కొసరి పెట్టినదేదొరుచిలేనిదైనను
నోరు మూసుకు తినితీరవలయు
విసిరి కొట్టినదేదొ వీపుకు తగిలినా
చూసిచూడనియట్లు చూడవలయు
అరిచి తిట్టినదేదొ అస్సలు చెవులకు
వినపడనియట్లుగా వెడలవలయు
పైమూడు సూత్రాలు పాటించి మగవారు
దీటుగా లాక్ డవును దాటవలయు
ఆశ వీడకుండ ఆరాట పడకుండ
మూడు సూత్రములను వాడువాడు
హాయిగా తరించు నాపద నొందడు
ఆవిడైనగాని కోవిడైనగాని.
Courtesy:C.V.L.N.Ravi kumar
లాక్-డౌన్ రాకముందు కూడా ప్రశాంత జీవనానికై పాటించినది ఇవే మూడు సూత్రాలు కదా, శర్మ గారు 🤔
ReplyDelete🙂
విన్నకోటవారు,
Deleteఈ కవి కిశోరానికి ఇప్పుడిప్పుడే జీవితానుభవం కలుగుతున్నట్టుగా ఉందండి. :)