వద్దురా చిన్నయ్యా!వద్దురా చిన్నయ్యా!!
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా!
వద్దురా చిన్నయ్యా!!
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా!
వద్దురా చిన్నయ్యా!!
కరోన ఇళ్ళకి కదలివచ్చేవేళ ముదిపాపలను చూసి పట్టుకెళ్ళేవేళ
వద్దురా చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!
కట్టిన మాస్కేమో దగ్గుకే మాసేను పాలుగారే మోము తుమ్ముకే వాడేను
వద్దురా వద్దురా కన్నయ్యా!
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!
కరోన తగిలిన కానివాళ్ళేనని చీలివాళ్ళంతా అల్లరి చేసేరు
వద్దురా చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!
ఆడుకోవలెనన్న,పాడుకోవలెనన్న
ఆదటను నేనున్నా,అన్నిటను నీదాన (సెల్ఫోన్)
వద్దురా! వద్దురా!!వద్దురా!!!చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!అయ్యా!!!
వద్దురా చిన్నయ్య!చిన్నయ్య!!
తొలి ఏకాదశి సందర్భంగా,శుభకామనలతో!
కంటైన్మెంట్ జోన్ లో గడుపుతున్న సందర్భంగా!!
బ్లాగు మరల ఓపెన్ ఐన సందర్భంగా!!!
With due respects to all concerned.
అతలాకుతలంగా ఉన్న సమకాలీన పరిస్థితులకు తగిన పాట వ్రాశారు, శర్మ గారు. చక్కగా కుదిరింది.
ReplyDelete// “ బ్లాగు మరల ఓపెన్ ఐన సందర్భంగా!!!” //
ReplyDelete🙂 అలవాటు పడిన వ్యవహారం కదా, ఒదుల్చుకోవడం అంత సులువు కాదని మీ లాంటి పెద్దలకు మేం చెప్పేదేముంది.
భారత ప్రభుత్వం వారు చెప్పే “ఘర్ వాపసీ” లాగా నన్నమాట 🙂.
పునః స్వాగతం.
విన్నకోటవారు,
ReplyDeleteకరోన ఏభై మీటర్ల దూరంలో ఇంట్లో జాయపతి హైదరబాదునుంచి తెచ్చుకున్నారు. పతిని పట్టుకుంది. అతన్ని హాస్పిటల్ కి తీసుకుపోయారు. జాయ బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. కరోన జాయని వదిలేసి పతినే పట్టుకుందండి. జాయ ఎక్కడికి వెళ్ళలేదు,ఇంట్లో ఉండలేదు, ఇంటికెవరూరారు.
మా సంగతేంచెప్పను? ఆ సందర్భంగా కదలిన పేరడీపాటిది.నచ్చినందుకు ధన్యవాదాలు.
మానెయ్యాలంటే చెప్పలేనండి, ఆగుతూ,సాగడం తప్పదుకదండీ!బ్లాగులు రెండూ సాంకేతిక కారణాలతో పని చేయటం లేదండి. దగ్గరగా నెలైందనుకుంటా. ఏం చేసినా కుదరలేదు, రోగీపాలే కోరేడు, వైద్యుడూ పాలే కోరేడని బ్లాగుల్ని వదిలేశా, ఇదే బాగుందనుకున్నా కూడా. ఈ పేరడీ పాట రెడీ అయింది.ఏదో ఏదో చేశానుగాని బ్రవుసర్ మార్చి చూడలెదు. బ్రవుజర్ మార్చి చూదామని అనిపించింది, నిన్న. కొత్త బ్రవుసర్ తో చూశా, క్లిక్ అయింది అదండి సంగతి.రెండో న్లాగు ఇంతే సంగతులండి
ధన్యవాదాలు.
పేరడీలు మొదలు పెట్టారన్నమాట. శుభం.
ReplyDeleteజాగ్రత్త మాష్టారూ. కరోనా ఏభై మీటర్స్ లో ఉందన్నారు. జగమెరిగిన వారు మీరు. మీకు మేము చెప్పడం ఏమిటి? మా చాదస్తం కాకపొతే. ....... మహా
బులుసువారు,
Deleteనమస్కారం సార్, చాలాకాలం తరవాత కలిశాం.
కరోన వచ్చిన ఇంటిలోని ఆమెకు కరోనా లేదు, కాని ఆమెకు క్వారంటైన్ తప్పదు. ఎవరూ ఆ ఇంటికి వెళ్ళలేరు, ఆమె ఎవరింటికి రాలేదు, అందుకు ఆమెను వంతులవారిగా అందరమూ పలకరిస్తున్నాం, ఫోన్ లో. ఆమెకు కావలసినవి సమకూరుస్తున్నాం. ఆమె ఒకతే, వారెవరింటికి వెళ్ళలేదు, ఎవరూ వారింటికి రాలేదు కనక ఆ ఇల్లొకదానిని రెడ్ జోన్ గా గుర్తించి మమ్మల్ని కంటైన్మెంట్ జోన్లో పడేశారు. మా పైది బఫర్ జోన్.
ఆమె మానసికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎవరో ఒకరం పలకరిస్తూనే ఉన్నాం. కావలసినవి అందిస్తున్నాం. ముఖ్యంగా ఆమె ఒంటరికాదనే భావాన్ని కలగజేసే ప్రయత్నమే చేస్తున్నాం. అతను యువకుడు కనక బాగానే ఉన్నానని చెబుతున్నట్టు వార్త తెలుస్తోంది.
ఇక నేనంటారా, సంవత్సరంన్నర పైగా లాక్డవున్లోనే ఉన్నానండి.పిల్లలు బయటికి తిరక్క తప్పటం లేదు. వారిని ప్రతిసారి ఎక్కడికి అని అడగలేక, అడగక ఉండలేక నా బాధ ఏం చెప్పుకోను?ఆ సందర్భంగా పుట్టినదే ఈ పేరడీ పాట సార్.
మిత్రులు శర్మ గారు,
ReplyDeleteకుశలమా? బహుకాల దర్శనం! పేరడీలూ కూడా మొదలుపెట్టారన్నమాట. బాగుంది బాగుంది.
శ్యామలీయం వారు,
Deleteనమస్తే! కుశలమే!!
//పేరడీలు కూడా మొదలుపెట్టేరనమాట,బాగుంది,బాగుంది//
తిరుపతి వేంకటకవులు ఒక సంస్థానం లో ఇలా అన్నారు.
ఉ// సంగరశక్తి లేదు వ్యవసాయము సేయుట సున్న సంతలో
నంగడి వేసి యమ్ము టది యంతకు మున్నె హుళక్కి, ముష్టికిన్
బొంగు భుజాన వైచికొని పోయెద మెక్కడికేని ముష్టి చెం
బుం గొనిపెట్టు మొక్కటి యమోఘ మిదే కద! దంతిరాణృపా !
అటుల నేటికి నాకు
చదువా...లేదు, మరో భాష... రాదు, దేవుడా అందామంటే.... అంతా స్వయం కృషే అనే మూర్ఖత :) తెర, తెరవేల్పులంటే....అదో రకపు విముఖత,రాజకీయమా....గుండు సున్న,ఏదో ఒక పార్టి తరఫున వాదించే శక్తి...హుళక్కి,ఇంటి పై రాయి విసిరి, తల ఓగ్గ గల నైపుణ్యమా..లేదు
అందుకు తెనుగులో పేరడీ కవితా పితామహులు జరుక్ శాస్త్రి గారు చెప్పినట్టు పేరడీ చెప్పాలని చిన్న కోరిక. అదీ అవసరం పడే సుమ్మా!కరోనా ఏభై మీటర్ల దూరంలో కొలువు తీరింది, పిల్లలేమో బయటికి తిరుగుతున్నారు, అవసరం కొద్దీనీ, బయటకు వెళుతున్న ప్రతిసారి వారిని ఎక్కడికి?,ఎందుకు? అని ప్రశ్నించక తప్పటం లేదు. అడక్కపోతే ముప్పు, అడిగితే తప్పు అన్నచందమైపోయింది. పిల్లలు విసుక్కుంటారేమో అనే భయం పట్టుకుంది, అందుకు బతిమాలడం మంచిదనుకుంటే ఈ పాట గుర్తొచ్చింది, పేరడీ రాసానండి.....ఇక ముందు రాయనండి,మన్నించండి
ధన్యవాదాలు
ముందును వ్రాయగ నౌను ప
Deleteసందుగ మరి యందుకేమి సందేహము మీ
కెందుకు బిడియం బిక మా
కందించుడు పేరడీలు హాస్యం బొలుకన్
శ్యామలీయంగారు,
Deleteసిగ్గొదిలేస్తే సంగీతం,చేతకాకపోతే సర్వే అని సామెతండి :)
ReplyDeleteకష్టేఫలి వారికి
బహు కాల దర్శనం.
టేక్ కేర్ అని చెప్పటం తప్పించి వేరే యేమి చేయగలము?
May be a few tips There is a kashayam called in Tamil 'kabasura kudi neer' ( I don't know what to call in Telugu- may be కఫ జ్వర కషాయము) - search if available the same or equivalent keep drinking regularly as immunity booster.
Take care
జిలేబి
జిలేబి గారు,
Deleteకషాయం తాగుతున్నాం, ఎవరూ చేయగలది లేదు, ఎవరి గోలవారిదే సుమా! మీరు జాగర్త, దేశంలో ఉన్నారుగా, మీరు లేప్ టాప్ ముందు కుర్చీలోంచి కదలరని తెలుసనుకోండి :)
ధన్యవాదాలు
చెప్పినమాట వినకుండా పిల్లలు ఊరికే బయట తిరిగితే ఓ పని చెయ్యండి. వాళ్ళు ఇంట్లోకి వస్తున్నప్పుడల్లా శానిటైజర్ తో హొలీ ఆడేయ్యండి!
Deletehttps://www.google.com/amp/s/www.thehindu.com/sci-tech/health/siddha-research-papers-throw-light-on-efficacy-of-kabasura-kudineer-in-managing-covid-19/article31868238.ece/amp/
ReplyDeleteబోనగిరి గారు,
Deleteఇప్పటికే మిరియాలు,ధనియాలు,జీలకర్ర, అక్కల కర్ర,వాము,శొంఠి, పిప్పలి,దాల్చిన చెక్క,ఎండు ద్రాక్ష వగైరాలతో తీసిన కషాయంలో తేనె కలుపుకు తాగటం అలవాటేనండి.అవతల బ్లాగు అందుబాటులో లేదు, మీమాటే నిజం. ధన్యవాదాలు
Sarma gariki namaskaram
ReplyDeleteవాజసనేయగారు,
Deleteపదేళ్ళకితం ముచ్చటగా మూడు టపాలతో చాపచుట్టేసిన వైనం చూసి ముచ్చటేసింది. ఏమంత్రం వేసి వదుల్చుకున్నారో చెబితే శతసహస్ర వందనాలు, ఆ మంత్రం ఏదో చెప్పి పుణ్యం కట్టుకోరాదూ :)
ఏం? బ్లాగులు రాయకుండా పారిపోదామనే? అమ్మా!హన్నా!
Deleteసూర్యగారు,
Deleteవాజసనేయగారు పదేళ్ళకితం రెండునెలల్లో మూడు టపాలు రాసి బ్లాగ్ చాపని విజయవతంగా చుట్టేసేరు.
మరి మీరో ఏడేళ్ళ కితం తెలుగుతంబి బ్లాగుని చాప చుట్టేయలేదూ! :) నేషన్ వాంట్స్ టు నో అనగానే ప్రోఫైలూ చాప చుట్టేసేరే! :)
నిన్నగాక మొన్న మూడు రోజుల్లో రెండు టపాలేసి విజయవంతంగా బ్లాగ్ చాప చుట్టేసిన పిచ్చి రాముడు ఎక్కడో బ్లాగ్ బేతాళికని చూసి ఊష్ణం తెచ్చుకుని ఉంటారు. టేక్ ఇట్ ఈజీ :)
అవునండీ శర్మ గారు, కరక్టే, ఆ రెండు టపాలతోటే అంత ఫాన్-ఫేర్ తెచ్చుకున్న “పిచ్చి రాముడు” గారు ఏమైనట్లు చెప్మా?
Deleteనా ప్రొఫైల్ ఏమీ మార్చలేదు. అది అప్పుడూ ఇప్పుడూ అలానే ఉంది.
Deleteమీ బ్లాగు “తెలుగు తంబి” లో అసలు మీ ప్రొఫైలే లేదుగా? ఇంక మార్చడం మార్చకపోవడం అనే ప్రశ్న ఎక్కడుంది? ☝️
Deleteసూర్యగారు,
Deleteసూర్య అనే మీ పేరు మీద ఒత్తితే మీ ప్రొఫైల్ కనపడేది,నిన్నటిదాకా, ఇప్పుడు ప్రొఫైల్ లేదంటోంది. మీ ప్రొఫైల్ మీ ఇష్టం :)
విన్నకోటవారు,
Deleteతెలుగుతంబిలో ప్రొఫైల్ లేనే లేదు,పాపం పిచ్చిరాముడు, ఎందుకొచ్చిన తంటా అని వదిలేసి ఉండచ్చు. మరెవరో అనుకుంటున్నారుగా అనుకున్నారేమో కూడా! :)
శర్మగారూ, సత్య ప్రమాణంగా నేనేమీ నా ప్రొఫైల్ ని టచ్ చెయ్యలేదు మహాప్రభో! నేనెప్పుడూ ఎవరిపేరుమీదా ఎలుకతో ఒత్తి వారి ప్రొఫైల్ చూడలేదు కనుక అసలు ప్రొఫైల్ పేజీ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు.
Deleteఅందుచేత నా ప్రొఫైల్ లో ఏ మార్పులూ ఉండకూడదు. మీరిలా "నిన్న కనిపించి ఇవాళ కనిపించట్లేదు" అంటే ఏ హ్యాకరమ్మో ఆడుకుంటోందేమో అని భయం వేయుచున్నది. వారాంతంలో తీరిక చూసుకుని ఓసారి సరిచూసుకుంటాను.
నేనెప్పుడూ ఎవరిపేరుమీదా ఎలుకతో ఒత్తి వారి ప్రొఫైల్ చూడలేదు -. సూర్య గారు. Funtastic.
Deleteసూర్య పైన ఎలుకను నొక్కి చూసాను. ఖాళీ గా ఉంది. నిజమే.🐀🐁🐀🐁
Deleteసూర్యునికీ ఎలుకకూ పడదండీ :)
సూర్యా సార్!
Deleteకేబేజి కేజి అరవై అమ్ముతున్నట్టుంది మా దగ్గర :)
నా ప్రొఫైల్ అప్పుడేట్ చేసా. గూగుల్ వాడు ఎప్పుడు పెట్టాడో గాని "షేర్ యువర్ ప్రొఫైల్" ఆప్షన్ పెట్టాడు. ఇప్పటివరకూ అది ఆఫ్ లో ఉన్నట్లుంది.
Deleteఅలాగే మీ ప్రొఫైల్ కూడా చూసా! జగనన్న పథకాలన్నింటికీ అర్హమైనంత పేద ప్రొఫైల్ లా ఉందే! ఏమీ సమాచారం లేదు !!
Deleteజగమెరిగిన తాతకి జందెమేల :)
Deleteకేబేజి కేజి అరవై ....
చెవి అంత పెద్దదా :)
జిలేబి
సూర్యాజీ
Deleteపిలుపు మారింది చూశారా :)
ఆప్షన్ చిన్నప్పటిదే :)
దానికేంగాని, ఈ టపాలోనే కొంత ప్రొఫైల్ చెప్పుకున్నా చూడలేదూ :) ఇంతకాలానికి మీరొక్కరు నా ప్రొఫైల్ చూసి పూర్ గా వుందని నిజం చెప్పినవాళ్ళు :)జగనన్నకి చెప్పి ఒక ఎం.ఎల్.ఎ పదవీ ఒక మూడు కోట్ల రూపాయల ఇల్లూ ఇప్పించకూడదూ రిచ్ గా ఉంటుంది కదా :) చెప్పుకోడానికి చూడ్డానికీ
ఈ రోజుల్లో మూడు కోట్ల రూపాయలకు అంత గొప్ప ఘనమైన
Deleteఇల్లేమీ రాదు, శర్మ గారు. మరో మాట చెప్పండి 🙂.
మాటనేసేను కదండీ, అల్ప సంతోషిని, ఈ సారికిలా పోనిద్దాం :)
Deleteశర్మగారూ! తాదూర సందులేదుగాని మెడకో డోలు అన్నట్లు జగనన్న ఇచ్చేలా ఉంటే నేను 2కోట్లకే సర్దుకుపోతా. పదవి కూడా నాకక్కరలేదు. ప్రజాసేవ చేయాలన్న కసి అంతకంటే లేదు.
Deleteవిన్నకోటవారు మాత్రం బాగా రిచ్చి. బహుశా వరలక్ష్మీవ్రతమహిమ అనుకుంటా. 3కోట్లలో దొరికే ఇంటికి కూడా పెదవి విరుస్తున్నారు!
సూర్యాజీ
Deleteమీరేమో నేను పూర్ అన్నారు ఒప్పేసుకున్నాను. చిన్న కోరికలు రెండు కోరాను, ఇప్పించగలరనే నమ్మకం కదా :) ఒక ఇల్లు మూడు కోట్లు కదా! తక్కువండీ అని హెచ్చరించినా అన్నమాటకి కట్టుబడిపోయాను కదండీ, ఇక ఎం.ఎల్.ఎ ఐతే ఏదో సంపాదించుకోవచ్చనిగాని, ప్రజాసేవ కాకరకాయ చేస్తానని చెప్పానా:)
ఇయ్యా ఇప్పించగల
అయ్యలకే గాని అన్యులకేలా
రొయ్యకు లేవా బారెడు మీసలు
కాకోదర కుందవరపు కవి చౌడప్పా
అన్నారు చౌడప్ప కవి గారు.
ఆశ పెట్టేరు అడిగాను, ఆ పై మీ ఇష్టం, మీకు మీసాలున్నాయనే అనుకుంటున్నాను :)
@"ఇక ఎం.ఎల్.ఎ ఐతే ఏదో సంపాదించుకోవచ్చనిగాని, ప్రజాసేవ కాకరకాయ చేస్తానని చెప్పానా:)"
Deleteచూసారా చూసారా.. మీలో ప్రజాసేవ చెయ్యాలనే "కసి" ఎంతుందో?!☺️
ఇయ్యగలవాడిని కాను, ఇప్పించగలవాడినీ కాను. అందుకే నేను మీసం ఉంచుకోను.
పెద్దల పేరడీలు మురిపించి , కషాయము తీరు , బుధ్ధికిన్
ReplyDeleteతద్దయు చార్జిసేయు , నిక తాను జిలేబిమహాత్ములున్ , వెసన్
పెద్దలు నారసింహ పృధివీపతులున్ దొడగొట్టగా వలెన్ ,
అద్దరి బండిసారు మహితాత్ములు మున్నె కటారి దూసెడిన్ .
Deleteఎంత ఢాం ఢూం ఢుష్ అనుకున్నా ఒకే గూటి ( గో జి) పక్షులు కదా కలిసి దొడ్డగ కొట్టుకోవాల్సిందేను :)
జిలేబి
రాజావారు,
Deleteజిలేబి బామ్మని ఏం అనకండీ :) కొన్ని రోజుల కితం బామ్మ బ్లాగ్ కామెంట్లు మాలికలో అర్ధ చంద్రప్రయోగానికి గురిచేసేరు కల్నల్ గారు. ఆ తరవాతే దో జరిగింది, రెండు రోజులు బామ్మ నీళ్ళనుంచి బయట పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంది. ఆ తరవాత కల్నల్ గారు కామెంట్లకి తెర తొలిగించారు. మీరేమో బామ్మగారి చేత మళ్ళీ నారదాయనమః అనిపించేస్తున్నారాయె. ఆ తరవాతేం జరుగునో మీ దయ బామ్మ గారి ప్రాప్తి :)
మీరేమో బామ్మంటూ
Deleteసారెకు మేమేమొ వార్ని సారనుకుంటూ
తీరదు కన్ఫ్యూజు తమరు
తీరంగా జూడరాదె దినమణి రాయా !
రాజావారు,
Deleteబామ్మనే సత్య బామ్మనే అంటుంటే నిజమేదో తెలిసేదాకా చెప్పిన మాట నమ్మకతప్పదు కదు సార్
ఎక్కడికిపోతావు మారాజా
మా మాటల్లో చిక్కుకున్న మహరాజా
ఐ సే సాంగ్
పాడమంటే వచ్చేది పాటకాదు
మాటాడమంటే పలికేది మాటకాదు
నవ్వమంటే నవ్వేది నవ్వుకాదు
పువ్వైనా నవ్వైనా నీకోసం పూయదు
ఎక్కడికిపోతావు మారాజా
మా మాటల్లో చిక్కుకున్న మహరాజా!
మిత్రుడు ఓడిపోలేదు. ఇద్దరిదీ గెలుపే :)
ఒకరు పాతదానికి నగిషీ చెక్కుతారు, మరొకరు కొత్తదాన్ని ఊహించి తయారు చేస్తారు, ఎవరిది గెలుపు?
ఏదీ అర్థంకాలా ,
Deleteకాదో ఔనో తెలియక కంగారాయెన్
సోది వినిచె నీ భాస్కరు
లూదరగొట్టుటలు మాని లోగుట్టెదియో ?
ఓహో జలేబి 'సారే'
Deleteసాహో మేమూహించినదియె సారూ ! పలుకన్
బాహాట పరచు సౌఙ్ఞలు
దాహము దీర్చినవి లెస్స ' దండము సారూ !
ఓర కంట గీటి
ReplyDeleteదొంగ నవ్వు మీటి
చేసి నన్ను ఓటి
చింపి నారు చీటీ ... చేసినారు లూటీ
లాగి నాది రోటీ
పీకినారు బోటీ
వెళ్లినారు దాటి
తిప్పినారు లాటీ ... ఏమిటండి ధాటీ
చెప్పుతాను చాటి
దండమెట్టి కోటి
పోల్చ మీతోటి
నేను బహుత్ చోటీ ... మాట కాదు ఝూటీ
రాత మీది క్యూటీ
పాట మీది మీఠీ
ఎవరు మీకు సాటి
నేను కాను పోటీ ... తిప్పనింక గరిటి
పేరడీల జల్లికట్టు ఆడేస్తున్నారుగా గురువు గారూ ... !?
ఈ ప్రమాదం పసికట్టే నేను vrs కి అప్ప్లై చేశా ... 😊 🙏 ...
మిత్రమా!
Deleteమిత్రమా స్పర్ధయా వర్ధతే విద్యా అంతేగాని ఇది వ్యక్తిగత పోటీ కాదు. బాగుంది అన్నమాట మీ మంచితనానికి ప్రతీక. ఇక ఒకరికి అలుకొస్తే మరొకరు ప్రోతహిస్తూ పరుగు పెట్టించడానికి చేసే ప్రయత్నమే. ఒకరిని ఒకరు ఒక సారి దాటితే మరొకరు మరొకసారి దాటుతారు. అంతే!
ఒక చిన్న సూచన పీకినారు బోటీ అనే బదులు పీకినారు శాటీ అంటే బాగుంటుందా! శాటీ అంటే లంగోటీ
ఒయ్యారా లెటు వోయెను ?
Deleteఅయ్యయ్యో యేంది బండి ఔటైపొయ్ రా ?
సయ్యాట మాని , పాటల
కయ్యాలకు తెర దియంగ గమకించండీ !
మిత్రమా,
Deleteజనాల్ని జల్లికట్టు ఆడించేదాం. ఒకరు ఆగితే ఒకరు అందుకుందాం అదీ సంగతి. వి.ఆర్. ఎస్సా. చూదాం. అవసరాన్ని బట్టి వదుల్దాం :) అలా అంటూనే ఉండండి. :) :)
కిటకిట పళ్ళునూరి గమకింతురు, మాదొరవారు బండిసా
Deleteర,టమట కుంది, కండ్లెరుపులై ,యకటా ! నను పేరడీ విభున్ ,
చిటచిటలాడుటా ? యిదిగొ ! చేతకుసేత , మదీయపేరడీ
పటుతర పాట విన్చెదను , పాటవ మొప్పగ , మెచ్చ పాఠకుల్ .
గురువులు శర్మ గారు, రాజారావు గారు, వీఎన్నార్ గార్లకు నమస్కారాలు.
Deleteప్రతిస్పందన/ల/లోని ఆలస్యానికి మన్నించగలరు. ఈ మధ్య పెద్దగా బ్లాగ్స్ జోలికి
రావడం తగ్గింది. రావడానికి, రాయడానికి ఎందుకనో గాని పూర్తిగా హుషారు
తగ్గి పోయింది. ఎప్పుడో ఇలా ... wishing you all happy blogging ...
thanks and regards ... 😊 🙏 ...
// "ఈ మధ్య పెద్దగా బ్లాగ్స్ జోలికి రావడం తగ్గింది" //
Deleteబండి వారూ, మీరు చెప్పిన ఈ మాట వింటే పాత "మాయాబజార్" సినిమాలో శర్మ, శాస్త్రి లక్ష్మణ కుమారుడితో అభిమన్యుడి గురించి "అతడికి మీ తెలివేదీ, అతడికి మీ సుళువేదీ" అనే సీన్ గుర్తొచ్చిందండీ ... ఇక్కడ "అతడు" పదాన్ని నాకు అన్వయించుకుని అన్నమాట. ఏం చేస్తాం, ప్చ్ ప్చ్🙁
"అతడికి మీ తెలివేదీ"
ఇద్దరు పెద్దలు తమలో
Deleteతద్దయు మాటాడుకొనిన దాన నదేదో
పెద్దది పరమార్థ మొకటి
అద్దరి భాసిల్లుచుండు నందమ్మొలుకన్ .
Deleteవిన్నకోట వారు,
బాధ పడమాకండి బండి వారిదంతా ప్రసవ వైరాగ్యమేను :)
నారదా
జిలేబి
వీఎన్నార్ గారూ, మీ రాడార్ లో యాడో .. ఎక్కడో ... చూడ చూడా ... ఏదో తేడా ... పోన్లెండి ... మీరు శర్మ, శాస్త్రి ల్లోని వారు ఎటూ కారు! ఉత్తర కుమారులా? ఆ తత్తర గత్తర కూడా ... లేదు! అక్కడ "అతడు" అభిమన్యుడు. సో, మీరు వారు. అదియును సగర్వంగా వాక్రుచ్చేశారు!
Deleteఅంటే మాది ఉత్తుత్తి మాటన్న మాట!
మీరు మాటగాళ్లా లేక ఆటగాళ్లా? ... మరేమో గానీ పేద్ద పోటుగాళ్లే! కుమ్మేశారు ... కముకుగా ... దుముకుగా!!
మళ్ళీ ప్చ్ ప్చ్ అంటూ ఓ వైరాగ్య భావన!! - కేవలం నేను నిమిత్త మాత్రుణ్ణి మాత్రం అంటూ !!!
మీది విన్నకోట కాదు ... విన్నర్ కోటా !!!
jf / jk 😁😁 ... 🙏 🙏 ...
This comment has been removed by the author.
Delete@ Zilebi
Deleteబాధ పడమాకండి బండి వారిదంతా ప్రసవ వైరాగ్యమేను :
"బాధ పడమాకండి ..." - మీకలా అర్థమైందా!?
మీరూ కరెక్టే - స్రవణ వైరాగ్యం! భావ స్రావం అడుగంటినట్లే ఉంది!!
@ వెంకట రాజారావు . లక్కాకుల
Deleteగురువరా ఓ పద శరా ...
అద్దరి జెల్లసాని పెద్దలద్దిన అర్ధపు పరమార్ధమర్ధమెరుగక ఇద్దరి శోషిల్లుచుంటిని.
ఆపై మీ గద్దరింపుల తాలింపు! ఇదేమి చింపటం! ఇదెక్కడి లంపటం!
ఘొల్లుమను గుండెల గుబిల్ల జేసి శోభిల్లుట మీకు భావ్యమా - భాస్వరమా!?
హతవిధీ! - పద ప్రయోగమిక్కడ కరెక్టేనా గురువర్యా!?
jf / jk 😁😁 ... 🙏 🙏 ...
మిత్రమా!
Deleteలేట్ గా వచ్చినా లేటెస్ట్ గా అందుకున్నారుగా జల్లికట్టు,ఆడించెయ్యండి :)
This comment has been removed by the author.
Deleteగురూగారూ, మీరంటే తల పండిన వారు గనుక మీరు జల్లికట్టన్నా, బల్లకట్టన్నా, ఎల్లి కొట్టన్నా వీఎన్నార్ గారు పట్టించుకోరు. అదే గనక నేనంటే, తల ఎండిన వాణ్ణి గనుక, నాదో పిల్లి బిత్తిరి వేషం క్రింద జమకట్టీసి, పుల్లట్లు తినిపించీసి, బల్లి పట్టినట్టు పట్టీ గలరు,నల్లి కుట్టినట్టు కుట్టీగలరు - బట్టీలో పెట్టీ గలరు. అసలే కరోనా కాలం, ఖాన్ దాదా వీఎన్నార్ గారితో ఆటలాడి సారి* ఢరోనా గేలానికి చిక్కుకోడానికి న్నాకు బయ్యం. మీ ఆటకు నేనురాను బాబూ ...
Deletejf / jk 😁😁 ... 🙏 🙏 ...
*సారి : సారు గారి
(ఈ పదం నేనే కనిపెట్టా)
చూ. బండి భారతి ... 😁😁 ...
// “ సారి : సారు గారి (ఈ పదం నేనే కనిపెట్టా). చూ. బండి భారతి ... 😁😁“ //
Deleteఎవరూ కనిపెట్టకపోతే కొత్త పదాలెలా పుడతాయి, బండి వారూ. వేసుకోండి నాలుగు “వీరతాళ్ళు” 👌👏🙂.
బండి వారు,
Delete// “.... ఖాన్ దాదా వీఎన్నార్ గారితో ..... “ //
శర్మ గారి లాంటి పెద్దవారు ఆదేశిస్తే ఆ మూడోపనికేమైనా దూకచ్చేమో? లేకపోతే మీరన్న “ఖాన్ దాదా” అనిపించుకోవడం ఎలాగ మరి 😎 ?
కానీ వద్దులెండి. తెలిసిన వాళ్ళెవరైనా చూసి చెబితే పింఛనుకు దెబ్బ వచ్చే ప్రమాదం ఉండవచ్చు 😕. Anyway thanks for the comparison 🙂.
విన్నకోటవారు,
Deleteచుక్కలు పడిపోయుంటాయండీ, మూడో మాటా మాది కాదండి బాబూ :) మీరు విన్నర్ సారే
సర్వం jk 😁😁. శర్మ గారికి 🙏.
Deleteబండి వారూ, శర్మ గారు చెప్పింది చూశారుగా? ఇక మీ VRS అర్జీని తిరస్కరించడమైనది 🙂🙂.
ReplyDeleteగురుపౌర్ణమి శుభాకాంక్షలు 🙏.
ReplyDeleteకృష్ణం వందే జగద్గురుం
గురుపౌర్ణమి శుభాకాంక్షలు.
ReplyDeleteశ్రీ గురుపాదుకా స్తోత్రం
సదాశివ సమారంభాం
ReplyDeleteశంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం.
ధన్యవాదాలు
బండి వారు,
ReplyDelete// “ .... మీ రాడార్ లో యాడో ... ఎక్కడో .... ఏదో తేడా ...” //
అందుకేగా మరి నాకు “ఆ తెలివేదీ, ఆ సుళువేదీ” అన్నాను.
మీరు తెలివిగా బ్లాగుల వైపు రావడం గణనీయంగా తగ్గించేశారు, మాకు ఆ “తెలివి” లేక ఇంకా పట్టుకుని వేళ్ళాడుతున్నాం ... అని నా
నిన్నటి వ్యాఖ్యలోని కవిహృదయం.
“స్తుతి కాదిది, స్తుతి కాదిది” ☝️🙂.
ఇక్కడ నేనో 'విన్న మాట' చెబుతా 'విన్నకోట' సారూ - అది 'చిన్న మాటే' అయినా గానీ 'ఉన్న మాటే' అన్నది నా గ్రహింపు.
Delete"తెలివిగల వాళ్ళు, చతురులు, సరసులు క్రింద పడినా గానీ దాన్ని సుళువుగా వాళ్లదే గెలుపు" గా మలుస్తా .. రట! నన్నేదో గిచ్చారన్న ఓ మూల శంక తో నేను తన్నుకుంటుంటే, నేనేదో తెలివి గల వాణ్ణన్న ఈ చల్లని పంఖా ఏమిటి మహా ప్రభో!
jf / jk 😁😁 ... 🙏 🙏 ...
నేనెప్పుడూ “కోల్డ్ క్రీమ్” డబ్బా నా దగ్గరే ఉంచుకుంటాను, నాక్కూడా పనికొస్తుంది కదా 😉.
Delete😁😁.
ఓ!మూలశంక మందా
Deleteయేమీ కోల్డ్ క్రీము , సారు! యీ డబ్బా మీ
సామీప్యమునుండున, సరి
తామీ సలహా నిడంగదగును సఖునికిన్ .
కాదు. అటువంటి “శంక”లు నాకేమీ లేవు.
Deleteఎదుటి వారు తమకు మండుతోంది అంటే (ఏ కారణం వలనైనా గానీ) తాత్కాలిక ఉపశమనానికై రాసుకోమని ఆ క్రీమ్ డబ్బా ఇవ్వచ్చని ... సదుద్దేశం.
ఇరువురు పెద్దలిక్కడ ఒకరిపై ఒకరు శంక చక్రాలిసురు కుంటున్నట్లుగా ఉంది. ఓరగా నిలబడి గమనించుట మేలు గదా! సందట్లో సడేమియాగా వీఎన్నారు గారు క్రీమ్ డబ్బా పారేసుకుంటే, లాఘవంగా చేజిక్కించుకుని, సమరానంతరం మరల వారికే సమర్పించి, వారల అనుగ్రహము బడయవచ్చు. శంక వలదు ఇదియే బృహత్తరమైన అవుడియా!!! 😊😊
Deleteపెద్ద లిరువురూ కడుగడు
ReplyDeleteఉధ్ధతులే , సరిసమాన యోధులె , యొకరే
మిద్ద రభిమన్యులంతటి
సిధ్ధాంజనమున్న ఘనులె , శిరసా ప్రణతుల్ .
గురూ గారూ పెద్దలు శర్మ గారు, వీఏన్నార్ గార్ల గురించి మీరు భల్ భలే పద్యం వ్రాసారు. ఏదో మూలన ఈ శిష్య పరమాణువు గురించి కూడా ఓ చిన్నపాటి మంచి మాట పడేసుంటే బాగుండేదన్న ఈ ఆశావహుడి చిరు కోర్కెను, ఆ పై పద్యం వ్రాసేప్పుడు ఖాస్త గుర్తుంచుకోండి సార్ ... ఇట్లు మీ చిన్న పాటి శిష్యుడు.
Deletef / jk 😁😁 ... 🙏 🙏 ...
పెద్దలు బండిసారు తమపెద్దరికమ్మును ముద్దుముద్దుగా
Deleteరుద్దుదు లన్యులందు , తమలోని మహాద్భుత చిత్తవృత్తి యీ
రుద్దుడులో గనంబడక , రూఢముగా తమదైనశైలిలో
సుద్దులు మాటలాడెదరు జూడ , నమశ్శతముల్ మహాప్రభో !
Deleteవారెప్పుడున్ను బుడతడి
లా,రాణింతురు గదా బలాదూరుగ నా
పేరడి పాటల తోడై
ఓరాజన్నా మనకవి లొంగున తెలియన్ !
చైంచిక్ ,జాల్రా
జిలేబి
రాజావారు,
Deleteచాలా చిన్నాళ్ళం,చాలా విషయల్లో,మీకంటే. మీ అభిమానమే పెద్దాళ్ళని చేసేస్తోంది.
జిలేబీ జీ
Deleteపిలుపు మారింది చూశారా! గౌర్నం పెరిగిపోనాది
ఇది పూరించండి
”ఉద్ధతుల మధ్య పేదలకుండ తరమె"
Deleteగౌర్నం ఇస్తున్నారంటే భయమేస్తున్నాదండి ఆయ్
:)
ఉద్ధతుల మధ్య పేదల "కుండ" తరమె
నిండు గాన జిలేబీజి నీటుగాను
నోటికుండయగును డొల్లబోవగాను
వలదె వారితోడాటలు వారిజాక్షి!
పై పెద్దలందరికీ ఈ బుడతడి నమశ్శతముల్ ... 😁😁 ... 🙏 🙏 ...
Delete
Deleteబుడతడి వందనము లి
వే! బండియటంచు నింటి పేరండీ నా
కో బాగుగ పేరడి రా
సే బాలాగు కలదండి సేద్యంబదియే :)
జిలేబి
బుడుతడు బుడుత డటంచును
Deleteగడుసరి శ్రీబండిసారు గారిని తెగడన్
బడబానల మొడి గట్టుక
గడసానియ గెంతు టగును ఘనులకు దెలియన్ .
🙂👍
ReplyDelete
ReplyDeleteతాతగారు
కుశలమేనా
జిలేబి
బామ్మగారూ,
Deleteకుశలమే!
కరోనా ఒక అరకిలోమీటర్ వెనకడుగేసి ఒక కంపెనీ డాక్టర్ ని పట్టుకుంది, ఆరువందలమంది పనిచేసే కంపెనీని మూయించింది. మరో పక్క కిలో మీటర్ వెనక్కి వెళ్ళి ఒక యువకుణ్ణి పట్టుకుపోయింది. కరోనా జడలు విప్పి నాత్యం చేస్తోంది. ఇప్పుడు ప్రజలే వణుకుతున్నారు. బయటికి రావటం లేదు.
నా సంగతి
లక్షాధికారైన లవణమన్నమెకాని మెరుగు బంగారంబు మ్రింగబోడు కదా. వ్యవసాయ సీజన్ మొదలయి నెల దాటింది. ఈ సంవత్సరం వ్యవసాయం చూడకపోతే తినేందుకు గడ్డి కూడా దొరకదు. అందుకు వ్యసాయంకోసం మరో చిన్న పల్లెకు ప్రయాణం. నిన్ననే చేరాను, ఇంటికి. బామ్మా గల్లా పెట్టె నిండా రూపాయలున్నా పట్టేడు మెతుకులు కావు.నెల పైగా తిరుగుతూనే ఉన్నా. చేలో పన్జేస్తేనే మెతుకులిక ముందు సుమా.
Deleteఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా
విన్నకోటవారు,
Deleteవీలుంటే ఈ టపాలు చూడండి :)
https://kastephale.wordpress.com/2018/02/11/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b0-12/
https://kastephale.wordpress.com/2018/02/15/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b0-13/
ఏరువాక కొత్తకాదుగాని ఈ సంవత్సరం అమార్పులు చేశాను. ఒక ఎకరం గడ్డి పండిస్తున్నాం.
దమ్ము చేసి వెద జల్లించా. పంట దిగుబడిలో మార్పులొస్తాయేమో చూడాలి.
https://kastephale.wordpress.com/2015/03/30/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b0%e0%b1%8b/
Deleteమరో టపా మరచానండి
చదివానండి. మారిన / మారుతున్న రోజుల గురించి బహు చక్కగా వివరించారు 🙏.
Delete// "ఒక కంపెనీ డాక్టర్ ని పట్టుకుంది " //
ReplyDeleteమీ ఊరిలోని ITC (ILTD) కంపెనీయా శర్మ గారు?
Yes. Sir
Delete
Deleteడిటెక్టివ్ నర్సన్ :)
మీ మెచ్చుకోలు బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని విషయాలు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించినవి. వాటి గురించి గూఢచారి పనేమీ చెయ్యనవసరం లేదు “జిలేబి” గారూ.
Deleteథాంక్స్ ఎనీవే 🙂.