పత్తి ఏకడం పురాతనమైన వృత్తి. మానవుడు బట్ట కట్టే కాలం నుంచి ఈ పత్తి ఏకే ఉపకరణం ఎన్ని రూపాంతరాలు చెంది ఇలా స్థిరపడిందో చెప్పలేం. దీనికి నేటి కాలంలో కమాన్ అని పేరు. ఐతే పురాతన కాలం లో దీని పేరు ధనురి కర్ర అని నేడే తెలిసింది. ఇప్పుడీ వృత్తిని దూదేకుల వారు చేస్తున్నారు, వారిని నూర్ బాషా అంటారట.నేటి కాలంలో దూది పరుపులు వాడుతున్నవారు లేరు. చక్రం మళ్ళీ మేట్రెస్సులు వదిలేసి దూది పరుపుల దిశగా మళ్ళింది.
చిన్నప్పుడన్నీ దూది పరుపులే. నాలుగేళ్ళ కోసారి దూది ఏకించి కుట్టించేవారు. నాగరికులమైపోయిన తరవాత కాయర్ మేట్రెస్ లు వాడడం మొదలు పెట్టేం. వీటితో నడుము నొప్పి, గాలి ఆడక ఇబ్బంది కలుగుతూనే ఉన్నా నెట్టుకొస్తున్నాం. ఒక దూది పరుపుండిపోయింది, అదిగో దాన్ని మళ్ళీ కుట్టించా. తయారు చేసిన పరుపు బాగుంటే మరికొన్ని కుట్టిస్తానని ఆశ పెట్టా. చాలా బాగా కుట్టేడు, బాగుంది, మరో రెండు కుట్టించా. ఇవి చూసి పక్కవాళ్ళో రెండు కుట్టించుకున్నారు. ఆ తరవాత పక్క అపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుపోయారు, కుట్టిన పరుపుల పనితనం చూసి. చేసే పనిలో నైపుణ్యం బుర్రలో గుంజూ, మంచి మాటా ఉన్నవాడెక్కడేనా బతకగలడు
దూది పత్తి కాయల నుంచి,బూరుగు కాయల నుంచీ, జిల్లేడు కాయల నుంచీ తీస్తారు. ఈ దూదిని దారం తీయడం మొదలు, ఇలా పరుపులు కుట్టించుకునేదాకా వాదతారు. ఇక బూరుగుదూది పరుపు బాగుంటుందిగాని వేడి చేస్తుందని వాడరు,ఎక్కువగా. ఇక జిల్లేడు పత్తి వత్తులు చేసి శివారాధనలో వాడతారు.
పాతరోజులు మళ్ళీ గుర్తుకు తెచ్చారు శర్మ గారూ. ఇంటికి వచ్చి దూది ఏకే పని చేసేవారు ఇంకా చిన్న ఊళ్ళల్లో ఏమన్నా కనిపిస్తున్నారేమో, నగరాల్లో అరుదు.
ReplyDeleteఅవునూ, బూరుగు దూది వేడి చేస్తుందంటారా? మా చిన్నప్పుడు ఇంట్లో తగుమాత్రం ఉండేవండీ .... పరుపులు, తలగడలూ.
విన్నకోటవారు,
ReplyDeleteదూదు పరుపులు కుట్టించుకోవడం ఇప్పుడు పల్లెలలో బాగానే ఉందండి. పట్టణాలలో కూడా కుట్టేవారున్నారు,కాని, ఇంటి కొచ్చి కుట్టేవారుండరు. కారణం చోటు లేమి. మళ్ళీ దూది పరుపుల కాలం మొదలయినట్టే!
బూరుగుదూది వేడి చేస్తుందండి, అదీగాక ఉండచుట్టుకుపోతుంది. ఇప్పటికి తరగడాలకి వాడుతున్నారు.
ధన్యవాదాలు.
ఇంతకీ నిద్రతో సంభోగం చెయ్యాలంటే ఏ దూది వాడాలి సార్!☺️
ReplyDeleteసూర్య
Deleteదూది పరుపులు పనికిరావండి. హంస తూలికాతల్పాలు కావాలి :)
This comment has been removed by a blog administrator.
Deleteభలేవారే. హంసతూలికా తలపాలెందుకండీ దండగ.
Deleteమధుర భామిని ఒళ్ళో తలపెట్టుకు పడుకుని ఆమె మృదువుగా"సడి సేయకో..గాలి" అని పాడితే నిద్ర ఎందుకు రాదు చెప్పండి.
సూర్య,
Deleteబ్లాగులోని సదరు సందర్భం అయితే గనక ... ఇక్కడ మీరు వర్ణించిన సీనులోని పాత్రలు తారుమారు అవ్వాలి 🙂.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteనిద్రతో సంభోగం చేయడం ఏమిటి. ద్యావుడా. ఈ తవిక వ్రాయడం ఒక విపరీతం అయితే, దాన్ని ఆహా ఓహో అని పొగడటం ఏమిటి. నాకు అంతు పట్టడం లేదు
ReplyDeleteGKK (జీ) జీ,
Deleteవిషయాన్ని కొత్తగా ఊహించి చెప్పడమేమోనండి. :)
GKK గారు బ్లాగులోకానికి కొత్తవారి వలె గోచరించుచున్నారు . పోను పోను “అంతు” పడుతుంది లెండి. 🙂
DeleteSir నేను పాత కాపు నే నండి. GKK (G కిరణ్ కుమార్) . బుచికి ( బుజ్జి చిన్ని కిరణ్) గా కొన్నాళ్ళు ఉన్నాను. అనుపల్లవి బ్లాగులో సంగీత కబుర్లు వ్రాసేది కూడా నేనే. 2007 నుంచి బ్లాగుల్లో ఉన్నాను. ఎన్నాళ్లు ఊరకే ఉండలేను. నా వయసు 53 సంవత్సరాలు. అమ్మయ్య. ప్రవర చెప్పేశాను.
Deleteప్రవర చెప్పినందుకు సంతోషం GKK గారు.
Deleteబ్లాగులోకంలో మీరు నాకన్నా చాలా సీనియర్ కావున మీకు ఇదే నా నమస్కార బాణం 🙏.
Thank you sir🙏. అప్పటి దిగ్గజ బ్లాగర్లు ఎందుకో ఒక్కొక్కరూ విరమించారు/నిష్క్రమించారు. నేను మాత్రం పాత అలవాటు మానలేక ' పిచ్చి భూతమై' ఇంకా తిరుగుతున్నాను.
DeleteGKK (జీ) ji
Delete//అప్పటి దిగ్గజ బ్లాగర్లు ఎందుకో ఒక్కొక్కరూ విరమించారు/నిష్క్రమించారు. //
ఎందుకో మీకు తెలియదు గనకనా :)
సూర్యాజీ
ReplyDeleteమరచాను సుమా :) బాగా గుర్తు చేశారు :)