https://youtu.be/OV3Hvq5L5Eg
పాట1960లో విడుదలైన భట్టి విక్రమార్క చిత్రంలోది
కొమ్ములు తిరిగిన మగవారూ కొంగు తగిలితే పోలేరు నాకొంగు తగిలితే పోలేరు ని అనుసరించిన పారడీ పాట
కొమ్ములు తిరిగిన దేశాలే కంటి చూపుకే మాడేయి
కడగంటి చూపుకే మాసేయి
కత్తులు దూసే దేశాలే ఎత్తులు మార్చే దాదాలే
లాకు డవున్ లో చేరేరు,లాకు డవునులో చేరేరు, II కొమ్ములు తిరిగినII
మందుకోసమే మూగేరు, చేతులు, మూతులు కడిగేరు,దెబ్బకి భయపడిపోయారూ, ముక్కూ నోరూ మూసేరు, . II కొమ్ములు తిరిగినII
చేతులు కలిపే మొనగాళ్ళే చేతులు జోడించేరూ.దూరం పాటించేరు II కొమ్ములు తిరిగినII
తగిలిన కరోన కౌగిలిలో ప్రభువైనా వసివాడును లే
ఇదే నీతి ఈ జగతి. II కొమ్ములు తిరిగినII
పాట1960లో విడుదలైన భట్టి విక్రమార్క చిత్రంలోది
కొమ్ములు తిరిగిన మగవారూ కొంగు తగిలితే పోలేరు నాకొంగు తగిలితే పోలేరు ని అనుసరించిన పారడీ పాట
కొమ్ములు తిరిగిన దేశాలే కంటి చూపుకే మాడేయి
కడగంటి చూపుకే మాసేయి
కత్తులు దూసే దేశాలే ఎత్తులు మార్చే దాదాలే
లాకు డవున్ లో చేరేరు,లాకు డవునులో చేరేరు, II కొమ్ములు తిరిగినII
మందుకోసమే మూగేరు, చేతులు, మూతులు కడిగేరు,దెబ్బకి భయపడిపోయారూ, ముక్కూ నోరూ మూసేరు, . II కొమ్ములు తిరిగినII
చేతులు కలిపే మొనగాళ్ళే చేతులు జోడించేరూ.దూరం పాటించేరు II కొమ్ములు తిరిగినII
తగిలిన కరోన కౌగిలిలో ప్రభువైనా వసివాడును లే
ఇదే నీతి ఈ జగతి. II కొమ్ములు తిరిగినII
With regards to all concerned
ReplyDeleteమరో బండి రావు తయారు :)
Zilebi
Deleteఅరె ఏమయిందీ?
మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
హ్హ హ్హ హ్హ శర్మ గారూ 😀😀. మీరూ "చెయ్యి తిరిగిన" పేరడీ రచయితన్నమాట. ఇంతకాలం బయట పడలేదు. మీ లాంటి వారినే హిందీలో "ఛుపా రుస్తుం" అంటారు 😉.
ReplyDeleteమీ ఊళ్లో రోజూ పగలంతా కరెంటు తీసేస్తున్నారు అంటే మీరు విశ్రాంతి తీసుకుంటుంటారు కాబోసు అనుకున్నాను. ఇదా మీరు తీరిగ్గా చేస్తున్న పని 😉. మంచి కాలక్షేపమే లెండి 👌.
ఈ పాటే కదా👇. పేరడీ బాగా కుదిరింది 👏.
అన్నట్లు ఎక్కడ బండి వారెక్కడ, ఎక్కడ 😉?
"కొమ్ములు తిరిగిన మగవారు" (భట్టి విక్రమార్క చిత్రంలోని పాట)
VNR Sir,
Deleteఅదేంకాదండీ :)
కరంట్ లేక ఉన్నా లో వోల్టేజ్ తో పనికి రాక నిజంగా ఒళ్ళు మండిపోతోందండి. రోజూ ౪౪ ఉంటోంది వేడి
బయటకు రాలేక లోపల ఉండలేక..... అబ్బో ఆబాధ వర్ణనాతీతం కదండీ. ఆ పరిస్థితులలో మొదటి పల్లవి కదిలిందండి మదిలో. ఎప్పటి పాట అరవై ఏళ్ళ కితంది. ఈ పాట బాగా సరిపోతుందనుకున్నా. ఆ తరవాత కీ బోర్డ్ పరిగెట్టీందంతేనండి,పదేపది నిమిషాల్లో.ఇదంతా మిత్రుల చలవే :)
వారు బాగూందంటే జోష్ వచ్చేసిందంతేనండి
గురూ గారూ మిమ్మల్ని vnr గారు 'చెయ్యి తిరిగిన ఛుపా రుస్తుం' అనడం వెనుక నన్నేదో 'చెయ్యి విరిగిన సఫా రుస్తుం' అని గద్దరించి నట్లనిపించి ఉలిక్కిపడ్డాను. ఏం చేస్తాం మీరప్పుడప్పుడు ఎర్రర్స్, ఒమిషన్స్, ఆడిషన్స్ చెప్పినప్పుడే మీ రుస్తుం గిరీ వెనుక నున్న ఛుపా బరి ని గుర్తించాల్సింది - ఇప్పుడిలా సఫా హరీ అనిపించుకునే అవస్థ తప్పేది! కానీండి ఇప్పటికే సగం సన్యాసం జరిగింది - ఇక మీ సన్మానంతో - పావుకోళ్ళు చేత్తో అట్టుకుని - గోచీ లాక్కుంటూ - పలాయన మంత్రం జపిస్తూ - ఆశ్రమానికి లగో - ఆక్కుండా లగెత్తడమే!
Deleteశర్మ గారూ సారూ పాటలాడిరి నేడు
విన్నకోటా వారు ఆటలాడిరి జోడు
ఇద్దరూ జత గూడి కొమ్ము లిరిచిరి నేడు
సద్దుగా ఇక నేను ఆశ్రమానికి దౌడు
... ఒక్కడూ కనరాడు మొరను పెట్టగ గోడు !!! ప్చ్...ప్చ్...ప్చ్...
(ఏకవీర 'తోటలో నా రాజు' బాణీ ...)
(హ్యాపీ యేనా vnr గారూ ... ?
కాస్త రమణ మహర్షి ఆశ్రమం జీపీఎస్ రూట్ వాట్సాప్ చెయ్యగలరు)
ఇరువురికీ గోడు ప్రణామాలు 😊 🙏 ...
మిత్రమాబండివారు
Deleteఏమంటిరి! ఏమంటిరి!!
మిత్రులు ”ఛుపా”రుస్తుం అనినారా ”ఛిపా” రుస్తుం అనినారో పాలుబోలేదే :)
ఇది అంతయును మీ చలవేనని విన్నవించుకొంటినే! మీరిచ్చిన జోష్ మరియు కరంటు లేకపోవుట మూలంగా లోపలను, బయటను ఉండలేని, బయటి వేడి, చుట్టు పక్కల కరోనా వ్యాప్తి వార్తలతో లోపలి వేడితోనూ వేగుతున్న సమయాన మామిడి చెట్టు నీడన నిలుచున్న సమయాన, కొమ్ములు తిరిగిన దేశాలు కోవిడ్ వాక్సీనుకోసం అంగలారుస్తున్న సమయాన
ఒక పిల్ల తెమ్మెరలాటి వార్త పుణె వైరాలజీ లేబ్ నుంచి వాక్సీను విడుదల కానుందన్న వార్త తో తన్నుకొచ్చిన కవితేగాని మరొకటి కాదన్న మాట కదా!అరవి సంవత్సరాల కితం ఇరవై వయసులో విన్నపాట నేటి పరిస్థితికి పేరడీ పాటగా అతికినందుకు సంతసించితిని, మిత్రుల అభినందనకు మిగుల ఆనందించితినిగాని మరొకటి కాదుకదా!
మీరన్యధా భావించక సంన్యాసము వగైరాలను చింతించవలదని కదా వేడుట. అసలీనా ( అసలు+ఈ+నా) చిన్ని ప్రయత్నం హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయుటకాదనగలరో, మీరే శలవీయాలి :)
మీరు గోచీ పీక్కుంటూ రమణాశ్రమానికి పరిగెట్టే సీను అస్సలు ఊహించుకో లేకపోతున్నా :) మీరీ ప్రయత్నం విరమించిన వార్త వినుదాకా మనసుకు శాంతి చేకూరదేమో :)
Delete---కాస్త రమణ మహర్షి ఆశ్రమం జీపీఎస్ రూట్ వాట్సాప్ చెయ్యగలరు
గోచీని వెతుక్కోడానికి కూడ జీపీయెస్ కావలసి వచ్చిన రోజులొచ్చేయన్న మాట :)
God Positioning System :)
జిలేబి
జిలేబి
Deleteపుల్లపెట్టే బుద్ధి పోదు :)
మిత్రులు బండివారూ
Deleteతగునా ఇది మామా తమరే ఇటు పలుకనగున తగునా పాటకి పేరడీ (ఇల్లరికం చిత్రం)
ఆశ్రమమ్మునకు పోవుచుంటినిక
నా వెనుక రావలదు,రా తగదు పో పోర పొమ్మికన్
తగునా ఇది దోస్తూ తమరే ఇటు పలుకనగున తగునా ఇది దోస్తూ
తమ మాటే వేదమని తలచువాడనే, మదిని తలచువాడనే
తగునా ఇది దోస్తూ తమరే ఇటు పలుకనగున తగునా ఇది దోస్తూ
ఎల్లప్పుడు మిమ్ములనే మది పొగుడువాడనే
తగునా ఇది దోస్తూ తమరే ఇటు పలుకనగున తగునా ఇది దోస్తూ
మన మధ్యన పుల్లబెట్టువారుందురే
తగునా ఇది దోస్తూ తమరే ఇటు పలుకనగున తగునా ఇది దోస్తూ
మమ్మొదిలి సన్యసింప తమరెటుబోదురో
తగునా ఇది దోస్తూ తమరే ఇటు పలుకనగున తగునా ఇది దోస్తూ
మన మధ్యన పోటీ కాదందునే ఇంతగ బతిమాలింపగ
తగునా ఇది దోస్తూ తమరే ఇటు పలుకనగున తగునా ఇది దోస్తూ
Deleteబండి వారూ అర్జెంటు గా కొట్టు మూసేయాల్సిందే :)
జిలేబి
@ sarma ...
Deleteమీ మనసు పాల సముద్రం
నా పయన మందుట్లో పదిలంగ భద్రం
అది ఓర్చు కోలేని లోకం
మరి నా పడవ కెట్టింది దయలేక రంధ్రం
ఎకసెక్క మాడుతు సాంతం
నా తలపును చేసింది కఠినంగ ఛిద్రం
మీ పేరడీ లు అమోఘం
అవి పెంచేను దంచేను నరసింహ ప్రమోదం
మీ జోలికొస్తేను కొంచెం
ఆ సారుకొచ్చేను ఎనలేని కోపం
/ఆ సారు మరిచేరు శాంత మసాంతం/
@ Zilebi ...
Deleteగోచీని వెతుక్కోడానికి కూడ జీపీయెస్ కావలసి వచ్చిన రోజులొచ్చేయన్న మాట :)
దారి చూపని లాపతా
ఏ జాలి నెరగదు మీ కతా
ఎవ్వరెరుగరు మీ వెతా
తలచంగ మనసే కుత కుతా
/ఏ మనసు మండదు కుత కుతా/
దారి చూపని లాపతా
ఈ మౌని కెందుకు మీ వెతా ... 😠😠 ... 🙏 ...
@ sarma ...
Delete'తగునా ఇది దోస్తూ తమరే ఇటు పలుకనగున తగునా ఇది దోస్తూ ...'
సరదా మాటలు ప్రక్కన పెడితే ... ఏంటి గురువు గారూ ఏంటీ ఆవేశం!?
ఇన్నాళ్లూ ఎక్కడ దాచారీ కోణాన్ని!? ఎందుకు దాచారీ బాణాన్ని!?
పద్మవ్యూహంలో అభిమన్యుడు చెలరేగినట్లు అన్నేపులా దున్నేస్తున్నారుగా!?
nazar na lag jaaye, teri yeh raahon mein ... 👍😊🙏 ...
బండివారు, విన్నకోటవారు.
Deleteజగమేమాయ బతుకేమాయ
వేదాలలో సారమింతేనయా
కరోన వింతేనయా.కరోనకాలం లో చావులింతేనయా.
కదలలేని కాలమంతేనయా.
బాధే సౌఖ్యమనేభావన రానీవోయ్
అసహాయతే నేటి మాటేనయా,మనసు ఉడికేనయా
ఆ ఎఱుకే నిశ్చలానందమొయ్,బ్రహ్మానందమోయ్.
మిత్రమా బండివారు, విన్నకోటవారు.
Deleteమొన్న రిలయన్స్ రైట్స్ లో చిన్న ఇబ్బంది కలిగింది. దానితో ఒక పేరడీ పాట పుట్టుకొచ్చి, ఆ పై మీకు తెలిసినదే. కరోనా చుట్టు ముడుతోంది.
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?
విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరు?
ఎవరూహించెదరు?
కారణం, అమాయకత్వం,తెలియనితనం
బండి వారు,
ReplyDeleteదీన్నే భుజాలు తడుముకోవడం అంటారని మీకు తెలుసు కదా. అయినా కూడా “ఏకవీర” పేరడీ అలవోకగా అల్లేశారు చూశారా .... అంటే మీలోని స్పార్క్ అలాగే ఉందన్నమాట, మరెందుకు వగచడం?
అయినప్పటికీ ‘పేరడీ సన్యాసం’ చేసి, రమణాశ్రమానికి పయనమవుతానంటారా? ‘దారిచూపే దేవతా’ అంటూ “జిలేబి” గారిని అడగండి రూట్ కోసం .... అరవదేశం మీద వారొక అధారిటీ కదా. Good luck 👍🙂
మౌనంగా మీ మాట వినీ ఒదిగి ఒదిగి ఉంటాను
Deleteవినయం తోటే మీది మది తిరిగి గెలుచుకుంటాను ... 😊 🙏 ...
ఏమైనా బండి దొరలు
Deleteసామాన్యులు గారు వరస సరసోక్తులతో
మా మా తవువులు తకిథిమి
థీమీతకి వాయగొట్టె తీపర ముడిపెన్ .
Deleteరాజావారు,
పెద్దలతో, చతురులతో అంతే కదండీ :)
హయ్యో!హయ్యో!హయ్యో!
ReplyDeleteకుయ్యాలించి నరసన్న కోరిక దీర్చన్
చయ్యన మా బండిసారు
నియ్యకొలిపిరేమి? సన్యసించ , హతవిథీ !
నన్ననడం అన్యాయం కదా, రాజారావు మేస్టారూ. సన్యసించడానికై నేనేమీ మీ బెజవాడదొర గారిని “ఇయ్యకొలప” లేదు. కాస్త పోటీ తగిలేసరికి వారే పుంజాలు తెంపుకుని పరుగెడుతున్నారు కదా రమణాశ్రమం దిశగా.
Deleteవారో మీరో సారో
Deleteచేరంగా దీయ తగును , చెప్పెడి వాణ్ణా ?
కోరి రమణాశ్రమానికి
చేరంగా పంప తగదు , శ్రీదొరవారిన్ .
వెంకట రాజారావు . లక్కాకుల
Deleteసాబ్. యే దోస్తీ హౌమ్ నహీ ఛోడేంగే
@ వెంకట రాజారావు . లక్కాకుల ...
Deleteగోవుల్లు తెల్లన మీ మనసు చల్లన
మీ మాట మెల్లనా ఎందు వలనా
గోవుల్లు తెల్లన మీ మనసు చల్లన
మీ మాట మెల్లనా ఎందు వలనా
ఆ మాట తియ్యనా అందువలనా ... 😊 🙏 ...
బండి గారు మీరు ఆశ్రమం లోకి ఎందుకు వెళ్ళాలి. మీరు శర్మ sir ఇరువురు వేటూరి సీతారామ శాస్త్రి గారు లాగా మంచి పేరడీ పాటలు వ్రాయవచ్చు గదా.
ReplyDeleteబుచికిసార్,
Deleteనా హమ్ కర్తా హరిః కర్తా!చలవంతా మిత్రునిదే
@ బుచికి ...
Deleteఎంత మంచి బుచికి వయా ఎన్ని నోళ్ళ పొగడ నయా ...
ఎన్ని నోళ్ళ పొగడ నయా ఎన్ని నాళ్ళు పొగడ నయా ...
ఎంత మంచి బుచికి వయా ... 😊 🙏 ...
బండి sir. గోవులు తెల్లన రాజారావు sir పద్యం తియ్యన. ఇది అక్షర సత్యం.
DeleteThank you.
బుచికిసార్,బండివారు,
Deleteవందనం,అభినందనం
“తగునా ఇది దోస్తూ ...” అని పైన శర్మ గారు (ఛుపా రుస్తుం) కట్టిన పేరడీ మీద బండి వారి అభిప్రాయమే నా ఇభిప్రాయమున్నూ 👌.
ReplyDeleteవీరిద్దరూ కలిసి పాటలు కడితే బాగుంటుందిగా. ‘భాస్కర బండి కవులు’ అనే పేరు ఎలా ఉంటుంది?
బండివారు, విన్నకోటవారు.
Deleteఆనందమానందమాయె మరి ఆశలనందనమాయె
మాటలు చాలని చోట పాటగా మారిన హాయె.
ఏమనిపాడెదనో ఈ వేళ మానసవీణ మౌనముగా నర్తించిన వేళ ఏమని పాడెదనో
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను
అబ్బ, అమ్మ, అయ్యొ, ఎరక్కపోయివచ్చాను ఇరుక్కుపోయాను
ఇద్దరు పెద్దల మధ్యన, తండ్రీ కొడుకుల మధ్యన (సూర్యుడు, యముడు తండ్రి కొడుకులు= వేడి, కరోన= జీవనం,కైవల్యం). ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను.
నాదారిది కాదని తెలిసి ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. :)
శర్మ గారి పేరడీ టాలెంట్ రోజురోజుకీ మరింత రాణిస్తోంది 👏.
ReplyDelete
Deleteపలుకుల రాణి యిస్తోంది :)
Zilebi
Deleteఎంత కాలానికి తమనోటనొక మంచిమాట వింటిని
Deleteకవి అన్నారే వినిపించిందా :)
VNRసార్,
Deleteఅంతా మీ అభిమానం
Zilebi
Deleteమనసు మూగదేగాని బాసున్నది దానికి
చెవులుండే మనసుకే ఇనిపిస్తుందే అది :)
रेख्ता के तुम्ही नहीं उस्ताद हो ग़ालिब
ReplyDeleteकहते है अगले ज़माने में कोई मीर भी था
ఘాలిబ్ తనను గురించి రాసుకున్న కవితకు స్వేచ్చానువాదం:
ఉర్దూ (కవిత్వానికి) నీవు ఒక్కడివే పుడుంగు కాదు, అప్పట్లో మీర్ అనే గొప్ప కవి ఉండేవాడని అంటారు.
ఎంద"ఱో" మ"గా"నుభావులు, అందరికీ (వందనాళ్ళు) వందనాలు!
Jai Gottimukkala sir,
Deleteదేవుడే ఇచ్చాడు స్థాయి ఒకటి
ఒకరు ఉందన్న మరొకరు లేదన్న పోదు మిత్రమా
ఏమి దానర్ధం? ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు స్థాయి ఒకటి
నా దారి రహదారి
పేరడీ అంటేనే మాటల గారడీ
Deleteకొట్టేస్తుంటారు చదువర్లకు బురిడీ
బండి వారు, శర్మ గారు ఇద్దరూ ఎవెరెడీ
తాజాగా విన్నకోట & బుచికి గార్లూ రెడీ
The more the merrier. All are well!
Jai Gottimukkala sir
Deleteఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
హృదయ వీణ మీటుచూ ప్రేమగీతి పాడుచూ
బతుకునెల్ల హాయిగా,హాయిగా తీయగా పరవసింప జేయుచు
ఎచటినుండి వీచెనో ఈ చల్లనిగాలి.
ఇదెలా ఉంది సర్ శర్మ గారు, బండి వారు ?👇
Delete———-
ఎచట నుండి వచ్చెనో ఈ కోవిడు పురుగు
మాస్కులతో మూయుచూ ఇంటిలోనే ఉంచుతూ
బతుకునెల్ల మెల్లగా, మెల్లగా పూర్తిగా పరిహసింప జేయుచు
ఎచట నుండి వచ్చెనో ఈ కోవిడు పురుగు ।।
————
🙏
పాటే బుధుల వరించెనొ ?
Deleteపాటను బుధులే వరించి పరవశ మైరో ?
చేటో మంచో తెలియదు
దీటుగ మేథావు లెల్ల తీర్చిరి పాటల్ .
వయసున ప్రేయసి తా ని
ర్దయ చూపించిగ , బొగిలి , విరహ గీతాల
ల్లి,యెదలు రోదించిన నా
టి యిడుమ , నేపథ్య మిప్పు డెంతయు గలిసెన్ .
చైనా వైరస్ వచ్చింది దూరం దూరం జరగండి
Deleteచైనా నుంచి వచ్చింది ప్రపంచమంతా పాకింది.vnr sir
👌👏 “బుచికి” గారు.
Deleteరాజావారు,
Deleteపుడుతూనే లాలిపాట, ఆతరవాత జోలపాట.
నడిచే వయసులో ఆటపాట,చదువుపాట.
తదుపరి వలపుపాట,వానపాట,విరహపుపాట.సాపాటు పాట.
గడిస్తే కష్టాలు కన్నీళ్ళపాట.
చివరగా భక్తిపాట.
పాట జీవితం, ఎప్పుడు మేధావులే కాదు సామాన్యులూ ఆదరించినది పాటే
ఇంతేలే ఈ జీవితం తిరిగే రంగులరాట్నము, బతుకే రంగుల రాట్నము....
ఏలుకుంటే పాట, మేలుకుంటే పాట
Sharma sir bandi sir ప్రేరణతో నేను ఒక పేరడీ వ్రాశాను.
ReplyDeleteనేను చెప్పాను ఈ లోకం నవ్వింది. నేను వచ్చాను. పచ్చలోకం మెచ్చింది. నేను నవ్వాను. ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్.
నేను టాకితే కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి.
నేను పలికితే కొందరి నోళ్ళు వలవల ఏడ్చాయి.
నేను త్వీటితే కొందరి కాళ్లు గిల గిల మన్నాయి.
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.
డోంట్ కేర్.
మన వాళ్ళు బ్రీఫితే నేనూ టెల్లాను
DeleteWhat I am telling is, mana vaallu briefed me!
బుచికి sir,
Deleteబాగుందండీ
పట్టు పట్టరాదు
పట్టి విడువరాదు
జై గారు - super ,sharma గారు - thank you sir🙏
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteదమ్మారో దం పాట లల్లుదాం
ReplyDeleteరోజూ సుభా షామ్ పేరడీల జల్లుదాం
బ్లాగు లోళ్ల గిల్లుదాం
మళ్ళీ మళ్ళీ పాటేద్దాం యూనిటీ ని చాటేద్దాం ...
హలో శర్మ విన్న జై
భలే బుచికి బండి రావ్ ...
https://www.youtube.com/watch?v=xKU4q0JELTQ
వాహ్ వాహ్ వాహ్ ... క్యా సీన్ హై ... క్యా షాన్ హై ...
ప్రతి చేతిలో హుక్కా ... పాటేస్తూ చక్కా ... ఊగుడే ఎంచక్కా ...
ఇది గదా మనకు బ్లాగుల్లో కావాల్సింది ... కోరుకుంది.
కోరుకున్నానూ ఇంతే కోరుకున్నానూ
తలో పాటిస్తే చాలుననీ కోరుకున్నానూ ((2))
ఇన్నాళ్లూ వేచి ఉన్నాను
ఇక అన్నాళ్ళూ మన వన్నానూ/వంటానూ/ ...
కోరుకున్నానూ ఇంతే కోరుకున్నానూ
ఇలా సఖ్యతనే పాటిస్తే చాలు నన్నానూ
(ఓ సఖ్యతగా ఉండాలని కోరుకున్నానూ)
ఇంత మంచి తరుణం మునుపెన్నడూ
మన మాలికలో కనబడెనా ఎప్పుడూ ((2))
చెయ్యి చెయ్యి కలిపిందీ ఇప్పుడే
చెయ్యి చెయ్యి కలిసిందీ ఇప్పుడే
ఇక కలబడటం ఆగేనా ఇప్పుడూ/చప్పుడూ/
చదువుకున్న వాళ్ళమే మంచి తెలిసి నోళ్ళమే
అదుపులో ఉండటం అందరికీ మేలుగా/హాయిగా/ ...
https://www.youtube.com/watch?v=hLUjuwiupR4
😊 🙏 ...
పోటా పోటీ పాటలు
Deleteనాటూ నీటూ అటుకులు నానిన మాటల్
వూటుగ తాగిన వూటలు
తూటాల్లా పేల్చుదురిక తూగి వూగుచున్
పాడీ పాడీ పాటల్
Deleteఆడుచు పాడుచు చిటికెల్ సరదా మాటల్
చూడగ సంగడి వూటల్
నేడు గదా నిలిచెనిట నవ్వుల కోటల్
... ఏదో ... చిన్న ... సరదా ... సార్ ...
😊 🙏 ...
Deleteబండ్లు, శర్మ లు, సింహాలు, బుచికీలు ఓ జూమ్ కాలెట్టి వరస బెట్టి పేరడీల గట్టి దాని రికార్డింగు యూట్యూబులో నెట్టి బ్లాగులో పెట్టుడీ :)
జూము కాల్సలో కలదోయి హాయి :)
జిలేబి
మిత్రులందరికి
Deleteఅందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం, అందమే ఆనందం
పడిలేచే కడలి తరంగం, జడిలో విరిసిన తారంగం
సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం
అందమె ఆనందం.....
మీరూ మొదలెట్టేరా !
ReplyDeleteనారాయణ ! పాట తీట నవ నవ లాడున్
గీరేసుకోక తప్పదు ,
తీరదు తానంటు కొనిన తీట మహాత్మా !
బండిదొరలు పద్యానికి మారేరు ,
ReplyDeleteవారి అనుమతితో కందపద్యానికి
చిన్న సవరణ ,
జిలేబీ గారికి బస్తీమే సవాల్ !
పాడీ పాడీ పాటల్
ఆడుచు పాడుచు చిటికెలు హాసపు మాటల్
చూడగ సంగడి వూటల్
నేడు గదా నిలిచె నిచట నేర్పుల కోటల్ .
😊 🙏 ...
Deleteఇవాళ (మే 27) జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి. కొంతమంది ప్రముఖుల ముక్తసరి నివాళి మినహా మీడియా వారు పెద్దగా పట్టించుకున్నట్లు లేదే 😒?
ReplyDeleteరేపు (మే 28) NTR (Senior) గారి జయంతి. మీడియా లో హోరెత్తించేసినా ఆశ్చర్యపడనక్కరలేదు.
That is natural sir
Deleteఅవును సర్.
Deleteబ్లాగుల్లో కూడా ఎవరూ తలుచుకున్నట్లు లేదు (నెహ్రూ గారిని) ?
Yes sir
Deleteభలే వారే!
Deleteఇవ్వాళేమిటి, రోజూ తలుచుకుంటూనే ఉన్నారుగా. ఇప్పుడు నెహ్రూను తిట్టడం ఫ్యాషన్. దేశంలోని సమస్యలన్నింటికీ ఆయనే కారణం. కాని ఆయన పెట్టిన PSU లలో వాటాలు అమ్ముకుని బడ్జెట్లో లోటు పూడ్చుకుంటారు.
Is it So?
Deleteవిన్నకోట వారూ, రామారావు హడావుడి అతని అసమదీయ మీడియాలో వారం కింది నుంచే మొదలయ్యింది.
Deleteఅవును బోనగిరి గారూ, నెహ్రూ ఒక సమర్థవంతుడైన institution-builder. వారు మొదలెట్టిన PSU లు .. ఆ పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్లు, తదితర భారీ పరిశ్రమలు, భారీ డాములు, రిసెర్చ్ లాబ్స్, నేషనల్-లెవెల్ విద్యాసంస్ధలు ... వాటిని నెహ్రూ గారు “Temples of Modern India” అని వర్ణించేవారు.
Deleteఆశ్చర్యం లేదు, జై గారు. మన విజువల్ మీడియాకు సినిమాల మోజు అధికం కదా.
DeleteNo power supply exclusively for my home. Likely restoration tomorrow only. No sleep to night. Stand exhausted as it worked Nealy for ten hours
ReplyDeleteరాత్రికి డాబా మీద పడుకుంటే నయమేమో కదా?
DeleteIt is burning, emanating heat. Surroundings all multi storied no air circulation
ReplyDeleteహు, కనబడిన ప్రతి అంగుళం అంగుళం నిర్మాణం చేసెయ్యడమే ప్రగతి, పురోగతి అనుకుంటుంన్నట్లున్నారు, ఇంక ఆకులు ఎక్కడ అల్లాడతాయి 😕.
DeleteThere are trees in my back yard but of no use, as buildings are much higher than the trees
DeleteAt leaat his admirers to remember
ReplyDeleteTDP people are remembering NTR. The same congress people also can remember Nehru.
ReplyDeleteCell battery rundown. Thank sirs. Good night
ReplyDeleteGood night Sir.
Delete