కాదేదీ కవితకనర్హం
కుక్కపిల్లా,సబ్బు బిళ్ళా, అగ్గిపుల్లా
మహాకవి శ్రీశ్రీ
పేరడీ
తెనుగులో పేరడీ కవితలకు ఆది గురువు శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. వీరు జరుక్ శాస్త్రిగానే ప్రసిద్ధులు. ఆదిగురువుకు నమస్కరిస్తూ
కాదేదీ తినుట కనర్హం
కుక్కా,నక్కా,పిల్లీ,బల్లీ
నేటి అవుసరం ఉడతా మిడతా
తింటేనే ఉనికి లేకుంటే లేదు మనికి
కడుపుకాలితే సర్వం సమానం
కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం.
ఆది పేరడీ గురువును స్మరించుకున్న సందర్భంగా చిన్న కవిత :)
పేరడీ కవిత్వానికి
ఆది గురువు జరుక్కు
దీనికి కావాలి చమక్కు
అనిపించాలి చురుక్కు
నవ్వు రావాలి భళుక్కు
ఇది ఇంతకు ముందే ఎవరేనా చెప్పేసేరేమో కూడా :)
కవిత బాగుందండి. మీరు టాలెంటు దాచుకున్నారని తెలిసి కలుక్కు. 🙂.
ReplyDeleteవిడియో చూస్తే మాత్రం భళుక్కు 😳.
మీలో నిగూఢ నైపుణ్యాలు చాలానే ఉన్నాయండీ! రారండోయ్, పద్యాలు కడదాం అంటూ “జిలేబి” గారక్కడ ఎలుగెత్తి పిలుస్తున్నారు, అదేదో కాస్త ప్రయత్నించరాదూ? కాకపోతే వారి పిలుపు మరీ జాషువా గారి ఒక ఖండిక బాణీలో ఉన్నట్లు అనిపించింది 😕.
(“రా, కదలిరా” అంటూ రాజకీయ పార్టీలు చేసే సభ్యత్వ నమోదు ఉద్యమాలు గుర్తొస్తున్నాయి “జిలేబి” గారి పిలుపు వింటుంటే 🙂)
VNR Sir,
Deleteసామాన్యుడినండీ! మీ అభిమానం అలా అనిపించేస్తోంది
Sharma sir పేరడీ కవిత బాగుంది. చిన్న సందేహం. కాదేదోయ్ అన్న పదం సరైనదేనా. కాదేదీ లేక కాదేదీ నోయ్ అనవచ్చా.
ReplyDeleteచివరి పంక్తిలో ఇంతకు ' ముందే ' బదులు మరోలా వచ్చింది గమనించ గలరు.
బుచికిsir,
Deleteకుక్కపిల్ల
అగ్గిపుల్ల
సబ్బు బిళ్ళ
హీనంగా చూడకు దేన్నీ
కవితామయమేనోయ్ అన్నీ
రొట్టెముక్క
అరటితొక్క
బల్ల చెక్క
నీవైపే చూస్తూ ఉంటాయ్
తమలోతు కనుక్కోమంటాయ్
తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుర్రపు కళ్ళెం
కాదేదీ కవితకనర్హం
ఔనౌను శిలపమర్ఘం
ఉండాలోయ్ కవితావేశం
కానీవోయ్ రస నిర్దేశం
దొరకదటోయ్ శోభ లేశం
కళ్ళంటూ ఉంటే చూసెయ్
వాక్కుంటే వ్రాసెయ్
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం.
ఇదీ శ్రీశ్రీ అసలు కవితనుకుంటా. ఆ తరవాత వాడుకలోకి ఇలా చాలా రూపాంతరాలొచ్చాయండి. అందులో ఒకటి తీసుకున్నా! ఇది గ్రామ్యం. తప్పుచేసి ఉంటాను. typo సరి చేస్తాను. ధన్యవాదాలు.
https://sskchaithanya.blogspot.com/search?q=%E0%B0%8B%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81
Thank you sir.
Deleteప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం. - కలకాలం నిలిచిపోయే శ్రీశ్రీ వాక్యాలు అవి sir.
మిడుతల వేపుడు కాష్ట్లీ
ReplyDeleteఉడుతల ఫ్రై , క్ర్యాప్సు ప్రైయ్యు నోజన్ కాష్ట్లీ
కడు నత్తల సూప్ కాష్ట్లీ
జడుపేటికి పెరుగు కూడె చౌక బుధవరా !
ReplyDeleteరాజా సాబ్
ఈ సారికిలా పోనివ్వండి, పెరుగుతో సరిపెట్టుకుంటా. :)
నత్త కనబడుటలేదు :)