్నంత విస్తృతంగా ఉండకూడదే ?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      అందమె ఆనందం,ఆనందమె జీవిత మకరందం. పచ్చటి చేలు,జేగురు రంగులో కలిగిననీళ్ళు, పల్లెపట్టుల అందం ఈ సమయంలో. మట్టిమనుషులం కదండీ అందుకు అవే అందంగా కనపడతాయి మాకు :)

      పల్లెలలో కరోనా లేదండి, నెమ్మదిగా పట్టణాలనుంచి దిగుమతి అయింది. నేటికి మావూరిలో కేస్ లు ఇరవై మూడట,తూగోజిలో ఐదు వందలకి చేరేయంటున్నారు.తూగోజిలో మూడు హాస్పిటల్స్ డెసిగ్నేట్ చేశారు. కాకినాడ జి.జి.హెచ్,రాజానగరం జి.ఎస్.ఎల్, అమలాపురం హాస్పిటల్. నిన్న రేపిడ్ టెస్ట్ కి బస్ పెట్టింది ప్రభుత. నూట ఎనభై మందికి టెస్ట్ చేస్తే ఇరవైమూడు పాసిటివ్ తేలేయట.

      లక్షణాలు లేనివారు కూడా పాసిటివ్ కనపడుతున్నారటండి.ఏమో ఏమగునో, వ్యవసాయం నడిచి గింజలు దక్కకపోతే నవంబర్ తరవాత అందరం పస్తులేనండి,వ్యవసాయానికి కష్టం ఎక్కువ కనపడుతోందండి. రైతు ప్రయత్నం జరుగుతోంది, ఆ తరవాత తినే వారి అదృష్టం కదండీ!

      Delete


  2. తాతగారే గ్రామమునకు పోయినారు ?



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi,

      మావూరు

      Delete


    2. మా వూరా మావూరా మామీ వూరా మా మీ వూరా :)



      జిలేబి


      Delete
    3. Zilebi,

      అదే అదే అదే :)

      Delete

  3. శర్మ గారు,
    సాంప్రదాయ సాగు పద్ధతులతో ఏం తిప్పలు పడుతుంటారు గానీ ఈ విడియోలోని కిటుకులు ఏమన్నా ఉపయోగ పడతాయేమో ఓసారి చూడండి.

    వ్యవసాయ పద్ధతులకు ఆధునిక సుళువులు

    ReplyDelete
  4. Replies
    1. పై విడియో లింకు పని చెయ్యకపోతే ఇది కాపీ &
      పేస్ట్ చేసి చూడండి 👇.
      😃😃


      https://www.facebook.com/groups/1146332668726421/permalink/4772061549486830/?sfnsn=wiwspwa&extid=l3b1BLbOHJPK00KQ&d=w&vh=i

      Delete
    2. విన్నకోటవారు,
      లింక్ చూశాను,బాగుంది. మా దగ్గర ఊడుపు ఒకటే ఎక్కువ. ఊడుపు కోసం చాలా రకాల ప్రయోగాలు చేసేశారు మావాళ్ళు. ఈ పీట చిటకా బాగున్నట్టే ఉంది. రేపు కలుపు తీతకి పని రావచ్చేమో. ఈ సీజన్ లో ఏవీ యంత్రాలు పనికిరావండి, ఇక్కడ కారణం, మట్టిలోని జిగురు ప్రభావం, యంత్రం కూరుకుపోతుంది, అందుకు వాడరు. ఇప్పుడు ఒక ప్రయోగం చేశాను, పాతదే....దమ్ము చేస్తాం, ఆ పైన నీరు దిగగొడతాం. మడిగా మార్క్ చేస్తాం, విత్తనాలు జల్లేస్తున్నాం, ఇది అమలు చేయించా. ఒక కూలి మనిషికి ౭౫౦ నుంచి వెయ్యి దాకా ఉంది రేటు రోజుకి. కూలీలు దొరకడం లేదు. ఇలా ఉంటే రైతేం చేయగలడో చెప్పలేను. రైతు కాడి వదిలేస్తే, కరువు తప్పదు.

      Delete
  5. శర్మ గారు
    ఇవాళ టీవీ వార్తల్లో చెప్పారు .... గోదావరి జిల్లాల్లో పంటకాలువలను కూడా కొంత మేర ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నారటగా? నిర్మాణాలకు తామేమీ అనుమతులివ్వలేదని నీటిపారుదల శాఖ వారి ఉవాచట. ఆక్రమణల వల్ల దాదాపు 50 వేల ఎకరాలకు నీరు అందట్లేదని టీవీ వారి ఉవాచ.

    అసలు మనుషులకేమయ్యింది? వ్యవసాయానికి లైఫ్ లైన్ లాంటి పంటకాలువలను కూడా బతకనివ్వమంటే ఇంగితం పూర్తిగా నశించినట్లే అనుకోవాలి. ఉచ్చం నీచం వదిలేసినట్లున్నారు జనం.

    కాటన్ మహాశయుడి ఆత్మ క్షోభిస్తూ ఉండుంటుంది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఇది కొత్తా కాదు,వింతా కాదు! స్వాతంత్ర్యం వచ్చినది మొదలు జరుగుతున్నదే! వారికిప్పుడేదో అవసరం వచ్చి ఉంటుందండి

      Delete
    2. మరేం పరవాలేదు. ఏదో ఒకరోజు కుండపోతగా వర్షాలు కురిస్తే అడ్డుగా కట్టిన మేడలన్నీ కొట్టుకుపోతాయి. అపుడుగాని మనుషులకు తిక్క కుదరదు.

      Delete
    3. సూర్యజీ,
      అలా అంటారా. వారి పునాదులు గట్టివండీ :)

      Delete