Friday, 8 May 2020

బాధగా ఉంది.



కష్టం కలిగినపుడే బాధ తప్పదు. ధైర్యం కోల్పోవద్దు.వదంతులు నమ్మద్దు

8 comments:

  1. పులి మీద పుట్ర అంటే ఇదేనేమో?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      మరీ పల్లెటూరివాడిని కదండీ, ఇది గోరు చుట్టుమీద రోకటి పోటు.
      మొదటి వీడియోలు చూస్తే కడుపు తరుక్కుపోయింది. ఇక్కడ పెట్టడానికి కూడా నాకు మనస్కరించలేదు.

      Delete
  2. మీరు రాస్తోంది వైజాగ్ ఉదంతం గురించో కాదో పోస్టు చూస్తే అర్థం కావట్లేదు.
    ప్రాణ నష్టం తక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం కావచ్చు.
    ఈ కంపెనీ పెట్టిన 60లలో వైజాగ్ చిన్నగా ఉండేదని, ఇప్పుడు ఊరు పెరిగి పారిశ్రామిక వాడలోకి చొచ్చుకుపోయిందని అంటున్నారు. పరిశ్రమలకు దగ్గర్లో ఇళ్లకు ఎలా అనుమతిస్తున్నాయో ప్రభుత్వాలు.

    ReplyDelete
    Replies
    1. సూర్య

      మీరు నేను చెప్పేది విశాఖ సంఘటన గురించే. మీరు చెప్పినదాంట్లో తేడా లేదు. కొంచం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ దుస్సంఘటన జరిగేది కాదేమో. అనుమతుల గురించి అందరిదీ తప్పే అనుకుంటాను.

      Delete
    2. భూవాడకం మార్పు (land use change) కంటే ముందు బోలెడంత తతంగం (ఉ. లిఖిత అభ్యంతరాల స్వీకరణ, పబ్లిక్ హియరింగ్/గ్రామసభ) జరుగుతుంది, అందుట్లో పరిశ్రమ యాజమాన్యానికి తమ ఉద్దేశ్యాలు తెలియజేసే అవకాశాలు ఉంటాయి.

      The organization has already long ago exhausted available redress mechanisms under due process. They have no right to violate statutory & common law liabilities on such pretexts.

      Fail-safe is an essential feature of OHS processes.

      Delete
    3. అన్ని అనుమతులూ లేకుండా పరిశ్రమ రాలేదు. దానికి చుట్టు పక్కల కొంత దూరందాకా నివాసాలు ఉండకూడదనే నిబంధనా ఉంటుంది. కాని అది ఉల్లంఘింపబడి ఉండే సావకాశాలే ఎక్కువ. కావలసినన్ని కతలున్నాయి,దీని గురించి.

      పరిశ్రమలు రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలి ఒక నినాదం, అదే మనుషులు వేరు రూపాల్లో ఎక్కడ పరిశ్రమవస్తున్నా అక్కడక్కడ ప్రజలను రెచ్చగొట్టి పరిశ్రమలను మూయించేయడం ( తూత్తుకుడి కాపర్ లాగా) ఇదొక విషవలయం. చెప్పుకుంటే కావలసినంత కత. తప్పెవరిది?

      Delete
  3. "కష్టం కలిగినపుడే బాధ తప్పదు. ధైర్యం కోల్పోవద్దు.వదంతులు నమ్మద్దు"

    మూడు చిన్న వాక్యాలే అయినా అక్షరకోట్లు చేసే మాటలు, ముఖ్యంగా మూడవది.

    తక్షణ చర్యలతో నష్ట నివారణకు దోహదపడిన అధికారులకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. Jai Gottimukkala
      ఇవి జీవితానుభవాలేనండి. వదంతులు ముందు నడుస్తున్నాయండి, అన్నిటా.కొంచం నిదానించాలి.

      Delete